మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 17. స్తన్య సంబంధిత ప్రకరణం. ఇందులో 20 హదీసులు (హదీసు 916 – 935), 12 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFస్తన్య సంబంధిత ప్రకరణం8 పేజీలు · 0.5 MB
17. స్తన్య సంబంధిత ప్రకరణం
كتاب الرضاعఅధ్యాయాలు (12)
- 1 స్తన్య సంబంధం వల్ల కూడా రక్త సంబంధం వలె బంధుత్వం ఏర్పడుతుంది H 916 – 918
- 3 స్తన్య సంబంధ సోదరుని కుమార్తెను వివాహమాడటం నిషిద్ధం H 919
- 4 భార్యకు మొదటి భర్త వల్ల కలిగిన కుమార్తెను, భార్య సోదరీని వివాహమాడటం నిషిద్ధం H 920
- 8 ఆకలి తీర్చడానికి పట్టే పాల వల్లనే స్తన్య సంబంధిత వరస ఏర్పడుతుంది H 921
- 10 భార్య లేక బానిస కలిగి ఉన్న వాడిదే సంతానమవుతుంది H 922 – 923
- 11 పిల్లల సంబంధం విషయంలో శరీరాకృతిని బట్టి నిర్ణయం తీసుకోవడం H 924
- 12 పెళ్ళయిన పిదప పడుచు భార్య దగ్గర ఎన్ని రోజులు, పునర్వివాహిత దగ్గర ఎన్ని రోజులు ఉండాలి H 925
- 13 ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క రోజు (పగలు, రాత్రి) కేటాయించాలి H 926
- 14 స్త్రీ తన వంతును తన సవతికి కానుకగా సమర్పించుకోవచ్చు H 927
- 15 ధర్మపరాయణురాలైన స్త్రీని వివాహమాడటమే అత్యంత శ్రేయస్కరం H 928
- 16 కన్యను చేసుకోవడమే మంచిది H 929 – 932
- 18 స్త్రీల పట్ల సత్ప్రవర్తన H 933 – 935
1వ అధ్యాయం – స్తన్య సంబంధం వల్ల కూడా రక్త సంబంధం వలె బంధుత్వం ఏర్పడుతుంది
హదీసు 916
باب يحرم من الرضاعة ما يحرم من الولادة
حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ عِنْدَهَا، وَأَنَّهَا سَمِعَتْ صَوْتَ رَجُلٍ يَسْتَأْذِنَ فِي بَيْتِ حَفْصَةَ قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ يَا رَسُولَ اللهِ أُرَاهُ فُلاَنًا (لِعَمِّ حَفْصَةَ مِنَ الرَّضَاعَةِ) فَقَالَتْ عَائِشَةُ: يَا رَسُولَ اللهِ هذَا رَجُلٌ يَسْتَأْذِنُ فِي بَيْتِكَ، قَالَتْ: فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُرَاهُ فُلاَنًا (لِعَمِّ حَفْصَةَ مِنَ الرَّضَاعَةِ) فَقَالَتْ عَائِشَةُ؛ لَوْ كَانَ فُلاَنٌ حَيًّا (لِعَمِّهَا مِنَ الرَّضَاعَةِ) دَخَلَ عَلَيَّ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَعَمْ، إِنَّ الرَّضَاعَةَ تُحَرِّمُ مَا يَحْرُمُ مِنَ الْوِلاَدَةِ
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 7 باب الشهادة على الأنساب والرضاع المستفيض
విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓ రోజు దైవప్రవక్త ﷺ నా దగ్గర (ఇంట్లో) ఉన్నప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి మాటలు విన్పించాయి. అతను హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంట్లో ప్రవేశించడానికి ఆమె అనుమతి కోరుతున్నారు. అప్పుడు నేను దైవప్రవక్త ﷺతో “దైవప్రవక్తా! బహుశా ఆయన హజ్రత్ హఫ్సా(రదియల్లాహు అన్హా) గారి స్తన్య సంబంధపు పినతండ్రి కావచ్చనుకుంటా. ఆయన మీ ఇంట్లోకి (అంటే హఫ్సా ఇంట్లోకి) రావడానికి అనుమతి కోరుతున్నారు” అని అన్నాను. దానికి దైవప్రవక్త ﷺ “(ఔనౌను) ఈయన ఫలానా వ్యక్తి హఫ్సా(రదియల్లాహు అన్హా)కు స్తన్య సంబంధపు పినతండ్రి అవుతాడు” అని అన్నారు. అప్పుడు నేను “అయితే నాకు స్తన్య సంబంధపు పినతండ్రి అయిన ఫలానా వ్యక్తి బ్రతికి ఉంటే ఆయన కూడా నా ముందుకు (పరదా లేకుండా) రావచ్చా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త సమాధానమిస్తూ “రావచ్చు. అనువంశిక బంధుత్వం వల్ల ప్రత్యేక బంధువులు ఎలా వివాహ నిషిద్ధులు (మహ్రం) అవుతారో అలాగే స్తన్య సంబంధం వల్ల ఏర్పడిన బంధువులు కూడా వివాహ నిషిద్ధులు (మహ్రం) అవుతారు” అని తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : 52వ ప్రకరణం – షహాదాత్, 7వ అధ్యాయం – అష్షహాదతి అలల్ అన్సాబి వర్రజాయి]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 916
హదీసు 917
باب تحريم الرضاعة من ماء الفحل
حديث عَائِشَةَ، قَالَتْ: اسْتَأْذَنَ عَلَيَّ أَفْلَحُ أَخُو أَبِي الْقُعَيْسِ بَعْدَمَا أُنْزِلَ الْحِجَابُ، فَقُلْتُ: لاَ آذَنُ لَهُ حَتَّى أَسْتَأْذِنَ فِيهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِنَّ أَخَاهُ أَبَا الْقُعَيْسِ لَيْسَ هُوَ أَرْضَعَنِي، وَلكِنْ أَرْضَعَتْنِي امْرَأَةُ أَبِي الْقُعَيْسِ فَدَخَلَ عَلَيَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقُلْتُ لَهُ: يَا رَسُولَ اللهِ إِنَّ أَفْلَحَ أَخَا أَبِي الْقُعَيْسِ اسْتَأْذَنَ فَأَبَيْتُ أَنْ آذَنَ حَتَّى أَسْتَأْذِنَكَ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَمَا مَنَعَكِ أَنْ تَأْذَنِينَ عَمُّكِ قُلْتُ: يَا رَسُولَ اللهِ إِنَّ الرَّجُلَ لَيْسَ هُوَ أَرْضَعَنِي، وَلكِنْ أَرْضَعَتْنِي امْرَأَةُ أَبِي الْقُعَيْسِ فَقَالَ: ائْذَنِي لَهُ، فَإِنَّهُ عَمُّكِ، تَرِبَتْ يَمِينُكِ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 33 سورة الأحزاب: 9 باب قوله (إن تبدوا شيئاً أو تخفوه)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓ రోజు అబుల్ ఖయీస్ సోదరుడగు అఫ్లహ్ (రదియల్లాహు అన్హు) మా ఇంట్లోకి రావడానికి నా అనుమతి కోరారు. ఇది పరదా ఆదేశం అవతరించిన నాటి సంగతి. అందువల్ల నేను దైవప్రవక్త ﷺ నుండి అనుమతి తీసుకోకుండా ఆయన్ని లోపలికి రావడానికి అనుమతించకూడదని భావించాను. నాకు స్తన్యం ఇచ్చిన వారు ఆయన సోదరుడు అబుల్ ఖయీస్ కాదు; అబుల్ ఖయీస్ భార్య మాత్రమే ఇచ్చింది (అంటే స్తన్య బంధుత్వం అబుల్ ఖయీస్ వంశం వల్ల కాకుండా ఆయన భార్య వల్ల ఏర్పడింది) అన్నాను. ఆ తరువాత కాస్సేపటికి దైవప్రవక్త ﷺ రానే వచ్చారు. అప్పుడు నేనీ విషయాన్ని ఆయన దృష్టికి తెస్తూ “దైవప్రవక్తా! అబుల్ ఖయీస్ సోదరుడు అఫ్లహ్ ఇంట్లోకి రావడానికి నన్ను అనుమతి అడిగాడు, కాని మీ నుండి అనుమతి తీసుకోనంత వరకు నేను అనుమతి ఇవ్వలేనన్నాను అతనితో” అని అన్నాను.
దైవప్రవక్త ﷺ ఈ మాట విని “నీ పినతండ్రిని లోపలికి రావడానికి అనుమతించకుండా నీకు ఏ విషయం నిరోధించింది?” అని అన్నారు. దానికి నేను “దైవప్రవక్తా! నాకా పురుషుడు పాలు త్రాగించలేదు. ఆయన భార్య మాత్రమే నాకు పాలు త్రాగించింది” అని అన్నాను. అప్పుడు దైవప్రవక్త (చిరుకోపంతో) “నీ చేతులు మట్టిలో కలిసిపోను! ఆయన్ని రావటానికి అనుమతించు. ఆయన నీకు పినతండ్రి అవుతారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 33 – అహ్జాబ్ సూరా – 9వ అధ్యాయం – ఇన్ తుబ్దూ]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 917
హదీసు 918
حديث عَائِشَةَ، قَالَتْ: اسْتَأْذَنَ عَلَيَّ أَفْلَحُ فَلَمْ آذَنْ لَهُ فَقَالَ: أَتَحْتَجِبِينَ مِنِّي وَأَنَا عَمُّكِ فَقُلْتُ: وَكَيْفَ ذلِكَ قَالَ: أَرْضَعَتْكِ امْرَأَةُ أَخِي بِلَبَنِ أَخِي فَقَالَتْ: سَأَلْتُ عَنْ ذلِكَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: صَدَقَ أَفْلَحُ، ائْذَنِي لَهُ
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 7 باب الشهادة على الأنساب والرضاع المستفيض
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ అఫ్లహ్ లోపలికి రావడానికి అనుమతి అడిగితే నేనాయనకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడాయన “ఏమిటి, నీవు నా ముందు కూడా పరదా పాటిస్తున్నావా?! నేను నీ చిన్నాయనమ్మా!!” అని అన్నారు. నేను ‘ఎలా!’ అని అడిగాను. “నీకు నా సోదరుడి భార్య స్తన్యమిచ్చింది. ఆమెలో ఆ పాలు నా సోదరుడే వల్లనే పడ్డాయి” అన్నారు ఆయన. ఆ తరువాత నేను దీన్ని గురించి దైవప్రవక్త ﷺను అడిగితే “అఫ్లహ్ చెప్పింది నిజమే. ఆయన్ని లోపలికి రావడానికి అనుమతించు” అన్నారు దైవప్రవక్త ﷺ.
[సహీహ్ బుఖారీ : 52వ ప్రకరణం – షహాదాత్, 7వ అధ్యాయం – అష్షహాదతి అలల్ అన్సాబి వర్రిజా అల్ ముస్త ఫైజ్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 918
3వ అధ్యాయం – స్తన్య సంబంధ సోదరుని కుమార్తెను వివాహమాడటం నిషిద్ధం
హదీసు 919
باب تحريم ابنة الأخ من الرضاعة
حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي بِنْتِ حَمْزَةَ: لاَ تَحِلُّ لِي، يَحْرُمُ مِنَ الرَّضَاعِ مَا يَحْرُمُ مِنَ النَّسَبِ، هِيَ بِنْتُ أَخِي مِنَ الرَّضَاعَةِ
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 7 باب الشهادة على الأنساب والرضاع المستفيض
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం :- దైవప్రవక్త ﷺ హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) కుమార్తె గురించి మాట్లాడుతూ “ఆమెను నేను వివాహమాడటం ధర్మసమ్మతం కాదు. ఆమె నా స్తన్య సంబంధ సోదరుని కుమార్తె. స్తన్య సంబంధం వల్ల (ఒకే స్త్రీ పాలు త్రాగిన) వారంతా బంధువులయిపోతారు. అనువంశిక బంధుత్వం వల్ల ఏ విధంగా నిషేధం ఏర్పడుతుందో వారి మధ్య కూడా పరస్పర వివాహం నిషిద్ధమవుతుంది” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ: 52వ ప్రకరణం – షహాదాత్, 7వ అధ్యాయం – అష్షహదతి అలల్ అన్సాబివర్రిజా అల్ ముస్త ఫైజ్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 919
4వ అధ్యాయం – భార్యకు మొదటి భర్త వల్ల కలిగిన కుమార్తెను, భార్య సోదరీని వివాహమాడటం నిషిద్ధం
హదీసు 920
باب تحريم الربيبة وأخت المرأة
حديث أُمِّ حَبِيبَةَ قَالَتْ: قُلْتُ يَا رَسُولَ اللهِ هَلْ لَكَ فِي بِنْتِ أَبِي سُفْيَانَ قَالَ: فَأَفْعَلُ مَاذَا قُلْتُ: تَنْكِحُ؛ قَالَ: أَتُحِبِّينَ قُلْتُ: لَسْتُ لَكَ بِمُخْلِيَةٍ، وَأَحَبُّ مَنْ شَرَكَنِي فِيكَ أُخْتِي قَالَ: إِنَّهَا لاَ تَحِلُّ لِي قُلْتُ: بَلَغَنِي أَنَّكَ تَخْطُبُ قَالَ: ابْنَةَ أُمِّ سَلَمَةَ قُلْتُ: نَعَمْ قَالَ: لَوْ لَمْ تَكُنْ رَبِيبَتِي مَا حَلَّتْ لِي، أَرْضَعَتْنِي وَأَبَاهَا ثُوَيْبَةُ، فَلاَ تَعْرِضْنَ عَلَيَّ بَنَاتِكُنَّ وَلاَ أَخَوَاتِكُنَّ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 25 باب (وربائبكم اللاتي في حجوركم)
విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం:- నేనొకరోజు దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ “దైవప్రవక్తా! (నా సోదరి) అబూ సుఫ్యాన్ కూతురంటే మీ కిష్టమేనా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త ﷺ “ఎందుకు, అయితే నన్నేం చేయమంటావు?” అని ప్రశ్నించారు. “ఏం చేయడమేమిటి; మీరామెను పెళ్ళి చేసుకోండి” అన్నాను నేను. “అయితే నేనామెను చేసుకోవడం నీ కిష్టమేనా?” అడిగారు దైవప్రవక్త ﷺ. “నేనొక్క దాన్నేనా మీకు భార్యగా ఉన్నది? ఇంకెవరూ లేరా? కాకపోతే మీ భార్యలలో నాతో పాటు నా చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను” అన్నాను నేను.
దైవప్రవక్త ﷺ ఈ మాట విని “నేనామెను చేసుకోవడం ధర్మసమ్మతం (హలాల్) కాదు” అని అన్నారు. “మీరు మరొక స్త్రీని చేసుకోవడానికి వివాహ సందేశం పంపారని విన్నాను” అన్నానేను.
“ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కుమార్తె దుర్రను గురించేనా నువ్వు చెబుతున్నది?” అడిగారు ఆయన. నేను ‘ఔనండీ’ అన్నాను. “ఆమె (నా భార్య మాజీ భర్త వల్ల కలిగిన కుమార్తె కాకుండా ఉన్నా సరే నేనామెను చేసుకోవడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే, నాకు, ఆమె నాన్నకు సౌబియా (రదియల్లాహు అన్హు) పాలు పట్టింది. ( ఈ విధంగా ఆమె నాకు స్తన్య సంబంధమైన కూతురు వరసవుతుంది) మీరిక ముందు మీ (మాజీ భర్తల వల్ల మీకు కలిగిన) కుమార్తెలు, సోదరీలను గురించి నా ముందు (వివాహ) ప్రస్తావన తీసుకురాకండి” అన్నారు దైవప్రవక్త ﷺ.
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 25వ అధ్యాయం – వరబాయి బుకుముల్లతి ఫీ హుజూరికుమ్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 920
8వ అధ్యాయం – ఆకలి తీర్చడానికి పట్టే పాల వల్లనే స్తన్య సంబంధిత వరస ఏర్పడుతుంది
హదీసు 921
باب إِنما الرضاعة من المجاعة
حديث عَائِشَةَ، قَالَتْ: دَخَلَ عَلَيَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَعِنْدِي رَجُلٌ، قَالَ: يَا عَائِشَةُ مَنْ هذَا قُلْتُ: أَخِي مِنَ الرَّضَاعَةِ قَالَ: يَا عَائِشَةُ انْظُرْنَ مَنْ إِخْوَانُكُنَّ، فَإِنَّمَا الرَّضَاعَةُ مِنَ المَجَاعَةِ
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 7 باب الشهادة على الأنساب والرضاع المستفيض
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త ﷺ ఓసారి నా దగ్గరికి (ఇంటికి) వచ్చినప్పుడు ఒకతను నా దగ్గర కూర్చొని ఉన్నాడు. దైవప్రవక్త ﷺ అతడ్ని చూసి “ఆయిషా ఇతనెవరూ?” అని అడిగారు. దానికి నేను “ఇతను నా స్తన్య సంబంధ సోదరుడు” అని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త ﷺ “ఆయిషా నిజంగా ఎవరు సోదరుడో సరిగా పరికించి చూసుకోవాలి. ఎందుకంటే పసితనంలో ఆకలి తీర్చడానికి పట్టే పాల వల్ల మాత్రమే స్తన్య సంబంధిత వరస ఏర్పడుతుంది” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 52వ ప్రకరణం – షహాదాత్, 7వ అధ్యాయం – అష్షహాదతి అలల్ అన్సాబి వర్రజా అల్ ముస్త ఫైజ్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 921
10వ అధ్యాయం – భార్య లేక బానిస కలిగి ఉన్న వాడిదే సంతానమవుతుంది
హదీసు 922
باب الولد للفراش وتوقي الشبهات
حديث عَائِشَةَ، قَالَتْ: اخْتَصَمَ سَعْدُ بْنُ أَبِي وَقَّاصٍ وَعَبْدُ بْنُ زَمْعَةَ فِي غُلاَمٍ؛ فَقَالَ سَعْدٌ: هذَا، يَا رَسُولَ اللهِ ابْنُ أَخِي عُتْبَةَ بْنِ أَبِي وَقَّاصٍ، عَهِدَ إِلَيَّ أَنَّهُ ابْنُهُ، انْظُرْ إِلَى شَبَهِهِ، وَقَالَ عَبْدُ بْنُ زَمْعَةَ: هذَا أَخِي، يَا رَسُولَ اللهِ وُلِدَ عَلَى فِرَاشِ أَبِي مِنْ وَلِيدَتِهِ فَنَظَرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى شَبَهِهِ فَرَأَى شَبَهًا بَيِّنًا بِعُتْبَةَ، فَقَالَ: هُوَ لَكَ يَا عَبْدُ، الْوَلَدُ لِلْفِرَاشِ وَلِلْعَاهِرِ الْحَجَرُ، وَاحْتَجِبِي مِنْهُ يَا سَوْدَة بِنْتَ زَمْعَةَ فَلَمْ تَرَهُ سَوْدَةُ قَطُّ
أخرجه البخاري في: 34 كتاب البيوع: 100 باب شراء المملوك من الحربي وهبته وعتقه
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ సాద్ బిన్ అబీ వఖాస్ (రదియల్లాహు అన్హు)కు, హజ్రత్ అబ్ద్ బిన్ జమా (రదియల్లాహు అన్హు)కు మధ్య ఒక బాలుని విషయంలో తగాదా వచ్చింది. అప్పుడు హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! ఈ బాలుడు నా సోదరుడు ఉత్బాబిన్ అబీ వఖాస్ గారి కుమారుడు. ఈ పిల్లవాడు తన కొడుకని ఆయన స్వయంగా నా ముందు అంగీకరించాడు. కావాలంటే మీరు ఈ బాలుడ్ని (నా సోదరుని రూపురేఖలతో) పోల్చి చూడండి” అని అన్నారు.
ఆ తరువాత అబ్ద్ బిన్ జమా (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “దైవప్రవక్తా! ఈ బాలుడు నాకు తమ్ముడవుతాడు; నా తండ్రి పడకపై ఆయన దాసీ కడుపున పుట్టాడు” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త ﷺ సాద్ చెప్పిన సాక్ష్యం ప్రకారం చూస్తే ఆ బాలుడు అచ్చం ఉత్బాను పోలి ఉన్నట్లు కన్పించాడు.
అయినప్పటికీ దైవప్రవక్త ﷺ (సాద్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ “అబ్ద్! ఇతను నీవాడు(నీ తమ్ముడే). (చట్టం ప్రకారం) ఎవరి భార్య లేక దాసీ పడకపై సంతానం జన్మిస్తుందో అది అతని సంతానమే అవుతుంది. వ్యభిచారికి మిగిలేది రాళ్ళే (అంటే రాళ్ళ శిక్ష)” అని అన్నారు. ఆ తరువాత ఆయన (తన భార్య) హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా)ని సంబోధిస్తూ “సౌదా బిన్తె జమా! ఈ బాలుని ముందు నువ్వు పరదా పాటించు” అని చెప్పారు. అందువల్ల హజ్రత్ సౌదా(రదియల్లాహు అన్హా) ఆనాటి నుండి మరెన్నడూ అతని ముందు (పరదా లేకుండా) రాలేదు.
[సహీహ్. బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 100వ అధ్యాయం- షరాయిల్ మమ్లూకు మినల్ హరబి]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 922
హదీసు 923
حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْوَلَدُ لِصَاحِبِ الْفِرَاشِ
أخرجه البخاري في: 85 كتاب الفرائض: 18 باب الولد للفراش، حرة كانت أو أمة
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరి పడకపై సంతానం జన్మిస్తుందో అది అతని సంతానమే అవుతుంది.”★
[సహీహ్ బుఖారీ : 85వ ప్రకరణం – ఫరాయెజ్, 18వ అధ్యాయం – అల్ వలదిల్ ఫిరాషి హుర్రతన్ కానత్ అవామా]
★ అరబ్బులో ‘పడక’ (ఫిరాష్) అనే పదం సాధారణంగా మగవానితో సమాగమం జరిపిన స్త్రీని ఉద్దేశించి చెప్పబడుతుంది. అంటే భార్య లేక చట్ట బద్ధంగా సంక్రమించిన బానిసరాలు అని భావం. – (అనువాదకుడు)
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 923
11వ అధ్యాయం – పిల్లల సంబంధం విషయంలో శరీరాకృతిని బట్టి నిర్ణయం తీసుకోవడం
హదీసు 924
باب العمل بإِلحاق القائف الولد
حديث عَائِشَةَ، قَالَتْ: دَخَلَ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ وَهُوَ مَسْرُورٌ، فَقَالَ: يَا عَائِشَةُ أَلَمْ تَرَىْ أَنَّ مُجَزِّزًا الْمُدْلِجِيَّ دَخَلَ فَرَأَى أُسَامَةَ وَزَيْدًا، وَعَلَيْهِمَا قَطِيفَةٌ قَدْ غَطَّيَا رُؤوسَهُمَا، وَبَدَتْ أَقْدَامُهُمَا، فَقَالَ: إِنَّ هذِهِ الأَقْدَامَ بَعْضُهَا مِنْ بَعْضٍ
أخرجه البخاري في: 85 كتاب الفرائض: 31 باب القائف
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒక రోజు దైవప్రవక్త ﷺ అత్యంత సంతోషంతో నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు – “ఆయిషా! ఈ సంగతి నీకు తెలుసా? ముజజ్జజ్ ముద్లిజ్జీ★వచ్చినప్పుడు ఉసామా (రదియల్లాహు అన్హు), జైద్ (రదియల్లాహు అన్హు)లు ఇద్దరూ ఒకే దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారు. వారిద్దరి ముఖాలు దుప్పటిలో కప్పబడి ఉన్నాయి. కాని కాళ్ళు మాత్రం బయట ఉన్నాయి. ఆ స్థితిలో వాళ్ళను చూసి ‘వీరిద్దరి కాళ్ళు చూస్తుంటే ఒకరి కాళ్ళు మరొకరి నుండి వచ్చినట్లు కన్పిస్తున్నాయి’ అని అన్నాడు”.
[సహీహ్ బుఖారీ : 85వ ప్రకరణం – ఫరాయెజ్, 31వ అధ్యాయం – అల్‌ఖాయెఫ్]
★ ఇతను అరేబియాలో ఓ సుప్రసిద్ధ అవయవ సాముద్రికుడు.
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 924
12వ అధ్యాయం – పెళ్ళయిన పిదప పడుచు భార్య దగ్గర ఎన్ని రోజులు, పునర్వివాహిత దగ్గర ఎన్ని రోజులు ఉండాలి
హదీసు 925
باب قدر ما تستحقه البكر والثيب من إِقامة الزوج عندها عقب الزفاف
حديث أَنَسٍ، قَالَ: مِنَ السُّنَّةِ، إِذَا تَزَوَّجَ الرَّجُلُ الْبِكْرَ عَلَى الثَّيِّبِ، أَقَامَ عِنْدَهَا سَبْعًا، وَقَسَمَ؛ وَإِذَا تَزَوَّجَ الثَّيِّبَ عَلَى الْبِكْرِ، أَقَامَ عِنْدَهَا ثَلاَثًا، ثُمَّ قَسَمَ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 101 باب إذا تزوج الثيب على البكر
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-‘ఎవరైనా పునర్వివాహితురాలైన భార్య ఉండగా కన్యను చేసుకుంటే ఆ పడచు భార్య దగ్గర అతను ఏడు రోజులు గడిపి ఆ తర్వాత భార్యలందరి మధ్య సమానంగా వంతులవారీని పాటించాలి. ఒకవేళ కన్య అయిన భార్య ఉండగా, వితంతువునో లేక విడాకులు పొందిన స్త్రీనో చేసుకుంటే, ఆ భార్య దగ్గర మూడురోజులు గడిపి ఆ తర్వాత భార్యల నడుమ సమానంగా వంతుల వారీని పాటించాలి. ఇది ప్రవక్త సంప్రదాయం.
[సహీహ్ బుఖారీ: 67వ ప్రకరణం – నికాహ్, 101వ అధ్యాయం – ఇజా తజవ్వజుస్సయ్యిబ్ అలల్ బాకిర్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 925
13వ అధ్యాయం – ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క రోజు (పగలు, రాత్రి) కేటాయించాలి
హదీసు 926
باب القسم بين الزوجات وبيان أن السنة أن تكون لكل واحدة ليلة مع يومها
حديث عَائِشَةَ، قَالَتْ: كُنْتُ أَغَارُ عَلى اللاَّتِي وَهَبْنَ أَنْفُسَهُنَّ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَقُولُ: أَتَهَبُ الْمَرْأَةُ نَفْسَهَا فَلَمَّا أَنْزَلَ اللهُ تَعَالَى (تُرْجِى مَنْ تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوى إِلَيْكَ مَنْ تَشَاءُ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلاَ جُنَاحَ عَلَيْكَ) قُلْتُ: مَا أُرَى رَبَّكَ إِلاَّ يُسَارِعُ فِي هَوَاكَ
أخرجه البخاري في: 65 كتاب التفسير: 33 سورة الأحزاب: 7 باب قوله (ترجى من تشاء منهن)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ప్రారంభంలో నేను తమను తాము దైవప్రవక్త ﷺకు కానుకగా సమర్పించుకునే స్త్రీలను అసహ్యించుకుంటూ అది సిగ్గు చేటయిన విషయమని భావించేదాన్ని. స్త్రీ ఈ విధంగా తనను తాను (పురుషునికి) కానుకగా సమర్పించుకోవడం సమంజసమేనా అని ఆలోచించేదాన్ని. అయితే ఆ తర్వాత అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు – “(ప్రవక్తా!) నీ భార్యలలో నీ కిష్టమయిన వారిని నీతో పాటు ఉంచుకోవడానికి, నీ కిష్టంలేని వారిని నీ నుండి వేరు చేయడానికి నీకు పూర్తి అధికారం ఇవ్వబడుతోంది. అలాగే వేరు చేసిన భార్యలను తిరిగి నీ దగ్గరకు రప్పించుకోవడానికి కూడా నీకు అధికారం ఉంది. నీవు ఈ విధంగా చేయడంలో ఎలాంటి తప్పులేదు.” (అహ్జాబ్ : 51)
ఈ సూక్తి అవతరించినపుడు నేను దైవప్రవక్త ﷺతో “నేను గమనిస్తున్నాను, మీరు కోరుకున్నదల్లా మీ ప్రభువు వెంటనే ఆమోదిస్తున్నాడు” అని అన్నాను.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 33 – అహ్జాబ్ సూరా, 7వ అధ్యాయం – తుర్జీమన్తషా]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 926
14వ అధ్యాయం – స్త్రీ తన వంతును తన సవతికి కానుకగా సమర్పించుకోవచ్చు
హదీసు 927
باب جواز هبتها نوبتها لضرتها
حديث ابْنِ عَبَّاسٍ عَنْ عَطَاءٍ، قَالَ: حَضَرْنَا مَعَ ابْنِ عَبَّاسٍ جَنَازَةَ مَيْمُونَةَ بِسَرِفَ، فَقَالَ ابْنُ عَبَّاسٍ: هذِهِ زَوْجَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِذَا رَفَعْتُمْ نَعْشَهَا فَلاَ تُزَعْزِعُوهَا وَلاَ تُزَلْزِلُوهَا، وَارْفُقُوا، فَإِنَّهُ كَانَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تِسْعٌ، كَانَ يَقْسِمُ لِثَمَانٍ، وَلاَ يَقْسِمُ لِوَاحِدَةٍ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 4 باب كثرة النساء
హజ్రత్ అతా (రహిమహుల్లాహ్) కథనం:- మేము ‘సరిఫ్’ అనే ప్రాంతంలో హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)తో కలిసి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హు) గారి జనాజా (అంత్యక్రియలు)లో పాల్గొన్నాము. ఆ సందర్భంలో హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “ఈమె దైవప్రవక్త ﷺ గారి సతీమణి. కనుక మీరు ఈమె శవపేటికను ఎత్తుకొని మోసేటప్పుడు ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి. దాన్ని అటూ ఇటూ ఊపకుండా జాగ్రత్తగా ఎత్తుకొని నిదానంగా మోసుకెళ్ళాలి”. దైవప్రవక్త ﷺకు ఏకకాలంలో తొమ్మిద మంది భార్యలు ఉన్నారు, వారిలో ఎనిమిది మందికి ఆయన వంతుల్ని నిర్ణయించారు. ఒక భార్య (హజ్రత్ సౌదా-రజి)కు వంతు నిర్ణయించలేదు. (కారణం హజ్రత్ సౌదా(రదియల్లాహు అన్హా) వయస్సు మీద పడటం వల్ల తన వంతును హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)కు కానుకగా ఇచ్చేశారు.)
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 4వ అధ్యాయం – కస్రతున్నిసా]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 927
15వ అధ్యాయం – ధర్మపరాయణురాలైన స్త్రీని వివాహమాడటమే అత్యంత శ్రేయస్కరం
హదీసు 928
باب استحباب نكاح ذات الدين
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: تُنْكَحُ الْمَرْأَةُ َلأرْبَعٍ: لِمَالِهَا وَلِحَسَبِهَا وَجَمَالِهَا وَلِدِينِهَا، فَاظْفَرْ بِذَاتِ الدِّينِ، تَرِبَتْ يَدَاكَ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 15 باب الأكفاء في الدين
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “స్త్రీని సాధారణంగా నాలుగు విషయాల ప్రాతిపదికగా వివాహమాడుతారు. (1) ఆమె సిరి సంపదలు చూసి చేసుకుంటారు. (2) ఆమె కుటుంబం, వంశాలను చూసి చేసుకుంటారు. (3) ఆమె అందచందాలు చూసి చేసుకుంటారు. (4) ఆమె ధర్మపరాయణతను చూసి చేసుకుంటారు. కనుక మీరు ధర్మపరాయణురాలైన స్త్రీ ద్వారా సాఫల్యం పొందండి. లేకుంటే మీ చేతులకు మట్టి అంటుకుంటుంది. (చివరికి మీకు పశ్చాత్తాపమే మిగులుతుంది).”
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 15వ అధ్యాయం – అల్ అక్ఫాయి ఫిద్దీన్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 928
16వ అధ్యాయం – కన్యను చేసుకోవడమే మంచిది
హదీసు 929
باب استحباب نكاح البكر
حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: تَزَوَّجْتُ، فَقَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا تَزَوَّجْتَ فَقُلْتُ: تَزَوَّجْتُ ثَيبًا فَقَالَ: مَا لَكَ وَلِلْعَذَارَى وَلِعَابِهَا قَالَ مُحَارِبٌ (أَحَدُ رِجَالِ السَّنَدِ) : فَذَكَرْتُ ذلِكَ لِعَمْرِو بْنِ دِينَارٍ، فَقَالَ عَمْرٌو: سَمِعْتُ جَابِرَ بْنَ عَبْدِ اللهِ يَقُولُ: قَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: هَلاَّ جَارِيَةً تُلاَعِبُهَا وَتُلاَعِبُكَ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 10 باب تزويج الثيبات
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా(రదియల్లాహు అన్హు) కథనం:- నేను వివాహం చేసుకున్నప్పుడు దైవప్రవక్త ﷺ “నీవు ఎలాంటి స్త్రీని వివాహమాడావు?” అని అడిగారు. నేను ‘పునర్వివాహితను’ చేసుకున్నానని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త ﷺ “కన్యను చేసుకోవడంలో నీకే విషయం అడ్డు వచ్చింది? కన్యను చేసుకుంటే ఆమెతో నీవు ఆడుకుంటూ ఆనందం అనుభవించవచ్చు కదా!” అని అన్నారు.
హదీసు ఉల్లేఖకులలో ఒకరు ఈ హదీసుని గురించి అమ్ర్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్) ముందు ప్రస్తావించినపుడు ఆయన ఇలా అన్నారు:- నేను హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) నోట దైవప్రవక్త ﷺ అన్న ఈ మాటలు విన్నాను. అవి ఇలా ఉన్నాయి – “నీవు కన్యను ఎందుకు చేసుకోలేదు? కన్యను చేసుకొని ఉంటే ఆమెతో నీవు సరదాగా ఆడుకుంటూ ఆనందం అనుభవించవచ్చు కదా!”
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 10వ అధ్యాయం – తజ్వీజుస్సయ్యిబాత్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 929
హదీసు 930
حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: هَلَكَ أَبِي وَتَرَكَ سَبْعَ بَنَاتٍ أَوْ تِسْعَ بَنَاتٍ، فَتَزَوَّجْتُ امْرَأَةً ثَيِّبًا، فَقَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تَزَوَّجْتَ يَا جَابِرُ فَقُلْتُ: نَعَمْ فَقَالَ: بِكْرًا أَمْ ثَيِّبًا قُلْتُ: بَلْ ثَيِّبًا قَالَ: فَهَلاَّ جَارِيَةً تُلاَعِبُهَا وَتُلاَعِبُكَ وَتُضَاحِكُهَا وَتُضَاحِكُكَ قَالَ، فَقُلْتُ لَهُ: إِنَّ عَبْدَ اللهِ هَلَكَ وَتَرَكَ بَنَاتٍ، وَإِنِّي كَرِهْتُ أَنْ أَجِيئَهُنَّ بِمِثْلِهِنَّ، فَتَزَوَّجْتُ امْرَأَةً تَقُومُ عَلَيْهِنَّ وَتُصْلِحُهُنَّ، فَقَالَ: بَارَكَ اللهُ أَوْ خَيْرًا
أخرجه البخاري في: 69 كتاب النفقات: 12 باب عون المرأة زوجها في ولده
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:-మా నాన్నగారు చనిపోతూ ఏడుగురు లేక తొమ్మిది మంది ఆడపిల్లలను వదిలివెళ్ళారు. అందువల్ల నేను పునర్వివాహితను వివాహమాడాను. అప్పుడు దైవప్రవక్త ﷺ “జాబిర్! నువ్వు పెళ్ళి చేసుకున్నావా?” అని అడిగారు. నేను చేసుకున్నానని చెప్పాను. “అయితే కన్యను చేసుకున్నావా? లేక పునర్వివాహితను చేసుకున్నావా?” అని అడిగారు ఆయన మళ్ళీ. నేను పునర్వివాహితను చేసుకున్నానని చెప్పాను. “కన్యను ఎందుకు చేసుకోలేదు? కన్యను చేసుకుంటే నీవు ఆమెతో, ఆమె నీతో ఆడుకుంటూ, నీవు ఆమెను, ఆమె నిన్ను నవ్విస్తూ ఆనందంగా గడపవచ్చు కదా!” అన్నారు దైవప్రవక్త ﷺ. “మా నాన్న అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)గారు చనిపోతూ (చిన్న చిన్న) ఆడపిల్లలను వదలి వెళ్ళారు. నేను ఆయనలా అనుభవం లేని పడుచు పిల్లను తీసుకురావడం బాగుండదని భావించాను. అందువల్ల ఈ పిల్లలను (అంటే నా చెల్లెళ్ళను) పెంచి పోషిస్తూ తగిన విద్యాబుద్ధులు గరపగలిగే స్త్రీని పెళ్ళి చేసుకున్నాను” అని వివరించాను నేను. దైవప్రవక్త ﷺ ఈ మాటలు విని “అల్లాహ్ నీకు శుభం కలిగించుగాక” అన్నారు. లేక [“నీకు మేలు చేకూర్చుగాక”] “నీవు చాలా మంచి పని చేశావు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 69వ ప్రకరణం – అన్నుఫ్ఖాత్, 12వ అధ్యాయం – ఔనుల్ మరాతి జౌజహా ఫీవలదిహీ]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 930
హదీసు 931
حديث جَابِرٍ، قَالَ: كُنْتُ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي غَزْوَةٍ، فَلَمَّا قَفَلْنَا تَعَجَّلْتُ عَلَى بَعِيرٍ قَطُوفٍ، فَلَحِقَنِي رَاكِبٌ مِنْ خَلْفِي، فَالْتَفَتُّ فَإِذَا أَنَا بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ قَالَ: مَا يُعْجِلُكَ قُلْتُ: إِنِّي حَدِيثُ عَهْدٍ بِعُرْسٍ قَالَ: فَبِكْرًا تَزَوَّجْتَ أَمْ ثَيِّبًا قُلْتُ: بَلْ ثَيِّبًا قَالَ: فَهَلاَّ جَارِيَةً تُلاَعِبُهَا وَتُلاَعِبُكَ قَالَ: فَلَمَّا قَدِمْنَا ذَهَبْنَا لِنَدْخُلَ، فَقَالَ: أَمْهِلُوا حَتَّى تَدْخُلُوا لَيْلاً أَيْ عِشَاءً لِكَيْ تَمْتَشِطَ الشَّعِثَةُ وَتَسْتَحِدَّ الْمُغِيبَةُ وَفِي هذَا الْحَدِيثِ أَنَّهُ قَالَ: الْكَيْسَ الْكَيْسَ يَا جَابِرُ يَعْنِي الْوَلَدَ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 121 باب طلب الولد
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺతో పాటు ఒక దండయాత్రలో పాల్గొన్నాను. యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు నేను నిదానంగా నడిచే ఒక ఒంటెపై ముందుగానే బయలుదేరాను. (కొంచెం దూరం పోయేటప్పటికి) నా వెనకాల ఒక రౌతు వస్తూ నన్ను కలుసుకున్నాడు. నేను వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యచకితుణ్ణయ్యాను. నా ముందు దైవప్రవక్త ﷺ నిలబడివున్నారు. ఆయన నన్ను చూడగానే “నువ్వు అంత తొందరగా ఎందుకు బయలుదేరావు?” అని అడిగారు. “నేను కొత్తగా పెళ్ళి చేసుకున్నానండీ!” అన్నాను నేను. “అయితే కన్యను చేసుకున్నావా లేక పునర్వివాహితను చేసు కున్నావా?” అని అడిగారు ఆయన. నేను పునర్వివాహితను చేసుకున్నానని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త ﷺ “నీవు కన్యను ఎందుకు చేసుకోలేదు? కన్యను చేసుకుంటే నీవు ఆమెతో, ఆమె నీతో ఆడుకుంటూ ఆనందంగా గడపవచ్చు కదా!” అని అన్నారు.
చివరికి మేము మదీనా చేరుకున్నాము. మేము ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోబోతుంటే దైవప్రవక్త ﷺ మమ్మల్ని పిలిచి ఇలా అన్నారు; “ఆగండి. (అప్పుడే వెళ్ళ వద్దు) రాత్రి బాగా చీకటి పడిన తర్వాత అంటే ఇషా (నమాజు) వేళ అయిన తర్వాత ఇండ్లకు వెళ్ళండి. ఇలా ఆలస్యంగా వెళ్తే శిరోజాలు విరబూసుకొని ఉన్న స్త్రీలు చక్కగా తల దువ్వుకొని జడవేసుకుంటారు. భర్తలు దగ్గరలేని కారణంగా కొందరు స్త్రీలు నాభి క్రింది రోమాలను వదిలేసి ఉంటే వాటిని శుభ్రంగా తొలగించుకుంటారు”.
ఈ హదీసులోనే దైవప్రవక్త ﷺ హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు)తో ఇలా అన్నారు:- “జాబిర్! ఇప్పుడిక నీవు రమించి పిల్లల్ని పుట్టించాలి.”
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 121వ అధ్యాయం – తలబుల్ వలద్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 931
హదీసు 932
حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي غَزَاةٍ فَأَبْطَأَ بِي جَمَلِي وَأَعْيَا، فَأَتَى علَيَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: جَابِرٌ فَقُلْتُ: نَعَمْ قَالَ: مَا شَأْنُكَ قُلْتُ: أَبْطَأَ عَلَيَّ جَمَلِي وَأَعْيَا فَتَخَلَّفْتُ؛ فَنَزَلَ يَحْجُنُهُ بِمِحْجَنِهِ ثُمَّ قَالَ: ارْكَبْ فَرَكِبْتُ فَلَقَدْ رَأَيْتُهُ أَكُفُّهُ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: تَزَوَّجْتَ قُلْتُ: نَعَمْ، قَالَ: بِكْرًا أَمْ ثَيِّبًا قُلْتُ: بَلْ ثَيِّبًا قَالَ: أَفَلاَ جَارِيَةً تُلاَعِبُهَا وَتُلاَعِبُكَ قُلْتُ: إِنَّ لِي أَخَوَاتٍ، فَأَحْبَبْتُ أَنْ أَتَزَوَّجَ امْرَأَةً تَجْمَعُهُنَّ وَتَمْشُطُهُنَّ وَتَقُومُ عَلَيْهِنَّ؛ قَالَ: أَمَّا إِنَّكَ قَادِمٌ، فَإِذَا قَدِمْتَ فَالْكَيْسَ الْكَيْسَ ثُمَّ قَالَ: أَتَبِيعُ جَمَلَكَ قُلْتُ: نَعَمْ فَاشْتَرَاهُ مِنِّي بِأُوقِيَّةٍ، ثُمَّ قَدِمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَبْلِي، وَقَدِمْتُ بِالْغَدَاةِ، فَجِئْنَا إِلَى الْمَسْجِدِ فَوَجَدْتُهُ عَلَى بَابِ الْمَسْجِدِ قَالَ: آلانَ قَدِمْتَ قُلْتُ: نَعَمْ قَالَ: فَدَعْ جَمَلَكَ فَادْخُلْ فَصَلِّ رَكْعَتَيْنِ فَدَخَلْتُ فَصَلَّيْتُ؛ فَأَمَرَ بِلاَلاً أَنْ يَزِنَ لَهُ أُوقِيَّةً، فَوَزَنَ لِي بِلاَلٌ فَأَرْجَحَ فِي الْمِيزَانِ فَانْطَلَقْتُ حَتَّى وَلَّيْتُ، فَقَالَ: ادْعُ لِي جَابِرًا قُلْتُ الآنَ يَرُدُّ عَلَيَّ الْجَمَلَ، وَلَمْ يَكُنْ شَيْءٌ أَبْغَضَ إِلَيَّ مِنْهُ قَالَ: خُذْ جَمَلَكَ، وَلَكَ ثَمَنُهُ
أخرجه البخاري في: 34 كتاب البيوع: 34 باب شراء الدواب والحمير
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త ﷺతో పాటు ఒక దండయాత్రలో పాల్గొన్నాను. (తిరిగి వస్తున్నప్పుడు) నా ఒంటె బాగా అలసిపోయింది. అందువల్ల నేను వెనకబడిపోయాను. దైవప్రవక్త ﷺ నా దగ్గరికి వచ్చి “జాబిర్!” అని పిలిచారు. నేను “ఆ” అన్నాను. ఆయన “ఏమిటీ పరిస్థితి?” అని అడిగారు. “నా ఒంటె అలసిపోవడం వల్ల ఆలస్యమయి నేను వెనకబడిపోయాను” అని చెప్పాను నేను.
అప్పుడు దైవప్రవక్త ﷺ (ఒంటె నుంచి దిగి) తన దగ్గరున్న వంకర కర్రను నా ఒంటె మెడ మీద వేసి లాగి “ఇక ఎక్కు” అన్నారు. నేనప్పుడు ఎక్కగానే అది వేగం పుంజుకుంది. దైవప్రవక్త(ఒంటె) కంటే ముందుకు పోకుండా ఉండేందుకు నేను దాన్ని నిరోధించేవాడ్ని.
తర్వాత దైవప్రవక్త ﷺ మాట్లాడుతూ “నువ్వు పెళ్ళి చేసుకున్నావా?” అని అడిగారు. నేను చేసుకున్నానని చెప్పాను. “అయితే కన్యను చేసుకున్నావా? పునర్వివాహితను చేసుకున్నావా?” అని అడిగారు ఆయన. నేను “కన్యను కాదు పునర్వివాహితనే చేసుకున్నానని” చెప్పాను. “కన్యను ఎందుకు చేసుకోలేదు? కన్యను చేసుకుని ఉంటే నీవు ఆమెతో, ఆమె నీతో ఆడుకుంటూ ఆనందంగా గడపవచ్చు కదా!?” అని అన్నారు దైవప్రవక్త ﷺ. “కాని నాకు చాలా మంది (పసి వయస్కులయిన) చెల్లెళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళను పెంచి పోషిస్తూ, వాళ్ళకు తలదువ్వి జడలు వేస్తూ సరిగా చూసుకునే స్త్రీ అయితే బాగుంటుందని చేసుకున్నాను” అన్నాను నేను.
అప్పుడు దైవప్రవక్త ﷺ “సరే ఇప్పుడు నీవు ఇంటికి వెళ్తున్నావుకదా, వెళ్ళి రతి క్రీడ పట్ల ఏ మాత్రం విముఖత చూపరాదు సుమా!” అని హెచ్చరించారు. ఆ తర్వాత “నాకీ ఒంటెను అమ్ముతావా?” అని అడిగారు. నేను అమ్ముతానండీ అన్నాను. అప్పుడు దైవప్రవక్త ﷺ ఒక ఊఖియా వెండి ధరకు నా ఒంటెను కొన్నారు. ఆ తర్వాత ఆయన నాకంటే ముందే (మదీనా) చేరుకున్నారు. నేను మరుసటి రోజు చేరుకున్నాను. నేను మస్జిదులో ప్రవేశిస్తుంటే దైవప్రవక్త ﷺ నాకు ముఖద్వారం దగ్గర కన్పించి “ఇప్పుడు చేరుకున్నావా?” అని అడిగారు. నేను ఔనండీ! అన్నాను. “సరే, ఒంటెను ఇక్కడే కట్టేసి మస్జిదులోకి వెళ్ళి రెండు రకాతులు నమాజు చేసుకో” అన్నారు ఆయన.
నేను లోపలికి వెళ్ళి రెండు రకాతులు నమాజు చేశాను. అంతలో దైవప్రవక్త ﷺ హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ని పిలిచి, ఒక ఊఖియా వెండి తూచి నాకివ్వమని చెప్పారు. హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) నా కోసం వెండి తూచారు. కొంచెం ఎక్కువే తూచారు. నేను దాన్ని తీసుకొని బయలుదేరాను. అలా నేను వెనక్కి తిరిగానో లేదో “జాబిర్‌ని పిలవండి” అన్నారు దైవప్రవక్త ﷺ. (నా గుండె గుభేలుమన్నది) దైవప్రవక్త ﷺ నా ఒంటెను నాకు తిరిగిస్తారేమోనని భావించాను. ఆ ఒంటె అంటే నాకు అసహ్యం వేసింది. దైవప్రవక్త ﷺ నన్ను ఉద్దేశించి “నీ ఒంటెను తీసికెళ్ళు; దాని పైకం కూడా నువ్వే ఉంచుకో” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 34వ అధ్యాయం – షరాయిద్దవాబ్]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 932
18వ అధ్యాయం – స్త్రీల పట్ల సత్ప్రవర్తన
హదీసు 933
باب الوصية بالنساء
حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْمَرْأَةُ كَالضِّلَعِ، إِنْ أَقَمْتَهَا كَسَرْتَهَا، وَإِنِ اسْتَمْتَعْتَ بِهَا اسْتَمْتَعْتَ بِهَا وَفِيها عِوَجٌ
أخرجه البخاري في: 67 كتاب النكاح: 79 باب المداراة مع النساء
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “స్త్రీ ప్రక్కటెముక లాంటిది. మీరు ఆమెను సరిచేయడానికి ప్రయత్నిస్తే విరిగిపోతుంది. మీరామె ద్వారా ప్రయోజం పొందదలచుకుంటే ప్రయోజనం పొందండి. ఆమెలో ఉన్న వక్రత మాత్రం అలాగే ఉంటుంది.”
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 79వ అధ్యాయం – అల్‌ముదారతి మఅన్నిసా]
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 933
హదీసు 934
حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِي جَارَهُ، وَاسْتَوْصُوا بِالنِّسَاءِ خَيْرًا فَإِنَّهُنَّ خُلِقْنَ مِنْ ضِلَعٍ، وَإِنَّ أَعْوَجَ شَيْءٍ فِي الضِّلَعِ أَعْلاَهُ، فَإِنْ ذَهَبْتَ تُقِيمُهُ كَسَرْتَهُ، وَإِنْ تَرَكْتَهُ لَمْ يَزَلْ أَعْوَجَ، فَاسْتَوْصُوا بِالنِّسَاءِ خَيْرًا
أخرجه البخاري في: 67 كتاب النكاح: 80 باب الوصاة بالنساء
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “అల్లాహ్ ను, పరలోకాన్ని విశ్వసిస్తున్నవాడు తన పొరుగువారికి ఏ మాత్రం కష్టం కలిగించకూడదు. “మీరు స్త్రీల పట్ల మృదువుగా వ్యవహరించండి. స్త్రీలు ప్రక్కటెముకలతో సృజించబడ్డారు. ప్రక్కటెముకలలో కూడా అన్నిటికంటే ఎక్కువ వంకరగా ఉండే పై ఎముకతో సృజించబడ్డారు. (1) మీరు దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తే విరిగిపోతుంది. ఒకవేళ దాన్ని దాని మానాన వదిలేస్తే అది ఎల్లప్పుడూ వంకరగానే ఉంటుంది. అందువల్ల మీరు స్త్రీలతో మంచిగా (మృదువుగా) మసలుకోండి”.
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 80వ అధ్యాయం – అల్‌వసాతిన్ బిన్నిసా]
(1) మొట్టమొదట స్త్రీని తొలిమానవుడు ఆదం (అలైహిస్సలాం) ప్రక్కటెముకల నుండి సృష్టించడం జరిగిందన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. స్త్రీని ప్రక్కటెముకతో పోల్చడంలోని ఉద్దేశ్యం, సహజ సిద్ధమైన ఆమె శారీరక మానసిక తత్వానికి, ఆమె స్వాభావిక లక్షణాలకు అనుగుణంగా ఆమె పట్ల నేర్పుతో వ్యవహరించాలన్నదే. ఆమె పట్ల అతికరకుగా ప్రవర్తించకూడదు. అలా అని ఆమెను ఆమె మానాన వదిలిపెట్టడం కూడా మంచిది కాదు. మొత్తం మీద పురుషుల సత్ప్రవర్తన మీదనే స్త్రీల (నైతిక, సామాజిక) వికాసం ఆధారపడి ఉంటుందని ఈ హదీసు తెలియజేస్తోంది. – సంకలనకర్త
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 934
హదీసు 935
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَوْلاَ بَنُو إِسْرَائِيلَ لَمْ يَخْنَزِ اللَّحْمُ، وَلَوْلاَ حَوَّاءُ لَمْ تَخُنْ أُنْثَى زَوْجَهَا
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم صلوات الله عليه وذريته
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు:- “ప్రపంచంలో ఇస్రాయీల్ సంతతి గనక (యూదులు) లేకుంటే మాంసం కుళ్ళిపోయేది కాదు.(2) హజ్రత్ హవ్వా (అలైహిస్సలాం)యే గనక లేకుంటే ఏ స్త్రీ కూడా తన భర్తకు ద్రోహం తలపెట్టేది కాదు.”(3)
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖలఖ ఆదమ సలవాతిల్లాహి అలైహి వ జుర్రియ్యతిహీ]
(2) ‘మాంసం కుళ్ళేది కాదు’ అని హదీసులో అనబడింది కదూ! హజ్రత్ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం బనీ ఇస్రాయీల్ (ఇస్రాయీల్ వంశీయులు) ‘సల్వా’ మాంసాన్ని పేరాశతో పోగుచేసి పెట్టుకునేవారు. ఇలా చేయరాదని వారించినప్పటికీ వారు మానుకోలేదు. పర్యవసానంగా ఆ మాంసం కుళ్ళిపోయింది. మాంసం కుళ్ళటం అనేది కూడా అప్పటి నుండే మొదలయింది.
(3) ఇక హవ్వా గారి సంగతి. ఆమె గారు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ని నిషిద్ధ వృక్షం యొక్క పండు తినేందుకు ప్రోత్సహించింది. ఈ ‘గుణం’ ఆదం సంతతికి కూడా వారసత్వంగా సంక్రమించింది. అంతకు మించి ఇక్కడ ‘ద్రోహం’ అంటే విపరీతార్థం ఏమీలేదు.
మహా ప్రవక్త మహితోక్తులు|17. స్తన్య సంబంధిత ప్రకరణం|హదీసు 935
You must be logged in to post a comment.