ప్రళయంరోజున అల్లాహ్ రోజులను వారి రూపాల్లో లేపుతాడు. జుమా రోజును చాలా అందంగా మెరుస్తూ లేపుతాడు [ఆడియో]

ప్రళయంరోజున అల్లాహ్ రోజులను వారి రూపాల్లో లేపుతాడు. జుమా రోజును చాలా అందంగా మెరుస్తూ లేపుతాడు
https://youtu.be/VbIVhcUW0_Q [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సయ్యిదినా అబూ మూసా అష్అరీ (రజియల్లాహు అన్ హు) వారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా బోధించారు:

إنَّ اللهَ يَبْعَثُ الأيامَ يومَ القيامةِ على هَيْئَتِها ،
ప్రళయం రోజున అల్లాహ్ (వారంలోని ఏడు) రోజులను వారి (నిర్దిష్ట) రూపాల్లో లేపుతాడు.

و يَبْعَثُ يومَ الجمعةِ زَهْرَاءَ مُنِيرَةً ،
మరియు జుమా (శుక్రవారం) రోజును చాలా అందంగా మెరుస్తూ లేపుతాడు.

أهلُها يَحُفُّونَ بِها كَالعَرُوسِ تُهْدَى إلى كَرِيمِها ،
వధువును వరుడి వద్దకు పంపించేటప్పుడు, వధువు స్నేహితురాళ్ళు ఆమెను చుట్టుముట్టుకున్నట్లుగా, జుమా హక్కును చెల్లించినవారు జుమాను చుట్టుముట్టుకుంటారు.

تُضِيءُ لهُمْ ، يَمْشُونَ في ضَوْئِها ،
అది వారి కోసం వెలుగునిస్తుంది, వారు ఆ వెలుగులో నడుస్తూ ఉంటారు.

أَلْوَانُهُمْ كَالثَّلْجِ بَياضًا ،
వారి సువాసన కస్తూరిలా పరిమళిస్తూ ఉంటుంది.

يَخُوضُونَ في جبالِ الكَافُورِ ،
వారు కర్పూరపు సుగంధ భరితమైన పర్వతాల మధ్య ఆనందిస్తూ ఉంటారు

ينظرُ إليهِمُ الثَّقَلانِ ، ما يُطْرِقُونَ تَعَجُّبًا، حتى يَدْخُلوا الجنةَ ،
వారు స్వర్గంలోకి ప్రవేశించే వరకు మానవులు, జిన్నాతులు ఆశ్చర్యంగా తమ చూపులను వారి వైపు ఎత్తకుండా ఉంటారు.

لا يُخَالِطُهُمُ أحدٌ إلَّا المؤذِّنُونَ المُحْتَسِبُونَ
నమాజుకు పిలిచే ముఅజ్జిన్లు తప్ప మరెవరూ వారికి లభించే ఈ ప్రతిఫలానికి చేరుకోలేరు.

(సహీహ్ ఇబ్ను ఖుజైమః 1/182/1, ముస్తద్రక్ హాకిమ్ 1/277, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీహా 706లో దృఢమైన సనదు అని పేర్కొన్నారు, ఇమామ్ హాకిమ్ వారు సహీహ్ గ వర్గీకరణ చేశారు. అలాగే సహీహుల్ జామి 1872లో కూడా ప్రస్తావించారు)

    తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11) [వీడియో]

    బిస్మిల్లాహ్
    తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)

    [49 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

    జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
    https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

    ఇమాం వెనుక జుహ్ర్, అస్ర్ నమాజు చివరి రెండు రకాతులలో సూరహ్ ఫాతిహా తో పాటు ఇంకొక సూరా కూడా చదవవచ్చా? [వీడియో]

    బిస్మిల్లాహ్

    [1:32 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

    వీడియో పాఠాలు

    ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 12: సామూహిక నమాజ్, పంక్తుల విషయం, ఖస్ర్, జమ్అ [వీడియో]

    బిస్మిల్లాహ్

    [68 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

    ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
    శుద్ధి & నమాజు [పుస్తకం]

    సామూహిక నమాజ్:

    ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

    إِذَا أُقِيمَتْ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ. (مسلم ).

    “ఏ నమాజ్ యొక్క ఇఖామత్ అయ్యిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు”. (ముస్లిం 710).

    జహరీ([1]) నమాజులో ముఖ్తదీ([2]) నిశబ్దంగా

     ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

    (لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ).

    “సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)

    పంక్తుల విషయం:

    ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి

    వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః        لاَ صَلاَةَ  لِفَردٍ خَلفَ الصَّف

    “పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).

    వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).

    మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

    (خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

    “పురుషుల మేలయిన పంక్తి మొదటిది. చెడ్డది చివరిది. స్త్రీలకు మేలయిన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

    మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః

    (إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ).

    “కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసేవారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 676).

    పంక్తులను సరి చేసుకొని, నమాజీలు దగ్గరదగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

    (سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاة)

    “మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).

    ఖస్ర్:

    ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.

    ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.

    స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.

    ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.

    జమ్అ:

    జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).

    ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.

    అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.

    అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.


    [1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.

    [2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.  


    ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

    జుమా రోజు మసీదుకు పిల్లలను తీసుకువచ్చే వారికి కొన్ని సూచనలు [వీడియో]

    బిస్మిల్లాహ్

    [2 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

    జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
    https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

    ఇతరములు:

    ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 13 – వ్యాదిగ్రస్తుని (రోగి) నమాజ్, జుమా నమాజ్, పండుగ నమాజ్ [వీడియో]

    బిస్మిల్లాహ్

    [32 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

    ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
    శుద్ధి & నమాజు [పుస్తకం]

    వ్యాదిగ్రస్తుని నమాజ్:

    నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

    (صَلِّ قَائِمًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ).

    “నీవు నిలబడి నమాజ్ చేయి. శక్తి లేనిచో కూర్చుండి చేయి. ఈ శక్తి లేనిచో పరుండుకొని చేయి”. (బుఖారిః 1117).

    జుమా నమాజ్:

    జుమా నమాజ్ వాజిబుంది. అది చాలా గొప్ప దినము. వారము రోజుల్లో అది చాలా ఘనతగల రోజు. అల్లాహ్ ఆదేశం:

    [يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] {الجمعة:9}

    {విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).

    జుమా ప్రత్యేకతలు:

    స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.

    జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.

    జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

    (مَنْ قَرَأ سُورَةَ الْكَهفِ كَانَتْ لَهُ نُورًا يَومَ الْقِيَامةِ مِن مَقَامِهِ إِلى مَكَّةَ وَمَنْ قَرَأ عَشْرَ آيَاتٍ مِنْ آخِرِهَا ثُمَّ خَرَجَ

    الدَّجَّالُ لَمْ يَضُرُّه).

    “ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”. (అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).

    ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.

    (إِذَا جَاءَ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَقَدْ خَرَجَ الْإِمَامُ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ).

    “మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).

    ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.

    ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.

    పండుగ నమాజ్

    పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.

    పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).

    పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.


    ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

    తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 71 [ఆడియో]

    బిస్మిల్లాహ్

    Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 71
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
    ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

    ఇస్లామిక్ క్విజ్ 71వ భాగం సిలబస్ : మొదట క్రింద వీడియో విని ఆ తరువాత ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నించండి

    తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 71- [15:41 నిముషాలు]

    (1) యూదులు తమ మతాచారులను (అహ్’బార్) లను మరియు క్రయస్టవులు తమ సన్యాసులను (రుహ్’బాన్) లను ప్రభువులుగా చేసుకునేవారా?

    A] అవును చేసుకునే వారు
    B] చేసుకునే వారుకాదు
    C] ప్రవక్తలుగా చేసుకునే వారు

    (2) అల్లాహ్ కు అతి దగ్గఱి మరియు ప్రత్యకులుగా ఉండేందుకు ఇప్పుడు మనం ఎవరి జాబితాలోకి చేరాలి?

    A] అస్’హాబుల్ కహఫ్
    B] అహ్’లుల్ కితాబ్
    C] అహ్’లుల్ ఖుర్ఆన్

    (3) జుమానాడు దువా స్వీకరించబడే రెండు ప్రత్యేక శుభ ఘడియలలో నుండి ఒకటి ఈ క్రింది వాటిలో ఒకటి ఉంది అదేమిటి?

    A] ఫజర్ నుండి జుమా అజాన్ వరకు గల సమయం
    B] ఇమామ్ ప్రసంగించేందుకు వేదికపై కూర్చున్నప్పటి నుండి జుమా నమాజు ముగిసే మధ్య సమయం వరకు
    C] గురువారం మగ్రిబ్ నుండి శుక్రవారం సూర్యోదయం వరకు

    ఇతరములు :

    తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
    https://teluguislam.net/others/telugu-islamic-quiz

    సూర కహఫ్ తిలావత్ ఘనత, ముఖ్యంగా జుమా (శుక్రవారం) రోజు [వీడియో]

    బిస్మిల్లాహ్

    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
    ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

    జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు

    • జుమాకు సంబంధించిన ఆడియో, వీడియోలు, ఆర్టికల్స్ , పుస్తకాలు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ప్రయోజనం పొందండి మరియు మీ స్నేహితులకు మరియు బంధుమిత్రులకు పంపించండి.
      https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

    సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
    https://teluguislam.net/tafsir-kahf/

    ఖురాన్ మెయిన్ పేజీ
    https://teluguislam.net/quran

    సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
    https://teluguislam.net/2020/06/25/18-al-kahf

    శుక్రవారం (జుమా) రోజు సురయే కహఫ్ పారాయణం ఘనత [ఆడియో]

    బిస్మిల్లాహ్

    ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [1:32 నిమిషాలు]

    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
    ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

    kahaf-1

    kahaf-2

    పై రెండు హదీసులు : “మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]”నుండి
    08. ఖురాన్ మహాత్యాల పుస్తకం (కితాబ్  ఫధాయిల్ అల్ -ఖురాన్) (47 పేజీలు)

    ఇతరములు: 

    ఒక పల్లెలో మస్జిద్ ఉండదు, ఒక ఇంట్లో జుమా నమాజు జరుపుకోవచ్చా? [ఆడియో]

    బిస్మిల్లాహ్

    ఒక పల్లెలో మస్జిద్ ఉండదు, వేరే వాళ్ళ ఇంట్లో జుమ్మా జరుగుతుంది అలా చెయ్యచ్చా చెయ్యకూడదా!

    [3:32 నిమిషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
    ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

    జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
    ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
    https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

    %d bloggers like this: