الأصول الثلاثة– تلغو
ఈ పుస్తక రచయిత: ఇమాం ముహమ్మద్ తమీమీ రహిమహుల్లాహ్
అనువాదకర్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ 28పేజీలు]
యూట్యూబ్ ప్లే లిస్ట్: (23 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3sKIkLUrdBOs1lCFaW2b0U
విషయసూచిక
- 1. నాలుగు విషయాల జ్ఞానం విధి
- 2. మూడు విషయాల జ్ఞానం విధి
- 3. మిల్లతె ఇబ్రహీం అంటే ఏమిటి?
- 4. ఉసూలే సలాస ఏమిటి? నీ ప్రభువు ఎవరు?
- 5. నీవు నీ ప్రభువును ఎలా గుర్తించావు?
- 6. ఆరాధన రకాలు & దుఆ ఆధారాలు
- 7. ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం, భరోసా)
- 8. రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూఅ (నమ్రత)
- 9. ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిగాస (మొరపెట్టుకొనుట)
- 10. జిబహ్ (బలిదానం), నజ్ర్ (మ్రొక్కుబడి)
- 11. ఆధారాలతో ఇస్లాం ధర్మ పరిచయం
- 12. లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క దలీల్, నిజ అర్ధం
- 13. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క దలీల్ & భావం
- 14. నమాజ్, జకాత్, ఉపవాసం & హజ్ యొక్క దలీల్
- 15. ఈమాన్, దాని భాగాలు, మూల సూత్రాలు, దలీల్
- 16. ఇహ్ సాన్, దాని దలీల్
- 17. హదీసె జిబ్రీల్: ఇస్లాం, ఈమాన్ & ఇహ్ సాన్ యొక్క దలీల్
- 18. మూడవ సూత్రం – నీ ప్రవక్త ఎవరు?
- 19. హిజ్రత్ (వలసపోవుట)
- 20. ప్రవక్త ﷺ వారి మదీనా జీవితం
- 21. మరణానంతర జీవితం
- 22. ప్రవక్తలు ఎందుకు వచ్చారు?
- 23. తాగూత్ వివరణ
﷽
1వ పాఠం – నాలుగు విషయాల జ్ఞానం విధి
అల్లాహ్ నిన్ను కరుణించుగాక! 4 విషయాలు నేర్చుకొనుట మనపై విధి అని తెలుసుకో! (1) ఇల్మ్, (2) అమల్, (3) దఅవత్, (4) సబ్ర్ .
- ఇల్మ్ (విద్య, జ్ఞానం); అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం గురించి (ఖుర్ఆన్, హదీసుల) ఆధారాలతో తెలుసుకొనుట.
- అమల్ (తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆచరించుట).
- దఅవత్ (ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించుట).
- సబ్ర్ (ఏ కష్టం, ఆపద ఎదురైనా ఓపిక, సహనాలు వహించుట).
వీటన్నిటికి దలీల్ (ఆధారం) ఇది:
وَالْعَصْـرِ (1) إِنَّ الْإِنسَانَ لَفِي خُسـْرٍ (2) إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3)
కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).
ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم
“అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది“
ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
فَاعْلَمْ أَ نَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ واسْتَغْفِرْ لِذَنبِكَ
“కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో, నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు“. (ముహమ్మద్ 47:19).
ఈ ఆయతులో వాచ,కర్మ కంటే ముందు జ్ఞానం ప్రస్తావన ఉంది.
Read More “త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ”