హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 113వ అధ్యాయం: పానీయాల్లో ఊదటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 765 – 766) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
113. పానీయాల్లో ఊదటం అవాంఛనీయం
باب كراهة النفخ في الشراب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 765
عن أَبي سعيدٍ الخدريِّ رضي اللَّه عنه أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى عَنِ النَّفخِ في الشَّرابِ فَقَالَ رَجُلٌ: القذَاةُ أَراها في الإِناءِ؟ فقال:"أَهْرِقْهَا"قال: فإِنى لا أُرْوَى مِنْ نَفَسٍ وَاحِدٍ؟ قَالَ:"فَأَبِنْ القَدَحَ إِذاً عَنْ فِيكَ" رواه الترمذي وقال: حديث حسن صحيح.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పానీయంలో ఊదటాన్ని వారించారు.
అది విని ఒక వ్యక్తి సందేహపడుతూ "మరి పానీయంలో నలకలు కనబడితేనో?" అని అడిగాడు. దాని కాయన, "ఆ పానీయాన్ని (కొద్దిగా) పారబొయ్యి" అని చెప్పారు. "ఒక్క శ్వాసలో త్రాగితే నాకు దప్పిక తీరదు" మళ్ళీ అన్నాడా వ్యక్తి. "అయితే శ్వాస తీసుకునేటప్పుడు చెంబుని నోటిదగ్గర్నుంచి ప్రక్కకు తీసుకో" అని చెప్పారు దైవప్రవక్త ﷺ. (తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ prohibited us blowing in the drinking water. A man said: “O Messenger of Allah! Sometimes I see some litter floating about on the surface. What should I do then?” He ﷺ replied, “Pour them out.” Then the man said: “My thirst is not quenched with one draught.” Messenger of Allah ﷺ said, “Then put away the cup from your mouth (in between three gulps), and take breath.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
పానీయంలో నలకల్లాంటి మలినాలేవయినా పడిపోతే ఆ పానీయంలో ఊదటానికి బదులు అందులోని కొంత పానీయాన్ని పారబోయాలి. అంతకంటే హానికరమైన వస్తువేదయినా పడిపోతే మొత్తం పానీయాన్నే పారబోయాలి. అంతేగాని అందులో ఊదకూడదు. పానీయంలో ఊదటం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. ఖరీదైన పానీయాల్లో నలకలు పడిపోతే వాటిని చెమ్చాతో కూడా తీసిపారేయవచ్చు. ఒక నలుసు కోసం మొత్తం పానీయాన్ని పారబోయటం మంచిది కాదు కదా!
ఒక శ్వాసలో తాగితే దాహం తీరదనుకున్నప్పుడు పానీయమున్న చెంబును నోటికి దూరంగా జరిపి మళ్ళీ శ్వాస తీసుకొని త్రాగాలి. ఆ విధంగా మూడు శ్వాసల్లో పానీయం త్రాగటం అభిలషణీయమే కాకుండా దానివల్ల దాహం కూడా తీరుతుంది. అయితే టీ, పాలు లాంటి వేడిగా ఉండే పానీయాలను గుటకలుగా త్రాగవలసి ఉంటుంది. కాబట్టి వాటిని ఎన్ని శ్వాసల్లోనయినా త్రాగవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|113. పానీయాల్లో ఊదటం అవాంఛనీయం|హదీసు 765
హదీసు 766
وعن ابن عباس رضي اللَّه عنهما أن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى أَن يُتنَفَّسَ في الإِنَاءِ، أَوْ يُنْفَخَ فِيهِ، رواه الترمذي وقال: حديث حسن صحيح.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ పానీయమున్న చెంబులో శ్వాస తీసుకోవటాన్ని లేక అందులో ఊదటాన్ని వారించారు.
(తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ prohibited us from breathing into the drinking vessel or blowing onto.[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|113. పానీయాల్లో ఊదటం అవాంఛనీయం|హదీసు 766
You must be logged in to post a comment.