కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః
ఓ ప్రవక్తా! ఇలా అను: తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (జుమర్ 39: 53).
అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు. (జుమర్ 39: 53).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net

ఓ విశ్వాసులారా! “అల్లాహ్ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.
మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు.
(1) మీకు ఇవ్వ బడిన సిలబస్(తౌబా – 9: 40) వివరణ ప్రకారం దైవప్రవక్త (ﷺ) వారితో పాటుగా గుహలో ఉన్న రెండవ వ్యక్తి (సహచరుడు) ఎవరు? A) అబూబక్ర్ సిద్దీక్ (రజియల్లాహు అన్హు) B) అలీ (రజియల్లాహు అన్హు) C) అబూహురైరా (రజియల్లాహు అన్హు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారు: తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట”. (బుఖారి 2654, ముస్లిం 87).
అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు. దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరడం (తౌబా చేయడం) తప్పనిసరి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
“… ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.”
షిర్క్ లో ఒక రకం పెద్ద/ఘోరమైన షిర్క్ (షిర్కె అక్బర్). ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది. తౌబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటాడు. ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ఈ రకమైన షిర్క్ యొక్క కొన్ని రూపాలు తర్వాత పాఠాల్లో వస్తూ ఉన్నాయిః వేచించండీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]
249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).
250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).
అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి
నేను మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.
[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]
251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”
[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]
252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).
253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).
[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తౌబా, ఇస్తిగ్ ఫార్ ప్రాముఖ్యత
తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయడంలో తప్పులు, పొరపాట్లు తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయడంలో జాప్యం చేయడం తౌబా, ఇస్తిగ్ ఫార్ గురించిన సందేహాలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి: పశ్చాత్తాపం (తౌబా) [PDF]
హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:
విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి, దాసుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడటానికి మూడు షరతులు ఉన్నాయి.
ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి.
రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి,
మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి.
ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపించినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు.
ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు నిబంధనలున్నాయి.
పై మూడు నిబంధన లతో పాటు నాల్గవ నిబంధన ఏమిటంటే, అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయితే వారి శిక్షను తాను అనుభవించాలి లేదా క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్ణి నిర్దోషిగా నిలబెట్టాలి.
అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. ఏవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే అహ్లే సున్నత్ వారి దృష్టిలో ఆయా విషయాల్లో అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి.
పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై ఖుర్ఆన్ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ ఉంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్ – ౩7)
మరోచోట అల్లాహ్ ఉపదేశిస్తున్నాడు : “మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్ – ౩)
ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలండి.” (తహ్రీమ్ – 8)
13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:
“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)
ముఖ్యాంశాలు:
1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమయిన పొరపాట్లు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్బైకన్నా ఎక్కువసార్లు పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా ఉపేక్షించబడతాం!
2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది.
14. హజ్రత్ అగర్ర్ బిన్ యసార్ ముజనీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“ప్రజలారా! పాపాలపై పశ్చాత్తాపభావంతో అల్లాహ్ వైపుకు మరలండి. మన్నింపు కోసం ఆయన్ను వేడుకోండి. నేను అల్లాహ్ సన్నిధిలో రోజుకు వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి పోతూ ఉంటాను.”
(సహీహ్ ముస్లింలోని ధ్యాన ప్రకరణం)
15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్ అబూ హంజా అనస్ బిన్ మాలిక్ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“తన దాసుడు పాపాలపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్, ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.” (బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. (వెతికి వేసారి) నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్పైపోయి “ఓ అల్లాహ్! నీవే నా దాసుడివి, నేనునీ ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు.
1.పై హదీసులో కూడా పశ్చాత్తాపం ప్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి నొక్కి వక్కాణించటం జరిగింది.
2. దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు.
3. అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం చేసి మరీ చెప్పటం ధర్మసమ్మళమే.
5. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు.
16. హజ్రత్ అబూ మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ అష్అరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్పోధించారు:
“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి వేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్ పగటిపూట తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ పరంపర) సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంతవరకూ (అంటే ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు తూనే ఉంటుంది.” (ముస్లిం)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగిపోతే ఏమాత్రం జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో మోకరిల్లాలి.
17. హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సమ్మతించి ఆమోదిస్తాడు.” (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ధ్యానం, ప్రార్ధనల ప్రకరణం)
ముఖ్యాంశాలు:
నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ మరలింపునే ‘తౌబా‘ (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం.
“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.”
ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. (సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం ఆమోదించబడుతుందన్న అధ్యాయంలో ఈ హదీసు ప్రస్తావించ బడింది)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్ధం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్ హదీసుల మాదిరిగా “హసన్” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.