మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 55. వ్యాఖ్యాన ప్రకరణం. ఇందులో 14 హదీసులు (హదీసు 1893 – 1906), 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFవ్యాఖ్యాన ప్రకరణం6 పేజీలు · 1.3 MB
55. వ్యాఖ్యాన ప్రకరణం
كتاب التفسيرఅధ్యాయాలు (3)
హదీసు 1893
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قِيلَ لِبَنِي إِسْرَائِيلَ: ادْخُلُوا الْبَابَ سُجَّدًا، وَقُولُوا حِطَّةٌ، فَبَدَّلُوا فَدَخَلُوا يَزْحَفُونَ عَلَى أَسْتَاهِهِمْ، وَقَالُوا: حَبَّةٌ فِي شَعْرَةٍ
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 28 باب حدثني إسحق بن نصر
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు:- ఇస్రాయీల్ సంతతివారికి “పట్టణ ముఖద్వారం గుండా వంగి హిత్తతున్, హిత్తతున్★ అంటూ ప్రవేశించండి” (2:58) అని ఆజ్ఞ అయింది. కాని వారు దైవాజ్ఞ భావాన్ని మార్చివేశారు. పాప క్షమాపణ అనడానికి బదులు ‘వెన్నులో గింజ’ అంటూ పిరుదులను ఈడుస్తూ (కుప్పిగంతులేస్తూ) ప్రవేశించారు.
(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం-అంబియా, 28వ అధ్యాయం – హద్దసనీ ఇస్‌హాఖుబ్ను నస్ర్)
★ ‘హిత్తతున్’ అంటే ‘ఇది క్షమాపణ కోరవలసిన సమయం, పాపాలు దూరమవుతున్నాయి’ అని అర్థం. (సంకలనకర్త)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1893
హదీసు 1894
حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ اللهَ تَعَالَى تَابَعَ عَلَى رَسُولِهِ، قَبْلَ وَفَاتِهِ حَتَّى تَوَفَّاهُ أَكْثَرَ مَا كَانَ الْوَحْيُ ثُمَّ تُوُفِّيَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بَعْدُ
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 1 باب كيف نزول الوحي
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ జీవిత చరమదశలో అల్లాహ్ నిరంతరాయంగా మాటిమాటికి దివ్యావిష్కృతి (వహీ)ని అవతరింపజేశాడు. ముఖ్యంగా ఆయన నిర్యాణానికి ముందు అనేకసార్లు దివ్యావిష్కృతి అవతరించింది. ఆ తర్వాత ఆయన ఇహలోకం వీడిపోయారు.
(సహీహ్ బుఖారీ:- 66వ ప్రకరణం – ఫజాయిలె ఖుర్‌ఆన్, 1వ అధ్యాయం – కైఫ నుజూలుల్ వహ్‌యి)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1894
హదీసు 1895
حديث عُمَرَ بْنِ الْخَطَّابِ، أَنَّ رَجُلاً مِنَ الْيَهُودِ قَالَ لَهُ: يَا أَمِيرَ الْمُؤْمِنِينَ آيَةٌ فِي كِتَابِكُمْ تَقْرَءُونَهَا، لَوْ عَلَيْنَا، مَعْشَرَ الْيَهُودِ نَزَلَتْ، لاَتَّخَذْنَا ذلِكَ الْيَوْمَ عِيدًا قَالَ: أَيُّ آيَةٍ قَالَ (الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلاَمَ دِينًا) قَالَ عُمَرُ: قَدْ عَرَفْنَا ذَلِكَ الْيَوْمَ، وَالْمَكَانَ الَّذِي نَزَلَتْ فِيهِ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ قَائِمٌ بِعَرَفَةَ، يَوْمَ جُمُعَةٍ
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 33 باب زيادة الإيمان ونقصانه
హజ్రత్ తారిఖ్ బిన్ షిహాబ్ (రహిమహుల్లాహ్) కథనం:- ఒక యూద మతస్థుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ “విశ్వాసుల నాయకా! మీ గ్రంథంలో మీరు పఠించే ఒక సూక్తి ఉంది. ఆ సూక్తి గనక మా యూదులపై అవతరించి ఉంటే, మేమా సూక్తి అవతరించిన రోజును పండుగ దినంగా చేసుకునేవాళ్ళము” అని అన్నాడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఆ సూక్తి ఏది?” అని అడిగారు. యూదుడు ఆ సూక్తిని ఇలా పఠించాడు, “నేనీ రోజు మీ కోసం మీ ధర్మాన్ని సంపూర్ణం గావించి, మీకు (ప్రసాదించవలసిన) నా అనుగ్రహ భాగ్యాన్ని పూర్తి చేశాను. మీ కోసం ఇస్లాంను మీ ధర్మంగా ఆమోదించాను”. (5:3)
దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “ఆ రోజు ఏదో మాకు బాగా తెలుసు. పైగా దైవప్రవక్త ﷺపై ఈ సూక్తి ఎక్కడ అవతరించిందో కూడా మాకు తెలుసు. ఆ రోజు శుక్రవారం. దైవప్రవక్త ﷺ అరఫాత్ ప్రాంతంలో (ప్రసంగించడానికి) నిల్చున్నారు. (శుక్రవారం ముస్లింలకు ఇంతకు ముందు నుంచే పండుగ రోజుగా పరిగణించబడుతూ వస్తోంది)” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:-2వ ప్రకరణం – ఈమాన్, 33వ అధ్యాయం-జియాదతిల్ ఈమాని వనుఖ్సానిహీ)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1895
హదీసు 1896
حديث عَائِشَةَ، عَنْ عُرْوَةَ ابْنِ الزُّبَيْرِ، أَنَّه سَأَلَ عَائِشَةَ عَنْ قَوْلِ اللهِ تَعَالَى (وَإِنْ خِفْتُمْ) إِلَى (وَرُبَاعَ) فَقَالَتْ: يَا ابْنَ أُخْتِي هِيَ الْيَتِيمَةُ تَكُونُ فِي حَجْرِ وَلِيِّهَا، تُشَارِكهُ فِي مَالِهِ، فَيُعْجِبُهُ مَالُهَا وَجَمَالُهَا فَيُرِيدُ وَلِيُّهَا أَنْ يَتَزَوَّجَهَا بِغَيْرِ أَنْ يُقْسِطَ فِي صَدَاقِهَا، فَيُعْطِيَهَا مِثْلَ مَا يُعْطِيهَا غَيْرُهُ فَنُهُوا أَنْ يَنْكِحُوهُنَّ إِلاَّ أَنْ يُقْسِطُوا لَهُنَّ، وَيَبْلُغُوا بِهِنَّ أَعْلَى سُنَّتِهِنَّ مِنَ الصَّدَاقِ، وَأُمِرُوا أَنْ يَنْكِحُوا مَا طَابَ لَهُمْ مِنَ النِّسَاءِ سِوَاهُنَّقَالَتْ عَائِشَةُ: ثُمَّ إِنَّ النَّاسَ اسْتَفْتَوْا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بَعْدَ هذِهِ الآيَةِ فَأَنْزَلَ اللهُ (وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ) إِلَى قَوْلِهِ (وَتَرْغَبُونَ أَنْ تَنْكِحُوهُنَّ) وَالَّذِي ذَكَرَ اللهُ أَنَّهُ يُتْلَى عَلَيْكُمْ فِي الْكِتَابِ، الآيَةُ الأُولَى الَّتِي قَالَ فِيهَا (وَإِنْ خِفْتُمْ أَنْ لاَ تُقْسِطُوا في الْيَتَامَى فَانْكِحُوا مَا طَابَ لَكُمْ مِنَ النِّسَاءِ) قَالَتْ عَائِشَةُ: وَقَوْلُ اللهِ فِي الآيَةِ الأُخْرَى (وَتَرْغَبُونَ أَنْ تَنْكِحُوهُنَّ) يَعْنِي هِيَ رَغْبَةُ أَحَدِكُمْ لِيَتِيمَتِهِ الَّتِي تكُونُ فِي حَجْرِهِ، حِينَ تَكُونُ قَلِيلَةَ الْمَالِ وَالْجَمَالِ فَنُهُوا أَنْ يَنْكِحُوا مَا رَغِبُوا فِي مَالِهَا وَجَمَالِهَا مِنْ يَتَامَى النِّسَاءِ، إِلاَّ بِالْقِسْطِ، مِنْ أَجْلِ رَغْبَتِهِمْ عَنْهُنَّ
أخرجه البخاري في: 47 كتاب الشركة: 7 باب شركة اليتيم وأهل الميراث
హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం:-(దివ్యఖుర్‌ఆన్‌లో) “మీరు అనాథలకు న్యాయం చేకూర్చలేమని భయపడితే, మీకు నచ్చిన స్త్రీలలో ఇద్దర్ని (గాని), ముగ్గుర్ని (గాని), నల్గుర్ని(గాని) వివాహమాడండి” (4:3) అనే దైవసూక్తిని గురించి నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగాను. దానికామె ఈ విధంగా సమాధానమిచ్చారు:-
“బాబూ! దానికి అనాథ బాలిక అని అర్థం. ఒకరి (అంటే ఒక బంధువు) సంరక్షణలో పోషించబడుతూ, సంరక్షకునికి తన సంపదలో భాగం కల్పించిన అనాథ బాలిక ఆమె. ఆ తరువాత ఆ సంరక్షకుడు ఆమె అందాన్ని, ఆమె ఆస్తిని మోహించి మహర్ విషయంలో న్యాయం చేకూర్చకుండా ఆమెను వివాహమాడగోరుతాడు. అంటే ఆమెకు ఇతర స్త్రీలకు ఇచ్చేటంత మహర్ ఇవ్వడానికి అంగీకరించడు. అందువల్ల ఈ సూక్తిలో అలాంటి బాలికలను మహర్ విషయంలో న్యాయం చేకూర్చకుండా వివాహమాడకూడదని ఆజ్ఞాపించబడింది. సంరక్షకుడు అలాంటి బాలికను వివాహమాడదలిస్తే ఆమెకు చెల్లించవలసిన మహర్‌ని పూర్తిగా చెల్లించాలి. తరువాత ఆ బాలికలే కాకుండా మీకు నచ్చిన ఇతర స్త్రీలను కూడా చేసుకోవచ్చని ఈ సూక్తిలో తెలియజేయబడింది.
“ఈ సూక్తి అవతరించిన తరువాత ప్రజలు మళ్ళీ దైవప్రవక్త ﷺను దాని గురించిన వివరాలు అడిగారు. అప్పుడు ఈ (క్రింది) సూక్తి అవతరించింది – “ప్రజలు నిన్ను స్త్రీలను గురించి తీర్పు అడుగుతున్నారు. వారికిలా చెప్పు, వారి విషయంలో అల్లాహ్ మీకు తీర్పు యిస్తున్నాడు. దాంతోపాటు ఈ గ్రంథంలో మీకు ఇంతకు పూర్వం వినిపించిన ఆజ్ఞలను కూడా ఆయన మీకు గుర్తు చేస్తున్నాడు. అంటే అనాథ బాలికలకు సంబంధించిన ఆజ్ఞలు. ఆ బాలికల హక్కులను మీరు నిర్వర్తించరు. వారికి పెళ్ళిళ్ళు చేయరు (వారి అందం, ఆస్తి చూసి స్వయంగా మీరే వారిని వివాహమాడడానికి ఉవ్విళ్ళూరుతారు). ఎలాంటి శక్తిస్థోమతాలేని పసిపిల్లలకు సంబంధించిన ఆజ్ఞలు కూడా. అనాథలకు న్యాయం చేకూర్చాలని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు”. (4:127)
“ఈ గ్రంథంలో మీకు ఇంతకు పూర్వం విన్పించిన ఆజ్ఞలు” అంటే ‘మీరు అనాథలకు న్యాయం చేకూర్చలేమని భయపడితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దర్ని (గాని), ముగ్గుర్ని (గాని), నల్గుర్ని (గాని) వివాహమాడండి’ అనే మొదటి సూక్తి అన్నమాట. రెండవ సూక్తిలో ‘వారికి పెళ్ళిళ్ళు చేయరు లేదా స్వయంగా మీరే వారిని వివాహమాడడానికి ఉవ్విళ్ళూరుతారు’ అంటే సంరక్షకునికి తన సంరక్షణలో ఉండే అనాథ బాలికపట్ల ఆకర్షణ అని అర్థం. సంరక్షకుడ్ని ఆకట్టుకునేటంత అందం, ఆస్తి లేకపోతే అతనామె వివాహాన్ని చేయకుండా ఆమె ఆస్తిని స్వాహా చేస్తాడు. అందం, ఆస్తి ఉంటే స్వయంగా అతనే ఆమెను వివాహమాడతాడు. ఇక్కడ ఆకర్షణ అనేది రెండు పరిస్థితులకూ వర్తిస్తుంది. అందువల్ల (ఈ వైఖరి మానుకొని) అనాథ బాలికలకు న్యాయం చేకూర్చాలని ఆదేశించడం జరిగింది. వారిని వివాహమాడదలచుకుంటే వారికి చెల్లించవలసిన మహర్ ధనాన్ని పూర్తిగా చెల్లించి న్యాయం చేకూర్చాలి. ఒకవేళ ఆమెను వివాహమాడడం తనకు ఇష్టం లేకపోతే ఇతరులకిచ్చి వివాహం జరిపించాలి. ఆ విధంగానైనా ఆమెకు న్యాయం´ చేకూర్చాలి”.
(సహీహ్ బుఖారీ:- 47వ ప్రకరణం – షిర్కత్, 7వ అధ్యాయం – షిర్కతిల్‌యతీమి వ అహ్లిల్ మీరాస్)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1896
హదీసు 1897
حديث عَائِشَةَ قَالَتْ: (وَمَنْ كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ، وَمَنْ كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ) أُنْزِلَتْ فِي وَالِي الْيَتِيمِ الَّذِي يُقِيمُ عَلَيْهِ، وَيُصْلِحُ فِي مَالِهِ، إِنْ كَانَ فَقِيرًا أَكَلَ مِنْهُ بِالْمَعْرُوفِ
أخرجه البخاري في: 34 كتاب البيوع: 95 باب من أجرى أمر الأنصار على ما يتعارفون بينهم
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “అనాథ (పిల్లల) సంరక్షకుడు ధనికుడయి ఉంటే అతను అల్లాహ్ కు భయపడుతూ (వారి పట్ల) మసలుకోవాలి. పేదవాడయి ఉంటే సముచిత రీతిలో (అనాథ పిల్లల ఆస్తిని) తినాలి”. (దివ్యఖుర్‌ఆన్-4:6)
అనాథ సంరక్షణ బాధ్యత వహిస్తూ అతని ఆస్తిని కాపాడే వ్యక్తి విషయంలో ఈ సూక్తి అవతరించింది. అలాంటి సంరక్షకుడు పేదవాడయి ఉంటే అతను అనాథ ఆస్తిని న్యాయబద్ధంగా – సముచితరీతిలో – అనుభవిస్తే అందులో ఎలాంటి తప్పులేదు.
(సహీహ్ బుఖారీ:- 34వ ప్రకరణం – బుయూ, 95వ అధ్యాయం – మన్ అజ్రా అమ్రల్ అమ్సారి అలా మాయత ఆరఫూన్ బైనహుమ్)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1897
హదీసు 1898
حديث عَائِشَةَ (وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا) قَالَتْ: الرَّجُلُ تَكُونُ عِنْدَهُ الْمَرْأَةُ لَيْسَ بِمُسْتَكْثِرٍ مِنْهَا، يُرِيدُ أَنْ يُفَارِقَهَا فَتَقُولُ: أَجْعَلُكَ مِنْ شَأْنِي فِي حِلٍّ فَنَزَلَتْ هذِهِ الآيَةُ فِي ذَلِكَ
أخرجه البخاري في: 46 كتاب المظالم: 11 باب إذا حلله من ظلمه فلا رجوع منه
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “స్త్రీకి తన భర్త తనను వేధిస్తాడని లేదా నిరాదరిస్తాడని భయముంటే” (ఖుర్‌ఆన్-4:128)….
ఒక పురుషుడు తన భార్యను అంతగా పట్టించుకోకుండా ఆమెను వదిలేద్దామని భావిస్తాడు. ఆ స్థితిలో అతని భార్య ‘(నాకు విడాకులివ్వకు) నీవు రెండో పెళ్ళి చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను’★ అని అంటుంది. అలాంటి భర్త విషయంలో ఈ సూక్తి అవతరించింది.
(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం – మజాలిమ్, 11వ అధ్యాయం – ఇజా ఖల్లలహూ మిన్ జుల్మిహీ ఫలా రుజూ అమిన్‌హు)
★ అంటే నాకు విడాకులివ్వకు అని అర్థం. విడాకుల కంటే (రెండో పెళ్ళి చేసుకోవడం ద్వారా) పరస్పరం రాజీపడటం మంచిది. స్త్రీ భర్తతో కొంతకాలం కాపురం చేసింది గనుక, మిగిలిన జీవితం కూడా అతనితో పాటు గడపటమే మంచిది.
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1898
హదీసు 1899
حديث ابْنِ عَبَّاسٍ عَنْ سَعِيدِ بْنِ جُبَيْرٍ، قَالَ: آيَةٌ اخْتَلَفَ فِيهَا أَهْلُ الْكُوفَةِ فَرَحَلْتُ فِيهَا إِلَى ابْنِ عَبَّاسٍ، فَسَأَلْتُهُ عَنْهَا فَقَالَ: نَزَلَتْ هذِهِ الآيَةُ (وَمَنْ يَقْتُلْ مُؤْمِنًا مُتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ) هِيَ آخِرُ مَا نَزَلَ، وَمَا نَسَخَهَا شَيْءٌ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 4 سورة النساء: 16 باب ومن يقتل مؤمنًا متعمدًا فجزاؤه جهنم
హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక సూక్తి భావం విషయంలో కూఫా ప్రజల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. నేనప్పుడు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) దగ్గరకు వెళ్ళి ఆ సూక్తిని గురించి అడిగాను. ఆయన దానికి సమాధానమిస్తూ “ఎవరైనా విశ్వాసిని ఉద్దేశ్యపూర్వకంగా చంపితే దాని ప్రతిఫలం నరకం అవుతుంది- (4:93) అనే సూక్తి ఈ వ్యవహారం గురించి అవతరించిన చివరి సూక్తి. దీన్ని మరే సూక్తీ రద్దు చేయలేదు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 4వ సూరా – నిసా, 16వ అధ్యాయం – వమయ్యఖ్తుల్ మూమినన్ ముత అమ్మిదన్ ఫజజావుహూ జహన్నమ్)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1899
హదీసు 1900
حديث ابْنِ عَبَّاسٍ قَالَ ابْنُ أَبْزَى: سُئِلَ ابْنُ عَبَّاسٍ عَنْ قَوْلِهِ تَعَالَى (وَمَنْ يَقْتُلْ مُؤْمِنًا مُتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ) ، وَقَوْلِهِ (وَلاَ يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللهُ إِلاَّ بِالْحَقِّ) حَتَّى بَلَغَ (إِلاَّ مَنْ تَابَ) فَسَأَلْتُهُ، فَقَالَ: لَمَّا نَزَلَتْ قَالَ أَهْلُ مَكَّةَ: فَقَدْ عَدَلْنَا بِاللهِ وَقَتَلْنَا النَّفْسَ الَّتِي حَرَّمَ اللهُ إِلاَّ بِالْحَقِّ، وَأَتَيْنَا الْفَوَاحِشَ فَأَنْزَلَ اللهُ (إِلاَّ مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلاً صَالِحًا) إلى قَوْلِهِ (غَفُورًا رَحِيمًا)
أخرجه البخاري في: 65 كتاب التفسير: 25 سورة الفرقان: 3 باب يضاعف له العذاب يوم القيامة
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్జా (రదియల్లాహు అన్హు) కథనం:- (1) “ఎవరైనా విశ్వాసిని ఉద్దేశ్యపూర్వకంగా చంపితే దాని ప్రతిఫలం నరకం అవుతుంది” (4:93); (2) “అల్లాహ్‌ను తప్ప మరే దైవాన్ని మొరపెట్టుకోని వారు, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా చంపనివారు, వ్యభిచారానికి పాల్పడనివారు – ఈ (పాప) కార్యాలు చేసేవాడు తన పాపాలకు పర్యవసానం అనుభవిస్తాడు”. (25:68)
నేనీ రెండు సూక్తుల్ని గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ని అడిగితే ఆయన ఈ విధంగా తెలియజేశారు: “ఈ రెండవ సూక్తి అవతరించినప్పుడు మక్కా బహుదైవారాధకులు (నొసలు చిట్లిస్తూ) ‘మనం బహుదైవారాధన (షిర్క్) కూడా చేశాము, అల్లాహ్ నిషేధించిన ప్రాణిని ఉద్దేశ్యపూర్వకంగా హతమార్చడం కూడా చేశాము, నీతిమాలిన చర్యలక్కూడా పాల్పడ్డాము. (అంటే మనం సరాసరి నరకంలోకి పోయి పడతామన్నమాట. మన పాపాల మన్నింపుకు మరో దారే లేదన్నమాట)’ అని అన్నారు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది – ‘(పాపం చేసిన తరువాత) పశ్చాత్తాపంతో పాపక్షమాపణ వేడుకొని, సత్యాన్ని విశ్వసించి సదాచార వైఖరి అవలంబించిన వారు తప్ప. అలాంటి వారి పాప కార్యాలను అల్లాహ్ పుణ్యకార్యాలుగా మార్చుతాడు. ఆయన గొప్ప క్షమాశాలి, అపార దయామయుడు’ (25:70)”.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 25వ సూరా – ఫుర్ఖాన్, 3వ అధ్యాయం – యుజాఅఫు లహుల్ అజాబు యౌమల్ ఖియామ)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1900
హదీసు 1901
حديث ابْنِ عَبَّاسٍ رضي الله عنه (وَلاَ تَقُولُوا لِمَنْ أَلْقى إِلَيْكُمُ السَّلاَمَ لَسْتَ مُؤْمِنًا) قَالَ: كَانَ رَجُلٌ فِي غُنَيْمَةٍ لَهُ، فَلَحِقَهُ الْمُسْلِمُونَ، فَقَالَ: السَّلاَمُ عَلَيْكُمْ فَقَتَلُوهُ وَأَخَذُوا غُنَيْمَتَهُ فَأَنْزَلَ اللهُ فِي ذَلِكَ، إِلَى قَوْلِهِ (عَرَضَ الْحَياةِ الدُّنْيَا) تِلْكَ الْغُنَيْمَةُ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 4 سورة النساء: 17 باب ولا تقولوا لمن ألقى إليكم السلام لست مؤمنًا
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- “ఎవరైనా మీ దగ్గరకు సలాం చేస్తూ వస్తే అతనికి వెంటనే ‘నీవు విశ్వాసివి కావు’ అని చెప్పకండి. మీరు ప్రాపంచిక ప్రయోజనాలు కోరుతున్నారా? అయితే…” (4:94). మేకలు కలిగి ఉన్న ఒకతని దగ్గరకు ముస్లింలు వచ్చినప్పుడు అతను వారిని చూసి అస్సలాము అలైకుం అన్నాడు. కాని ఆ ముస్లింలు అతడ్ని (విశ్వాసిగా నాటకమాడుతున్న శత్రువనుకొని) చంపివేశారు. చంపి అతని మేకల్ని కూడా తీసికెళ్ళారు. ఆ సందర్భంలో ఈ సూక్తి అవతరించింది. ఇందులో ప్రాపంచిక ప్రయోజనాలంటే అతని దగ్గరున్న కొన్ని మేకలన్నమాట.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 4వ సూరా -నిసా, 17వ అధ్యాయం – వలా తఖూలూ లిమన్ అల్ఖా ఇలైకుముస్సలామ లస్త మూమిన)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1901
హదీసు 1902
حديث الْبَرَاءِ رضي الله عنه، قَالَ: نَزَلَتْ هذِهِ الآيَةُ فِينَا كَانَتِ الأَنْصَارُ، إِذَا حَجُّوا فَجَاءُوا، لَمْ يَدْخُلُوا مِنْ قِبَلِ أَبْوَابِ بُيُوتِهِمْ، وَلكِنْ مِنْ ظُهُورِهَا فَجَاءَ رَجُلٌ مِنَ الأَنْصَارِ فَدَخَلَ مِنْ قِبَلِ بَابِهِ، فَكَأَنَّهُ عُيِّرَ بِذلِكَ، فَنَزَلَتْ (وَلَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوتَ مِنْ ظُهُورِهَا وَلكِنَّ الْبِرَّ مَنِ اتَّقى وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا)
أخرجه البخاري في: 26 كتاب العمرة: 18 باب قول الله تعالى (وأتوا البيوت من أبوابها)
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మీరు మీ ఇండ్లలోకి దొడ్డి దారిన ప్రవేశించడం పుణ్యకార్యం కాదు. అల్లాహ్ ఆగ్రహం నుండి తప్పించుకోవడమే అసలైన పుణ్యకార్యం. కనుక మీరు మీ ఇండ్లలోకి ముఖద్వారం గుండానే ప్రవేశించండి”. (2:189)
ఈ సూక్తి మా గురించి అవతరించింది. అన్సారులు హజ్ యాత్ర నుండి తిరిగొచ్చిన తరువాత తమ ఇండ్లలోకి వాటి ముఖద్వారాల గుండా ప్రవేశించకుండా దొడ్డి దారిన ప్రవేశిస్తారు. ఇది వారి ప్రాచీన సంప్రదాయం. దాని ప్రకారం ఒక అన్సారీ ముస్లిం హజ్ యాత్ర నుండి తిరిగొచ్చి తన ఇంట్లోకి దొడ్డి దారిన ప్రవేశించాడు. ఆ సందర్భంలో ఈ సూక్తి అవతరించింది.
(సహీహ్ బుఖారీ:- 26వ ప్రకరణం-ఉమ్రా, 18వ అధ్యాయం – ఖౌలిల్లాహితఆలా (వాతుల్ బుయూత మిన్ అబ్వాబిహా)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1902
హదీసు 1903
باب في قوله تعالى أولئك الذين يدعون يبتغون إِلى ربهم الوسيلة
حديث ابْنِ مَسْعُودٍ (إِلَى رَبِّهِمُ الْوَسِيلَةَ) قَالَ: كَانَ نَاسٌ مِنَ الإِنْسِ يَعْبُدُونَ نَاسًا مِنَ الْجِنِّ، فَأَسْلَمَ الْجِنُّ، وَتَمَسَّكَ هؤُلاَءِ بِدِينِهِمْ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 17 سورة بني إسرائيل: 7 باب قل ادعوا الذين زعمتم من دونه
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- మానవుల్లో కొందరు జిన్నులలో కొందరిని పూజిస్తూ వుండేవారు. తరువాత ఆ జిన్నులు ముస్లిములయిపోయారు. కాని ఈ మనుషులు మాత్రం ఇంకా ఆ జిన్నులనే పూజిస్తూ ఉండిపోయారు, అలాంటి మానవుల్ని గురించి ఈ సూక్తి అవతరించింది- “వీరు ఎవరిని మొరపెట్టుకుంటున్నారో వారు స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్య మార్గాన్ని అన్వేషిస్తున్నారు. వారు పరస్పరం పోటీపడుతూ ఆయన కారుణ్య కటాక్షాలను ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.” (17:57)
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం- తఫ్సీర్, 17వ సూరా – బనీ ఇస్రాయీల్, 7వ అధ్యాయం – ఖులిద్ ఉల్లజీన జఅమ్తుమ్ మిన్ దూనిహీ)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1903
5వ అధ్యాయం – తౌబా, అన్ఫాల్, హష్ర్ సూరాల వ్యాఖ్యానం
హదీసు 1904
باب في سورة براءة والأنفال والحشر
حديث ابْنِ عَبَّاسٍ عَنْ سَعِيدٍ بْنِ جُبَيْرٍ، قَالَ: قُلْتُ لاِبْنِ عَبَّاسٍ، سُورَةُ التَّوْبَةِ قَالَ: التَّوْبَةُ هِيَ الْفَاضِحَةُ مَا زَالَتْ تَنْزِلُ (وَمِنْهُمْ، وَمِنْهُمْ) ، حَتَّى ظَنُّوا أَنَّها لَمْ تُبْقِ أَحَدًا مِنْهُمْ إِلاَّ ذُكِرَ فِيهَا قَالَ: قُلْتُ: سُورَةُ الأَنْفَالِ قَالَ: نَزَلَتْ فِي بَدْر قَالَ: قُلْتُ، سُورَةُ الْحَشْرِ قَالَ: نَزَلَتْ فِي بَنِي النَّضِيرِ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 59 سورة الحشر: 1 باب حدثنا محمد بن عبد الرحيم
హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ని తౌబా సూరాను గురించి అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారు: “తౌబా సూరా (అవిశ్వాసుల్ని, కపటుల్ని) అవమానపరిచే సూరా. ఈ సూరాలో ‘వారిలో ఒకడు, వారిలో ఒకడు’ అని మాటి మాటికి సూక్తులు అవతరిస్తున్న తీరును గమనిస్తే, ఎవరినీ వదలి పెట్టడం జరగదని, అందర్నీ ప్రస్తావించడం జరుగుతుందని మాకు అనుమానం కలిగేది”.
ఆ తరువాత నేను అన్ఫాల్ సూరాని గురించి అడిగితే “ఈ సూరా బద్ర్ యుద్ధం గురించి అవతరించింది” అని అన్నారు ఆయన. ఆ తరువాత నేను హష్ర్ సూరాని గురించి అడిగాను. దానికాయన “ఈ సూరాలో బనీ నజీర్ (తెగయూదుల) గురించిన ప్రస్తావన ఉంది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 59వ సూరా-హష్ర్, 1వ అధ్యాయం-హద్దసనా ముహమ్మద్ బిన్ అబ్దుర్రహీం)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1904
6వ అధ్యాయం-మద్య నిషేధం గురించిన సూక్తి అవతరణ
హదీసు 1905
باب في نزول تحريم الخمر
حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ ابْنِ عُمَرَ، قَالَ: خَطَبَ عُمَرُ عَلَى مِنْبَرِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنَّهُ قَدْ نَزَلَ تَحْرِيمُ الْخَمْرِ وَهِيَ مِنْ خَمْسَةِ أَشْيَاءَ: الْعِنَبِ وَالتَّمْرِ وَالْحِنْطَةِ وَالشَّعِيرِ وَالْعَسَلِ وَالْخَمْرُ مَا خَامَرَ الْعَقْلَ وَثَلاَثٌ، وَدِدْتُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمْ يُفَارِقْنَا حَتَّى يَعْهَدَ إِلَيْنَا عَهْدًا: الْجَدُّ وَالْكَلاَلَةُ وَأَبْوَابٌ مِنْ أَبْوَابِ الرِّبَا
أخرجه البخاري في: 74 كتاب الأشربة: 5 باب ما جاء في أن الخمر ما خامر العقل من الشراب
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా)కథనం:- హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త వేదిక (మింబర్) పై నిలబడి ప్రసంగిస్తూ “సారా నిషేధం గురించిన ఆజ్ఞ అవతరించింది. ఆ రోజుల్లో సారా అయిదు రకాల వస్తువులతో తయారు చేయబడుతుండేది (1) ద్రాక్ష, (2) ఖర్జూరం, (3) సాధారణ గోధుమలు, (4) జౌరకం గోధుమలు, (5) తేనె. బుద్ధిమాంద్యం కలిగించే ప్రతి వస్తువునీ (అరబీ భాషలో) ‘ఖమర్’ అంటారు. అదీగాక (1)తాత (2)వారసుల్లేకుండా చనిపోయేవాడు(3) వడ్డీకి సంబంధించిన ఒక రకం. ఈ మూడు విషయాలను గురించి కూడా దైవప్రవక్త ﷺ మమ్మల్ని వీడిపోకముందే స్పష్టమైన ఆదేశాలు ఇస్తే బాగుంటుందని నేను కోరుకునేవాడ్ని”.
(సహీహ్ బుఖారీ:-74వ ప్రకరణం – అష్రిబా, 5వ అధ్యాయం-మాజాఅ ఫీఅన్నల్‌ఖమ్ర మాఖామరల్ అఖ్ల మినష్షరాబ్)
(1) అంటే, తాత వదలిన ఆస్తి సమస్య.
(2) చనిపోయేటప్పుడు సంతానం తల్లిదండ్రులు లేకుండా సోదరసోదరీలుగాని, లేదా దూరపు బంధువులు గాని మాత్రమే కలిగి ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ‘కలాలా’ అంటారు. కొందరి దృష్టిలో కేవలం సంతానం లేకుండా చనిపోయే వ్యక్తిని ‘కలాలా’ అంటారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జీవితాంతం ఈ వ్యవహారం గురించి సందిగ్ధంలో పడి ఉన్నారు. అయితే కొందరు షరీఅత్ వేత్తలు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అభిప్రాయాన్ని సమర్థించారు. అంటే సంతానం, తల్లిదండ్రులు లేకుండా సోదర సోదరీలు, దూరపు బంధువులు మాత్రమే కలిగి ఉండేవాడు ‘కలాలా’ క్రిందికి వస్తాడని ఆయన అభిప్రాయం. ఖుర్‌ఆన్ ద్వారా కూడా ఈ విషయం ధృవపడుతోంది. ఖుర్‌ఆన్ కలాలా వ్యక్తి ఆస్తికి అతని సోదరీని వారసురాలిగా పరిగణించింది (4:176). తండ్రి జీవించి ఉంటే సోదరీకి వాటా లభించే ప్రసక్తే ఉండదు.
(3) ఇది ‘రిబా’ అల్‌ఫజల్ రకం వడ్డీ. ఇందులో మళ్ళీ రెండు రకాలున్నాయి. ఒకటి అప్పిచ్చి దాని మీద లాభం తీసుకోవడం. అప్పు గడువు పెరిగిన కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలాంటి వడ్డీ పద్ధతిని ఖుర్‌ఆన్ నిషేధించింది. దీని విషయంలో ధర్మవేత్తల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. రెండో రకం వడ్డీ గురించి ప్రవక్త ప్రవచనంలో ఆరు వస్తువుల ప్రస్తావన ఉంది: (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4) యవలు, (5) ఖర్జూరం, (6) ఉప్పు. మిగతా వస్తువుల విషయంలో ధర్మవేత్తల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. (సంకలనకర్త)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1905
7వ అధ్యాయం -‘హాజాని ఖస్మానిఖ్‌త సమూ ఫీ రబ్బిహిం’ అనే సూక్తికి వ్యాఖ్యానం
హదీసు 1906
باب في قوله تعالى هذان خصمان اختصموا في ربهم
حديث أَبِي ذَرٍّ عَنْ قَيْسٍ، قَالَ: سَمِعْتُ أَبَا ذَرٍّ يُقْسِمُ قَسَمًا، إِنَّ هذِهِ الآيَةَ (هذَانِ خَصْمَانِ اخْتَصَمُوا فِي رَبِّهِمْ) نَزَلَتْ فِي الَّذِينَ بَرَزُوا يَوْمَ بَدْرٍ: حَمْزَةَ، وَعَلِيٍّ، وَعُبَيْدَةَ بْنِ الْحَارِث، وَعُتْبَةَ وَشَيْبَةَ ابْنَيْ رَبِيعَةَ، وَالْوَلِيدِ بْنِ عُتْبَةَ
أخرجه البخاري في: 64 كتاب المغازي: 8 باب قتل أبي جهل
1906: హజ్రత్ ఖైస్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అబూజర్ గిప్పారి (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి ఇలా అన్నారు- “ఈ రెండు పక్షాల మధ్య తమ ప్రభువు విషయంలో జగడం వచ్చింది” (22:19) అనే సూక్తి బద్ర్ యుద్ధం నాడు పంక్తుల నుండి బయటికి వచ్చి పరస్పరం పోరాడిన యోధుల్ని గురించి అవతరించింది. ఇందులో (ముస్లింల తరపున) (1) హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) (2) హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), (3) హజ్రత్ ఉబైదా (రదియల్లాహు అన్హు); (అవిశ్వాసుల తరపున) రబీయా కొడుకులు (1) ఉత్బా, (2) షిబా, (3) మరొకతను వలీద్ బిన్ ఉత్బా పాల్గొన్నారు.
(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 8వ అధ్యాయం – ఖత్లి అబీజహల్)
మహా ప్రవక్త మహితోక్తులు|55. వ్యాఖ్యాన ప్రకరణం|హదీసు 1906
You must be logged in to post a comment.