మహా ప్రవక్త మహితోక్తులు – 34. జంతు వేట ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 34. జంతు వేట ప్రకరణం. ఇందులో 26 హదీసులు (హదీసు 1254 – 1279), 10 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFజంతు వేట ప్రకరణం8 పేజీలు · 0.5 MB

34. జంతు వేట ప్రకరణం

كتاب الصيد والذبائح ما يؤكل من الحيوان
అధ్యాయాలు (10)
  1. 1 తర్ఫీదు ఇవ్వబడిన కుక్కల ద్వారా వేట H 1254 – 1259
  2. 3 గోళ్ళు, కోరలు గల జంతువులు, పక్షులను తినడం నిషిద్ధం H 1260
  3. 4 సముద్ర జంతువుల్ని (చచ్చినవి కూడా) తినవచ్చు H 1261
  4. 5 పెంపుడు గాడిద మాంసం నిషిద్ధం H 1262 – 1268
  5. 6 గుర్రం మాంసం తినడం గురించి H 1269 – 1270
  6. 7 ఉడుం మాంసం ధర్మసమ్మతమే H 1271 – 1274
  7. 8 మిడతల మాంసం ధర్మసమ్మతమే H 1275
  8. 9 కుందేలు మాంసం తినవచ్చు H 1276
  9. 10 వేటకు, పరుగుకు పనికొచ్చే పద్ధతులన్నీ అవలంబించవచ్చు H 1277
  10. 12 జంతువుల్ని కట్టివేసి గురిపెట్టడం, కొట్టడం నిషిద్ధం H 1278 – 1279

1వ అధ్యాయం – తర్ఫీదు ఇవ్వబడిన కుక్కల ద్వారా వేట

1254

హదీసు 1254

باب الصيد بالكلاب المعلمة

حديث عَدِيِّ بْنِ حَاتِمٍ رضي الله عنه، قَالَ: قُلْتُ يَا رَسُولَ اللهِ إِنَّا نُرْسِلُ الْكِلاَبَ الْمُعَلَّمَةَ، قَالَ: كُلْ مَا أَمْسَكْنَ عَلَيْكَ قُلْتُ: وَإِنْ قَتَلْنَ قَالَ: وَإِنْ قَتَلْنَ قُلْتُ: وَإِنَّا نَرْمِي بِالْمِعْرَاضِ، قَالَ: كُلْ مَا خَزَقَ، وَمَا أَصَابَ بِعَرْضِهِ فَلاَ تَأْكُلْ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 3 باب ما أصاب المعراض بعرضه

హజ్రత్ అదీబిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺతో “దైవప్రవక్తా! మేము శిక్షణ ఇవ్వబడిన కుక్కల ద్వారా (జంతువుల్ని) వేటాడుతుంటాము” అని అన్నాను. దైవప్రవక్త ﷺ ఈ మాట విని “వేటాడిన తరువాత కుక్క తన యజమాని కోసం ఎదురు చూస్తూ వేట జంతువును పట్టి అలాగే ఉంచితే, దాని (మాంసం)ని మీరు తినవచ్చు” అని అన్నారు. “ఒకవేళ కుక్క వేట జంతువుని చంపితే?” అని నేను అడిగాను. దానికి ఆయన “కుక్క వేట జంతువుని చంపినా సరే” అని అన్నారు. “మరి దైవప్రవక్తా! మేము (ఉక్కు మొన గల కలప) ఈటె (JAVELIN) విసరి వేటాడుతుంటాము (దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి)?” అని అడిగాను మళ్ళీ. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “ఆ ఈటె సరిగ్గా తగిలి వేట జంతువు శరీరంలో దిగబడితే దాని (మాంసం)ని తినవచ్చు. అలా కాకుండా ఆ ఈటె అడ్డంగా తగిలి (జంతువు శరీరంలో దిగబడకపో)తే దాన్ని తినకూడదు” అని అన్నారు.★

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయి హివస్సైద్, 3వ అధ్యాయం – మా అసాబల్ మీరాజు బి అర్జిహీ)

★ అవసరం రీత్యా , లేదా వృత్తిరీత్యా, లేదా మరేదైనా ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో వేటాడ వచ్చన్న విషయంతో ధర్మవేత్తలు ఏకీభవించారని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అన్నారు. అనవసరంగా, లేక వినోదం కోసం వేటాడటం అభిలషనీయం కాదని (మక్రూహ్ అని) ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. జిబహ్ చేసి ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో జంతువుని వేటాడటం లైస్ (రహిమహుల్లాహ్), ఇబ్నె అబ్దుల్ హకమ్ (రహిమహుల్లాహ్)ల దృష్టిలో ధర్మసమ్మతమే. ఈ ఉద్దేశ్యం లేకుండా అనవసరంగా జంతువుని బలిగొనడం వీరి దృష్టిలో కూడా నిషిద్ధమే.

కుక్క ద్వారా వేటాడే విషయమై ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ఇది: వేట కోసం కుక్కను వదలి పెట్టేటప్పుడు , అలాగే వేటాడిన జంతువుని కోసేటప్పుడు ‘బిస్మిల్లాహ్’ పఠించాలి. దీనిపై ధర్మవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ‘బిస్మిల్లాహ్’ పఠించడం తప్పనిసరా (వాజిబ్) లేక ప్రవక్త సంప్రదాయమా (సున్నత్) అనే విషయంలో మాత్రం భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృష్టిలో ఇది సున్నత్. కనుక పొరపాటునగాని, లేదా ఉద్దేశపూర్వకంగా గాని, బిస్మిల్లాహ్ పఠించకపోయినా జంతువు హలాల్ అవుతుంది. కాకపోతే జిబహ్ చేసే వ్యక్తి ముస్లిం అయిఉండాలి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) , ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ల అభిప్రాయం కూడా ఇదే. కాని అహ్లె జాహిర్ (బాహ్యార్ధ స్వీకార) ధర్మవేత్తల దృష్టిలో పొరపాటుగానయినా, ఉద్దేశ్యపూర్వకంగానయినా బిస్మిల్లాహ్ పఠించకపోతే జంతువు హలాల్ కాజాలదు. ఇబ్నె సైరీన్(రహిమహుల్లాహ్) , అబూ సౌర్ (రహిమహుల్లాహ్) తదితర ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఇదే. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్), సుఫ్యాన్ సౌరీ (రహిమహుల్లాహ్), అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం బిస్మిల్లాహ్ పఠించడం మరచిపోతే జంతువు హలాల్ అవుతుంది. కావాలని బిస్మిల్లాహ్ పఠించకపోతే హరాం అవుతుంది.

ఈ హదీసు ప్రకారం ప్రతి వేట కుక్క ద్వారా వేటాడిన జంతువు హలాల్ అవుతుంది. అయితే అది శిక్షణ ఇవ్వబడిన కుక్క అయి ఉండాలి. దాని రంగు ఏదైనా పరవాలేదు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) , ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ఇదే. కాని హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), నఖయి (రహిమహుల్లాహ్), ఖతాదా (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్) ల దృష్టిలో నల్ల కుక్క షైతాన్‌కు మారు రూపమైనందున, నల్ల కుక్క ద్వారా జంతువుల్ని వేటాడటం సమంజసం కాదు. శిక్షణ ఇవ్వబడని కుక్క ద్వారా వేటాడిన జంతువులు నిషిద్ధం అనే విషయంలో మాత్రం అందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది.

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1254

1255

హదీసు 1255

حديث عَدِيِّ بْنِ حَاتِمٍ، قَالَ: سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قُلْتُ: إِنَّا قَوْمٌ نَصِيدُ بِهذِهِ الْكِلاَبِ فَقَالَ: إِذَا أَرْسَلْتَ كِلاَبَكَ الْمُعَلَّمَةَ، وَذَكَرْتَ اسْمَ اللهِ فَكُلْ مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَإِنْ قَتَلْنَ، إِلاَّ أَنْ يَأْكُلَ الْكَلْبُ، فَإِنِّي أَخَافُ أَنْ يَكُونَ إِنَّمَا أَمْسَكَهُ عَلَى نَفْسِهِ، وَإِنْ خَالَطَهَا كِلاَبٌ مِنْ غَيْرِهَا فَلاَ تَأْكُلْ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 7 باب إذا أكل الكلب

హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺతో “దైవప్రవక్తా! మేము కుక్కల ద్వారా (జంతువుల్ని) వేటాడుతుంటాము……?” అని అన్నాను. దైవప్రవక్త ﷺ ఈ మాట విని ఇలా అన్నారు. “మీరు శిక్షణ ఇవ్వబడిన కుక్కను వేట కోసం వదలేటప్పుడు ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి వదలండి. కుక్క వేట జంతువుని పట్టి మీ కోసం ఆపి ఉంచితే అలాంటి వేట జంతువు (మాంసం)ని మీరు తినవచ్చు, అది చచ్చినా సరే. అయితే దాన్ని కొంత కుక్క తినివేస్తే మాత్రం (అనుమానమే). అది తన కోసం వేటాడి ఉంటుందని నా అనుమానం (అలాంటి వేట జంతువుని తినకూడదు). అదే విధంగా మీ కుక్కతో పాటు ఇతర కుక్కలు కలసిపోతే అలాంటి వేట జంతువుని కూడా తినకూడదు.”

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 7వ అధ్యాయం – ఇజా అకలల్ కల్బ్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1255

1256

హదీసు 1256

حديث عَدِيِّ بْنِ حَاتِمٍ رضي الله عنه، قَالَ: سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْمِعْرَاضِ، فَقَالَ: إِذَا أَصَابَ بِحَدِّهِ فَكُلْ، وَإِذَا أَصَابَ بِعَرْضِهِ فَلاَ تَأْكُلْ، فَإِنَّهُ وَقِيْذٌ قُلْتُ: يَا رَسُولَ اللهِ أُرْسِلُ كَلْبِي وَأُسَمِّي، فَأَجِدُ مَعَهُ عَلَى الصَّيْدِ كَلْبًا آخَرَ لَمْ أُسَمِّ عَلَيْهِ، وَلاَ أَدْرِي أَيُّهُمَا أَخَذَ قَالَ: لاَ تَأْكُلْ إِنَّمَا سَمَّيْتَ عَلَى كَلْبِكَ، وَلَمْ تُسَمِّ عَلَى الآخَرِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 3 باب تفسير المشبهات

హజ్రత్ అదీబిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం:- నేను ఉక్కు మొన గల కలప ఈటె (బరిసె)తో వేటాడటం గురించి విచారిస్తే దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు : “ఆ ఈటె మొన గనుక సూటిగా వేట జంతువునకు తగిలితే దాన్ని తినవచ్చు. ఒకవేళ ఆ ఈటె అడ్డంగా తగిలి (వేట జంతువు చచ్చిపో)తే దాన్ని తినకూడదు. అది కట్టె లేక రాయి దెబ్బతో చంపబడిన జంతువవుతుంది (అలాంటి జంతువులను తినడం నిషిద్ధమని దివ్య ఖుర్ఆన్‌లో ఉంది)”. నేను మళ్ళీ ఇలా అడిగాను! “దైవప్రవక్తా! నేను ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి నా కుక్కను వేట కోసం వదలిపెడతా (ననుకోండి). అయితే నేను వేట జంతువు దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ మరో కుక్క కూడా కనిపిస్తుంది. దాన్ని వదలేటప్పుడు నేను బిస్మిల్లాహ్ అని పఠించలేదు. వేట జంతువుని ఈ రెండింటిలో అసలు ఏ కుక్క పట్టిందో కూడా నాకు తెలియదు. (అలాంటి స్థితిలో నేనేం చెయ్యాలి)?” దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “నీవు నీ కుక్కను వదలేటప్పుడు మాత్రమే బిస్మిల్లాహ్ పఠించావు. రెండవ కుక్క కోసం బిస్మిల్లాహ్ పఠించలేదు. అందుచేత నీవా వేట జంతువుని తినకూడదు” అని అన్నారు.★

(సహీహ్ బుఖారీ:- 34వ ప్రకరణం – అల్‌బుయూ, 3వ అధ్యాయం – తఫ్సీరిల్ ముషబ్బిహాత్)

★ “అల్లాహ్ పేరు పఠించకుండా జిబహ్ చేయడం జరిగితే దాని మాంసాన్ని తినకండి” అన్న అల్లాహ్ ఆదేశం దివ్య ఖుర్ఆన్‌లో (6:121) ఉంది.

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1256

1257

హదీసు 1257

حديث عَدِيِّ بْنِ حَاتِمٍ رضي الله عنه، قَالَ: سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ صَيْدِ الْمِعْرَاضِ قَالَ: مَا أَصَابَ بِحَدِّهِ فَكُلْهُ، وَمَا أَصَابَ بِعَرْضِهِ فَهُوَ وَقِيذٌ وَسَأَلْتُهُ عَنْ صَيْدِ الْكَلْبِ فَقَالَ: مَا أَمْسَكَ عَلَيْكَ فَكُلْ، فَإِنَّ أَخْذَ الْكَلْبِ ذَكَاةٌ، وَإِنْ وَجَدْتَ مَعَ كَلْبِكَ أَوْ كِلاَبِكَ كَلْبًا غَيْرَهُ فَخَشِيتَ أَنْ يَكُونَ أَخَذَهُ مَعَهُ، وَقَدْ قَتَلَهُ فَلاَ تَأْكُلْ، فَإِنَّمَا ذَكَرْتَ اسْمَ اللهِ عَلَى كَلْبِكَ وَلَمْ تَذْكُرْهُ عَلَى غَيْرِهِ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 1 باب التسمية على الصيد

హజ్రత్ అదీబిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం:- నేను ఉక్కు మొన గల కలప ఈటె (బరిసె)తో వేటాడటం గురించి విచారిస్తే దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు: “ఆ ఈటె మొన గనక వేట జంతువుకు తగిలితే దాన్ని తినవచ్చు. ఒకవేళ ఆ ఈటె అడ్డంగా తగిలి (వేట జంతువు చచ్చిపో)తే అది నిషిద్ధం (ముర్దార్)అవుతుంది”. ఆ తరువాత నేను కుక్క ద్వారా వేటాడటం గురించి అడిగాను. దానికి దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు: “ఆ కుక్క వేటాడి పట్టిన జంతువును మీ కోసం ఆపి ఉంచితే దాన్ని తినవచ్చు. కుక్క జంతువును వేటాడటమంటే ఆ జంతువును జిబహ్ చేయడమే. అయితే మీరు శిక్షణ ఇచ్చిన కుక్కతో పాటు మరో కుక్క కూడా వచ్చి చేరితే అదే వేట జంతువును పట్టి చంపి ఉంటుందన్న అనుమానం కలుగుతుంది. కనుక అలాంటి వేట జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ కుక్కను వదలేటప్పుడు మాత్రమే ‘బిస్మిల్లాహ్’ పఠించి ఉంటారు. రెండవ కుక్క విషయంలో బిస్మిల్లాహ్ పఠించి ఉండరు.”

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 1వ అధ్యాయం – అత్తస్మియతి అలస్సైద్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1257

1258

హదీసు 1258

حديث عَدِيِّ بْنِ حَاتِمٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أَرْسَلْتَ كَلْبَكَ وَسَمَّيْتَ فَأَمْسَكَ وَقَتَلَ فَكُلْ، وَإِنْ أَكَلَ فَلاَ تَأْكُلْ، فَإِنَّمَا أَمْسَكَ عَلَى نَفْسِهِ؛ وَإِذَا خَالَطَ كِلاَبًا لَمْ يُذْكَرِ اسْمُ اللهِ عَلَيْهَا فَأَمْسَكْنَ وَقَتلْنَ فَلاَ تَأْكُلْ، فَإِنَّكَ لاَ تَدْرِي أَيُّهَا قَتَلَ؛ وَإِنْ رَمَيْتَ الصَّيْدَ فَوَجَدْتَهُ بَعْدَ يَوْمٍ أَوْ يَوْمَيْنِ لَيْسَ بِهِ إِلاَّ أَثَرُ سَهْمِكَ فَكُلْ، وَإِنْ وَقَعَ فِي الْمَاءِ فَلاَ تَأْكُلْ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 8 باب الصيد إذا غاب عنه يومين أو ثلاثة

హజ్రత్ అదీబిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- మీరు ‘భిస్మిల్లాహ్’ పఠించి మీ కుక్కను వేట కోసం వదలిపెట్టినప్పుడు, అది జంతువును వేటాడి (తాను స్వయంగా తినకుండా) పట్టి మీ కోసం ఆపి ఉంచితే ఆ జంతువును మీరు తినవచ్చు. కుక్క దాన్ని చంపి వేసినా సరే మీరు తినవచ్చు. ఒకవేళ కుక్క ఆ వేట జంతువుని కొంత భాగం తింటే మాత్రం మీరిక దాన్ని తినకూడదు. (అది నిషిద్ధం). ఎందుకంటే ఈ జంతువుని కుక్క తన కోసం వేటాడింది. వేట కోసం మీ కుక్కను వదలిపెట్టేటప్పుడు ‘బిస్మిల్లాహ్’ పఠించబడని ఇతర కుక్కలు కూడా దాంతో చేరిపోతే అవి వేటాడి చంపిన జంతువును మీరు తినకూడదు. ఎందుకంటే ఆ కుక్కల్లో ఏ కుక్క జంతువును వేటాడి చంపిందో తెలియదు.

మీరు వేట జంతువుపైకి బాణం వదలి, అది (ఒకటి రెండు రోజుల తరువాత) చచ్చిపోయి దొరికినప్పుడు, దానిపై మీ బాణం తప్ప మరెవరి బాణం గుర్తు లేకపోతే మీరా జంతువును నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే బాణం దెబ్బతగిలిన తరువాత ఆ జంతువు నీటిలోకి పోయి పడి చచ్చిపోతే దాన్ని తినకండి.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహివస్సైద్, 8వ అధ్యాయం – అస్సైది ఇజా గాబ అన్హు యౌమైన్ అవ్ సలాస)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1258

1259

హదీసు 1259

حديث أَبِي ثَعْلَبَةَ الْخُشَنِيِّ، قَالَ: قُلْتُ يَا نَبِيَّ اللهِ إِنَّا بِأَرْضِ قَوْمٍ أَهْلِ الْكِتَابِ، أَفَنَأْكُلُ فِي آنِيَتِهِمْ وَبِأَرْضِ صَيْدٍ، أَصِيدُ بِقَوْسِي وَبِكَلْبِي الَّذِي لَيْسَ بِمُعَلَّمٍ وَبِكَلْبِي الْمُعَلَّمِ، فَمَا يَصْلُحُ لِي قَالَ: أَمَّا مَا ذَكَرْتَ مِنْ أَهْلِ الْكِتَابِ فَإِنْ وَجَدْتُمْ غَيْرَهَا فَلاَ تَأْكُلُوا فِيهَا، وَإِنْ لَمْ تَجِدُوا فَاغْسِلوهَا وَكُلُوا فِيهَا، وَمَا صِدْتَ بِقَوْسِكَ فَذَكَرْتَ اسْمَ اللهِ فَكُلْ، وَمَا صِدْتَ بِكَلْبِكَ الْمُعَلَّمِ فَذَكَرْتَ اسْمَ اللهِ فَكُلْ وَمَا صِدْتَ بِكَلْبِكَ غَيْرَ مُعَلَّمٍ فَأَدْرَكْتَ ذَكَاتَهُ فَكُلْ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 4 باب صيد القوس

హజ్రత్ అబూ సాలబా ఖుషనీ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺను ఇలా అడిగాను: “దైవప్రవక్తా! మేము గ్రంథప్రజలు ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాము. మరి మేము వారి కంచాలలో భోజనం చేయవచ్చా? మా ప్రాంతంలో వేట జంతువులు చాలా ఉన్నాయి. నేను నా ధనుర్బాణాలతో కూడా వేటాడుతాను, కుక్కల ద్వారా కూడా వేటాడుతాను. కుక్కలు శిక్షణ ఇవ్వబడినవి కూడా ఉంటాయి, శిక్షణ ఇవ్వబడనివి కూడా ఉంటాయి. వీటిలో ఏ వేట మంచిది (ధర్మసమ్మతమైనది)?”.

దానికి దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు. “నీవు గ్రంథ ప్రజల కంచాలను గురించి అడిగావు. మీకు వేరే కంచాలు లభిస్తే, గ్రంథ ప్రజల కంచాలలో భోజనం చేయకండి. ఒకవేళ వేరే కంచాలు దొరక్కపోతే గ్రంథ ప్రజల కంచాలు (గిన్నెలు) శుభ్రంగా కడిగి వాటిలో మీరు భోజనం చేయవచ్చు★ పోతే ధనుర్బాణాలతో వేటాడేటప్పుడు, బాణం వదిలేముందు ‘బిస్మిల్లాహ్’ పఠించి బాణం వదలాలి. అప్పుడా వేట జంతువుని మీరు తినవచ్చు. శిక్షణ ఇవ్వబడిన కుక్కను వేటకు వదిలేటప్పుడు ‘బిస్మిల్లాహ్’ పఠించి వదలిపెడ్తే అలాంటి వేట జంతువుని కూడా మీరు తినవచ్చు. ఒకవేళ శిక్షణ ఇవ్వబడని కుక్క ద్వారా వేటాడటం జరిగితే అట్టి పరిస్థితిలో వేట జంతువు సజీవంగా మీకు దొరికితే, దాన్ని (దైవనామంతో) జిబహ్ చేసి తినండి”.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహివస్సైద్, 4వ అధ్యాయం – సైదిల్ ఖౌస్)

★ ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు:- గ్రంథ ప్రజలు తమ కుండలలో పంది మాంసం వండుతారని, వారు తమ పాత్రలలో సారాయి పోసుకొని తాగుతారని అబూ దావూద్ ఉల్లేఖించిన హదీసులో మరింత వివరంగా ఉంది. అందువల్లనే ఇతర పాత్రలు లభిస్తే వారి పాత్రలు ఉపయోగించకూడదని దైవప్రవక్త ﷺ అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రం వారి పాత్రలను కడిగి ఉపయోగించుకోవచ్చు. ఇతర పాత్రలు ఉన్నప్పటికీ బహుదైవారాధకుల పాత్రలను కడిగి వాడుకోవచ్చని ఫికహ్ వేత్తల అభిప్రాయంకాగా, ఈ హదీసులో ఇతర పాత్రలు ఉన్నప్పుడు గ్రంథ ప్రజలపాత్రలను వాడకూడదని ఉంది. వాటిని కడిగినప్పటికీ వాడకూడదు. ఈ విధంగా ఈ హదీసు పైకి ఫికహ్‌వేత్తల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇందులో ఎలాంటి వ్యతిరేక భావం లేదు. హదీసులో పంది మాంసం వండిన పాత్రలను లేదా సారాయి తాగిన పాత్రలను గురించి ప్రస్తావించబడింది. ఫికహ్‌వేత్తలు ఇలాంటి అశుద్ధతలు లేని పాత్రలను గురించి పేర్కొన్నారు. (అనువాదకుడు)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1259

3వ అధ్యాయం – గోళ్ళు, కోరలు గల జంతువులు, పక్షులను తినడం నిషిద్ధం

1260

హదీసు 1260

باب تحريم أكل كل ذي ناب من السباع وكل ذي مخلب من الطير

حديث أَبِي ثَعْلَبَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنْ أَكْلِ كُلِّ ذِي نَابٍ مِنْ السِّبَاعِ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 29 باب أكل كل ذي ناب من السباع

హజ్రత్ అబూ సాలబా (రదియల్లాహు అన్హు) కథనం:- కోరలు(1) గల జంతువుల్ని తినడాన్ని దైవప్రవక్త ﷺ (ముస్లింలను) వారించారు.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయి హి వస్సైద్, 29వ అధ్యాయం – అక్లికల్లిజీనాబిన్ మినస్సిబాఅ)

(1) మూల భాషలో “జీనాబ్” అనే పదం వచ్చింది. అంటే కోర పళ్ళు గల ప్రాణి అని అర్థం. ఈ కోర పళ్ళతో అది వేట జీవాలను గట్టిగా పట్టుకొని కొరుకుతుంది, రక్కుతుంది. జంతువులు అంటే ఇక్కడ పులి, సింహం, చిరుత, ఉడుము, ఏనుగు, కోతి వగైరా. అరబీ భాషలో “జీముఖ్లబ్” అనే మరో పదం ఉంది. అంటే పంజాగల ప్రాణులు అని అర్థం; అంటే వేటాడే పక్షులు అని భావం. ఉదాహరణకు:- డేగ, గ్రద్ద, దూడబోతు మొదలైనవి.(సంకలనకర్త)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1260

4వ అధ్యాయం – సముద్ర జంతువుల్ని (చచ్చినవి కూడా) తినవచ్చు

1261

హదీసు 1261

باب إِباحة ميتة البحر

حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: بَعَثَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلاَثَمِائَةِ رَاكِبٍ، أَمِيرُنَا أَبُو عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ، نَرْصُدُ عِيرَ قُرَيْشٍ، فَأَقَمْنَا بِالسَّاحِلِ نِصْفَ شَهْرٍ، فَأَصَابَنَا جُوعٌ شَدِيدٌ حَتَّى أَكَلْنَا الْخَبَطَ، فَسُمِّيَ ذَلِكَ الْجَيْشُ جَيْشَ الْخَبَطِ فَأَلْقَى لَنَا الْبحْرُ دَابَّةً يُقَالُ لَهَا الْعَنْبَرُ، فَأَكَلْنَا مِنْهُ نِصْفَ شَهْرٍ، وَادَّهَنَّا مِنْ وَدَكِهِ، حَتَّى ثَابَتْ إِلَيْنَا أَجْسَامُنَا فَأَخَذَ أَبُو عُبَيْدَةَ ضِلَعًا مِنْ أَضْلاَعِهِ فَنَصَبَهُ، فَعَمَدَ إِلَى أَطْوَلِ رَجُلٍ مَعَهُ، وَأَخَذَ رَجُلاً وَبَعِيرًا فَمَرَّ تَحْتَه قَالَ جَابِرٌ: وَكَانَ رَجُلٌ مِنَ الْقَوْمِ نَحَرَ ثَلاَثَ جَزَائِرَ ثُمَّ نَحَرَ ثَلاَثَ جَزَائِرَ ثُمَّ نَحَرَ ثَلاَثَ جَزَائِرَ ثُمَّ إِنَّ أَبَا عُبَيْدَةَ نَهَاهُ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 65 باب غزوة سيف البحر

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ మమ్మల్ని ఖురైషీయుల (వర్తక) బిడారాలను అడ్డుకోవడానికి పంపించారు. మేము మొత్తం మూడొందల మంది రౌతులం. మా నాయకుడు హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్. సముద్ర తీరాన మేము అర్థమాసం వరకు ఉండిపోవాల్సి వచ్చింది. దాని వల్ల మేము కూటి కోసం అలమటించవలసి వచ్చింది. చివరికి మేము (ఆహార పదార్ధాలు లేక) ఆకులు సయితం తిన్నాము. ఈ కారణంగానే ఆ సైన్యానికి “ఆకుల సైన్యం” అని పేరొచ్చింది. తరువాత మా కోసం సముద్రం ‘అంబర్’ అనే ఓ పెద్ద చేపను ఒడ్డు మీద విసరేసింది. దాన్ని పదిహేను రోజులదాకా తిన్నాము. దాని కొవ్వును మా శరీరాలకు రుద్దుకున్నాము. దాంతో మా శరీరాలు మునుపటి శరీరాల్లా ఆరోగ్యవంతమయిపోయాయి. హజ్రత్ అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు) ఆ చేప ప్రక్క టెముక నొకదాన్ని ఒక చోట నిలబెట్టారు. తరువాత అందరికంటే పొడవైన వ్యక్తిని ఒంటె మీద కూర్చోబెట్టి ఆ ఎముక క్రింది నుంచి పోనిస్తే ఆ వ్యక్తి ఎముకకు తగలకుండా సులభంగా పోగలిగాడు.

(చేప దొరక్క ముందు తినడానికి ఏమీ దొరక్క) ఒక వ్యక్తి (ఓ రోజు) మూడు ఒంటెలు జిబహ్ చేశాడు, తరువాత (రెండవ రోజు) మరో మూడు ఒంటెలు జిబహ్ చేశాడు. తరువాత (మూడోరోజు) మరో మూడు ఒంటెలు జిబహ్ చేశాడు. ఆ తరువాత హజ్రత్ అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు) ఇక ఒంటెలను జిబహ్ చేయవద్దని అతడ్ని వారించారు. (2)

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 65వ అధ్యాయం – గజవతుసైఫిల్ బహ్ర)

(2) నది, చెరువు, సముద్రాలలోని జలచరాలు స్వయంగా చచ్చినా , లేదా వేటాడి చంపినా సరే వాటి మాంసం హలాల్ (ధర్మసమ్మతం) అవుతుందని ఈ హదీసుని బట్టి తెలుస్తోంది. అయితే కొన్ని విషయాల్లో ధర్మవేత్తల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. చేపలు హలాల్ అనడంలో అందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది. అహ్లె హదీసు వర్గం దృక్పథం ప్రకారం కప్ప హరాం (నిషిద్ధం). కప్పను మినహాయించి ఇతర జలచరాల విషయంలో మూడు దృక్పథాలు ఉన్నాయి. జలచరాలన్నీ హలాల్ అనేదే సరయిన దృక్పథం. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దృష్టిలో కప్ప కూడా హలాలే. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో చేపలు తప్ప మరే జలచరాలూ హలాల్ కాదు. అలాగే చేప చచ్చిపోయి నీటి మీద తేలితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో అదీ హరామే. కాని అహ్లె హదీస్ వారి దృక్పథం ప్రకారం, అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ హదీసుని బట్టి చచ్చిన చేప నీటిపై తేలినా హలాలే అవుతుంది. దీన్ని హరాంగా పరిగణించేవారు హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) గారి హదీసుని ప్రమాణంగా తీసుకున్నారు. కాని ఈ హదీసు బలహీనమైనది; ప్రామాణిక హదీసుల జాబితాలో రాజాలదు. వాస్తవం అల్లాహ్ కే తెలుసు. (ఇమామ్ నవవీ- రహ్మలై).

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1261

5వ అధ్యాయం – పెంపుడు గాడిద మాంసం నిషిద్ధం

1262

హదీసు 1262

باب تحريم أكل لحم الحمر الإنسية

حديث عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنْ مُتْعَةِ النِّسَاءِ يَوْمَ خَيْبَرَ، وَعَنْ أَكْلِ الْحُمُرِ الإِنْسِيَّةِ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 38 باب غزوة خيبر

హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఖైబర్ యుద్ధం నాడు దైవప్రవక్త ﷺ స్త్రీలను తాత్కాలికంగా వివాహమాడటాన్ని,★ పెంపుడు గాడిద మాంసం తినడాన్ని నిషేధించారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం -మగాజి, 38వ అధ్యాయం – గజ్వతి ఖైబర్)

★ ఇస్లాం ప్రారంభకాలంలో తాత్కాలిక వివాహం (ముతా) మార్గాంతరం లేని వారి కోసం (మృత జంతువుని తినడం ధర్మసమ్మతమైనట్లు) ధర్మసమ్మతం చేయబడింది. కాని ఆ తరువాత ఇది నిషేధించబడింది. తిరిగి మక్కా జయించబడిన సమయంలో లేదా వీడ్కోలు హజ్ (హజ్జతుల్ విదా) సమయంలో మరొకసారి తాత్కాలిక వివాహానికి అనుమతినివ్వడం జరిగింది. ఆ తరువాత దీన్ని శాశ్వతంగా నిషేధించారు దైవప్రవక్త ﷺ. (సంకలనకర్త)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1262

1263

హదీసు 1263

حديث أَبِي ثَعْلَبَةَ، قَالَ: حَرَّمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لُحُومَ الْحُمُرِ الأَهْلِيَّةِ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 28 باب لحوم الحمر الإِنسية

హజ్రత్ అబూ సాలబా (రదియల్లాహు అన్హు) కథనం:- పెంపుడు గాడిద మాంసం తినడాన్ని దైవప్రవక్త ﷺ మమ్మల్ని వారించారు.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం-అజ్జిబాయిహివస్సైద్, 28వ అధ్యాయం – లుహూమిల్ హుమురిల్ ఇన్సియ్యా).

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1263

1264

హదీసు 1264

حديث ابْنِ عُمَرَ، قَالَ: نَهى النَّبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ أَكْلِ لحُومِ الْحُمُرِ الأَهْلِيَّةِ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 38 باب غزوة خيبر

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ మమ్మల్ని పెంపుడు గాడిదల మాంసం తినకూడదని తాకీదు చేశారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 38వ అధ్యాయం – గజ్వతి ఖైబర్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1264

1265

హదీసు 1265

حديث ابْنِ أَبِي أَوْفَى، قَالَ: أَصَابَتْنَا مَجَاعَةٌ، لَيَالِيَ خَيْبَرَ، فَلَمَّا كَانَ يَوْمُ خَيْبَرَ، وَقَعْنَا فِي الْحُمُرِ الأَهْلِيَّةِ فَانْتَحَرْنَاهَا، فَلَمَّا غَلَتِ الْقُدُورُ نَادَى مُنَادِي رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْفِئُوا الْقُدُورَ فَلاَ تَطْعَمُوا مِنْ لُحُومِ الْحُمُرِ شَيْئًا قَالَ عَبْدُ اللهِ (هُوَ ابْنُ أَبِي أَوْفَى) : فَقُلْنَا إِنَّمَا نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لأَنَّهَا لَمْ تُخَمَّسْ، قَالَ: وَقَالَ آخَرُونَ حَرَّمَهَا الْبَتَّةَ

أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 20 باب ما يصيب من الطعام في أرض الحرب

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు) కథనం:- ఖైబర్ ముట్టడి జరిగిన రాత్రులలో మేము ఆకలితో అలమటించవలసి వచ్చింది. ఖైబర్ జయించబడగానే ఆ రోజు మేము పెంపుడు గాడిదలపై విరుచుకుపడ్డాము. మేము వాటిని కోశాము. కాని ఆ మాంసాన్ని దేగిశాలలో వేసి ఉడకబెడ్తుంటే దైవప్రవక్త ﷺ తరపున ఒక ప్రకటన కర్త వచ్చి“దేగిశాలను బోర్లించండి. పెంపుడు గాడిద మాంసం ఏ మాత్రం తినకండి” అని ప్రకటించాడు. మేమీ ప్రకటన విని, ఈ గాడిదల నుండి అయిదో భాగం (ధనాగారం కోసం) వసూలు చేయబడనందున వీటి మాంసం తినకూడదని దైవప్రవక్త ﷺ మమ్మల్ని వారిస్తున్నారని భావించాము. కాని మరి కొంత మంది “(అది కాదు) పెంపుడు గాడిదల (మాంసాన్ని తినడం)ని అల్లాహ్ పూర్తిగా నిషేధించాడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖుమ్స్, 20వ అధ్యాయం – మాయుసీబు మినత్తఆమిఫీ అర్జిల్ హరబ్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1265

1266

హదీసు 1266

حديث الْبَرَاءِ وَعَبْدِ اللهِ بْنِ أَبِي أَوْفَى، أَنَّهُمْ كَانُوا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَصَابُوا حُمُرًا فَطَبَخُوهَا، فَنَادَى مُنَادِي النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَكْفِئُوا الْقُدُورَ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 38 باب غزوة خيبر

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు)ల కథనం:- మేము (ఖైబర్ యుద్ధంలో) దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాము. (విజయప్రాప్తిగా) కొన్ని పెంపుడు గాడిదలు మా చేతికి చిక్కాయి. మేము వాటిని (కోసి, మాంసం) ఉడకబెట్టసాగాము. అంతలో దైవప్రవక్త ﷺ తరపున ఒక ప్రకటనకర్త వచ్చి “దేగిశాలను బోర్లించండి (గాడిద మాంసం తినకండి)” అని ప్రకటించాడు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 38వ అధ్యాయం – గజ్వతి ఖైబర్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1266

1267

హదీసు 1267

حديث ابْنِ عَبَّاسٍ رضي الله عنهما، قَالَ: لاَ أَدْرِي أَنْهى عَنْهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَجْلِ أَنَّهُ كَانَ حَمُولَةَ النَّاسِ فَكَرِهَ أَنْ تَذْهَبَ حَمُولَتُهُمْ، أَوْ حَرَّمَهُ فِي يَوْمِ خَيْبَرَ، لَحْمَ الْحُمُرِ الأَهْلِيَّةِ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 38 باب غزوة خيبر

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- గాడిదలు ప్రజల భారాన్ని మోయడానికి ఉపయోగపడతాయన్న కారణమ్మీదే దైవప్రవక్త ﷺ వీటి మాంసాన్ని తినడాన్ని వారించారన్న సంగతి నాకు తెలియదు. ఈ విధంగా ఈ రవాణా సాధనాలను వృధా చేయడం ఆయనకు ఇష్టం లేదన్నది కూడా నాకు తెలియదు. లేదా ఆయన ఖైబర్ యుద్ధం నాడు వీటి మాంసాన్ని నిజంగానే నిషేధించారన్న విషయం కూడా నాకు తెలియదు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 38వ అధ్యాయం – గజ్వతి ఖైబర్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1267

1268

హదీసు 1268

حديث سَلَمَةَ بْنِ الأَكْوَعِ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى نِيرَانًا تُوقَدُ يَوْمَ خَيْبَرَ قَالَ: عَلَى مَا توقَدُ هذِهِ النِّيرَانُ قَالُوا: عَلَى الْحُمُرِ الإِنْسِيَّةِ، قَالَ: اكْسِرُوهَا وَأَهْرِقُوهَا قَالُوا: أَلاَ نُهَرِيقهَا وَنَغْسِلُهَا قَالَ: اغْسِلُوا

أخرجه البخاري في: 46 كتاب المظالم: 32 باب هل تكسر الدنان التي فيها الخمر أو تخرق الزقاق

హజ్రత్ సలమా బిన్ అక్వయి (రదియల్లాహు అన్హు) కథనం:- ఖైబర్ యుద్ధ సందర్భంలో దైవప్రవక్త ﷺ అనేక చోట్ల అగ్ని ప్రజ్వరిల్లుతున్న దృశ్యాలు చూసి “ఈ అగ్ని మంటలు ఏమిటి?” అని అడిగారు. “పెంపుడు గాడిదల మాంసం వండుతున్నారు” అన్నారు అనుచరులు (కొందరు). దైవప్రవక్త ﷺ ఈ మాట విని “ఆ కుండలను పగలగొట్టండి. మొత్తం మాంసాన్ని పారవేయండి” అని ఆదేశించారు. అప్పుడు అనుచరులు “మాంసం పారవేసి, కుండలు శుభ్రంగా కడిగివేస్తే సరిపోదా?” అని అడిగారు. “సరే అలాగే వాటిని కడుక్కోండి” అన్నారు దైవప్రవక్త ﷺ.

(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం – మజాలిమ్, 32వ అధ్యాయం – హల్ తుక్సరుద్దినా నుల్లతి ఫీహల్ ఖమ్రు అవ్ తుఖ్రకుజ్జిఖాఖు)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1268

6వ అధ్యాయం – గుర్రం మాంసం తినడం గురించి

1269

హదీసు 1269

باب في أكل لحوم الخيل

حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ رضي الله عنهما، قَالَ: نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَوْمَ خَيْبَرَ، عَنْ لُحُومِ الْحُمُرِ، وَرَخَّصَ فِي الْخَيْلِ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 38 باب غزوة خيبر

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఖైబర్ యుద్ధం నాడు దైవప్రవక్త ﷺ మమ్మల్ని గాడిద మాంసం తినడాన్ని వారించారు. అయితే గుర్రం మాంసం తినడానికి అనుమతించారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 38వ అధ్యాయం – గజ్వతి ఖైబర్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1269

1270

హదీసు 1270

حديث أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رضي الله عنهما، قَالَتْ: نَحَرْنَا عَلَى عَهْدِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَرَسًا فَأَكَلْنَاهُ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 24 باب النحر والذبح

హజ్రత్ అస్మా బిన్తె అబీ బకర్ (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో మేము ఒక గుర్రాన్ని కోసి దాని మాంసం తిన్నాము.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 24వ అధ్యాయం – అన్నహ్రివజ్జబ్హి )

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1270

7వ అధ్యాయం – ఉడుం మాంసం ధర్మసమ్మతమే

1271

హదీసు 1271

باب إِباحة الضب

حديث ابْنِ عُمَرَ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الضَّبُّ، لَسْتُ آكُلُهُ، وَلاَ أُحَرِّمُهُ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 33 باب الضب

హజ్రత్ అబ్దుల్లా బిన ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- నేను ఉడుం మాంసం తినను. అయితే దాన్ని నిషిద్ధం (హరాం)గా కూడా పరిగణించను.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 33వ అధ్యాయం – అజ్జబ్బి)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1271

1272

హదీసు 1272

حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: كَانَ نَاسٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِيهمْ سَعْدٌ، فَذَهَبُوا يَأْكُلُونَ مِنْ لَحْمٍ، فَنَادَتْهُمُ امْرَأَةٌ مِنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِنَّهُ لَحْمُ ضَبٍّ، فَأَمْسَكُوا فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: كُلُوا أَوِ اطْعَمُوا، فَإِنَّهُ حَلاَلٌ أَوْ قَالَ: لاَ بَأْسَ بِهِ وَلكِنَّهُ لَيْسَ مِنْ طَعَامِي

أخرجه البخاري في: 95 كتاب أخبار الآحاد: 6 باب خبر المرأة الواحدة

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ అనుచరుల్లో కొందరు మాంసం తినడానికి ఉపక్రమించారు, వారిలో హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు)కూడా ఉన్నారు. అప్పుడు విశ్వాసుల మాతృమూర్తుల్లో ఒకరు బిగ్గరగా “ఆగండి, అది ఉడుం మాంసం (తినకండి)” అని అన్నారు. దైవప్రవక్త ﷺ అది విని, “తినండి. ఇది హలాల్ మాంసమే” అని అన్నారు. లేక “ఈ మాంసం తినడంలో తప్పులేదు. కాకపోతే నేను మాత్రం దీన్ని తినను” అని అన్నారు ఆయన.

(సహీహ్ బుఖారీ:- 95వ ప్రకరణం – అఖ్బారిల్ ఆహాద్, 6వ అధ్యాయం – ఖబ్రిల్ మర్‌అతిల్ వాహిదా)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1272

1273

హదీసు 1273

حديث خَالِدِ بْنِ الْوَلِيدِ، أَنَّهُ دَخَلَ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، عَلَى مَيْمُونَةَ، وَهِيَ خَالَتُهُ، وَخَالَةُ ابْن عَبَّاسٍ، فَوَجَدُ عِنْدَهَا ضَبًّا مَحْنُوذًا قَدِمَتْ بِهِ أُخْتُهَا، حُفَيْدَةُ بِنْتُ الْحارِثِ، مِنْ نَجْدٍ فَقَدَّمَتِ الضَّبَّ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَكَانَ، قَلَّمَا يُقَدِّمُ يَدَهُ لِطَعَامٍ، حَتَّى يُحَدَّثَ بِهِ وَيُسَمَّى لَهُ فَأَهْوَى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَدَهُ إِلَى الضَّبِّ، فَقَالَتِ امْرَأَةٌ مِنَ النِّسْوَةِ الْحُضُورِ: أَخْبِرْنَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مَا قَدَّمْتُنَّ لَهُ، هُوَ الضَّبُّ يَا رَسُولَ اللهِ فَرَفَعَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَدَهُ عَنِ الضَّبِّ فَقَالَ خَالِدُ بْنُ الْوَلِيدِ: أَحَرَامٌ الضَّبُّ يَا رَسُولَ اللهِ قَالَ: لاَ، وَلكِنْ لَمْ يَكُنْ بِأَرْضِ قَوْمِي، فَأَجِدُنِي أَعَافُهُ، قَالَ خَالِدٌ: فَاجْتَرَرْتُهُ فَأَكَلْتُهُ، وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَنْظُرُ إِلَيَّ

أخرجه البخاري في: 70 كتاب الأطعمة: 10 باب ما كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لا يأكل حتى يسمى له فيعلم ما هو

హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺ వెంట విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా) గారింటికి వెళ్ళాను. హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా) నాకు, అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)కు పిన్నమ్మ అవుతారు. ఆమె ఇంట్లో నాకు వేయించిన ఉడుం (మాంసం) కనిపించింది. అది ఆమెకు ఆమె సోదరి హఫీదా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హు) నజద్ ప్రాంతం నుండి తెచ్చిచ్చారు. దాన్ని హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺకు వడ్డించారు. దైవప్రవక్త ﷺ సాధారణంగా తనకు వడ్డించిన ఆహార పదార్థాలేమిటో తెలియజేయనంత వరకు అందులో చేయి పెట్టేవారు కాదు. ఆయన ఆ ఉడుం మాంసం వైపు చేయి పోనిస్తుంటే అక్కడున్న కొందరు స్త్రీలలో ఒకామె “దైవప్రవక్త ﷺకు నీవు ఏం వడ్డించావో కాస్త తెలియజెయ్యి” అని అన్నది. మరి ఆమె స్వయంగానే “దైవప్రవక్తా! అది ఉడుం మాంసం” అని చెప్పింది. దైవప్రవక్త ﷺ ఈ మాట వినగానే తమ చేతిని వెనక్కి తీసుకున్నారు.

నేనది చూసి “దైవప్రవక్తా! ఉడుం (మాంసం) నిషిద్ధమా?” అని అడిగాను. “లేదు, నిషిద్ధం కాదు. కాని ఇది మన ప్రాంతంలో లభించదు గనక నాకు అది తినబుద్ధికాదు, అంతే” అన్నారు దైవప్రవక్త ﷺ. అప్పుడు నేను దాన్ని (అంటే ఉడుం మాంసం ఉన్న కంచాన్ని) నా వైపుకు లాక్కొని తిన్నాను. నేను తింటుంటే దైవప్రవక్త ﷺ నా వైపు చూడసాగారు.

(సహీహ్ బుఖారీ:- 70వ ప్రకరణం – అత్‌యిమహ్, 10వ అధ్యాయం – మా కానన్నబియ్యు ﷺ లా యాకులు హత్తాయుసమ్మాలహూ ఫయాలము మాహువ)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1273

1274

హదీసు 1274

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: أَهْدَتْ أُمُّ حُفَيْدٍ، خَالَةُ ابْنِ عَبَّاسٍ، إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَقِطًا وَسَمْنًا وَأَضُبًّا، فَأَكَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الأَقِطِ وَالسَّمْنِ، وَتَرَكَ الضَّبَّ تَقَذُّرًا قَالَ ابْنُ عَبَّاسٍ: فَأُكِلَ عَلَى مَائِدَةِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلَوْ حَرَامًا مَا أُكلَ عَلَى مَائِدَةِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

أخرجه البخاري في: 51 كتاب الهبة: 7 باب قبول الهدية

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- మా పిన్నమ్మ హజ్రత్ ఉమ్మె హఫీదా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ ఇంటికి కానుకగా జున్ను, నెయ్యి, ఉడుం (మాంసం) పంపించారు. దైవప్రవక్త ﷺ జున్ను, నెయ్యి మాత్రం తిన్నారు. కాని ఉడుం మాంసాన్ని ఏవగించుకుంటూ వదలిపెట్టారు (తినలేదు).

దైవప్రవక్త ﷺ ముందు ఆయన అనుచరులు ఉడుం మాంసాన్ని తిన్నారు. ఉడుం నిషిద్ధమయి ఉంటే ఆయన ముందు వారు దాన్ని తినేవారు కాదు.

(సహీహ్ బుఖారీ:- 51వ ప్రకరణం – హిబా, 7వ అధ్యాయం – ఖబూలిల్ హదియహ్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1274

8వ అధ్యాయం – మిడతల మాంసం ధర్మసమ్మతమే

1275

హదీసు 1275

باب إِباحة الجراد

حديث ابْنِ أَبِي أَوْفَى، قَالَ: غَزَوْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، سَبْعَ غَزَوَاتٍ، أَوْ سِتًّا، كُنَّا نَأْكُلُ مَعَهُ الْجَرَادَ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 13 باب أكل الجراد

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త ﷺతో కలసి ఆరేడు యుద్ధాలలో పాల్గొన్నాము. ఆయన వెంట ఉన్నప్పుడు మేము మిడతలను (కూడా) తినేవాళ్ళము.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జబాయిహి వస్సైద్, 13వ అధ్యాయం – అక్లిల్ జరాద్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1275

9వ అధ్యాయం – కుందేలు మాంసం తినవచ్చు

1276

హదీసు 1276

باب إِباحة الأرنب

حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: أَنْفَجْنَا أَرْنَبًا بِمَرِّ الظَّهْرَانِ، فَسَعَى الْقَوْمُ فَلَغَبُوا، فَأَدْرَكْتُهَا، فَأَخَذْتُهَا، فَأَتَيْتُ بِهَا أَبَا طَلْحَةَ، فَذَبَحَهَا، وَبَعَثَ بِهَا إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِوَرِكِهَا أَوْ فَخِذَيْهَا فَقَبِلَهُ، وَأَكَلَ مِنْهُ

أخرجه البخاري في: 51 كتاب الهبة: 5 باب قبول هدية الصيد

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము ముర్రజ్జహ్రాన్ సమీపంలో ఒక కుందేలును వెంటాడాము. జనం (దాన్ని పట్టుకోవడానికి) పరుగెత్తారు. అయితే నేను (ఒక్కడ్ని మాత్రమే) ఆ కుందేలు దాకా చేరుకొని దాన్ని పట్టుకొని హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన దాన్ని జిబహ్ చేసి దాని నడుం మాంసాన్ని లేక తొడలను దైవప్రవక్త ﷺకు పంపారు. ఆయన దాన్ని స్వీకరించి ఆరగించారు.

(సహీహ్ బుఖారీ:- 51వ ప్రకరణం – హిబా, 5వ అధ్యాయం – ఖబూలి హద్యతిస్సైద్)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1276

10వ అధ్యాయం – వేటకు, పరుగుకు పనికొచ్చే పద్ధతులన్నీ అవలంబించవచ్చు

1277

హదీసు 1277

باب إِباحة ما يستعان به على الاصطياد والعدو وكراهة الخذف

حديث عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ، أَنَّهُ رَأَى رَجُلاً يَخْذِفُ فَقَالَ لَهُ: لاَ تَخْذِفْ، فَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنِ الْخَذْفِ، أَوْ كَانَ يَكْرَهُ الْخَذْفَ وَقَالَ: إِنَّهُ لاَ يُصَادُ بِهِ صَيْدٌ وَلاَ يُنْكَى بِهِ عَدُوٌّ، وَلكِنَّهَا قَدْ تَكْسِرُ السِّنَّ وَتَفْقَأ الْعَيْنَ ثُمَّ رَآهُ بَعْدَ ذَلِكَ يَخْذِفُ، فَقَالَ لَهُ: أُحَدِّثكَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ نَهى عَنِ الْخَذْفِ أَوْ كَرِهَ الْخَذْفَ، وَأَنْتَ تَخْذِفُ لاَ أُكَلِّمُكَ كَذَا وَكَذَا

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 5 باب الخذف والبندقة

హజ్రత్ అబ్దుల్లా బిన్ మగప్ఫిల్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి వేట జంతువుపై కంకర్రాళ్ళు విసరికొడ్తుంటే హజ్రత్ అబ్దుల్లా బిన్ మగప్ఫిల్ (రదియల్లాహు అన్హు) చూసి అతడ్ని వారించారు. “దైవప్రవక్త ﷺ వేట జంతువుపై కంకరాళ్ళు విసరి కొట్టడాన్ని వారించారు లేక ఆయన వేట జంతువుని కంకరాళ్ళతో కొట్టడాన్ని ఇష్టపడేవారు కాదు. కంకరాళ్ళతో వేటాడటం కుదరదు. దాని వల్ల అది చావదు. కాకపోతే ఎప్పుడైనా దాని పళ్ళు రాలిపోవచ్చు లేదా కళ్ళు పగిలిపోవచ్చు” అన్నారు ఆయన.

ఆ తరువాత కూడా ఆ వ్యక్తి కంకరాళ్ళతో కొడ్తుంటే హజ్రత్ అబ్దుల్లా బిన్ మగప్ఫిల్ (రదియల్లాహు అన్హు) అతనితో ఇలా అన్నారు: “నేను నీకు దైవప్రవక్త ﷺ ప్రవచనం విన్పించాను. ఆయన కంకరాళ్ళు కొట్టకూడదని (మనల్ని) వారించారు. లేక ఆయన కంకరాళ్ళు కొట్టడాన్ని ఇష్టపడేవారు కాదు. నువ్వీ ప్రవచనం విని కూడా కంకరాళ్ళు కొడ్తున్నావు. ఇక నేను నీతో మాట్లాడను”.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 5వ అధ్యాయం – అల్ఖజ్ఫివల్ బుందుఖా)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1277

12వ అధ్యాయం – జంతువుల్ని కట్టివేసి గురిపెట్టడం, కొట్టడం నిషిద్ధం

1278

హదీసు 1278

باب النهي عن صبر البهائم

حديث أَنَسٍ، قَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنْ تُصْبَرَ الْبَهَائِمُ

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 25 باب ما يكره من الْمُثْلة والمصبورة والمجثمة

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- జంతువుల్ని కట్టివేసి (వాటిని గురిపెట్టి బాణం వదలి) చంపడాన్ని దైవప్రవక్త ﷺ (మమ్మల్ని) వారించారు.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వస్సైద్, 25వ అధ్యాయం – మాయుక్రహు మినల్ ముస్లతి వల్ ముస్బూరతిల్ ముజస్సమ్మా)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1278

1279

హదీసు 1279

حديث ابْنِ عُمَرَ عَنْ سَعِيدِ بْنِ جُبَيْرٍ، قَالَ: كُنْتُ عِنْدَ ابْنِ عُمَرَ، فَمَرُّوا بِفِتْيَةٍ، أَوْ بِنَفَرٍ نَصَبُوا دَجَاجَةً يَرْمُونَهَا، فَلَمَّا رَأَوُا ابْنَ عُمَرَ تَفَرَّقُوا عَنْهَا وَقَالَ ابْنُ عُمَرَ: مَنْ فَعَلَ هذَا إِنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَعَنَ مَنْ فَعَلَ هذَا

أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 25 باب ما يكره من المثلة والمصبورة والمجثمة

హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వెంట ఉన్నాను. మేము కొందరు వ్యక్తుల లేక యువకుల సమీపం నుండి పోవడం తటస్థించింది. అప్పుడు వారు ఒక కోడిని గురి కోసం కట్టివేసి దాని మీదికి బాణాలు వదులుతున్నారు. అయితే వారు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ని చూడగానే దాన్ని వదలి పెట్టి అటు ఇటూ పరుగెత్తారు. అప్పుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) “దీన్నెవరు ఇలా కట్టివేశారు?” అని అడిగి ఆ తరువాత ఇలా అన్నారు: “ఇలా (జంతువుని లేక మరేదయినా జీవాన్ని కట్టివేసి దానిపైకి బాణాలు వదలి పెట్టే పని) చేసే వారిని దైవప్రవక్త ﷺ శపించారు”.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం- అజ్జిబాయిహి వస్సైద్, 25వ అధ్యాయం – మాయుక్రహు మినల్ ముస్లతి వల్ మస్బూరతి వల్ ముజస్సమ్మా)

మహా ప్రవక్త మహితోక్తులు|34. జంతు వేట ప్రకరణం|హదీసు 1279