షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

”నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువు గానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు”. (సూరా ఫాతిర్‌: 06)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

”నిశ్చయంగా షైతాన్‌ మనిషి నరాల్లో రక్తం వలె ప్రవహిస్తుంటాడు”. (బుఖారీ)

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (33 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఈ ఆడియో లో క్రింది విషయాలు వివరించబడ్డాయి:

 • అల్లాహ్ యొక్క జిక్ర్ 
 • షిర్క్  నుండి  & పాపకార్యాల నుండి దూరముండుట 
 • అల్లాహ్ పై బలమైన విశ్వాసం మరియు నమ్మకం 
 • వివిధ సందర్భాలలో దుఆలు పఠించడం 
 • ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చదివే దుఆ చదవడం 
 • 100 సార్లు “లా ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు …” చదవడం 
 • మితి మీరిన కోపానికి దూరముండుట, కోపం వచ్చినప్పుడు “అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీమ్” చదువుట  
 • సూరా అల్ ఫలఖ్ , సూరా అల్ నాస్ చదవడం 
 • ఇంట్లో ప్రవేశించేటప్పుడు , తినేముందు, తాగేముందు బిస్మిల్లాహ్ తో ప్రారంభించడం 
 • ఇంట్లో సురా బఖర చదవడం 
 • నిద్ర పోయే ముందు “అయతుల్ కుర్సీ” చదవడం 
 • నిద్ర పోయే ముందు సురా బఖర చివరి రెండు అయతులు చదవడం 
 • మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు చేసే దుఆ చేసుకోవడం 

జిన్నాతుల యొక్క పెరుగుదల

షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :

‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’

[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]

من أقوال ابن العثيمين رحمه  الله

  ولمَّا غفل النَّاس عن الأوراد الشَّرعية كثرت فيهم الجنُّ الآن، وتلاعبت بهم .

لقاء الباب المفتوح ١٩٧

తెలుగు అనువాదం: teluguislam.net

నుండి: https://followingthesunnah.com/2019/10/18/the-increase-of-jinn/

%d bloggers like this: