మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 38. సంస్కార ప్రకరణం. ఇందులో 16 హదీసులు (హదీసు 1380 – 1395), 8 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFసంస్కార ప్రకరణం5 పేజీలు · 0.3 MB
38. సంస్కార ప్రకరణం
كتاب الآدابఅధ్యాయాలు (8)
- – జీవనశైలి
- 1 అబుల్ ఖాసిం అనే మారు పేరును పెట్టుకోకూడదు H 1380 – 1383
- 3 అసమంజసమైన పేరుంటే తీసి మంచిపేరు పెట్టుకోవాలి H 1384
- 4 రాజాధిరాజు, సార్వభౌముడు అనే పేర్లు పెట్టుకోరాదు H 1385
- 5 పిల్లవాడు పుట్టగానే సత్పురుషుని చేత ఉగ్గు పోయించడం, పుట్టినరోజే పేరు పెట్టడం H 1386 – 1390
- 7 ఇంట్లో ప్రవేశించడానికి అనుమతి అడగాలి H 1391
- 8 అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే ‘నేను’ అనరాదు H 1392
- 9 ఇతరుల ఇండ్లలో తొంగి చూడరాదు H 1393 – 1395
జీవనశైలి
1వ అధ్యాయం – అబుల్ ఖాసిం అనే మారు పేరును పెట్టుకోకూడదు
హదీసు 1380
باب النهي عن التكني بأبي القاسم وبيان ما يستحب من الأسماء
حديث أَنَس رضي الله عنه، قَالَ: دَعَا رَجُلٌ بِالْبَقِيعِ، يَا أَبَا الْقَاسِمِ فَالْتَفَتَ إِلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: لَمْ أَعْنِكَ قَالَ: سَمُّوا بِاسْمِي وَلاَ تَكْتَنُوا بِكُنْيَتِي
أخرجه البخاري في: 34 كتاب البيوع: 49 باب ما ذكر في الأسواق
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- బఖీ అనే చోట ఒక వ్యక్తి ఎవరినో అబుల్ ఖాసిం! అని పిలిస్తే, దైవప్రవక్త ﷺ అతని వైపు తిరిగి చూశారు. అతను “మిమ్మల్ని కాదండి”! అన్నాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ “మీరు కావాలంటే (మీ పిల్లలకు) నా పేరు పెట్టుకోండి. అంతేగాని నా మారుపేరు (కునియత్) పెట్టుకోకండి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 34వ ప్రకరణం – అల్ బుయూ, 49వ అధ్యాయం – మాజుకిర ఫిల్ అస్వాఖ్)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1380
హదీసు 1381
حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ الأَنْصَارِيِّ، قَالَ: وُلِدَ لَرَجُلٍ مِنَّا غُلاَمٌ، فَسَمَّاهُ الْقَاسِمَ فَقَالَتِ الأَنْصَارُ: لاَ نَكْنِيكَ أَبَا الْقَاسِمِ، وَلاَ نُنْعِمُكَ عَيْنًا فَأَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ وُلِدَ لِي غُلاَمٌ، فَسَمَّيْتُهُ الْقَاسِمَ، فَقَالَتِ الأَنْصَارُ: لاَ نَكْنِيكَ أَبَا الْقَاسِمِ، وَلاَ نُنْعِمُكَ عَيْنًا فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَحْسَنَتِ الأَنْصَارُ، سَمُّوا بِاسْمِي، وَلاَ تَكَنَّوْا بِكُنْيَتِي، فَإِنَّمَا أَنا قَاسِمٌ
أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 7 باب قول الله تعالى (فإن لله خمسه)
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మా (తెగ అన్సార్)లో ఒక వ్యక్తికి పిల్లవాడు పుడితే అతనా పిల్లవాడికి ఖాసిం అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు అన్సారులు అతనితో “మేము నీ మారు పేరును అబుల్ ఖాసిం అని పడనీయము. (ఆ మారు పేరు కారణంగా) నీ కళ్ళకు చలువ చేకూర్చము” అని అన్నారు. ఈ మాటలు విని ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికెళ్ళి “దైవప్రవక్తా! నాకొక పిల్లవాడు పుడితే నేనతనికి ఖాసిం అని పేరు పెట్టాను. కాని అన్సారులు నా మారు పేరును ‘అబుల్ ఖాసిం’ అని పడనివ్వమని, (తద్వారా) నా కళ్ళకు చలువ చేకూర్చమని అంటున్నారు” అని అన్నాడు. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “అన్సారులు బాగానే చెప్పారు. మీరు నా పేరు పెట్టుకోవచ్చుగాని నా మారు పేరును పెట్టుకోకండి. ఖాసిం (దైవానుగ్రహాన్ని పంచిపెట్టేవాడు)ని నేను మాత్రమే” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 57వ ప్రకరణం-ఫర్జుల్ ఖుమ్స్, 7వ అధ్యాయం – ఖౌలిల్లాహితఆలాఁ ఫ అన్నలిల్లాహి ఖుముసహూ)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1381
హదీసు 1382
حديث جَابِرٍ رضي الله عنه، قَالَ: وُلِدَ لِرَجُلٍ مِنَّا غُلاَمٌ، فَسَمَّاهُ الْقَاسِمَ، فَقُلْنَا: لاَ نَكْنِيكَ أَبَا الْقَاسِمِ، وَلاَ كَرَامَةَ فَأَخْبَرَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: سَمِّ ابْنَكَ عَبْدَ الرَّحْمنِ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 105 باب أحب الأسماء إلى الله عز وجل
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మాలో ఒకతనికి పిల్లవాడు పుడితే అతనా పిల్లవాడికి ఖాసిం అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు మేమతనితో “మేము నీకు అబుల్ ఖాసిం అని మారు పేరు పెట్టుకోనివ్వము. ( ఆ మారు పేరుతో) నిన్ను గౌరవించము” అని అన్నాము. అతనీ సంగతి దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావిస్తే “నీ కొడుక్కి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టుకో” అని చెప్పారు దైవప్రవక్త ﷺ.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 105వ అధ్యాయం – అహబ్బిల్ అస్మాయి ఇలల్లాహి అజ్జవజల్ల)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1382
హదీసు 1383
حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ أَبُو الْقَاسِمِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: سَمُّوا بِاسْمِي وَلاَ تَكْتَنُوا بِكْنْيَتِي
أخرجه البخاري في: 61 كتاب المناقب: 20 باب كنية النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- మీరు నా పేరు పెట్టుకోవచ్చు. కాని నా మారు పేరుని పెట్టుకోకండి.
(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 20వ అధ్యాయం -కునియతిన్నబియ్యి ﷺ)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1383
3వ అధ్యాయం – అసమంజసమైన పేరుంటే తీసి మంచిపేరు పెట్టుకోవాలి
హదీసు 1384
باب استحباب تغيير الاسم القبيح إِلى حسن وتغيير اسم برة إِلى زينب وجويرية ونحوها
حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ زَيْنَبَ كَانَ اسْمُهَا بَرَّةً، فَقِيلَ تُزَكِّي نَفْسَهَا فَسَمَّاهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، زَيْنَبَ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 108 باب تحويل الاسم إلى اسم أحسن منه
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా) గారి పేరు మొదట్లో బర్రా అని ఉండేది. దానిపై ప్రజలు “ఈమె తనను తాను పవిత్రురాలని, పుణ్యవతి అని భావిస్తుంది” అని చెప్పుకునేవారు. అందువల్ల దైవప్రవక్త ﷺ ఆమెకు జైనబ్ అని పేరు పెట్టారు.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం-అదబ్, 108వ అధ్యాయం – తహ్‌వీలిల్ ఇస్మి ఇలా ఇస్మిన్ అహ్సనమిన్హు )
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1384
4వ అధ్యాయం – రాజాధిరాజు, సార్వభౌముడు అనే పేర్లు పెట్టుకోరాదు
హదీసు 1385
باب تحريم التسمي بملك الأملاك وبملك الملوك
حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَخْنَعُ الأَسْمَاءِ عِنْدَ اللهِ رَجُلٌ تَسَمَّى بِمَلِكِ الأَمْلاَكِ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 114 باب أبغض الأسماء عند الله
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- ఎవరైనా రాజాధిరాజు అని పేరు పెట్టుకుంటే అది అల్లాహ్ దృష్టిలో అతి నీచమైన పేరుగా పరిగణించబడుతుంది.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 114వ అధ్యాయం – అబ్గజిల్ అస్మాయి ఇన్దల్లాహ్)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1385
5వ అధ్యాయం – పిల్లవాడు పుట్టగానే సత్పురుషుని చేత ఉగ్గు పోయించడం, పుట్టినరోజే పేరు పెట్టడం
హదీసు 1386
باب استحباب تحنيك المولود عند ولادته وحمله إِلى صالح يحنكه وجواز تسميته يوم ولادته واستحباب التسمية بعبد الله وإِبراهيم وسائر أسماء الأنبياء عليهم السلام
حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: كَانَ ابْنٌ لأَبِي طَلْحَةَ يَشْتَكِي، فَخَرَجَ أَبُو طَلْحَةَ، فَقُبِضَ الصَّبِيُّ فَلَمَّا رَجَعَ أَبُو طَلْحَةَ، قَالَ: مَا فَعَل ابْني قَالَتْ أُمُّ سُلَيْمٍ: هُوَ أَسْكَنُ مَا كَانَ فَقَرَّبَتْ إِلَيْهِ الْعَشَاءَ، فَتَعَشَّى، ثُمَّ أَصَابَ مِنْهَا فَلَمَّا فَرَغَ، قَالَتْ: وَارِ الصَّبِيَّ فَلَمَّا أَصْبَحَ أَبُو طَلْحَةَ أَتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَخْبَرَهُ فَقَالَ: أَعْرَسْتُمُ اللَّيْلَةَ قَالَ: نَعَمْ قَالَ: اللهُمَّ بَارِكْ لَهُمَا فَوَلَدَتْ غُلاَمًا قَالَ لِي أَبُو طَلْحَةَ: احْفَظْهُ حَتَّى تَأْتِيَ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَتَى بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَرْسَلَتْ مَعَهُ بِتَمَرَاتٍ، فَأَخَذَهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: أَمَعَهُ شَيْءٌ قَالُوا: نَعَمْ، تَمَرَاتٌ فَأَخَذَهَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَمَضَغَهَا، ثُمَّ أَخَذَ مِنْ فِيهِ، فَجَعَلَهَا فِي فِي الصَّبِيِّ، وَحَنَّكَهُ بِهِ، وَسَمَّاهُ عَبْدَ اللهِ
أخرجه البخاري في: 71 كتاب العقيقة: 1 باب تسمية المولود غداة يولد لمن لم يعق عنه، وتحنيكه
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ అబూతల్హా (రదియల్లాహు అన్హు) గారి పిల్లవాడు జబ్బుపడ్డాడు. కాని అప్పుడు అబూతల్హా (రదియల్లాహు అన్హు) ఏదో ఊరు వెళ్ళి ఉన్నారు. ఆయన తిరిగి వచ్చేలోగా పిల్లవాడు చనిపోయాడు. ఆయన రాగానే బాబు ఎలా ఉన్నాడని అడిగారు. దానికి (ఆయన భార్య) హజ్రత్ ఉమ్మె సలీమ్ (రదియల్లాహు అన్హా) “బాబు పూర్వం కంటే చాలా ప్రశాంతంగా నిక్షేపంగా ఉన్నాడు” అని అన్నారు. తరువాత ఆమె హజ్రత్ అబూతల్హా (రదియల్లాహు అన్హు)కు అన్నం వడ్డించారు. ఆయన భోజనం చేశారు. ఆ రాత్రి ఆయన హజ్రత్ ఉమ్మె సలీం (రదియల్లాహు అన్హా)తో సమాగమం కూడా జరిపారు. అది ముగిసిన తరువాత ఆమె ఆయనతో మాట్లాడుతూ “ఇక వెళ్ళి పిల్లవాడ్ని ఖననం చేసి రండి” అని అన్నారు.
మరునాడు ఉదయం హజ్రత్ అబూతల్హా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి ఆయనకు జరిగిన వృత్తాంతమంతా వివరించారు. దైవప్రవక్త ﷺ ఈ సంఘటన విని “రాత్రి నీవు నీ భార్యను కలుసుకున్నావా?” అని అడిగారు. అబూతల్హా (రదియల్లాహు అన్హు) ఔనన్నారు. అప్పుడు దైవప్రవక్త ﷺ “అల్లాహ్! వీరిద్దరిపై శుభానుగ్రహాలు వర్షింపజెయ్యి” అని ప్రార్థించారు.
ఆ తరువాత కొన్నాళ్ళకు హజ్రత్ ఉమ్మె సలీం (రదియల్లాహు అన్హా)కు మరో పిల్లవాడు పుట్టాడు. అప్పుడు హజ్రత్ అబూతల్హా (రదియల్లాహు అన్హు) నాతో (హజ్రత్ అనస్‌తో) “నువ్వీ పిల్లవాడ్ని దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసికెళ్ళే వరకు కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి” అని అన్నారు. తరువాత నేనా పిల్లవాడ్ని దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసికెళ్ళాను. ఉమ్మె సలీం (రదియల్లాహు అన్హా) పిల్లవాడి కోసం కొన్ని ఖర్జూర పండ్లు కూడా ఇచ్చి పంపారు. దైవప్రవక్త ﷺ పిల్లవాడ్ని వడిలోకి తీసుకొని “ఈ పిల్లవాడి కోసం ఏదైనా తెచ్చావా?” అని అడిగారు. నేను “తెచ్చాను. కొన్ని ఖర్జూర పండ్లున్నాయి” అన్నాను. అప్పుడు దైవప్రవక్త ﷺ ఒక ఖర్జూర పండు తీసుకొని నమిలి దాన్ని పిల్లవాడి నోట్లో పెట్టారు. ఈ విధంగా ఆయన పిల్లవాడికి ఉగ్గుపోసి ‘అబ్దుల్లా’ అని పేరు పెట్టారు.
(సహీహ్ బుఖారీ:- 71వ ప్రకరణం – అఖీఖా, 1వ అధ్యాయం – తస్మియతిల్ మౌలూది గదాత యూలద్ లిమన్ లమ్ యవుఖ్ వ తహ్నీకిహీ)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1386
హదీసు 1387
حديث أَبِي مُوسى رضي الله عنه، قَالَ: وُلِدَ لِي غُلاَمٌ، فَأَتَيْتُ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَمَّاهُ إِبْرَاهِيمَ، فَحَنَّكَهُ بِتَمْرَةٍ وَدَعَا لَهُ بِالْبَرَكَةِ وَدَفَعَه إِلَيَّ وَكَانَ أَكْبَرَ وَلَدِ أَبِي مُوسى
أخرجه البخاري في: 71 كتاب العقيقة: 1 باب تسمية المولود غداة يولد لمن لم يعق عنه، وتحنيكه
హజ్రత్ అబూమూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం:- నాకొక పిల్లవాడు పుడితే నేనతడ్ని తీసుకొని దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను. ఆ పిల్లవాడికి ఆయన ఇబ్రాహీం అని పేరు పెట్టారు. ఖర్జూర పండు నమిలి అతని నోట్లో పెట్టారు. పిల్లవాడికి శ్రేయోశుభాలు కలగాలని ప్రార్ధన చేసి అతడ్ని తిరిగి నాకిచ్చివేశారు.
ఈ పిల్లవాడే హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) గారి పెద్ద కొడుకు.
(సహీహ్ బుఖారీ:- 71వ ప్రకరణం – అఖీఖా, 1వ అధ్యాయం – తస్మియతిల్ మౌలూదిగదాత యూలద్ లిమన్ లమ్ యవుఖ్వ తహ్నీకిహీ)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1387
హదీసు 1388
حديث أَسْمَاءَ رضي الله عنها، أَنَّهَا حَمَلَتْ بِعَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَتْ: فَخَرَجْتُ وَأَنَا مُتِمٌّ فَأَتَيْتُ الْمَدِينَةَ، فَنَزَلْتُ بِقُبَاءٍ، فَوَلَدْتُهُ بِقُبَاءٍ ثُمَّ أَتَيْتُ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَوَضَعْتُهُ فِي حَجْرِهِ ثُمَّ دَعَا بِتَمْرَةٍ فَمَضَغَهَا، ثُمَّ تَفَلَ فِي فِيهِ فَكَانَ أَوّلَ شَيْءٍ دَخَلَ جَوْفَهُ رِيقُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثُمَّ حَنَّكَهُ بِتَمْرَةٍ، ثُمَّ دَعَا لَهُ وَبَرَّكَ عَلَيْهِ؛ وَكَانَ أَوَّلَ مَوْلُودٍ وُلِدَ فِي الإِسْلاَمِ
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 45 باب هجرة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وأصحابه إلى المدينة
హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) కథనం:- అబ్దుల్లా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) నా కడుపులో ఉన్నప్పటి సంఘటన. నేను (మదీనాకు వలసపోవడానికి మక్కా నుండి) బయలుదేరినప్పుడు నిండు గర్భవతిగా ఉన్నాను. మదీనా వెళ్తూ ఖుబాలో ఆగినప్పుడు అబ్దుల్లాబిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) పుట్టాడు. నేను పిల్లవాడ్ని తీసుకొని దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను. పిల్లవాడ్ని ఆయన వడిలో పెట్టాను. అప్పుడు దైవప్రవక్త ﷺ ఒక ఖర్జూర పండు తెప్పించి నమిలి అబ్దుల్లా నోట్లో ఉంచారు. ఈ విధంగా అబ్దుల్లా కడుపులో అన్నిటికంటే ముందు పోయిన వస్తువు దైవప్రవక్త ﷺ లాలాజలమే. దైవప్రవక్త ﷺ మా బాబుకు ఖర్జూరంతో ఉగ్గుపోసి “అల్లాహ్! ఈ పిల్లవాడిపై శ్రేయోశుభాలు వర్షింపజెయ్యి” అని ప్రార్థించారు. హిజ్రత్ (వలస) తరువాత మదీనాలో ముస్లింల ఇంట పుట్టిన పిల్లల్లో ఈ అబ్బాయే మొట్టమొదటి అబ్బాయి.
(సహీహ్ బుఖారీ:- 63వ ప్రకరణం – మనాఖిబుల్ అన్సార్, 45వ అధ్యాయం – హిజ్రతిన్నబియ్యి ﷺ వ అస్హాబిహీ ఇలల్ మదీనతి)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1388
హదీసు 1389
حديث سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: أُتِيَ بِالْمُنْذِرِ ابْنِ أَبِي أُسَيْدٍ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حِينَ وُلِدَ، فَوَضَعَهُ عَلَى فَخِذِهِ، وَأَبُو أُسَيْدٍ جَالِسٌ؛ فَلَهَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِشَيْءٍ بَيْنَ يَدَيْهِ، فَأَمَرَ أَبُو أُسَيْدٍ بِابْنِهِ فَاحْتُمِلَ مِنْ فَخِذِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاسْتَفَاقَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَيْنَ الصَّبِيُّ فَقَالَ أَبُو أُسَيْدٍ: قَلَبْنَاهُ، يَا رَسُولَ اللهِ قَالَ: مَا اسْمُهُ قَالَ: فُلاَنٌ قَالَ: وَلكِنْ أَسْمِهِ الْمُنْذِرَ فَسَمَّاهِ يَوْمَئِذٍ الْمُنْذِرَ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 108 باب تحويل الاسم إلى اسم أحسن منه
హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- అబూ ఉసైద్ (రదియల్లాహు అన్హు) కొడుకు మున్జిర్ (రదియల్లాహు అన్హు) పుట్టినపుడు అతడ్ని దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకు రావడం జరిగింది. అప్పుడు దైవప్రవక్త ﷺ ఆ పిల్లవాడ్ని తొడమీద కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు అబూఉసైద్ (రదియల్లాహు అన్హు) (ఆయన దగ్గరే) కూర్చుని ఉన్నారు. దైవప్రవక్త ﷺ తన ముందు పెట్టబడిన వస్తువును అందుకోవడానికి అటువైపు దృష్టి కేంద్రీకరించారు. అబూఉసైద్ (రదియల్లాహు అన్హు) అది గమనించి “పిల్లవాడ్ని దైవప్రవక్త ﷺ దగ్గర్నుంచి ఎత్తుకోండి” అని అన్నారు. (అక్కడున్న వారు పిల్లవాడ్ని ఎత్తుకున్నారు) తరువాత దైవప్రవక్త ﷺ ఆ పని ముగిసిన తరువాత “పిల్లవాడు ఎక్కడున్నాడు?” అని అడిగారు. “దైవప్రవక్తా! పిల్లవాడ్ని ఇంటికి పంపివేశాము” అన్నారు అబూ ఉసైద్ (రదియల్లాహు అన్హు). “సరే, పిల్లవాడికి పేరేం పెట్టారు?” అడిగారు దైవప్రవక్త ﷺ. దానికి ఆయన ఫలానా పేరు పెట్టామన్నారు. కాదు, ఆ పిల్లవాడి పేరు మున్‌జిర్ (అని పెట్టండి)” అన్నారు దైవప్రవక్త ﷺ. ఆ రోజు నుండి అతనికి మున్‌జిర్ అని పేరు పెట్టబడింది.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 108 వ అధ్యాయం – తహ్‌వీలిల్ ఇస్మి ఇలా ఇస్మిన్ అహ్సన్ మిన్హు )
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1389
హదీసు 1390
حديث أَنَسٍ: قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَحْسَنَ النَّاسِ خُلُقًا وَكَانَ لِي أَخٌ يُقَالُ لَهُ أَبُو عُمَيْر، وقال أحبه فَطِيمٌ وَكَانَ إِذَا جَاءَ قَالَ: يَا أَبَا عُمَيْرٍ، مَا فَعَلَ النُّغيْرُ نُغَرٌ كَانَ يَلْعَبُ بِهِ
أخرجه البخاري في: 78 كتاب الأدب: 112 باب الكنية للصبي قبل أن يولد للرجل
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ ప్రజలందరిలో కెల్లా గొప్ప సుగుణవంతులు. నాకు అబూ ఉమైర్ అనే ఒక తమ్ముడున్నాడు. (చిన్నతనంలో) ఈ పిల్లవాడు దైవప్రవక్త ﷺ దగ్గరికి (తరచుగా) పోతుండేవాడు. దైవప్రవక్త ﷺ ఆ బాలుడితో “ఏం బాబూ ఉమైర్! నీ బుర్రు పిట్ట ఎలా ఉంది?” అని అడిగేవారు. అబూఉమైర్ (రదియల్లాహు అన్హు) దగ్గర ఒక ఎర్ర పక్షి ఉండేది. దాంతో అతను ఆడుకునేవాడు.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 112వ అధ్యాయం – అల్‌కున్యతి లిస్సబీ ఖబ్ల అఁయ్యూలద్ లిర్రజులి)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1390
7వ అధ్యాయం- ఇంట్లో ప్రవేశించడానికి అనుమతి అడగాలి
హదీసు 1391
باب الاستئذان
حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: كُنْتُ فِي مَجْلِسٍ مِنْ مَجَالِسِ الأَنْصَارِ إِذْ جَاءَ أَبُو مُوسى كَأَنَّهُ مَذْعُورٌ فَقَالَ: اسْتَأْذَنْتُ عَلَى عُمَرَ ثَلاَثًا، فَلَمْ يُؤْذَنْ لِي، فَرَجَعْتُ فَقَالَ: مَا مَنَعَكَ قُلْتُ: اسْتَأْذَنْتُ ثَلاَثًا فَلَمْ يُؤْذَنْ لِي، فَرَجَعْتُ وَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا اسْتَأْذَنَ أَحَدُكُمْ ثَلاَثًا، فَلَمْ يُؤْذَنْ لَهُ فَلْيَرْجِعْ فَقَالَ: وَاللهِ لَتُقِيمَنَّ عَلَيْهِ بِبَيِّنَةٍ أَمِنْكُمْ أَحَدٌ سَمِعَهُ مِنَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ أُبَيُّ بْنُ كَعْبٍ: وَاللهِ لاَ يَقُومُ مَعَكَ إِلاَّ أَصْغَرُ الْقَوْمِ، فَكُنْت أَصْغَرَ الْقَوْمِ؛ فَقُمْتُ مَعَهُ فَأَخْبَرْتُ عُمَرَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ذَلِكَ
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 13 باب التسليم والاستئذان ثلاثًا
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను అన్సారుల సమావేశంలో కూర్చొని ఉండగా అక్కడికి హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) వచ్చారు. చూస్తే ఆయన చాలా విచారం, ఆందోళన పడుతున్నట్లు అన్పించింది. (ఏమిటీ సంగతి అని మేము అడిగాము) (దానికి) ఆయన ఇలా అన్నారు: “నేను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ప్రవేశించడానికి ఆయన్ని మూడుసార్లు అనుమతి అడిగాను. కాని నాకు అనుమతి లభించలేదు. దాంతో నేను (విచారంతో) వెనక్కి తిరిగొచ్చాను. తరువాత ఆయన నన్ను లోపలికి ఎందుకు రాలేదు?” అని అడిగారు. దానికి నేను ఇలా సమాధానమిచ్చాను: “నేను మూడు సార్లు అనుమతి కోసం అడిగాను. కాని నాకు అనుమతి లభించలేదు. అందువల్ల నేను వెళ్ళిపోయాను. ఎవరైనా మూడు సార్లు అనుమతి కోరినప్పుడు అనుమతి లభించకపోతే అతను వెళ్ళిపోవాలని దైవప్రవక్త ﷺ సెలవిచ్చార”ని అన్నాను నేను. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ‘అయితే అల్లాహ్ సాక్షి! ఈ హదీసు వాస్తవికతను గురించి నీవు సాక్ష్యమివ్వాలి’ అని అన్నారు. దానికి నేను ‘మీలో ఎవరైనా దైవప్రవక్త ﷺ నోట ఈ ప్రవచనం విన్న వారున్నారా?’ అని అడిగాను. అప్పుడు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) (ముందుకు వచ్చి) ‘అల్లాహ్ సాక్షి! ఈ సాక్ష్యం కోసం మాలో అతి పిన్న వయస్కుడు కూడా మీ తరపున ఉంటాడు’ అని అన్నారు.
వారిలో అందరికంటే అతి పిన్న వయస్కుడ్ని నేనే (అబూ సయీద్). కనుక నేను లేచి వారి వెంట బయలుదేరాను. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళి, దైవప్రవక్త ﷺ ఈ మాట చెప్పారని అన్నాను ఆయనతో.
(సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 13వ అధ్యాయం – అత్తస్లీమి వల్ ఇస్తియిజాని సలాసన్)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1391
8వ అధ్యాయం – అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే ‘నేను’ అనరాదు
హదీసు 1392
باب كراهة قول المستأذن أنا إِذا قيل من هذا
حديث جَابِرٍ رضي الله عنه، قَالَ: أَتَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي دَيْنٍ كَانَ عَلَى أَبِي فَدَقَقْتُ الْبَابَ فَقَالَ: مَنْ ذَا فَقُلْتُ: أَنَا فَقَالَ: أَنَا، أَنَا كَأَنَّهُ كَرِهَهَا
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 17 باب إذا قال من ذا فقال أنا
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మా నాన్న చెల్లించవలసిన అప్పు విషయమై (మాట్లాడటానికి) నేను దైవప్రవక్త ﷺ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. దైవప్రవక్త ﷺ లోపలి నుంచే ‘ఎవరూ?’ అని అడిగారు. నేను ‘నేనండీ!’ అన్నాను. “నేను నేనేంటి?” అన్నారు, నేనలా (పేరు చెప్పకుండా) అనడం ఆయనకు నచ్చలేదన్నట్లుగా.
(సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 17వ అధ్యాయం – ఇజా ఖాల మన్‌జా? ఫఖాల అనా)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1392
9వ అధ్యాయం – ఇతరుల ఇండ్లలో తొంగి చూడరాదు
హదీసు 1393
باب تحريم النظر في بيت غيره
حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ، أَنَّ رَجُلاً اطَّلَعَ فِي جُحْرٍ فِي بَابِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَمَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِدْرًى يَحُكُّ بِهِ رَأْسَهُ فَلَمَّا رَآهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَوْ أَعْلَمُ أَنْ تَنْتَظِرَنِي لَطَعَنْتُ بِهِ فِي عَيْنَيْكَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنَّمَا جُعِلَ الإِذْنُ مِنْ قِبَلِ الْبَصَرِ أخرجه البخاري في 87 كتاب الديات: 23 باب من اطلع في بيت قوم ففقئوا عينه فلا دية له
హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాది (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ ఇంటికెళ్ళి తలుపు కన్నంలో నుంచి లోపలికి తొంగి చూడసాగాడు. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ చేతిలో మొనలు గల ఒక ఇనుప దువ్వెన ఉంది. దాంతో ఆయన తల గోక్కుంటున్నారు. ఆయన తలుపు సందు నుండి తొంగి చూస్తున్న ఆ వ్యక్తిని చూసి “నీవు నన్ను ఇలా తొంగి చూస్తున్నావని తెలిస్తే నేనీ దువ్వెనతోనే కంట్లో పొడిచేస్తాను” అని అన్నారు. ఆ తరువాత అతనితో “ఇలా తొంగి చూడరాదన్న ఉద్దేశ్యంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 89వ ప్రకరణం – అద్దియాత్, 23వ అధ్యాయం – మనిత్తలఅ ఫీబైతి ఖౌమ్ ఫఫఖవూ అయినహూ ఫలాదియత లహూ)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1393
హదీసు 1394
حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ رَجُلاً اطَّلَعَ مِنْ بَعْضِ حُجَرِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَامَ إِلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بِمِشْقَصٍ، أَوْ بِمَشَاقِصَ، فَكَأَنِّي أَنْظُرُ إِلَيْهِ يَخْتِلُ الرَّجُلَ لِيَطعُنَهُ
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 11 باب الاستئذان من أجل البصر
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ ఇంట్లోకి (తలుపు సందు నుంచి) తొంగి చూశాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఒక బాణం తీసుకొని ఎలాగైనా అతని కంట్లో పొడవబోతున్నారా అన్నట్లు (దిగ్గున) లేచారు. ఆ దృశ్యం నా మనో వీధిలో ఇప్పటికీ మెదలుతోంది.
(సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 11వ అధ్యాయం – అల్ ఇస్తియిజాను మిన్ అజలిల్ బసర్)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1394
హదీసు 1395
حديث أَبِي هُرَيْرَةَ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: لَوِ اطَّلَعَ فِي بَيْتِكَ أَحَدٌ وَلَمْ تَأذَنْ لَهُ، خَذَفْتَهُ بِحَصَاةٍ فَفَقَأتَ عَيْنَهُ، مَا كَانَ عَلَيْكَ مِنْ جُنَاحِ
أخرجه البخاري في: 87 كتاب الديات: 15 باب من أخذ حقه أو اقتص دون السلطان
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు:- నీ అనుమతి లేకుండా ఎవరైనా నీ ఇంట్లోకి తొంగి చూస్తే నీవతడ్ని కంకర్రాయి విసరికొట్టు. దానివల్ల అతని కన్ను పోయినా నీ మీద ఎలాంటి నిందరాదు.
(సహీహ్ బుఖారీ:- 87వ ప్రకరణం – అద్దియాత్, 15వ అధ్యాయం – మన్ అఖజ హఖ్ఖహూ అవిఖ్తస్స దూనస్సుల్తాన్)
మహా ప్రవక్త మహితోక్తులు|38. సంస్కార ప్రకరణం|హదీసు 1395
You must be logged in to post a comment.