[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/prophets-character
[PDF [27 పేజీలు]
ఖుత్బాయందలి ముఖ్యాంశాలు:
- (1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాల గురించి ఖురాన్ మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం.
- (2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి అనేక మంది సహాబాల సాక్ష్యం.
- (3) అత్యుత్తమ గుణగణాల నమూనాలు.
ఇస్లామీయ సహోదరులారా! నేటి జుమా ఖుత్బా యొక్క అంశం – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు”.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల్ని చర్చించే ముందు మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అవడంతో పాటు దైవప్రవక్త లందరికీ నాయకులు (ఇమామ్). ప్రవక్త పాలనా పోషణలు స్వయంగా అల్లాహ్ చూస్తాడు. ఇలా అతణ్ణి, నిత్యం పరిశుద్ధం చేస్తూ గుణగణాల్లో, నైతికతలో అందరికన్నా ఉత్తముడిగా, ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రవక్త సంరక్షకుడు స్వయానా అల్లాహ్ కనుక దివ్య ఖురాన్లో రెండు విషయాలపై ఒట్టేసి మరీ ఆయన ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“నూన్- కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే సాక్షిగా! (ఓ ముహమ్మద్)! నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కాదు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో వున్నావు”. (ఖలమ్ : 1-4)
ప్రవక్త ఎల్లప్పుడూ దైవ వాణి (వహీ)ని అనుసరిస్తాడు. కనుక ఆ దైవవాణే వాస్తవానికి అతని నైతికత, గుణగణాలు అయివుంటాయి. అందుకే ఓ సారి ఆయెషా (రజి అల్లాహు అన్హతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల గురించి అడగ్గా ఆమె జవాబిస్తూ – ఆయన గుణగణాలు స్వయానా దివ్య ఖురానే అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ – సహీఉల్ అర్నావూత్)
అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖురానుకు ఆచరణా ప్రతిబింబము అన్నమాట.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల సాక్ష్యం కేవలం ఖురానులోనే కాదు, మునపటి ఆకాశ గ్రంథాలలో కూడా లభ్యమై వుంది.
అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: “నేనొక సారి అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ను కలిసి ఆయనతో – తౌరాత్ లో వివరించబడ్డ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను గూర్చి వివరించండి- అని అడిగాను. ఆయన జవాబిస్తూ – సరే, అల్లాహ్ సాక్షి! దివ్య ఖురానులో వివరించబడ్డ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని గుణగణాలే తౌరాత్ లోనూ వివరించబడ్డాయి.
దివ్య ఖురాన్లో ఇలా వుంది: ‘ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్తాహరుడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాము.’ తౌరాత్ లో కూడా ఈ గుణగణాలు వివరించబడ్డాయి. వీటితో పాటు తౌరాత్ లో ఇంకా ఆయన అరబ్బుల కోసం కోటగా వుంటారని, ఆయన నా(అల్లాహ్) దాసులు మరియు ప్రవక్త అని, ఆయన పేరు ‘ముతవక్కల్’ (అల్లాహ్ పై నమ్మకం వుంచేవాడు) అని నేను పెట్టాను – అని వుంది. ఇంకా ఆయన గుణగణాల్లో ఇవి కూడా వివరించబడ్డాయి – ఆయన దుర్గుణులు, కఠినులు కారు మరియు బజార్లలో గొంతెత్తి సంభాషించరు. చెడును చెడుతో సమాధానం ఇవ్వకుండా, దానిని ఉపేక్షించి క్షమిస్తారు అని వివరించారు. (బుఖారీ : 4838)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలను గూర్చి దివ్య ఖురాను మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం తర్వాత మరి కొందరి సాక్ష్యం కూడా వినండి!
Read More “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు | జాదుల్ ఖతీబ్”
You must be logged in to post a comment.