https://youtu.be/SP78J9l4YSA [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1282. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
ఒక వ్యక్తి కపటి అవడానికి మూడు ఆనవాళ్ళు ఉంటాయి –
1) మాట్లాడినపుడు అతడు అబద్ధం చెబుతాడు.
2) వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
3) అతని దగ్గర ఏదన్నా అప్పగింత (అమానతు)గా పెడితే అందులో ద్రోహానికి పాల్పడతాడు (బుఖారీ, ముస్లిం).
బుఖారీ, ముస్లింల లోనే అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనంలో ఇలా వుంది: “పోట్లాటకు దిగినపుడు తిట్ల పురాణం మొదలెడతాడు.”
సారాంశం: ఈ హదీసులో ‘కపటి” యొక్క నాలుగు గుర్తులు సూచించబడ్డాయి. “వాడు నమాజ్ చేసినప్పటికీ, ఉపవాసాలు పాటించినప్పటికీ తాను ముస్టింనని అతను ప్రకటించుకున్నప్పటికీ” (ఈ లోపాలు మాత్రం అతనిలో ఉంటాయి) అని ‘ముస్లిం’లో అదనంగా ఉంది. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సందర్భంగా ఇలా అంటున్నారు – “చాలామంది పరిశోధకులైన విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఈ అవలక్షణాలు కపటులలో ఉండేది నిజమే, కాని ఒక నికార్సయిన విశ్వాసిలో కూడా ఈ అవలక్షణాలు జనిస్తే అతను కూడా ‘కపటిలాంటివాడు” గానే భావించబడతాడు. అంటే అతని స్వభావాన్నిబట్టి ఆ పదం అతని కోసం ప్రయోగించ బడుతుంది.
కపటత్వం కు (నిఫాఖ్) సంబంధించిన క్రింది లింకులు చదవండి:
- Hypocrisy – అన్నిఫాఖ్ – కపటత్వం – النفاق
- నిఫాఖ్ (కపటత్వం) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- అన్నిఫాఖ్ – కపటత్వం – ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3