సూర్య చంద్ర గ్రహణ నమాజు విధిగా ఉందా? [5:56 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ బక్రా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఉండగా సూర్యగ్రహణం అయ్యింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మస్జిద్ లోకి ప్రవేశించారు. మేము కూడా ప్రవేశించాము. అప్పుడు రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం విడిచాడు. ఆ తరువాత (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఇలా) చెప్పారు: “ఏ ఒకరి చావు కారణంగా సూర్య చంద్ర గ్రహణాలు సంభవించవు. మీరొక వేళ సూర్యచంద్ర గ్రహణాలు చూస్తే అది విడే వరకు నమాజ్ చదవండి. అల్లాహ్ ను వేడుకోండి”. (బుఖారి 1040).
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్య గ్రహణం సంభవిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు నమాజ్ చేయించారు. నమాజులో చాలా దీర్ఘంగా ఖియాం చేసారు (నిలబడ్డారు). రుకూ కూడా సుదీర్ఘంగా చేసారు. మళ్ళీ ఎక్కువ సేపు ఖియాం చేశారు. అయితే మొదటిసారి కన్నా ఈ సారి కొంచెం తక్కువ సేపు ఖియాం చేశారు. అలాగే తిరిగి రుకూ చేశారు. అయితే మొదటి రకూ కన్నా కొంచెం తక్కువ సేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. ఆదే విధంగా ఆయన రెండవ రకాతులో కూడా చేశారు. (ఇలా నమాజ్ పూర్తి చేసి) ప్రజల వైపు తిరిగారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం పూర్తిగా వీడాడు. ఆ తరువాత ఖుత్బా ఇచ్చారు. అందులో ఆయన అల్లాహ్ స్తోత్రం తరువాత ఇలా అన్నారు: “సూర్యచంద్రులు, రెండూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో, లేక పుట్టడం వల్లనో సూర్యచంద్ర గ్రహణాలు సంభవించవు. సూర్యగ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని సంభవిస్తే మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. అల్లాహ్ మహిమ, ఔన్నత్యాలను కీర్తించండి. నమాజు చదవండి. దానధర్మాలు చేయండి”. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడటం జరిగితే, వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ పౌరుషం అల్లాహ్ కే వస్తుంది. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు”. (బుఖారి 1044, ముస్లిం 901).
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే “అస్సలాతు జామిఅ” అని ప్రజలను పిలవడం జరిగింది. (బుఖారి 1045, ముస్లిం 2942).
విశేషాలు:
1- సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తే “అస్సలాతు జామిఅ” అని పిలుపు ఇవ్వాలి.
2- అందరూ కలసి, జమాఅతుతో దీర్ఘమైన నమాజ్ చేయాలి.
3- ప్రతి రకాతులో రెండు ఖియాంలు మరియు రెండు రుకూలు చేయాలి.
4- నమాజ్ తరువాత ఇమాం ప్రసంగించాలి, బోధచేయాలి.
5- సత్కార్యాలు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి.
6- దుష్కార్యాల నుండి దూరముండడని హెచ్చరించాలి
7- అల్లాహ్ యొక్క జిక్ర్, స్మరణలు అధికంగా చేయమనాలి.
8- దానధర్మాలు అధికంగా చేయండని చెప్పాలి.
9- నవ్వులాట, వినోదంలో కాకుండా పరలోక చింతలో సమయం గడపాలి.
10- అధికంగా పాపాల మన్నింపుకై క్షమాభిక్ష కోరాలి (ఇస్తిగ్ఫార్ చేయాలి).
‘దిన చర్యల పాఠాలు‘ అనే పుస్తకం లోని వ్యాసం ఇది.
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సలాతుల్ ఖుసూఫ్ (సూర్య చంద్ర గ్రహణాల నమాజు) సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు
పెద్ద వీడియో [37 నిముషాలు]
సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు – పెద్ద వీడియో [37 నిముషాలు]
చిన్న వీడియో [15నిముషాలు]
సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు – చిన్న వీడియో [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
సూర్య గ్రహణము చంద్ర గ్రహణముల గురించి సైన్స్ మరియు ఇస్లాం ఏం చెబుతుంది!
ముందుగా సూర్య చంద్రగ్రహణాల పేరిట జరిగే మూఢనమ్మకాలు తెలుసుకుందాం!
మన ప్రాంతాల్లో దురాచారాలు, మూడనమ్మకాలు గ్రహణ సమయ్యాల్లో ఎక్కవ పాటిస్తారు. మన దేశ ఎలక్ట్రానిక్ మిడియా పనికట్టుకొని ప్రత్యేకంగా పండితులను పిలిపించి దాని ప్రత్యేక సమయాన్ని వేచిస్తారు. ప్రజల అమాయకత్వమే తమ బలంగా సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.
మన ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఇలా వుంటాయి:
1) గర్భవతులు గ్రహణం చూడరాదనటం. 2)గ్రహణం పట్టే సమయంలో సూర్య చంద్రకాంతి పడేచోట కూర్చోకూడదనడం. 3) కూరగాయాలు తరగడం, పండ్లు కోయడం వంటివి చేయకూడదనడం. అలా చేస్తే పదార్థాలు విషం చేస్తాయని భావించటం. 4) గర్భిణులను గ్రహణ సమయాల్లో ఇంటికే పరిమితం చేయటం. 5) తమ నివాస స్థలాల్లో సూర్యకాంతులు పడకుండా చూడటం 6) గర్భవతి గ్రహణ సమయాల్లో చూస్తే పిల్లలు అంగవైకల్యాలుగా పుడతారని భావించడం. 7)ఫలానా రాశివారికి లాభం, ఫలాన రాశి వారికి కీడని నమ్మటం. 8)గ్రహణ సమయం అయిపోగానే ఇంటిని శుభ్రంగా కడగడం. 9)ఇంకా మూఢన్మకాలు, బహుదైవ కార్యకలపాలకు పాల్పడటం వంటివి చేయటం.
నా సహోద సహోదరిమణులారా మూఢనమ్మకాలు పాటించకూడదు. లాభం నష్టం అనేది భూమ్యకాశాల సృష్టకర్త అయిన అల్లాహ్(దేవుడు) అధీనంలోనే ఉన్నాయి. అలాగే బహుధైవరాధనను అన్ని మత గ్రంధాలు ఖండిస్తున్నాయి. బహుధైవరాధన అనేది క్షమించరాని నేరం!!
సైన్స్ సూర్య చంద్రగ్రహణాల గురించి ఏం చెబుతుంది:
చంద్రగ్రణాల ద్వారా గర్బణిలకు ఎటువంటి ప్రమాదం లేదని, అలాగే తిను పదార్దాలు చెడిపోవటం అధిక ఉష్ణోగ్రతలు 35 – 40 వరకు ఉండటమేనని తేల్చింది. అలాగే గ్రహణాల ఏర్పాటు అనేది ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే అని కూడా చెప్పింది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి.
ఇలా మనకు గ్రహణాల సబబు తెలిసిందని నిర్భయంగా ఉండలేము. చీకట్లు క్రమ్ముకొని ఉన్న ప్రపంచాన్ని కాంతితో నింపే అంతటి శక్తి సూర్యునిలో అల్లాహ్ యే ఇచ్చాడు, తాను కోరినప్పుడు ఏదో సబబు కలుగజేసి ఆ కాంతిని తీసేసుకుంటున్నాడు, పగటి వేల చీకటిగా చేస్తున్నాడు, అలాగే చంద్రుణ్ణి కూడా అందుకే ఆ అల్లాహ్ తో భయపడాలి. ఈ గ్రహణాల సందర్భంలో ఏమి చేయాలని ఆదేశించాడో అవి చేయాలి. అప్పుడే మనం ఇహపరాల మోక్షం పొందుతాము.
ఇస్లాం సమాచారం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
527. హజ్రత్ అబూ మస్వూద్ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
“సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్నమ్స్]
528. హజ్రత్ అబూమూసా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్ష(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే “ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిదుకు వెళ్ళి (కుసూఫ్) నమాజు చేశారు. అందులో ఖుర్ఆన్ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్హంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రసంగించారు.
“ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్ స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్కుసూఫ్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.