హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 122వ అధ్యాయం: పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 804 – 809) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే
باب تحريم لباس الحرير عَلَى الرجال وتحريم جلوسهم عَلَيْهِ واستنادهم إِلَيْهِ وجواز لبسه للنساء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 804
عن عمر بن الخطَّاب رضيَ اللَّه عنه قَالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تَلْبَسُوا الحَرِيرَ، فَإنَّ مَنْ لَبِسهُ في الدُّنْيَا لَمْ يَلْبَسْهُ في الآخرةِ." متفقٌ عليه.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : పట్టు వస్త్రాలు ధరించకండి. వాటిని ఇహలోకంలో ధరించిన వారు పరలోకంలో ధరించలేరు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణ ప్రకరణాలు)
English
`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Do not wear silk (clothes). For whoever wears (them) in this life will be deprived of them in the Hereafter.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసులోని వారింపు ముస్లిం పురుషులకు మాత్రమే. స్త్రీలు పట్టువస్త్రాలు ధరించవచ్చు. పురుషులు పట్టువస్త్రాలు ధరించకూడదనటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పట్టువస్త్రాలు కేవలం అలంకారప్రాయమైనవి. అది స్త్రీల ప్రత్యేక లక్షణం. అదీగాక పట్టువస్త్రాలు పురుషుల్లో సహజంగా ఉండే ధైర్యం, సాహసం, మొరటుతనం లాంటి పురుషలక్షణాలను ప్రభావితం చేయటమే గాకుండా వారిలో సౌకుమార్యాన్ని పెంపొందింపజేస్తాయి. పట్టువస్త్రాలు ధరించేవారిలో సహజంగానే గర్వం పుడుతుంది. ఇస్లాం దాన్ని సుతరామూ సహించదు. పురుషులకు పట్టు వస్త్రాలు అనుమతించకపోవటానికి ఇంకో ముఖ్య కారణం ఏమిటంటే, ఈ వస్త్రధారణ ఇస్లాం ధర్మం మానవునిలో తీసుకురాదలచిన నిరాడంబరతకు విరుద్ధం. దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : నిరాడంబరత ఇస్లాంలో అంతర్భాగం (ఇమామ్ అహ్మద్, ఇబ్నె మాజా, హాకిమ్ తదితరులు ఈ హదీసును వెలికితీశారు). పై కారణాల వల్ల పురుషులు పట్టువస్త్రాలు ధరించటానికి అనుమతించబడలేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 804
హదీసు 805
وعنه قَالَ: سمِعتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "إنَّما يلبَسُ الحريرَ منْ لاَ خَلاق لَهُ" متفقٌ عَلَيْهِ. وفي روايةٍ للبُخاريَ: "مَنْ لاَ خَلاَقَ لَهُ في الآخِرة". قولُهُ:"مَنْ لاَ خَلاَقَ لَهُ"، أَيْ: لاَ نَصيبَ لَهُ.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఎలాంటి (ప్రతిఫల) భాగ్యానికి నోచుకోనివాడే పట్టువస్త్రాలు ధరిస్తాడు.
(బుఖారీ – ముస్లిం)
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో "పరలోకంలో ఎలాంటి (ప్రతిఫల) భాగ్యానికి నోచుకోనివాడు" అని ఉంది.
(సహీహ్ బుఖారీ – సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణల ప్రకరణం)
English
`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “Silk (clothes) are worn only by him who has no share in the Hereafter.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 805
హదీసు 806
وعن أنس رضي اللَّه عنه قَالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ لَبِسَ الحَرِيرَ في الدُّنْيا لَمْ يَلْبسْهُ في الآخرَةِ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇహలోకంలో పట్టుబట్టలు ధరించినవాడు పరలోకంలో వాటిని ధరించలేడు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who wears silk clothes in this life shall not wear them in the Hereafter.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 806
హదీసు 807
وعن عليٍّ رضي اللَّه عنه قَالَ: رأَيْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَخَذَ حَرِيراً، فَجَعلَهُ في يَمينه، وَذَهَباً فَجَعَلَهُ في شِمالِهِ، ثُمَّ قَالَ: "إنَّ هذَيْنِ حرَامٌ عَلى ذُكُورِ أُمَّتي". رواهُ أَبُو داود بإسنادٍ حسن
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ పట్టు (వస్త్రాన్ని) పట్టుకుంటుండగా నేను చూశాను. ఆయన దాన్ని కుడిచేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బంగారాన్ని ఎడమచేతిలోకి తీసుకొని ఇలా అన్నారు: ఈ రెండూ నా అనుచర సమాజంలోని పురుషులకొరకు నిషేధించబడినవి.
(అబూదావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు).
(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం)
English
`Ali (radiyallahu anhu) reported: I saw Messenger of Allah ﷺ holding a piece of gold in his left hand and a silk (cloth) in his right hand. Then he said, “These two are forbidden for the males of my Ummah.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 807
హదీసు 808
وعن أَبي مُوسى الأشْعريِّ رضي اللَّه عنه أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "حُرِّم لِبَاسُ الحَرِيرِ وَالذَّهَب عَلَى ذُكُورِ أُمَّتي، وَأُحلَّ لإنَاثِهِم". رواهُ الترمذي وقال حديثٌ حسن صحيح.
హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : పట్టు వస్త్రాలు, బంగారం నా అనుచర సమాజంలోని పురుషులకు నిషేధించబడ్డాయి. స్త్రీలకు సమ్మతించబడ్డాయి. (తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Wearing of silk and gold has been made unlawful for males and lawful for the females of my Ummah.” [At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 808
హదీసు 809
وعن حُذَيْفَة رضي اللَّه عنه قَالَ: نَهَانَا النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنْ نَشْرب في آنِيةِ الذَّهب وَالفِضَّةِ، وَأنْ نَأْكُل فِيهَا، وعَنْ لُبْسِ الحَرِيرِ وَالدِّيبَاج وأنْ نَجْلِس عَلَيّهِ. رواه البخاري.
హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం : బంగారు, వెండి పాత్రల్లో త్రాగకూడదనీ, తినకూడదనీ, పట్టువస్త్రాలు ధరించకూడదనీ, వాటిమీద కూర్చోకూడదనీ దైవప్రవక్త ﷺ మమ్మల్ని వారించారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Hudhaifah (radiyallahu anhu) reported: The Prophet ﷺ prohibited us from eating or drinking in gold or silver utensils and from wearing silk and brocade, or sitting on (anything made from) them.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
పట్టు వస్త్రాల్లో అనేక రకాలున్నై. పల్చటి పట్టువస్త్రాల్ని 'ఇస్తబ్రక్' అని అంటారు. ముతక పట్టువస్త్రాల్ని 'దీబాజ్' అంటారు. అసలు పట్టు వస్త్రాలంటే సహజంగా పట్టుపురుగుల నుండి తయారుచేయబడినవే. కాని ఈ రోజుల్లో పట్టులాంటి వస్త్రాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. చూడటానికి అవి కూడా పట్టువస్త్రాల మాదిరిగానే కనిపిస్తాయి కాని వాస్తవానికి అవి పట్టువి అయివుండవు. అలాంటి కృత్రిమ వస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం కాదు. కాని ఏదయినా ప్రాంతంలో ప్రత్యేకంగా స్త్రీలే అలాంటి బట్టలు ధరిస్తున్నట్లయితే ఆ ప్రాంతంలో పురుషులు కృత్రిమ వస్త్రాలు కూడా ధరించకుండా ఉండటం మంచిది.
అదేవిధంగా పట్టువస్త్రాల మీద కూర్చోవద్దని కూడా దైవప్రవక్త ﷺ వారించారు. అంచేత పట్టువస్త్రాలను దుప్పట్లుగా వాడటం, పరుపులకు, దిండ్లకు ఉపయోగించటం కూడా ధర్మసమ్మతం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|122. పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్త్రీలకు సమ్మతమే|హదీసు 809
You must be logged in to post a comment.