
129. ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు
248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]
249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).
250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).
أَسْتَغْفِرُ اللهَ الْعَظِيمَ الَّذِي لَا إِلَهَ إلَّا هُوَ الحَيُّ القَيُّومُ وأَتُوبُ إِلَيْهِ
అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి
నేను మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.
[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]
251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”
[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]
252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).
253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).
[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]
ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు) అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
You must be logged in to post a comment.