
[4:21 నిముషాలు]
ఈమాన్ (విశ్వాసం), దాని మూలస్థంబాలు
https://teluguislam.net/2019/08/21/belief-eman-pillars/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్ (అల్లాహ్ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త (సల్లల్హాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).
You must be logged in to post a comment.