అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/NQSq]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం

బిస్మిల్లాహ్

అపశకునాల నమ్మకాలు కలిగిన ప్రజలు పూర్వపు కాలం నుండి ఈ రోజు వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొ విధమైన నమ్మకం. కనుక కొంత మంది రాహు కాలాన్ని నమ్ముతారు. ఆ కాలానికి అనుగుణంగా తమ జీవితాలను గడుపుతారు. ఇంకా కొంత మంది గర్బవతి చనిపోతే అపశకునంగా భావించి, ఆమె అంతక్రయలు జరపకుండా కాకులు, గద్దలు పెక్కు తినుట కొరకు ఊరు బయట ఆమె దేహాన్ని పడేసిన సంఘటనలు ఉన్నాయి. మరియు కొంత మంది ప్రజలు ఉదయాన్నే వితంతువు ఎదురుపడితే అపశకునంగా భావిస్తారు. ఒకవేళ తమ అమ్మ లేక చెల్లి లేక కూతురు విధవరాలు ఉంటే, వారిని కూడా ఎదురుగా రాకూడదని నివారిస్తారు. మరియు కొందరు వారి నివాసాలను ఇంటి వరండాలకే  పరిమితం చేస్తారు.

మరియు కొందరు ఇంటి నుండి బయలదేరేటప్పుడు పిల్లి గనుక ఎదురు వస్తే, లేక ఎవరైనా వారి ముందు తుమ్మినట్లయితే అపశకునంగా భావిస్తారు. తిరిగి ఇంట్లోకి పోయి కొన్ని నిమిషాలు కూర్చొన్న తరువాత తమ పనిపై బయలదేరుతారు. మరియు వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే “వీధి పోటు” అని అపశకునంగా భావించేవారు కూడా ఉన్నారు. మరి కొంత మంది తమ ఇంటి వాస్తు సరిలేక పోతే, దానిని అపశకునంగా భావించి కట్టిన ఇల్లును కూలదీసిన సంఘటనలు లేకపోలేదు.

సూర్య గ్రహణాన్ని, చంద గ్రహణాన్ని కూడా అపశకునంగా నమ్ముతారు. గర్భిణీలపై వాటి ఛాయ పడితే పుట్టబోయే పిల్లలు గుడ్డివారిగానో, కుంటివారిగానో పుట్టుతారని భావిస్తారు. మరియు ఫలానా తేదిలలో లేక సమయాలలో పిల్లలు జన్మిస్తే భాగ్యవంతులు కారని, కాన్పు కాక మునుపే సిజేరియన్ చేసి కడుపులో నుండి పిల్లలను బయటకు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరియు గ్రహణాల ప్రభావం దేవాలయాలపై ఉంటుందని పూజారులు నమ్ముతారు. కనుక వారు దేవాలయాలను సైతం మూసివేస్తారు.

మరియు కొంత మంది ప్రజలు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్నిబట్టి వారు శకునాలుగా నమ్ముతారు. తాము అనుకున్న దిశలో గాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావిస్తారు. లేక అనుకున్న దిశలో ఎగిరిపోతే మంచి శకునంగా భావిస్తారు. ఇలా రక రకాల శకునాల నమ్మకాలు దేశ విదేశాల సమాజ ప్రజలలో విస్తరించి ఉన్నాయి.

ఇస్లామీయ ధర్మం ప్రకారం అపశకునం అనేది లేనే లేదు. మరియు లాభ నష్టాల అధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ  లేదు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఓ ప్రవకా! ఇలా అను: “మరియు అల్లాహ్‌ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిది చేయగల సమర్థుడు.”(సూరతుల్‌ అన్ఆమ్‌:17)

మరొకచోట ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ

“ఒక వేళ అల్లాహ్‌ నీకు ఏదైన ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అను(గహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు” (సూరత్  యూనుస్‌:107)

మరొకచోట ఇలా ఉంది:

إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

“అల్లాహ్‌ నాకు కీడు చేయదలుచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్)  నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్‌ చాలు! ఆయన (అల్లాహ్)ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు.” (సూరతు జుమర్‌:38)

హజ్రత్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్బాస్‌ (రధియల్లాహు అన్హు) కథనం: నేను ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వాహనంపై ఆయన వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు:

“ఓ అబ్బాయి! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతాను. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో (అల్లాహ్‌ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉండు) అల్లాహ్‌ నిన్ను గుర్తుంచుకుంటాడు. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో, ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు (అల్లాహ్‌ సహాయం నీ కొరకు నిత్యం ఉంటుంది). నీవు అర్ధించ దలుచుకున్నప్పుడు అల్లాహ్‌నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే, అల్లాహ్‌నే సహాయం కోసం అర్ధించు. జా(గత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్‌ నీ కోసం వ్రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒక వేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్‌ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమి అది కలిగించజాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (విధివ్రాత (వాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది.”

(తిర్మిజీ: 2516, సహీహుల్‌ జామీ : 7957)

హజత్‌ బురైదా (రధియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) : “దుశ్శకునాలు చూసేవారు కాదు” (అబూదావూద్‌:3920).

కునమైనా  అపశకునమైనా, దౌర్చాగ్యమైనా, కలిమి అయినా- లేమి అయినా అంతా అల్లాహ్‌ చేతుల్లోనే ఉన్నాయనీ, అమాయుకులను, అన్యం పుణ్యం తెలియని జంతువులను, నెలలను, దినాలను లేక సమయాలను దోషులుగా నిలబెట్టడం అర్ధం పర్ధం లేని విషయమేననీ మనం తెలుసుకోవాలి.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 75 -78). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ


షిర్క్ (బహుదైవారాధన) దేనినంటారు? దాని నష్టాలు ఎలా ఉంటాయి? [వీడియో]

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/dUGq]

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

క్రింద ఇచ్చిన లింకులు కూడా చదవండి: 

అతి పెద్ద పాపం ఏమిటి?

biggest sin

అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం

78. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

“సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక్కడ అన్యాయం అంటే మీరు సాధారణంగా భావిస్తున్న అన్యాయం కాదు, ఈ సూక్తిలో అన్యాయం అంటే షిర్క్ (బహుధైవారాధన) అని అర్ధం. (ఖుర్ ఆన్ లో) హజ్రత్ లుఖ్మాన్ (అలైహిస్సలాం) తన కుమారునికి హితభోద చేస్తూ ‘కుమారా! అల్లాహ్ కి ఏ శక్తినీ సాటి కల్పించకు. అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం’ అని పలికిన మాటలు మీకు తెలియవా?”

[సహీహ్ బుఖారీ : 60 వ ప్రకరణం – అంబియా, 41 వ అధ్యాయం – ఖౌలుల్లాహ్ తాలా వలఖద్ ఆతైనా లుఖ్మాన్]

విశ్వాస ప్రకరణం : 53 వ అధ్యాయం – అవిశ్వాసులు తమ అవిశ్వాస జీవితంలో చేసిన సత్కార్యాలకు ఇస్లాం స్వీకరణ తరువాత పుణ్యఫలం లభిస్తుందా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

“ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు ..

70. హజ్రత్ సాబిత్ బిన్ జహాక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “

  • ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు).

  • తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు.
  • ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రళయదినాన అతడ్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది.
  • విశ్వాసిని హత్యచేయడం ఎంత ఘోరమైన పాపమో, అతడ్ని దూషించడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. అలాగే అతనిపై సత్యతిరస్కార (కుఫ్ర్) అపనిందను మోపడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. (*)

(*) ఇది ఒక హెచ్చరికగా, మందలింపుగా పేర్కొనబడింది. నవవి (రహ్మలై) గారి ప్రకారం మనిషి హృదయాలలో ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే అతను అవిశ్వాసి కాజాలడు. ఒకవేళ అతని హృదయంలో ఇస్లాం కి బదులు ఇతర ధర్మాల పట్ల ఔన్నత్యభావం ఉంటే అతను తప్పకుండా అవిశ్వాసి అవుతాడు.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 44 వ అధ్యాయం – మాయన్హా మినస్సిబాబివల్లాన్]

విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్నవాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లిం కే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం

46. హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్ని (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు ఆఇహి వసల్లం) మాతో కలిసి హుదైబియా ప్రాంతంలో ఉదయం నమాజు చేశారు. రాత్రి వర్షం కురిసింది. ఉదయం వరకు నేల తడిగానే ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగిసిన తరువాత అనుచరుల వైపుకు తిరిగి, “అల్లాహ్ ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. “దేవునికి, దైవప్రవక్తకే బాగా తెలుసు. మాకు తెలియదు” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త ఈ విధంగా తెలిపారు –

“అల్లాహ్ ఇలా అన్నాడు – ఈ రోజు ఉదయం నా దాసులలో కొందరు విశ్వాసులయిపోయారు, మరి కొందరు అవిశ్వాసులయిపోయారు. దేవుని దయవలన మనకు వర్షం కురిసింది అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 156 వ అధ్యాయం – యస్తగ్ బిలుల్ ఇమామున్నాస ఇజా సల్లమ్]

విశ్వాస ప్రకరణం – 30 వ అధ్యాయం – తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్