నెలవంకను చూసినప్పుడు (ముఖ్యంగా రమజానులో), ఈ దుఆ చేయడం మర్చిపోవద్దు [ఆడియో]

నెలవంకను చూసినప్పుడు (ముఖ్యంగా రమజానులో), ఈ దుఆ చేయడం మర్చిపోవద్దు
https://youtu.be/kXubOTNK6-Y [1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పూర్తి దుఆ నేర్చుకోకపోయినా, కనీసం క్రింద ఇచ్చిన చిన్న దుఆ నేర్చుకోండి:

అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామ్

ఓ అల్లాహ్ ఈ చంద్రోదయాన్ని మా కొరకు శుభప్రదమైనదిగా, విశ్వాసముతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయుము

పూర్తి దుఆ ఇక్కడ చదవండి/నేర్చుకోండి :
https://teluguislam.files.wordpress.com/2022/12/hisn-al-muslim-zafarullah-chap-67.pdf

Good English link to watch:
Don’t Forget to Make This Du’ā When Ramadhān Arrives – Shaykh ‘Abdurrazzāq al Badr [Ar|En Subtitles]

ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కావచ్చు

తల్హా బిన్ ఉబైదుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. తదుపరి అందులో ఒక వ్యక్తి ఎక్కువగా ఆరాధనలు చేసేవాడు, అల్లాహ్  మార్గంలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఇక రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు, మొదటి వ్యక్తి మరణించిన 1 సం॥ తర్వాత మరణించాడు. 

తల్హా (రదియల్లాహు అన్హు) కథనం:  ఈ రెండవ వ్యక్తి, వీరమరణం పొందిన మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించడం నేను కలలో చూశాను. మరుసటి రోజు ఉదయం ఈ కలను నేను ప్రజల ముందు ప్రస్తావించగా వీరు దీనిపై ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: “ఆ రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి మరణించాక 1 సం॥ పాటు బ్రతికి లేడా? దానిలో అతను రమజాన్ మాసాన్ని పొందాడు, దాని ఉపవాసాలు పాటించాడు మరియు 1 సం॥ పాటు నమాజులు (అదనంగా) చదివాడు. అందుకే వీరిద్దరి మధ్య (స్వర్గంలో) దూరం- భూమ్యాకాశాల మధ్య వున్న దూరమంత వుంది”. (సహీ ఉల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ : 1316) 

ఈ హదీసుపై కాస్త దృష్టి సారించండి! 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. అందులో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కన్నా ఎక్కువగా ఆరాధించేవాడు మరియు వీరమరణం పొందాడు. ఇక రెండవ వ్యక్తి – మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మరియు సహజ మరణం పొందాడు. మరి ఇతను మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలోకి ఎలా ప్రవేశిచగలిగాడు? దానికి కారణం ఏమిటంటే – ఇతను మొదటి వ్యక్తి వీరమరణం పొందాక 1 సం॥ పాటు బ్రతికి వున్నాడు. ఈ వ్యవధిలో ఇతనికి రమజాన్ మాసం ప్రాప్తించింది. అందులో ఇతను ఉపవాసాలు వున్నాడు మరియు సం॥ అంతా నమాజులు చదివాడు. ఇలా, ఉపవాసాలు మరియు నమాజుల కారణంగా వీర మరణం పొందిన వాని కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించాడు…. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే శుభప్రద రమజాన్ మాసాన్ని పొంది, దానిలో ఉపవాసాలు పాటించడం అనేది అల్లాహ్ ఇచ్చే గొప్పవరం. 

మీరు ఓ విషయం ఆలోచించండి! మన స్నేహితులలో, బంధువులలో ఎంతో మంది గత రమజాన్ మాసంలో మనతో కలిసివున్నారు. కానీ ఈ రమజాన్ మాసం రావడానికి ముందే వారు లోకం విడిచి వెళ్ళిపోయారు. వారికి ఈ శుభప్రదమాసం ప్రాప్తం కాలేదు. కానీ మనకు అల్లాహ్ – జీవితాన్ని మరియు ఆరోగ్యాన్నిచ్చి దానితోపాటు శుభప్రదమైన ఈ మాసాన్ని కూడా ప్రసాదించాడు. తద్వారా మనం చిత్త శుద్ధితో మన పాపాలకు గాను పశ్చాత్తాపం చెంది మన సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్ ను  సంతృప్తి పరచుకోవచ్చు…. మరి ఇది అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్పవరం కాదా? 

అలాగే – ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కూడా కావచ్చు. మరుసటి రమజాన్ వచ్చే వరకు మనం కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు! అందుకే (అల్లాహ్ ప్రసాదించిన) ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరుచుకొని దాని శుభాలను ప్రోగు చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుండాలి. 

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా నుండి తీసుకోబడింది:
శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం | జాదుల్ ఖతీబ్

శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్య అంశాలు:
 

  • 1) రమజాన్ మాసాన్ని పొందడం గొప్పవరం. 
  • 2) రమజాన్ మాసపు ప్రత్యేకతలు. 
  • 3) రమజాన్ మాసంలో తప్పనిసరి ఆచరణలు ఉపవాసం మరియు దాని మహత్యం, ఖియాం, దాన ధర్మాలు, దివ్య ఖురాన్ పఠనం, దుఆలు, జిక్ర్ (స్మరణ), అస్తగ్ ఫార్ . 
  • 4) ఉపవాసం మర్యాదలు. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

అల్లాహ్ అనుగ్రహం మరియు కృప వల్ల శుభప్రద రమజాన్ మాసం ఆరంభమైనది. అందుకే మనమంతా మరోసారి మన జీవితంలో ఈ శుభప్రద మాసాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపాలి. ఇది ఎలాంటి మాసమంటే – అల్లాహ్ దానిలో స్వర్గపు ద్వారాలు తెరుస్తాడు, నరక ద్వారాలను మూసివేస్తాడు, మానవులను ఇతర రోజుల్లోలాగా భ్రష్టు పట్టించకుండా షైతానును బంధిస్తాడు. ఇంకా, ఈ నెలలోనే అల్లాహ్ అత్యధికంగా తన దాసులను నరకాగ్ని నుండి విముక్తి అనే బహుమతిని ప్రసాదిస్తాడు, దీనిలోనే ఆయన తన దాసులను మన్నించి వారి పశ్చాత్తాపాన్ని, ప్రార్థనలను స్వీకరిస్తాడు. అందుకే ఇలాంటి మహత్తరమైన మాసాన్ని పొందటం నిజంగా అల్లాహ్ ప్రసాదించిన గొప్పవరం. ఈ మాసపు ప్రాధాన్యత, ఔన్నత్యాలను మనం సలఫుస్సాలిహీన్ (మొదటి మూడు తరాల సజ్జనులు)ల ఆచరణను బట్టి అంచనా వేయవచ్చు. వారు ఇలా ప్రార్థించేవారు: 

ఓ అల్లాహ్! మాకు శుభప్రద రమజాన్ మాసాన్ని ప్రసాదించు”. తదుపరి రమజాన్ మాసం గడిచాక వాళ్ళు ఇలా ప్రార్థించే వారు – “ఓ అల్లాహ్ ఈ నెలలో మేము చేసిన ఆరాధనలను స్వీకరించు”. ఎందుకంటే ఈ నెల ఎంత ముఖ్యమైనదో వారికి తెలుసు కాబట్టి. (లతాయెఫుల్ మారిఫ్: 280వ పేజీ) 

అందుకే మనం కూడా ఈ మాసపు విశిష్టతను అర్థం చేసుకొని, దీనిలోని శుభాల ద్వారా ప్రయోజనం పొందాలి. 

రమజాన్ చివరి దశకం [వీడియో]

బిస్మిల్లాహ్

రమజాన్ చివరి దశకం (10 రోజులు)
( లైలతుల్ ఖద్ర్, తరావీహ్, తహజ్జుద్, నమాజ్ , ఎతికాఫ్, ఖురాన్ పారాయణం, దుఆ, ఇస్తిగ్ఫార్)

అబూ బక్ర్ బేగ్ ఉమ్రీ (హఫిజహుల్లాహ్) (అధ్యాపకులు మర్కజ్ ఇబాదుర్రహ్మాన్, ఏలూరు)

[34:34 నిముషాలు]

 ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

 

%d bloggers like this: