ఏమరుపాటు ఎంత వరకు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[38:22 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫూర్ (హఫిజహుల్లాహ్) వైజాగ్

సూరా అల్ అంబియా

21:1 اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ
ప్రజల లెక్కల ఘడియ సమీపించింది [1]. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు.[2]

21:2 مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا اسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ
వారి వద్దకు వారి ప్రభువు తరఫు నుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు.[3] (ఆషామాషీగా తీసుకుంటారు).

ఫుట్ నోట్స్:

[1] లెక్కల ఘడియ అంటే ప్రళయదినం అని భావం. ఆ సమయం క్షణం క్షణం దగ్గర పడుతోంది. రాబోయే ప్రతి సమయం దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఆ మాటకొస్తే మృత్యువు కూడా ప్రతి వ్యక్తి పాలిట ఒక “ప్రళయం” లాంటిదే. అదలా ఉంచితే గడిచిపోయిన కాలం దృష్ట్యా ప్రళయ ఘడియ దగ్గరపడుతోంది. మిగిలి ఉన్న కాలం గడిచిన కాలం కన్నా చాలా తక్కువ.

[2] వారు ప్రాపంచిక వ్యామోహంలో పడి తీర్పుదినం కొరకు సమకూర్చుకోవలసిన “సామగ్రి’ పట్ల అశ్రద్ధ చూపుతున్నారు. విశ్వాసం (ఈమాన్‌) కోరే సద్గుణాలను అలవరచుకోవటంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వైముఖ్య ధోరణి వారి పాలిట హానికరంగా పరిణమిస్తుంది.

[3] ప్రజల అవసరాల దృష్ట్యా, వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల దృష్ట్యా వాటికి పరిష్కారంగా అవతరించే ఖుర్‌ఆన్‌లోని భాగాలను వారు చాలా తేలిగ్గా తీసుకుంటారు. వినీ విననట్లుగా, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ విన్నా దాన్ని వేళాకోళంగా తీసుకుంటున్నారు. ఆ ఉపదేశంపై వారు యోచన చేయరు. అది తమ సమస్యలన్నింటికీ సర్వోత్తమ పరిష్కారం అని వారు గ్రహించరు.

మూలం: అహ్సనుల్ బయాన్ నుండి

దున్యా (ఇహలోక జీవితం)

పరలోక చింతన

%d bloggers like this: