హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 127వ అధ్యాయం: నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 814 – 819) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు

↑ విషయ సూచిక

باب آداب النَوم والاضْطِجَاع وَالقعُود والمَجلِس وَالجليس وَالرّؤيَا

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

814

హదీసు 814

عن الْبَراءِ بن عازبٍ رضيَ اللَّه عنهما قَالَ: كَانَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا أَوَى إِلَى فِرَاشِهِ نَامَ عَلى شِقَّهِ الأَيمنِ، ثُمَّ قَالَ: "اللَّهُمَّ أَسْلَمْتُ نَفْسِي إليْكَ، وَوجَّهْتُ وَجْهي إلَيْكَ، وفَوَّضْتُ أَمْرِي إلَيْكَ، وَأَلجَأْتُ ظهْري إلَيْكَ، رَغْبةً وَرهْبَةً إلَيْكَ، لا مَلْجأ ولا مَنْجى مِنْكَ إلاَّ إلَيْكَ، آمَنْتُ بِكتَابكَ الَّذِي أَنْزلتَ، وَنَبيِّكَ الَّذِي أَرْسَلْتَ". رواه البخاري بهذا اللفظ في كتاب الأدب من صحيحه.

హజ్రత్ బరా ఇబ్నె ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ పడక మీద మేను వాల్చినప్పుడు కుడివైపు తిరిగిపడుకొని ఈ విధంగా ప్రార్థించేవారు:

"అల్లాహుమ్మ అస్లమ్‌తు నఫ్‌సీ ఇలైక, వ వజ్జహ్‌తు వజ్‌హీ ఇలైక, వ ఫవ్వజ్‌తు అమ్రీ ఇలైక, వ అల్‌జాతు జహ్‌రీ ఇలైక రగ్‌బతన్ వ రహ్‌మతన్ ఇలైక, లా మల్జఅ వలా మన్‌జా మిన్‌క ఇల్లా ఇలైక ఆమన్‌తు బికితాబికల్లజీ అన్‌జల్‌త వ నబియ్యికల్లజీ అర్‌సల్‌త."

(దేవా! నేను నా స్వయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నా ముఖాన్ని నీ వైపుకు తిప్పుకున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. నిన్ను కోరుకుంటూ, నీ ఆగ్రహానికి భయపడుతూ నీ శరణుజొచ్చాను. నీవు ఆశ్రయమిస్తే తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు రక్షణ కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి మరో చోటులేదు. నేను నీవు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించాను. నీవు పంపిన ప్రవక్తను నమ్మాను).

(ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును ఈ వాక్యాలతో తన సహీహ్ గ్రంథంలోని సంస్కార ప్రకరణంలో పేర్కొన్నారు).

(సహీహ్ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం)

English

Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: Whenever Messenger of Allah ﷺ went to bed, he would lie down on his right side and recite: “Allahumma aslamtu nafsi ilaika, wa wajjahtu wajhi ilaika, wa fawwadtu amri ilaika, wa ‘alja’tu zahri ilaika, raghbatan wa rahbatan ilaika, la malja’a wa la manja illa ilaika. Amantu bikitabikal-ladhi anzalta, wa nabiyyikal-ladhi arsalta [O Allah! I have submitted myself to You, I have turned my face to You, committed my affairs to You, and depend on You for protection out of desire for You and out of fear of You (expecting Your reward and fearing Your punishment). There is no refuge and no place of safety from You but with You. I believed in the Book You have revealed, and in the Prophet You have sent (i.e., Muhammad ﷺ).]”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ప్రతి రోజు రాత్రి పడుకోబోయేముందు తమ విశ్వాసాన్ని, తమ ఇస్లాం ధర్మాన్ని, తాము అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలని ఈ హదీసులో బోధించబడింది. ప్రతి ముస్లిం ఈ విధంగా రాత్రి పూట ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటే పగటిపూట పనివేళల్లో కూడా అతనికి దైవాదేశాలు తప్పకుండా గుర్తుంటాయి. దీనిగురించి మరిన్ని వివరాల కొరకు 7వ అధ్యాయంలోని 80వ హదీసు చూడండి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 814

815

హదీసు 815

وعنه قَالَ: قَالَ لي رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إذَا أَتَيْتَ مَضْجَعكَ فَتَوَضَّأْ وُضُوءَكَ لِلصَّلاةِ، ثُمَّ اضْطَجِعْ عَلى شِقِّكَ الأَيمَنِ، وَقُلْ.."وذَكَرَ نَحْوهُ، وفيه:"واجْعَلْهُنَّ آخِرَ مَا تَقول" متفقٌ عَلَيهِ.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ నాకు ఇలా ఉపదేశించారు:

"నువ్వు పడకమీదకు వెళ్ళదలచుకున్నప్పుడు నమాజ్ కోసం వుజూ చేసుకునే విధంగా వుజూ చేసుకో. ఆ తర్వాత కుడి వైపుకు తిరిగి పడుకొని ఈ విధంగా ప్రార్థించు… (ఇంతకు ముందు హదీసులో పేర్కొన్న ప్రార్థన).

ఈ హదీసులో ఈ వాక్యం అదనంగా ఉంది: ఈ ప్రార్థనా వాక్యాలు నీ తుది పలుకులు కావాలి (అంటే. ఈ ప్రార్థన తరువాత నీ నోటి నుంచి ఎలాంటి ప్రాపంచిక విషయాలూ వెలువడరాదు).

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని దైవధ్యాన ప్రకరణం)

English

Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ directed me thus: “Whenever you go to bed, perform Wudu’ as you do for Salat then (before sleeping) recite: `O Allah! I have submitted myself to You, I have turned myself to You, committed my affairs to You and sought Your refuge for protection out of desire for You and fear of You (expecting Your reward and fearing Your punishment). There is no refuge and no place of safety from You but with You. I believe in the Book You have revealed and in the Prophet ﷺ You have sent.”’ Messenger of Allah ﷺ added: “If anyone recites these words and dies during the night, he will die on the true Deen, and if he remains alive till the morning, he will obtain good. And make this supplication your last words (before sleeping).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 815

816

హదీసు 816

وعن عائشةَ رضيَ اللَّه عنها قالتْ: كَانَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَصلِّي مِن اللَّيْلِ إحْدَى عَشَرَةَ رَكْعَةً، فَإذا طلَع الْفَجْرُ صَلَّى ركْعَتيْنِ خَفِيفتيْنِ، ثمَّ اضْطَجَعَ عَلَى شِقِّهِ الأيمن حَتَّى يَجِيءَ المُؤَذِّنُ فيُوذِنَهُ، متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ రాత్రిపూట పదకొండు రకాతుల (తహజ్జుద్) నమాజ్ చేసేవారు. ఉషోదయం కాగానే సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసేవారు. ఆ తర్వాత కుడి వైపుకు తిరిగి పడుకునేవారు. ఆఖరికి ముఅజ్జిన్ వచ్చి ఫజ్ర్ నమాజ్‌కు వేళ అయిందని ఆయనకు తెలియపరిచేవాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ used to offer eleven Rak`ah of optional Salat (prayers) in the latter part of night. When it was about dawn, he would offer two short Rak`ah and then would lie down on his right side till the Mu’adhdhin (one who calls for prayer) would come to inform him that the congregation had gathered (for prayer).[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ రాత్రిపూట చేసే (ఖియాముల్లైల్ లేక తహజ్జుద్) నమాజు గురించి వివరించబడింది. విత్ర్‌తో కలిపి ఆ నమాజు మొత్తం పదకొండు రకాతులతో కూడి ఉండేదని ఆయనగారి సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు. ఈ ఉల్లేఖనం సహీహ్ బుఖారీ గ్రంథంలో ఉంది. దాని ప్రకారం ఆయన రమజాన్ మాసంలోనయినా, ఇతర మాసాల్లోనయినా రాత్రిపూట చేసే నమాజు పదకొండు రకాతుల కంటే ఎక్కువ చేయలేదు. ఎనిమిది రకాతులు ఖియాముల్లైల్ (దీనినే రమజానేతర మాసాల్లో తరావీహ్ అంటారు) మరియు మూడు రకాతులు విత్ర్. మొత్తం కలిపి పదకొండు రకాతులు.

ఫజ్ర్‌పూట రెండు రకాతుల సున్నత్ నమాజ్ చేసి కుడి ప్రక్కకు తిరిగి కాసేపు పడుకోవటం సున్నత్ అని కూడా పై హదీసు ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 816

817

హదీసు 817

وعن حُذَيْفَةَ رضي اللَّه عنه قَالَ:: كَانَ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا أَخَذَ مَضْجَعَهُ مِنَ اللَّيْلِ وَضَعَ يَدهُ تَحْتَ خَدِّهِ، ثمَّ يَقُولُ: "اللَّهُمَّ بِاسْمِكَ أمُوتُ وَأَحْيَا" وَإِذَا اسْتيْقَظَ قَالَ: "الحَمْدُ للَّهِ اَلَّذي أَحْيَانَا بعْدَ مَا أَمَاتَنَا وإِلَيْهِ النُّشُورُ". رواه البخاري.

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ రాత్రిపూట తన పడకమీదకు చేరుకున్నాక తన (కుడి) చెంపక్రింద చెయ్యి పెట్టుకొని, "అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్‌యా" (దేవా! నేను నీ పేరుతోనే మరణిస్తున్నాను. తిరిగి నీ పేరుతోనే బ్రతుకుతాను) అని ప్రార్థించేవారు. తర్వాత నిద్ర మేల్కొన్నప్పుడు, "అల్‌హమ్దు లిల్లాహిల్లజీ అహ్‌యానా బాదమా అమాతనా వ ఇలైహిన్నుషూర్" (స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి బ్రతికించాడు. ఏదో ఒకరోజు మేమంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది)" అని పలికేవారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం)

English

Hudhaifah (radiyallahu anhu) reported: Whenever the Prophet ﷺ lay down for sleep at night, he would place his (right) hand under his (right) cheek and supplicate: “Bismika Allahumma amutu wa ahya [O Allah, with Your Name will I die and live (wake up)].” And when he woke up, he would supplicate: “Al-hamdu lillahil-ladhi ahyana ba`da ma amatana, wa ilaihin-nushur (All praise is due to Allah, Who has brought us back to life after He has caused us to die, and to Him is the return).”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 817

818

హదీసు 818

وعن يعِيشَ بنِ طخْفَةَ الغِفَارِيَّ رضي الله عنهما قَالَ: قَالَ أَبي"بينما أنَا مضُطَجِعٌ في الْمسَجِدِ عَلَى بَطْنِي إذَا رَجُلٌ يُحَرِّكُنِي بِرِجْلهِ فَقَالَ "إنَّ هذِهِ ضَجْعَةٌ يُبْغِضُهَا اللهُ"قَالَ: فَنَظرْتُ، فإذَا رسولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رواه أَبُو داود بإسنادٍ صحيح.

తన తండ్రి తనకు ఈ విధంగా చెప్పారని హజ్రత్ యయీష్ బిన్ తిఖ్‌ఫా గిఫారీ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు : నేనొకసారి మస్జిద్‌లో బోర్లాపడుకొని ఉండగా ఎవరో తన కాలుతో నన్ను కదుపుతూ, "ఇలా పడుకుంటే దేవుడు ఆగ్రహిస్తాడు" అని అంటున్నారు. లేచి చూస్తే నా ప్రక్కన దైవప్రవక్త ﷺ ఉన్నారు. (అబూ దావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

(సుననె అబూ దావూద్‌లోని నిద్ర ప్రకరణం)

English

Ya`ish bin Tikhfah Al-Ghifari (radiyallahu anhu) reported: My father said: I was lying down on my belly in the mosque when someone shook me with his foot and said, “Lying down this way is disapproved by Allah.” I looked up and saw that it was Messenger of Allah ﷺ.[Abu Dawud].

ముఖ్యాంశాలు

బోర్లా పడుకోవటం అత్యంత అసహ్యకరమైన చేష్ట. సభ్యత సంస్కారాలకు విరుద్ధం. అంతేకాదు, నైతికంగా, వైద్యపరంగా కూడా దానివల్ల ఎన్నో నష్టాలున్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 818

819

హదీసు 819

وعن أَبي هريرة رضي الله عنه عن رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ قَعَدَ مَقْعَداً لَمْ يَذْكُرِ الله تَعَالَى فِيهِ كَانَتْ عَلَيِهِ مِنَ اللهِ تَعَالَى تِرةٌ، وَمَنِ اضْطَجَعَ مُضْطَجَعاً لاَيَذْكُرُ الله تَعَالَى فِيهِ كَانَتْ عَلْيِه مِن اللهِ تِرةٌ" رواه أَبُو داود بإسنادِ حسن."التِّرةُ"بكسر التاء المثناة من فوق, وَهِيَ: النقص, وقيل: التبعة.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒకచోట కూర్చొని అక్కడ దేవుణ్ణి స్మరించకపోతే దేవుని తరపునుండి ఆ చోటు అతని పాలిట తలవంపుగా పరిణమిస్తుంది. ఎవరయినా ఒకచోట పడుకొని అక్కడ దేవుణ్ణి స్మరించకపోతే దేవుని తరపునుండి ఆ చోటు అతని పాలిట తలవంపుగా పరిణమిస్తుంది. (అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Whoever sits in a place where he does not remember Allah (SWT), he will suffer loss and incur displeasure of Allah; and whoever lies down (to sleep) in a place where he does not remember Allah, he will suffer sorrow and incur displeasure of Allah.” [Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|127. నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు|హదీసు 819