తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

2వ అధ్యాయం
తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

القول السديد شرح كتاب التوحيد – للشيخ السعدي

ఏకత్వపు బాటకు సత్యమైన మాట
(అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ
Al-Qawl as-Sadid sharh Kitab at-Tawhid – Imam as-Sa’di
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

[ఇక్కడ పుస్తకం చదవండి/డౌన్లోడ్ చేసుకోండి]

ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

విషయ సూచిక:

1. ఏకత్వపు బాటకు సత్యమైన మాట

2. తౌహీదు ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం

3. తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గం లో చేరుతారు

4. షిర్క్ నుండి భయపడుట

5. “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట

6. తౌహీదు మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము

7.కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు వాటిలాంటివి ధరించుట షిర్క్

8. మంత్రాలు మరియు తాయత్తుల విషయం లో వచ్చిన ఆదేశాలు

9. చెట్లు, రాళ్ళతో శుభం (తబర్రుక్) కోరుట

10. అల్లాహ్ యేతరుల కొరకు జిబాహ్(జంతు బలిదానం)

11. అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబాహ్ చేసే చోట , అల్లాహ్ కొరకు జిబాహ్ చేయరాదు

12. అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కు కొనుట షిర్క్

13. అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్

14. అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టు కొనుట షిర్క్

15. అల్లాహ్ ఆదేశం: ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకో లేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా? (7:ఆరాఫ్: 191, 192).

16. అల్లాహ్ ఆదేశం: చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు. (34: సబా:23).

17. సిఫారసు (షఫాఅత్)

18. అల్లాహ్ ఆదేశం: ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించ లేవు. (28: ఖసస్:56).

19. ఆదమ్ సంతానంలో కొందరు ధర్మాన్ని విడనాడి అవిశ్వాసంలో పడిపోవుటకు కారణం పూర్వ పుణ్య పురుషుల ప్రేమలో “గులువ్వు” చేయడం, అంటే హద్దు మీరటం.

20. పుణ్యపురుషుని సమాధి వద్ద అల్లాహ్ యొక్క ఆరాధన చేయుట చాలా కఠినంగా నివారించబడితే ఇక పుణ్యపురుషున్ని ఆరాధించేవాని గతి ఏమిటి?

21. పుణ్య పురుషుల సమాధుల విషయంలో హద్దు మీరుట (గులువ్వు) వలన ఆ సమాధులు విగ్రహాలుగా మారుతాయి.

22. తౌహీదును రక్షించుటకు, షిర్క్ వరకు చేర్పించే ప్రతీ దారిని మూసివేయుటకు ప్రవక్త చేసిన కృషి.

23.ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు.

24. ఇంద్రజాలం.

25. ఇంద్రజాలం యొక్క కొన్ని రకాలు.

26. జోతిష్యం మరియు అలాంటి పనులు.

27. ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలం చేయబడిన వ్యక్తి చికిత్స.

28. అపశకునం.

29. జోతిష్య శాస్త్రం.

30. నక్షత్ర బలంతో వర్షం కురిసింది అని నమ్ముట .

31. అల్లాహ్ ఆదేశం: ప్రజలలో కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్ధులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. (2:బకరా:165).

32. వాస్తవానికి తన మిత్రుల గురించి ఉరకే మిమ్మల్ని భయపెట్టింది షైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే, ఇకముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి.(3: ఆలె ఇమ్రాన్:175).

33. మీరు విశ్వాసులైతే కేవలం అల్లాహ్ పై నమ్మకం ఉంచండి.(5: మాఇద:2).

34. ఏమిటీ, ఈ ప్రజలు అల్లాహ్ యుక్తి అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది.(7: ఆరాఫ్: 99).

35. విధివ్రాతపై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం

36. ప్రదర్శనా బుద్ధి 

37. మానవుడు తాను చేసే సత్కార్యంతో ప్రాపంచిక లాభం పొందాలని ఉద్దేశించుట కూడా ఒక రకమైన షిర్క్ 

38. హలాల్ ను హరాం మరియు హరాంను హలాల్ చేయు పండితులకు, పాలకులకు విధేయత చూపుట (అల్లాహ్ ను త్యజించి) వారిని ప్రభువులుగా చేసుకొనుటయే

39. ప్రవక్తా! “నీ వద్దకు పంపబడిన గ్రంధాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము” అని ప్రకటన అయితే చేసి, (తమ వ్యవహారాల) పరిష్కారం కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి ‘తాగూత్’ను తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. (నిసా 4:60)

40. అల్లాహ్ నామాలను, గుణ విశేషణాలను తిరస్కరించువాడు 

41.అల్లాహ్ ఆదేశం: “వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు” (నహ్ల్ 16:83)

42.అల్లాహ్ ఆదేశం: “మీరు తెలిసి కూడా ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకండి” (బఖర 2:22)

43. అల్లాహ్ నామ ప్రమాణంతో తృప్తి చెందని వ్యక్తి గురుంచి ఆదేశం 

44. “అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు” అని పలుక వచ్చునా?

45. కాలాన్ని దూషించువారు, వాస్తవంగా అల్లాహ్ ను బాధ పెట్టేవారే 

46. ఖాజియుల్ ఖుజాత్ లాంటి బిరుదులు ధర్మ సమ్మతమేనా?

47. అల్లాహ్ నామాల పట్ల గౌరవం మరియు అందుకోసం పేరు మార్చుట 

48. ఖుర్ఆన్, ప్రవక్త మరియు అల్లాహ్ వచనములతో పరిహాసం 

49. అల్లాహ్ ఆదేశం: “కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, ‘నేను అసలు దీనికి అర్హుణ్ణే” (హామీమ్ అస్-సజ్డా  41:50)

50. అల్లాహ్ ఆదేశం: “అప్పుడు అల్లాహ్ వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు.కానీ వారు అయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయనకు భాగస్వామ్యులుగా చేయసాగారు” (ఆరాఫ్ 7:190)

51. అల్లాహ్ ఆదేశం: “అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేసుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదిలి పెట్టండి” (ఆరాఫ్ 7:180)

52. “అల్లాహ్ కు సలాం” అని చెప్పరాదు 

53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని చెప్పరాదు 

54. “నా దాసుడు, నా దాసి” అని పిలువరాదు 

55. అల్లాహ్ పేరుతో యాచించే వారిని వట్టి చేతులతో పంపకూడదు 

56. అల్లాహ్ పేరుతో కేవలం స్వర్గమే అడగాలి.

57. ‘ఒకవేళ’ ‘అట్లైనచో’, ‘ఇలా చేసి ఉంటే’ లాంటి పదాలు ఉపయోగించుట.

58. గాలిని దూషించుట నివారించబడినది.

59. అల్లాహ్ ఆదేశం: అల్లాహ్ ను గురించి అఙాన భూయిష్టమైన, సత్యదూరమైన, అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే:”ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకు ఏదైనా భాగం ఉందా?” వారికి ఇలా చెప్పు: ” (ఎవరికీ ఏ భాగము లేదు) ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలూ అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి”. (ఆలె ఇమ్రాన్ 3:154)

60. విధి వ్రాతను తిరస్కరించువారు 

61. ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు 

62. అధికంగా ప్రమాణాలు చేయుట 

63. అల్లాహ్ మరియు అయన ప్రవక్తతో చేయబడిన వాగ్దానం 

64. అల్లాహ్ పై ప్రమాణం చేయుట 

65. తన దాసుల ఎదుట అల్లాహ్ ను సిఫారసుగా చేయుట ఎంత మాత్రం సమ్మతం కాదు 

66. ప్రవక్త ద్వారా తౌహీద్ రక్షణ మరియు షిర్క్ మార్గాలను మూసివేయుట 

67. అల్లాహ్ ఆదేశం: “వారు అసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువ నివ్వలేదు. ప్రళయ దినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది.ఆకాశాలు అయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు అయన ఎంతో అతీతుడు” (జుమర్ 39:67)