మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 48. విద్యా విషయక ప్రకరణం. ఇందులో 8 హదీసులు (హదీసు 1705 – 1712), 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFవిద్యా విషయక ప్రకరణం3 పేజీలు · 0.1 MB
48. విద్యా విషయక ప్రకరణం
كتاب العلمఅధ్యాయాలు (4)
- 1 దివ్య ఖుర్ఆన్ లోని అస్పష్ట సూక్తుల వెంట పడకూడదు H 1705 – 1706
- 2 కరడు గట్టిన జగడాల మారి H 1707
- 3 యూదుల, క్రైస్తవుల విధానాలను అవలంబించేవారు H 1708
- 5 ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది H 1709 – 1712
1వ అధ్యాయం – దివ్య ఖుర్ఆన్ లోని అస్పష్ట సూక్తుల వెంట పడకూడదు
హదీసు 1705
باب النهي عن اتباع متشابه القرآن والتحذير من متبعيه والنهي عن الاختلاف في القرآن
حديث عَائِشَةَ رضي الله عنها، قَالَتْ: تَلاَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ هذِهِ الآيَةَ (هُوَ الَّذِي أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فيَتَّبِعُون مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ) إِلَى قَوْلِهِ (أُولُو الأَلْبَابِ) قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: فَإِذَا رَأَيْتَ الَّذِينَ يَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ فَأُولَئِكَ الَّذِينَ سَمَّى اللهُ فَاحْذَرُوهُمْ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 3 سورة آل عمران: 1 باب منه آيات محكمات
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- దైవప్రవక్త ﷺ ఈ క్రింది సూక్తుల్ని పఠించారు :- “ఆయనే మీ (హృదయ ఫలకం) పై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండు రకాల సూక్తులున్నాయి. ఒకటి ముహ్కామాత్ (స్పష్టమయినవి). ఇవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండు:- ముతషాబిహాత్ (అస్పష్టమయినవి). వక్ర బుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్థాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం అల్లాహ్ కు తప్ప మరెవరికీ తెలియదు. దీనికి భిన్నంగా విషయ పరిజ్ఞానంలో స్థిత ప్రజ్ఞులయినవారు ‘మేము వీటిని నమ్ముతున్నాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే’ అని అంటారు. అసలు ఏ విషయం ద్వారానయినా బుద్ధిమంతులే గుణపాఠం గ్రహించగలరు” (ఆలి ఇమ్రాన్ : 7)
ఆ తరువాత ఆయన ఈ విధంగా ప్రవచించారు: “మీరెప్పుడయినా దివ్య ఖుర్ఆన్‌లోని ఈ అస్పష్టమయిన సూక్తుల వెంట పడి ఆరా తీయడానికి ఎవరైనా ప్రయత్నించడం చూస్తే, అల్లాహ్ (ఖుర్ఆన్‌లో) వారిని గురించే ప్రస్తావించాడని తెలుసుకొని వారికి దూరంగా ఉండండి”.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 3వ సూరా – ఆలి ఇమ్రాన్, 1వ అధ్యాయం – మిన్హు ఆయాతున్ ముహ్‌కమాత్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1705
హదీసు 1706
حديث جُنْدَبٍ قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اقْرَءُوا الْقُرْآنَ مَا ائْتلَفَتْ عَلَيْهِ قُلُوبُكُمْ فَإِذَا اخْتَلَفْتُمْ، فَقُومُوا عَنْهُ
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 37 باب اقرءوا القرآن ما ائتلفت عليه قلوبكم
హజ్రత్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు :- మీ హృదయం, నోరు పరస్పరం సమన్వయం చెందినంత సేపు మీరు దివ్య ఖుర్ఆన్‌ని (శ్రద్ధగా) పఠించండి. మీ హృదయం, నోరు మధ్య సమన్వయ లోపం ఏర్పడితే మాత్రం ఖుర్ఆన్ పఠనం ఆపేయండి.”★
(సహీహ్ బుఖారీ:- 66వ ప్రకరణం – ఫజాయిలిల్ ఖుర్ఆన్, 37వ అధ్యాయం – ఇఖ్రవుల్ ఖుర్ఆన మా అతలఫత్ అలైహి ఖులూబుకుమ్)
★ అంటే, మానసిక ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఉన్నంత వరకూ పఠించండి. అవి ఏమీ లేకుండా పెదాలు ఆడించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అలా పఠించడం వల్ల తప్పులు దొర్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక సమన్వయలోపం అంటే అనుమానాలకు, సంశయాలకు కారణభూతమయ్యే. పరిస్థితి అన్నమాట. అయితే ధార్మిక సమస్యల పరిష్కారంలో ధర్మవేత్తల మధ్య వచ్చే విభేదం మాత్రం దీని క్రిందికి రాదు. అలాంటి విభేదానికి అనుమతి ఉంది. అలాంటి విభేదం వల్ల సఫలమయినా, విఫలమయినా చిత్తశుద్ధితో జరిగిన కృషి కారణంగా ప్రతిఫలం లభిస్తుంది. (సంకలనకర్త)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1706
2వ అధ్యాయం – కరడు గట్టిన జగడాల మారి
హదీసు 1707
باب في الألد الخصم
حديث عَائِشَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ أَبْغَضَ الرِّجَالِ إِلَى اللهِ، الأَلَدُّ الْخَصِمُ
أخرجه البخاري في: 46 كتاب المظالم: 15 باب قول الله تعالى (وهو ألد الخصام)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు :- అల్లాహ్ దృష్టిలో అందరి కంటే పరమ అసహ్యకరమైన వ్యక్తి కరడుగట్టిన జగడాల మారి. (అంటే సత్యానికి వ్యతిరేకంగా అసత్యానికి మద్దతుగా జగడం చేసేవాడు).
(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం – మజాలిమ్, 15వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా, వహువ అలద్దుల్ ఖిసాం)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1707
3వ అధ్యాయం – యూదుల, క్రైస్తవుల విధానాలను అవలంబించేవారు
హదీసు 1708
باب اتباع سنن اليهود والنصارى
حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَتَتْبَعُنَّ سَنَنَ مَنْ كَانَ قَبْلَكُمْ، شِبْرًا بِشِبْرٍ، وَذِرَاعًا بِذِرَاعٍ حَتَّى لَوْ دَخَلُوا جُحْرَ ضَبٍّ تَبِعْتُمُوهُمْ قُلْنَا: يَا رَسُولَ اللهِ الْيَهُودَ وَالنَّصَارَى قَالَ: فَمَنْ
أخرجه البخاري في: 96 كتاب الاعتصام: 14 باب قوله النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لتتبعن سنن من كان قبلكم
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం :- “మీరు పూర్వీకుల (అంటే గత మతస్థుల) జీవన విధానాలను ఒక్క అంగుళం కూడా వదలకుండా అనుసరిస్తారు. చివరికి వారు ఉడుం కన్నంలోకి దూరితే, వారి వెంట మీరు కూడా అందులోకి దూరుతారు” అన్నారు దైవప్రవక్త ﷺ. మేమీ మాట విని “దైవప్రవక్తా! ఏమిటీ మేము యూదుల్ని, క్రైస్తవుల్ని అనుసరిస్తామా?” అని అడిగాము (ఆశ్చర్యంతో). దానికి దైవప్రవక్త ﷺ “మరెవర్ని అనుకుంటున్నారు?” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 96వ ప్రకరణం – అల్ ఏతెసామ్, 14వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి ﷺల తత్తబిఉన్న సునన మన్‌కాన ఖబ్లకుమ్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1708
5వ అధ్యాయం – ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది
హదీసు 1709
باب رفع العلم وقبضه وظهور الجهل والفتن في آخر الزمان
حديث أَنَسٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يُرْفَعَ العِلْمُ، وَيَثْبُتَ الْجَهْلُ، وَيُشْرَبَ الْخَمْرُ، وَيَظْهَرَ الزِّنَا
أخرجه البخاري في: 3 كتاب العلم: 21 باب رفع العلم وظهور الجهل
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు :- ప్రళయ సూచనల్లో ఇవి కూడా ఉన్నాయి – జ్ఞానకాంతి. పోయి అజ్ఞానాంధకారం అలుముకుంటుంది. మద్యసేవనం విపరీతంగా పెరిగిపోతుంది. వ్యభిచారం సర్వసామాన్యమవుతుంది.
(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 21వ అధ్యాయం – రఫ్‌యిల్ ఇల్మి వజుహూరిల్ జహ్ల్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1709
హదీసు 1710
حديث أَبِي مُوسى قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ بَيْنَ يَدَيِ السَّاعَةِ أَيَّامًا، يُرْفَعُ فِيهَا الْعِلْمُ، وَيَنْزِلُ فِيهَا الْجَهْلُ، وَيَكْثُرُ فِيهَا الْهَرْجُ وَالْهَرْجُ الْقَتْلُ
أخرجه البخاري في: 92 كتاب الفتن: 5 باب ظهور الفتن
హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తెలియజేశారు :- ప్రళయానికి ముందు ఓ కాలం వస్తుంది. అప్పుడు జ్ఞానం పైకి పోయి అజ్ఞానం క్రిందికి దిగుతుంది. హర్జ్ అధికమవుతుంది. హర్జ్ అంటే హత్యాకాండ.
(సహీహ్ బుఖారీ:- 92వ ప్రకరణం – ఫితన్, 5వ అధ్యాయం – జుహూరిల్ ఫితన్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1710
హదీసు 1711
حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يَتَقَارَبُ الزَّمَان، وَيَنْقُصُ الْعَمَلُ، وَيُلْقَى الشُّحُّ، وَتَظْهَرُ الْفِتَنُ، وَيَكْثُرُ الْهَرْجُ قَالُوا: يَا رَسُولَ اللهِ أَيُّمَ هُوَ قَالَ: القَتْلُ، الْقَتْلُ
أخرجه البخاري في: 92 كتاب الفتن: 5 باب ظهور الفتن
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు :- “ప్రళయ కాలం సమీపించినపుడు సత్కర్మలు తరిగిపోతాయి; ప్రజల హృదయాల్లో పిసినారితనం, పేరాశలు తిష్ఠవేస్తాయి; సర్వత్రా కలహాలు, కల్లోలాలు పెద్ద ఎత్తున చెలరేగుతాయి; హర్జ్ అధికమవుతుంది.”
ప్రవక్త అనుచరులు ఈ మాట విని “హర్జ్ అంటే ఏమిటి దైవప్రవక్తా?” అని అడిగారు. “హర్జ్ అంటే హత్యా రక్తపాతాల”న్నారు దైవప్రవక్త ﷺ. ఈ మాట రెండు సార్లు అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 92వ ప్రకరణం – ఫితన్, 5వ అధ్యాయం – జుహూరిల్ ఫితన్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1711
హదీసు 1712
حديث عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُول: إِنَّ الله لاَ يَقْبِضُ الْعِلْمَ انْتِزَاعًا، يَنْتَزِعُهُ مِنَ الْعِبَادِ وَلكِنْ يَقْبِضُ الْعِلْمَ بِقبْضِ الْعُلَمَاءِ حَتَّى إِذَا لَمْ يُبْقِ عَالِمًا، اتَّخَذَ النَّاسُ رُءُوسًا جُهَّالاً، فَسُئِلُوا، فَأَفْتَوْا بغَيْرِ عِلْمٍ، فَضَلُّوا وَأَضَلُّوا
أخرجه البخاري في: 3 كتاب العلم: 34 باب كيف يقبض العلم
హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తెలియజేశారు :- అల్లాహ్ (ధర్మ జ్ఞానాన్ని) ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకెత్తుకోడు, జ్ఞానులు (అంటే ధర్మవేత్తలు) అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు. అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని (మూర్ఖుల్ని) నాయకులుగా చేసుకుంటారు. ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు. వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్వాలు (తీర్పులు) ఇస్తారు. ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే గాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు.
(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 34వ అధ్యాయం – కైఫ యుఖ్బజుల్ ఇల్మ్)
మహా ప్రవక్త మహితోక్తులు|48. విద్యా విషయక ప్రకరణం|హదీసు 1712
You must be logged in to post a comment.