హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 119వ అధ్యాయం: చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 12 హదీసులు (హదీసు 790 – 801) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం
باب صفة طول القميص والكُم والإِزار وطرف العمامة وتحريم إسبال شيء من ذلك على سبيل الخيلاء وكراهته من غير خيلاء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 790
عن أَسماء بنتِ يزيدَ الأنصارِيَّةِ رَضِيَ اللَّه عنها قالت: كَانَ كُمُّ قمِيصِ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِلى الرُّسُغِ. رواه أَبُو داود، والترمذي وَقالَ: حديث حسن.
హజ్రత్ అస్మా బిన్తె యజీద్ అన్సారియ్యా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ చొక్కా చేతులు మణికట్ల దాకా ఉండేవి. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్)
(అబూ దావూద్, తిర్మిజీలలోని వస్త్రధారణ ప్రకరణాలు)
English
Asma` bint Yazid (radiyallahu anha) reported: The Qamees sleeves of Messenger of Allah ﷺ reached down to his wrists.[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 790
హదీసు 791
وعن ابن عمر رضي اللَّه عنهما أَنّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلاءَ لَمْ يَنْظُر اللَّه إِليهِ يَوْم القِيَامَةِ"فَقَالَ أَبو بكر: يارسول اللَّه إِن إِزارى يَسْتَرْخى إِلا أَنْ أَتَعَاهَدَهُ، فَقَالَ لَهُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّكَ لَسْتَ مِمَّنْ يَفْعَلُهُ خُيَلاءَ". رواه البخاري، وروى مسلم بعضه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : గర్వాతిశయంతో తన నడుం వస్త్రాన్ని నేలమీద ఈడుస్తూ నడిచేవాణ్ణి దేవుడు ప్రళయదినాన (కారుణ్య) దృష్టితో చూడడు.
ఈ మాట విని అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) స్వయం గురించి తల్లడిల్లుతూ, "దైవప్రవక్తా! నేనెంత జాగ్రత్త వహిస్తున్నా నా నడుంవస్త్రం క్రిందికి జారిపోతుంది" అని విన్నవించుకున్నారు. దానికి దైవప్రవక్త ﷺ ఆయనతో, "మీరు గర్వం కొద్దీ ఈడుస్తూ నడిచేవారు కారు" అని అన్నారు. (బుఖారీ. ఇందులోని కొంత భాగాన్ని ముస్లిం కూడా ఉల్లేఖించారు)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Whoever allows his lower garment to drag out of vanity will find that Allah will not look at him on the Day of Resurrection.” On this Abu Bakr (radiyallahu anhu) submitted: “O Messenger of Allah! My lower garment keeps sliding down though I take care to pull it and wrap it.’‘ Messenger of Allah ﷺ said, “You are not of those who do it out of vanity.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 791
హదీసు 792
وعن أبي هريرة رضي اللَّه عنه أَنَّ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ ينْظُرُ اللَّه يَوْم القِيَامة إِلى مَنْ جَرَّ إِزَارَهُ بَطراً "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : గర్వంతో విర్రవీగుతూ తన ధోవతీని నేలమీద ఈడుస్తూ నడిచేవాడ్ని దేవుడు ప్రళయదినాన కన్నెత్తి (కటాక్ష వీక్షణలతో) చూడడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “On the Day of Resurrection, Allah will not look at him who trails his lower garment out of pride.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 792
హదీసు 793
وعنه عن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا أَسْفَلَ مِنَ الْكَعْبَيْنِ مِنَ الإِزار فَفِي النَّار" رواه البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : కాలి గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే ధోవతీ (లుంగీ, షరాయి) భాగం నరకాగ్నికి ఆహుతి అవుతుంది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “What is below the ankles of a lower garment is condemned to the Fire (Hell).”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసుని చూస్తే నరకాగ్నికి ఆహుతి అయ్యేవి కేవలం గిలకల క్రింద వ్రేలాడే వస్త్రాలేననిపిస్తోంది. వాస్తవానికి వాటితో పాటు ఆ విధంగా వ్రేలాడదీసే మనుషులు కూడా నరకానికి వెళతారు. అందుకే హజ్రత్ నాఫే (రహిమహుల్లాహ్) గారిని ఈ హదీసు ఔచిత్యం గురించి అడిగినప్పుడు ఆయన, దానికి సమాధానమిస్తూ, "దుస్తులదేం పాపం?! వాటిని ధరించిన వారి కాళ్ళు నరకాగ్నికి ఆహుతి అవుతాయి" అని చెప్పారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 793
హదీసు 794
وعن أَبي ذرٍّ رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "ثلاثةٌ لا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ القِيَامةِ، وَلاَ يَنْظُرُ إِلَيْهم، وَلا يُزَكِّيهِمْ، وَلهُمْ عَذَابٌ أَليمٌ"قَالَ: فقَرأَها رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ثلاثَ مِرَارٍ. قَالَ أَبو ذَرٍّ: خابُوا وخسِرُوا مَنْ هُمْ يَا رسول اللَّه؟ قَالَ:"المُسبِلُ، والمنَّانُ وَالمُنْفِقُ سِلْعَتَهُ بِالحَلفِ الكاذِبِ" رواه مسلم. وفي روايةٍ لَهُ:"المُسْبِلُ إِزَارَهُ".
హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ప్రళయదినాన దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు. వారిని (కారుణ్య దృష్టితో) చూడడు. వారిని శుభ్రపరచడు కూడా. పైగా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
దైవప్రవక్త ﷺ ఈ మాటలే మూడు సార్లు అన్నారు. అది విని అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు), "అలాంటి వారు ఓటమిని చవి చూస్తారు. నాశనమయిపోతారు. దైవప్రవక్తా! అసలు ఎవరు వారు?" అని అడిగారు. దానికాయన "నడుంవస్త్రాన్ని మడమలకన్నా క్రిందికి వ్రేలాడదీసేవాడు, ఉపకారం చేసి దెప్పిపొడిచేవాడు, అబద్ధపు ప్రమాణాలు చేసి తన సరుకును అమ్ముకునేవాడు" అని అన్నారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)
English
Abu Dharr (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “There are three to whom Allah will neither speak on the Day of Resurrection nor will look at them nor purify them (i.e., of their sins), and they will be severely tormented.” When he repeated this (statement) thrice, Abu Dharr (radiyallahu anhu) said: “They are doomed and destroyed! (But) who are they, O Messenger of Allah ﷺ?” He said, “One whose lower garment trails, one who boasts of kindness shown to another; and one who promotes sale of his business by taking false oaths.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 794
హదీసు 795
وعن ابن عمر رضي اللَّه عنهما، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الإِسْبَالُ في الإِزارِ، والقَمِيصِ، وَالعِمَامةِ، منْ جَرَّ شَيئا خُيَلاءَ لَم يَنظُرِ اللَّه إليهِ يوْمَ القِيَامةِ" رواه أَبُو داود، ُوالنسائى بإسنادٍ صحيح.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ధోవతీని, చొక్కాను, తలపాగాను ఎక్కువగా వ్రేలాడదీసి ధరిస్తారు (ఇది మహాపాపం). కనుక అహంకారంతో విర్రవీగుతూ వస్త్రాన్ని వ్రేలాడదీసి (ఈడుస్తూ) నడిచేవాడ్ని దేవుడు ప్రళయదినాన కన్నెత్తి కూడా చూడడు. (అబూదావూద్, నసాయి – ప్రామాణికమైన ఆధారాలతో)
(సుననె అబూ దావూద్లోని వస్త్రధారణ ప్రకరణం, సుననె నసాయీలోని అలంకరణల ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “On the Day of Resurrection, Allah will not look at one who trails his lower garment, Qamees or turban arrogantly.”[Abu Dawud and An-Nasa’i].
ముఖ్యాంశాలు
లుంగీ, ధోవతీ, పైజామా, షరాయి లాంటి నడుం వస్త్రాలను గిలకల క్రిందికి వేలాడదీయటం ఘోరపాపమైనట్లే అహంకారం కొద్ది అవసరానికి మించి పొడవైన చొక్కాలు. తలపాగాలు ధరించటం కూడా మహాపాపమేనని పై హదీసు ద్వారా బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 795
హదీసు 796
وعن أَبي جُرَيٍّ جابر بن سُلَيم رضي اللَّه عنه قَالَ: رَأَيتُ رَجلاً يصْدُرُ النَّاسُ عَنْ رَأْيهِ لاَ يَقُولُ شَيئاً إِلاَّ صَدَرُوا عَنْهُ، قلتُ: مَنْ هَذَا؟ قالوا: رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. قلتُ: عَليكَ السَّلامُ يَا رسولَ اللَّه مَرَّتَيْنِ قَالَ: "لاَ تَقُل علَيكَ السَّلامُ، علَيكَ السلامُ تحِيَّةُ الموْتَى قُلِ: السَّلامُ علَيك"قَالَ: قلتُ: أَنتَ رسول اللَّه؟ قَالَ:"أَنَا رسول اللَّه الَّذِي إِذا أَصابَكَ ضَرٌّ فَدعَوْتَهُ كَشَفَهُ عنْكَ، وإِذا أَصَابَكَ عامُ سنَة فَدَعوْتَهُ أَنبتَهَا لَكَ، وإِذَا كُنتَ بِأَرْضٍ قَفْرٍ أَوْ فلاةٍ، فَضَلَّت راحِلَتُكَ، فَدعوْتَه رَدَّهَا علَيكَ"قَالَ: قُلْتُ: اعْهَدْ إِليَّ. قَالَ:"لاَ تسُبَّنَّ أَحداً "قَالَ: فَما سببْتُ بعْدهُ حُرّا، وَلاَ عَبْداً، وَلا بَعِيراً، وَلا شَاةً "وَلا تَحقِرنَّ مِنَ المعروفِ شَيْئاً، وأَنْ تُكَلِّمَ أَخَاك وأَنتَ مُنْبسِطٌ إِليهِ وجهُكَ، إِنَّ ذَلِكَ مِنَ المعرُوفِ. وارفَع إِزاركَ إِلى نِصْفِ السَّاقِ، فَإِن أبيتَ فَإلَى الكَعبين، وإِياكَ وإِسْبال الإِزارِ فَإِنَّهَا مِن المخِيلةِ وإِنَّ اللَّه لا يحبُّ المَخِيلة، وإن امْرؤٌ شَتَمك وَعَيَّركَ بمَا يَعْلَمُ فيكَ فَلاَ تُعيِّرهُ بِمَا تَعلَم فيهِ، فإِنَّمَا وبالُ ذلكَ عليهِ" رواه أَبُو داود والترمذي بإِسنادٍ صحيحٍ، وَقالَ الترمذي: حديثٌ حسن صحيح.
హజ్రత్ అబూ జుర్రై జాబిర్ బిన్ సులైమ్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొక వ్యక్తిని చూశాను. ప్రజలు ఆయన సలహాలను పాటిస్తున్నారు. ఆయన ఏది చెప్తే దాన్ని ఒప్పుకుంటున్నారు. నేను "ఆయన ఎవరు?" అని ప్రజల్ని అడిగాను. "ఆయన దైవప్రవక్త" అని చెప్పారు ప్రజలు.
నేనాయన దగ్గరికి వెళ్ళి, "దైవప్రవక్తా! అలైకస్సలాం" అని రెండుసార్లు అన్నాను. దానికాయన (నా వైపు తిరిగి), "అలైకస్సలాం" అని అనకు. అలైకస్సలాం అనేది చనిపోయిన వారికి చేసే సలాం. దానికి బదులు 'అస్సలాము అలైక' అని చెప్పు అన్నారు. తర్వాత నేను ఆయన్ని "మీరు దైవప్రవక్తా!?" అని అడిగాను. అందుకాయన "(అవును). నేను దేవుని ప్రవక్తను. నీకేదయినా ఆపద వచ్చినప్పుడు నువ్వాయన్ని (దేవుణ్ణి) మొరపెట్టుకుంటే ఆయన నీ ఆపదను దూరం చేస్తాడు. నువ్వు కరువు కాటకాలకు గురై ఆయన్ని ప్రార్థిస్తే ఆయన (ఆ దేవుడు) నీ కోసం భూమి నుండి పంటను పండిస్తాడు. నువ్వు ఏదయినా అడవిలోగాని, ఎడారిలోగాని ఉండి, నీ వాహనం తప్పిపోయినప్పుడు నువ్వాయన్ని సహాయమర్థిస్తే, ఆయన నీ వాహనాన్ని తిరిగి నీ దగ్గరకు చేరు స్తాడు" అని చెప్పారు. అప్పుడు నేనాయన్ని "నాకు హితోపదేశం చేయండి" అని కోరాను. దానికాయన "ఎవరినీ తిట్టమాకు" అని చెప్పారు. అప్పట్నుంచి నేను ఏ స్వేచ్ఛాపరుణ్ణిగాని, బానిసనుగాని తిట్టలేదు. (ఆఖరికి) ఏ ఒంటెనీ, ఏ మేకనీ పల్లెత్తు మాట అనలేదు.
దైవప్రవక్త ﷺ నాకు చేసిన రెండో ఉపదేశం ఇది : "ఏ మంచి పనినీ అల్పంగా భావించకు. నీ సోదరుణ్ణి నగుమోముతో పలకరించటం కూడా మంచి పనే. ఇంకా నీ ధోవతీ (షరాయి, పైజామా)ని నగం పిక్కల వరకు ఎత్తికట్టుకో. కుదరదనుకుంటే కనీసం మడమల వరకైనా తప్పకుండా ఎత్తి ఉంచాలి. జాగ్రత్త సుమా! ధోవతీని మడమలకన్నా క్రిందికి వ్రేలాడదీయకు. ఎందుకంటే అది అహంకారానికి ఆనవాలు. దేవుడు అహంకారాన్ని యిష్టపడడు. ఎవరయినా నిన్ను తిట్టినా లేక తనకు తెలిసిన నీ లోపం గురించి దెప్పిపొడిచినా నువ్వు మాత్రం – అతని లోపం గురించి నీకు తెలిసివున్నా – అతన్ని దెప్పిపొడవకు. అతను తన పాపాన్ని తనే మోస్తాడు. (అబూదావూద్, తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయం)
English
Abu Juraiy Jabir bin Sulaim (radiyallahu anhu) reported: I noticed a man whose opinion was followed by every body, and no one acted contrary to what he said. I asked who he was, and I was informed that he was Messenger of Allah ﷺ. I said to him twice: “Alaikas-salam ya Rasul-Allah (may Allah render you safe).” He said, “Do not say: `Alaikas-salamu.’ This is the salutation to the dead (in Jahiliyyah times). Say, instead: `As-salamu `alaika (may Allah render you safe).”’ I asked: “Are you Messenger of Allah?” He replied, “(Yes) I am the Messenger of Allah, Who will remove your affliction when you are in trouble and call to Him, Who will cause food to grow for you when you are famine-stricken and call to Him, and Who will restore to you your lost riding beast in the desert when you call upon Him.” I said to him: “Give me instructions (to act upon).” He ( ﷺ said, “Do not abuse anyone.” (Since then I have never abused anyone, neither a freeman, nor a slave, nor a camel, nor a sheep). He ﷺ continued, “Do not hold in contempt even an insignificant act of goodness, because even talking to your brother with a cheerful countenance is an act of goodness. Hold up your lower garment half way to the leg, and at least above the ankles; for trailing it is arrogance, and Allah dislikes pride. And if a man imputes to you of bad things he knows you possess, do not impute to him bad things that you know he has for he will assume the evil consequences of his abuse.”[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ధోవతీ, లుంగీ, షరాయి, పైజామా మొదలగు వాటిని సగం పిక్కల వరకు ఎత్తికట్టుకోవటం ఉత్తమం. ఈ విధమైన వస్త్రధారణలో వినమ్రతా అణకువలు ఉట్టిపడతాయి. అలాగే గిలకలు బయటికి కనిపించేలా కట్టుకోవడంలోనూ తప్పులేదు. కాని గిలకల క్రిందికి వ్రేలాడదీసి నడుంవస్త్రాన్ని నేలమీద ఈడుస్తూ నడవటం ఘోరమయిన పాపం. దానికి శిక్షగా ప్రజలు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 796
హదీసు 797
وعن أَبي هريرة رضي اللَّه عنه، قَالَ: بينما رَجُل يُصَلِّى مُسْبِلٌ إِزَارَه، قَالَ لَهُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اذهَب فَتَوضأْ"فَذهَب فَتَوضَّأَ، ثُمَّ جاءَ، فَقَالَ:"اذهبْ فَتَوضَّأْ"فَقَالَ له رجُلٌ: يا رسول اللَّه. مالكَ أَمرْتَهُ أَن يَتَوَضَّأَ ثُمَّ سَكَتَّ عَنْهُ؟ قَالَ:"إِنه كانَ يُصلِّى وهو مُسْبلٌ إِزارهُ، إِن اللَّه لاَ يقْبلُ صلاةَ رجُلٍ مُسبِلٍ ". رواه أَبُو داود بإِسنادٍ صحيح عَلَى شرط مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి తన నడుంవస్త్రాన్ని (గిలకల క్రిందికి) వ్రేలాడదీసి నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త ﷺ అతన్ని చూసి, "వెళ్ళి, వుజూ చేసుకొని రా" అని అతన్ని ఆదేశించారు. అతనెళ్ళి వుజూ చేసుకొని వచ్చాడు. దైవప్రవక్త ﷺ మళ్ళీ అతన్ని "వెళ్ళి వుజూ చేసుకొని రా" అని ఆదేశించారు.
అది చూసి ఇంకో వ్యక్తి, "దైవప్రవక్తా! మీరతన్ని వుజూ చేసుకోమని ఆదేశించి (కారణం తెలుపకుండా) మౌనం వహిస్తున్నారేమిటి?" అని సందేహపడుతూ అడిగాడు. దానికాయన, "ఇందాక ఈ వ్యక్తి తన నడుంవస్త్రాన్ని (మడమల క్రిందికి) వ్రేలాడదీసి నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా నడుంవస్త్రాన్ని వ్రేలాడదీసేవాని నమాజును దేవుడు ఆమోదించడు" అని చెప్పారు.
(అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ముస్లిం షరతులననుసరించి తన గ్రంథంలో పేర్కొన్నారు).
(సుననె అబూ దావూద్లోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said to a man who was performing Salat while his lower garment was trailing, “Go and perform your Wudu’ again.” That man went and came back having performed it. The Messenger of Allah ﷺ said (again), “Go and perform your Wudu’.” Someone present said to Messenger of Allah ﷺ: “O Messenger of Allah! You ask him to perform his Wudu’ and then you kept silent (without saying the reason for it).” He ﷺ said, “He performed Salat while his lower garment was below his ankels. Allah does not accept the Salat of a man who trails his lower garment.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ఈ హదీసుని ఆధారంగా చేసుకొని కొంతమంది నడుంవస్త్రాన్ని గిలకలకన్నా క్రిందికి వ్రేలాడదీస్తే వుజూ భంగమవుతుందని వాదించారు. కాని ఈ వాదన సరయినది కాదు. షేఖ్ అల్ బానీ (రహిమహుల్లాహ్)గారు ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేసినవారు అపోహకు లోనయ్యారని చెప్పారు. ఎందుకంటే ఈ హదీసుకు ముఖ్య ఆధారమయిన అబూ జాఫర్ మదనీ అనే ఉల్లేఖకుని గురించి పూర్తి వివరాలు లభ్యం కాలేదు. అంచేత ఈ హదీసు ప్రామాణికమైనది కాదు. షేఖ్ అల్ బానీ గారు ఈ హదీసుని 'జయీఫ్ అబూ దావూద్' క్రింద పొందుపరచారు.
ఏది ఎలా ఉన్నా నడుంవస్త్రాన్ని గిలకల కన్నా క్రిందికి వ్రేలాడదీసే విషయానికి సంబంధించినంత వరకు, ఇతర ప్రామాణిక హదీసుల్లో దీని గురించి తీవ్రంగా హెచ్చరించటం జరిగింది. ఇది నిషిద్ధమన్న విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అంచేత నమాజులోగాని, బయటగాని ధోవతీ, పైజామా, షరాయి, లుంగీ మొదలగునవి గిలకల కన్నా క్రిందికి వ్రేలాడకుండా జాగ్రత్తపడాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 797
హదీసు 798
وعن قَيسِ بن بشرٍ التَّغْلبيِّ قَالَ: أَخْبَرنى أَبي وكان جَلِيساً لأَبِي الدَّرداءِ قَالَ: كَانَ بِدِمشقَ رَجُلٌ مِنْ أَصحاب النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقال لَهُ سهلُ بنُ الحنظَليَّةِ، وَكَانَ رجُلاً مُتَوحِّداً قَلَّمَا يُجالسُ النَّاسَ، إِنَّمَا هُوَ صلاةٌ، فَإِذا فرغَ فَإِنَّمَا هُوَ تَسْبِيحٌ وتكبيرٌ حَتَّى يأْتيَ أهْلَهُ، فَمَرَّ بِنَا ونَحنُ عِند أَبي الدَّردَاءِ، فَقَالَ لَهُ أَبو الدَّردَاءِ: كَلِمةً تَنْفَعُنَا وَلاَ تضُرُّكَ،. قَالَ: بَعثَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سريَّةً فَقَدِمَتْ، فَجَاءَ رَجُلٌ مِنهم فَجَلسَ في المَجْلِس الَّذِي يَجلِسُ فِيهِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فقَالَ لرجُلٍ إِلى جَنْبهِ: لَوْ رَأَيتنَا حِينَ التقَيْنَا نَحنُ والعدُو، فَحمَل فلانٌ فَطَعَنَ، فَقَالَ: خُذْهَا مِنِّى. وأَنَا الغُلامُ الغِفَارِيُّ، كَيْفَ تَرى في قوْلِهِ؟ قَالَ: مَا أَرَاهُ إِلا قَدْ بَطَلَ أَجرُهُ. فسَمِعَ بِذلكَ آخَرُ فَقَالَ: مَا أَرَى بِذَلَكَ بأْساً، فَتَنَازعا حَتى سَمِعَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَالَ: "سُبْحان اللَّه؟ لاَ بَأْس أَن يُؤْجَرَ ويُحْمَد" فَرَأَيْتُ أَبا الدَّرْدَاءِ سُرَّ بِذلكَ، وجعلَ يَرْفَعُ رأْسَه إِلَيهِ وَيَقُولُ: أأَنْتَ سمِعْتَ ذَلكَ مِنْ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم،؟ فيقول: نعَمْ، فما زال يعِيدُ عَلَيْهِ حَتَّى إِنّى لأَقولُ لَيَبرُكَنَّ عَلَى ركْبَتَيْهِ. قَالَ: فَمَرَّ بِنَا يَوماً آخَرَ، فَقَالَ لَهُ أَبُو الدَّرْدَاءِ: كَلِمَةً تَنفَعُنَا وَلاَ تَضُرُّكَ، قَالَ: قَالَ لَنَا رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "المُنْفِقُ عَلى الخَيْلِ كالبَاسِطِ يَدَهُ بالصَّدَقة لاَ يَقْبِضُهَا". ثُمَّ مرَّ بِنَا يَوْماً آخَرَ، فَقَالَ لَهُ أَبو الدَّرْدَاءِ: كَلِمَةً تَنْفَعُنَا وَلا تَضرُّكَ، قَالَ: قَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "نعْمَ الرَّجُلُ خُرَيْمٌ الأَسَديُّ، لولا طُولُ جُمته وَإِسْبَالُ إِزَارِه" فبَلغَ ذَلِكَ خُرَيماً، فَعجَّلَ فَأَخَذَ شَفرَةً فَقَطَعَ بِهَا جُمتَهُ إِلى أُذنيْه، ورفعَ إِزَارَهُ إِلى أَنْصَاف سَاقَيْه. ثَمَّ مَرَّ بنَا يَوْماً آخَرَ فَقَالَ لَهُ أَبُو الدَّرْدَاءِ: كَلِمةً تَنْفَعُنَا ولاَ تَضُرُّكَ قَالَ: سَمعْتُ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إِنَّكُمْ قَادمُونَ عَلى إِخْوانِكُمْ. فَأَصْلِحُوا رِحَالَكمْ، وأَصْلحوا لبَاسَكُمْ حَتَّى تَكُونُوا كَأَنَّكُمْ شَامَة في النَّاسِ، فَإِنَّ اللَّه لاَ يُحبُّ الفُحْشَ وَلاَ التَّفَحُش". رواهُ أَبو داود بإِسنادٍ حسنٍ، إِلاَّ قَيْسَ بن بشر، فاخْتَلَفُوا في توثيقِهِ وتَضْعفيه، وقد روى له مسلم.
హజ్రత్ ఖైస్ బిన్ బిష్ర్ తగ్లిబి (రదియల్లాహు అన్హు) కథనం : మా నాన్నగారు ఇలా తెలిపారు : ఆయన తరచూ అబూదర్దా (రదియల్లాహు అన్హు)తోపాటు కూర్చొని మాట్లాడుతుండేవారు:
"డెమాస్కస్లో సహ్ల్ బిన్ హంజలియా అనబడే దైవప్రవక్త అనుచరుడు ఒకాయన ఉండేవారు. ఆయన ఎల్లప్పుడూ ఏకాంతాన్ని యిష్టపడేవారు. ఆయన ప్రజలతోపాటు కలిసి కూర్చోవటం చాలా అరుదు. పొద్దస్తమానం ఆయన ధ్యాసంతా నమాజ్ మీదే ఉండేది. నమాజ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళేవరకు తస్బీహ్లు, తక్బీర్లు పలకటంలోనే నిమగ్నులై ఉండేవారు.
ఒకసారి మేము అబూదర్దా (రదియల్లాహు అన్హు) దగ్గర కూర్చొని ఉండగా ఆయన మా దగ్గర్నుంచి వెళుతున్నారు. అప్పుడు అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఆయన్ని పిలిచి, "మాకేదయినా విషయం చెప్పండి. దానివల్ల మాకు ప్రయోజనం కలగాలి. అలాగే మీకు నష్టం కూడా జరగకూడదు" అని కోరారు. అప్పుడాయన ఇలా చెప్పారు:
"ఒకసారి దైవప్రవక్త ﷺ ఓ సైనిక పటాలాన్ని (జిహాద్ నిమిత్తం) పంపారు. ఆ సైనిక పటాలం తిరిగొచ్చిన తర్వాత వారిలోని ఒకడు దైవప్రవక్త ﷺ ఆసీనులై ఉన్న సమావేశంలోకి వచ్చి కూర్చున్నాడు. తర్వాత అతను తన ప్రక్కనున్న మనిషితో ముచ్చటిస్తూ, "మేము, మరియు శత్రువులు పరస్పరం తలపడినప్పుడు (జరిగిన భీకరపోరును) నువ్వు చూస్తే బాగుండేది! మాలోని ఒకడు ఒక శత్రువుని ఈటెతో కొడ్తూ, "అదుగో నా తడాఖా చూడు. నేను గిఫార్ తెగకు చెందిన కుర్రోణ్ణి" అన్నాడు. ఇలా అనటం గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. దానికావ్యక్తి "అతని పుణ్యం వృధా అవుతుందని నా అభిప్రాయం" అని సమాధానమిచ్చాడు. అది విని ఇంకో వ్యక్తి లేచి, "నా అభిప్రాయం ప్రకారం అలా చేయటంలో తప్పులేదు (ఎందుకంటే అతను అహంకారంతో అనలేదు. పైగా శత్రువుని భయపెట్టే ఉద్దేశ్యంతోనే అలా అని ఉంటాడు)" అని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరూ వాదులాడుకోసాగారు. వారి గొడవ విని దైవప్రవక్త ﷺ "సుబ్హానల్లాహ్! ఆ వ్యక్తికి పుణ్యం దొరికినా, అతణ్ణి ప్రశంసించినా జరిగే నష్టమేమీ లేదు" అని అన్నారు.
ఈ విషయం విని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) సంతోషించటం నేను చూశాను. ఆయన ఇబ్నె హంజలియా వైపు తలెత్తి, "నిజంగానే మీరు దైవప్రవక్త ﷺ ఈ మాట చెబుతుండగా విన్నారా?" అని అడిగారు. ఇబ్నె హంజలియా 'అవున'న్నారు. ఆయన మాటిమాటికీ అదే ప్రశ్నవేస్తూ పోయారు. ఆయన్ని చూస్తే (ఇబ్నె హంజలియా పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచటానికి) ఆయన మోకాళ్ళ మీదే కూర్చుంటారేమోననిపించింది నాకు!
మరో రోజు ఆయన (ఇబ్నె హంజలియా) మా దగ్గర్నుంచి వెళుతున్నారు. అబూదర్దా (రదియల్లాహు అన్హు) ఆయనతో, "మాకు ఏదయినా విషయం తెలపండి. దానివల్ల మాకు ప్రయోజనం కలగాలి. అలాగని మీక్కూడా నష్టం జరగకూడదు" అన్నారు మళ్ళీ. దానికాయన, "(జిహాద్ కోసం ఉపయోగించే) గుర్రాలపై డబ్బు ఖర్చుపెట్టేవాడు తన చేతిని ముడుచుకోకుండా, ఎల్లప్పుడూ దానం చేయటం కోసం తెరిచిఉంచేవానితో సమానమని దైవప్రవక్త ﷺ మాతో చెప్పారు" అని అన్నారు.
ఇంకో రోజు ఆయన మా దగ్గర్నుంచి వెళ్ళారు. అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఆయనతో, "మాకో విషయం చెప్పండి. దానివల్ల మాకు ప్రయోజనం కలగాలి. అలాగని మీకూ నష్టం జరగకూడదు" అన్నారు. అప్పుడాయన ఇలా చెప్పారు: ఒకసారి దైవప్రవక్త ﷺ ఖురైమ్ అసదీ (రదియల్లాహు అన్హు) శిరోజాలు పొడుగ్గా, నడుంవస్త్రం గిలకల క్రిందికి వ్రేలాడుతూ ఉండకపోతే, అతను చాలా మంచివాడు అనిపించుకుంటాడని అన్నారు. ఈ విషయం తనకు తెలియగానే ఖురైమ్ ఒక కత్తెర తీసుకొని, దాంతో పెరిగిపోయిన తన శిరోజాల్ని చెవులదాకా కత్తిరించుకున్నారు. అలాగే తన నడుంవస్త్రాన్ని కూడా సగం పిక్కల వరకు ఎత్తికట్టుకున్నారు.
ఇబ్నె హంజలియా మరో రోజు మా సమీపం నుంచి వెళ్ళారు. అప్పుడు కూడా అబూదర్దా (రదియల్లాహు అన్హు) ఆయనతో, "మాకేదయినా విషయం తెలపండి. దానివల్ల మాకు ప్రయోజనం కలగాలి. అలాగని మీకూ నష్టం జరగకూడదు" అని అన్నారు. ఆ సందర్భంగా ఆయన దైవప్రవక్త ﷺ తన అనుచరులకు ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని చెప్పారు:
"మీరు మీ సోదరుల దగ్గరికి వెళ్ళనున్నారు. కనుక మీరు మీ అంబారీలను, దుస్తుల్ని చక్కబెట్టుకోండి. మొహం మీద పుట్టుమచ్చలున్న వ్యక్తి ఎంతమంది గుంపులోనయినా అవలీలగా గుర్తుపట్టగలిగేవిధంగా, అందంగా ఉంటాడు. మీరూ ఆ విధంగా తయారుకావాలి. అప్రయత్నంగాగానీ, బుద్ధిపూర్వకంగా గాని తమ శరీరాకృతిని వికారంగా మలచుకునే వారిని నిశ్చయంగా దేవుడు యిష్టపడడు."
అబూదావూద్ ఈ హదీసును ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు. కాని దీని పరంపరలోని ఒకానొక ఉల్లేఖకుడు ఖైస్ బిన్ బిష్ర్ విశ్వసనీయులా కారా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈయన ఉల్లేఖించిన హదీసుని గ్రహించారన్న విషయం గమనార్హం.
(సుననె అబూ దావూద్లోని వస్త్రధారణ ప్రకరణం)
English
Qais bin Bishr At-Taghlibi reported that his father, who attended the company of `Abud-Darda’ (radiyallahu anhu) told him: There was a man in Damascus who was a Companion of the Messenger of Allah ﷺ. He was called Ibn Al-Hanzaliyyah. He was a lonesome person and would rarely spend some time in the company of people. He would spend most of his time in performing Salat and when he finished, he would engage himself in Tasbih (Subhan-Allah) and Takbir (Allahu Akbar), till he would go home. He passed by us one day when we were sitting with Abud-Darda’ (radiyallahu anhu). The latter said to him: “Tell us something which will benefit for us and will not harm you.” He said: “Messenger of Allah ﷺ sent a detachment. When they returned, one of them came to the assemblage in which Messenger of Allah ﷺ was present and said to his neighbour during the conversation: `I wish you had seen us when we encountered the enemy. So-and-so (a believer) took up his spear, struck and said: Take this from me and I am the Ghifari boy. Now what do you think of this?’ The neighbour said: `I think that he lost his reward because of boasting.’ He said: `I see no harm in it.’ They began to exchange arguments till Messenger of Allah ﷺ heard them and said, `Subhan-Allah (Allah is free from every imperfection). He would be rewarded (in the Hereafter) and praised (in this world)’. I noticed that Abud-Darda’ (radiyallahu anhu) felt a great pleasure at this remark and, raising his head began to repeat: “Have you heard Messenger of Allah ﷺ say this!” Ibn Al-Hanzaliyyah (radiyallahu anhu) continued responding till I asked Abud-Darda’ (radiyallahu anhu) not to annoy him.
Ibn Al-Hanzaliyyah (radiyallahu anhu) happened to pass by us another day and Abud-Darda’ said to him: “Tell us something which will benefit us and will not harm you.” He said: “The Messenger of Allah ﷺ told us, `He who spends to purchase a horse (for Jihad) is like one who extends his hand for spending out of charity without withholding it.”’
He passed by us another day and Abud-Darda’ (radiyallahu anhu) said to him: “Tell us something which might benefit us, and will not harm you.” He said: “The Messenger of Allah ﷺ once said, `Khuraim Al-Usaidi is an excellent man were it not of his long hair and his lower garment which is hanging down.’ When Khuraim heard about what the Prophet had said about him, he trimmed his long hair up to his ears with a knife and raised his lower garment half way on his shanks.”
On another occasion he passed by us and Abud-Darda’ (radiyallahu anhu) said to him: “Tell us something that will benefit us and will not harm you.” He said that he heard Messenger of Allah ﷺ say, while coming back from an expedition: “You are returning to your brothers, so set your saddles and clothes in order so that you look tidy and graceful. Allah hates untidiness.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
- యుద్ధంలో శత్రువుని భయపెట్టటానికి, అతన్ని మానసికంగా కృంగదీయటానికి మనిషి తన ధైర్యసాహసాల గురించి గొప్పలు చెప్పుకోవటం తప్పుకాదు. పైగా ఉద్దేశ్యం మంచిదవటం వల్ల అందుకు పరలోకంలో పుణ్యం కూడా లభిస్తుంది. ప్రపంచంలో ప్రజల నీరాజనాలు కూడా అందుతాయి.
- శిరోజాల పొడవును బట్టి వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. భుజాల వరకు పెరిగిన శిరోజాలను 'జుమ్మా' అని, చెవి తమ్మెలకు – భుజాలకు మధ్య వరకు పెరిగిన శిరోజాలను 'లిమ్మా' అని, చెవితమ్మెల దాకా పెరిగిన శిరోజాలను 'వఫ్రా' అని అంటారు. దైవప్రవక్త శిరోజాలు లిమ్మా కంటే చిన్నవిగా వఫ్రా కంటే పొడవుగా ఉండేవి. మొత్తానికి దైవప్రవక్త శిరోజాలు కూడా పొడవుగా ఉండేవి కాని అవి జుమ్మా అంత పొడవుగా ఉండేవి కావు. పైగా అంత పొడవు శిరోజాలను ఆయన అసహ్యించుకునేవారు.
- ప్రయాణం నుంచి తిరిగిరాగానే ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు తొడుక్కోవటం అభిలషణీయం. అంతేగాని ప్రయాణం నుంచి తిరిగొచ్చి అవే మురికి బట్టలతో, మాసిన శరీరంతో ఉండటం మంచిది కాదు. కావాలని చేసినా, పొరపాటున చేసినా ఆ స్థితి అటు అల్లాహ్కూ అయిష్టకరం, ఇటు చూసేవారికీ అసహ్యకరం.
- ఒక వ్యక్తిని చక్కదిద్దే ఉద్దేశ్యంతో అతని పరోక్షంలో అతని బలహీనతలు వెలిబుచ్చటం తప్పు కాదు. దైవప్రవక్త ﷺ చేసింది అదే. అది చాడీ క్రిందికి రాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 798
హదీసు 799
وعن أَبي سعيدٍ الخدْرِيِّ رضيَ اللَّهُ عنه قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "إزرَةُ المُسلِمِ إِلى نصْفِ السَّاقِ، وَلاَ حَرَجَ أَوْ لاَ جُنَاحَ فِيمَا بَيْنَهُ وَبَيْنَ الكَعْبَيْنِ، فَمَا كانَ أَسْفَلَ منَ الكعْبَينِ فَهَوُ في النَّارِ، ومَنْ جَرَّ إِزارهُ بَطَراً لَمْ يَنْظرِ اللَّه إِلَيْهِ". رواهُ أَبُو داود بإِسنادٍ صحيحٍ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: ముస్లిం ధరించే అంగవస్త్రం సగం పిక్కల వరకు మాత్రమే ఉండాలి. పిక్కలకు-గిలకలకు మధ్య ఉన్నా ఫర్వా (లేక తప్పు) లేదు. కాని గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే వస్త్రం అగ్నికి ఆహుతి అవుతుంది. ఎవరయితే అహంకారంతో విర్రవీగుతూ తన ధోవతీ (షరాయి, లుంగీ)ని ఈడుస్తూ నడుస్తాడో, అతని వైపు దేవుడు కన్నెత్తి కూడా చూడడు. (అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు)
(సుననె అబూ దావూద్లోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The lower garment of a believer should be half way below the knees. He is guilty of no sin if they are up to the ankles. That which is below the ankles is in the Fire (of Hell). Allah will not look at one who allows his lower garment to trail out of vanity.[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 799
హదీసు 800
وعن ابنِ عمر رضيَ اللَّه عنهما قَالَ: مَرَرْتُ عَلى رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَفي إِزاري اسْترْخَاءٌ. فَقَالَ: "يَا عَبْدَ اللَّهِ، ارْفَعْ إِزارَكَ "فَرفعتهُ ثُمَّ قَالَ:"زِدْ"، فَزِدْتُ، فَمَا زِلْتُ أَتَحرَّاها بَعْدُ. فَقَالَ بَعْض القُوْمِ: إِلى أَيْنَ؟ فَقَالَ: إِلى أَنْصاف السَّاقَيْنِ". رواهُ مسلم.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒకసారి నేను దైవప్రవక్త ﷺ సమీపం నుండి వెళ్ళాను. ఆ సమయంలో నా నడుంవస్త్రం (గిలకలకన్నా) క్రిందికి వ్రేలాడుతూ ఉంది. అదిచూసి దైవప్రవక్త ﷺ "అబ్దుల్లాహ్! నీ నడుంవస్త్రాన్ని పైకెత్తుకో" అన్నారు. నేను దాన్ని పైకెత్తుకున్నాను. ఆయన ఇంకా పైకెత్తమన్నారు. నేను ఇంకాస్త పెకెత్తుకొని కట్టుకున్నాను. ఇక అప్పట్నుంచి దాని విషయంలో నేను జాగ్రత్త వహించేవాణ్ణి.
కొంతమంది ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారిని అడిగారు, "నడుంవస్త్రం ఎక్కడి వరకు ఉండాలి?" అని. దానికాయన, "సగం పిక్కల వరకు ఉండవచ్చని" చెప్పారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: My lower garment was trailing as I passed by Messenger of Allah ﷺ so he said, “Raise your lower garment, Abdullah.” I lifted it up and he told me to raise it higher. I complied with his orders and as I was still trying to find the best place (for it), one of the people asked where it should reach and he ﷺ replied, “Half way down the knees.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 800
హదీసు 801
وعنه قَالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ جَرَّ ثَوبَه خيلاءَ لَمْ يَنْظُرِ اللَّه إِلَيْهِ يَوْمَ القيامِةِ"فقالَتْ أُمُّ سَلَمَةَ: فَكَيْفَ تَصْنَعُ النِّسَاءُ بِذُيُولِهنَّ، قالَ:"يُرْخينَ شِبْراً". قَالَتْ: إِذن تَنكَشفُ أَقْدامُهنَّ. قَالَ:"فيُرْخِينَهُ ذِراعاً لاَ يَزِدْنَ". رواهُ أَبو داود، والترمذي وَقالَ: حديث حسن صحيح.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : అహంకారంతో విర్రవీగుతూ తన నడుంవస్త్రాన్ని ఈడుస్తూ నడిచేవాని వైపు దేవుడు ప్రళయదినాన కన్నెత్తి కూడా చూడడు."
అది విని హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా), "మరి స్త్రీలు తమ వస్త్రాలను ఎంతవరకు వదులుకోవచ్చు?" అని సందేహపడగా, దానికి దైవప్రవక్త ﷺ, "నడిపిక్కల నుండి ఒక జానెడు క్రిందికి వదులుకోవచ్చు" అని అన్నారు. "స్త్రీలు అలా ధరిస్తే, వారి కాళ్ళు నగ్నంగా ఉంటాయి" అన్నారు ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా). అప్పుడు దైవప్రవక్త ﷺ "అయితే ఒక మూరక్రిందికి వదులుకోవాలి. దానికి మించి వదులుకోకూడదు" అని అన్నారు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె అబూ దావూద్, సుననె తిర్మిజీలోని వస్త్రధారణ అధ్యాయాలు)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “On the Day of Resurrection, Allah will not look at the one who trails his lower garment out of arrogance.’‘ Umm Salamah (radiyallahu anha) asked: “What should women do with the hem of their clothes?” He ﷺ said, “They might lower them a hand’s span.” She said: “But their feet would still remain exposed.” He said, “Let them lower those equal to arm’s length but not more than that.”[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
నడుంవస్త్రం నడిపిక్కల వరకు ఉండాలన్న నియమం కేవలం పురుషులకు మాత్రమే. స్త్రీ పిక్కలు సతర్ (మర్మావయవాల) క్రిందికి వస్తాయి. వాటిని కప్పి ఉంచటం అవసరం. కనుక స్త్రీలు తమ అంగవస్త్రం దానికన్నా ఒక మూర క్రిందికి ఉండేవిధంగా కట్టుకోవాలి. పాదాలు సయితం మునిగిపోయేలా దుస్తులు ధరించినా ఫర్వాలేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|119. చొక్కా, చొక్కా చేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం అవాంఛనీయం|హదీసు 801
You must be logged in to post a comment.