వుదూ – Wudhu

ుదూ (కాలకృత్యాలు) ׃

(నిరూపణ ఖుర్ఆన్ ద్వారా) {المائدة:6}

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى المَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الكَعْبَيْنِ]

దివ్యఖుర్ఆన్ అల్ మాయిద 5׃6 “యా అయ్యుహల్లదీన ఆమనూ ఇదా ఖుమ్ తుమ్ ఇలస్సలాతి ఫగ్ సిలూ వుజూహకుమ్ వ ఐదియకుమ్ ఇలల్ మరాఫిఖి వమ్ సహూ బి రుఊసికుమ్ వ అర్ జులకుమ్ ఇలల్ కఅఁబైన్” – “ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజుకొరకు లేచినప్పుడు మీ ముఖాలను మరియు  మోచేతుల వరకు చేతులను కడుక్కోండి, తలపై తడి చేతులతో తుడవండి, కాళ్ళను చీలమండాల వరకు కడుక్కోండి”

ుదూ ప్రాముఖ్యత ׃

ముస్లిం హదీథ్ గ్రంథం׃ అన్ అబూ హురైర రదియల్లాహు అన్హు అన్నన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల “ఇదా తవద్దాఅల్ అబ్దుల్ ముస్లిము అవిల్ ముఅమిను (1) ఫగసల వజ్ హహు ఖరజ మిన్ వజ్ హిహ కుల్లు ఖతీఅతిన్ నజర ఇలైహా బిఐనైహి మఅల్ మాఇ ఔ మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ, (2) ఫఇదా గసల యదైహి ఖరజ మిన్ యదైహి కుల్లు ఖతీఅతిన్ కాన బతషత్ హా యదాహు మఅఁల్ మాఇ ఔ  మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ. (3) ఫఇదా గసల రిజ్ లైహి ఖరజత్ కుల్లు ఖతీఅతిన్ మషత్ హా రిజ్ లాహు మఅఁల్ మాఇ ఔ మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ హత్తా యఖ్రుజ నఖియ్యమ్మినద్దునూబ్”

అనువాదం׃ అబి హురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – ఎప్పుడైతే ముస్లిం (అల్లాహ్ దాసుడు) వుదూలో తన ముఖం కడుగునో అప్పుడు ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని అతను (తన) కళ్ళతో చూచినటువంటి (చిన్న) పాపాలన్నీ కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు చేతులను కడుగునో తన రెండు చేతులతో చేసినటువంటి (చిన్న) పాపాలన్నీ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు కాళ్ళను కడుగునో తన రెండు కాళ్ళ సహాయంతో అతను నడిచివెళ్ళి చేసినటువంటి (చిన్న) పాపాలన్నియూ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. తుదకు వుదూతో అతను పూర్తిగా పరిశుద్ధుడతాడు.

అబూ దావూద్ హదీథ్ గ్రంథం ׃ అన్ అలీ బిన్ అబి తాలిబ్ రదియల్లాహు అన్హు ఖాల – ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “మిఫ్ తాహుస్సలాతిత్తుహూర్” – అలీ బిన్ అబితాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – నమాజు యొక్క తాళం చేవి పరిశుభ్రతయే.

ుదూ యొక్క నిబంధనలు ׃

 1. పరిశుభ్రతా సంప్రాప్త సంకల్పం (మనస్సులో) చేసుకోవలెను
 2. స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని వినియోగించవలెను
 3. వుదూనందు శుభ్రపరచవలసిన శరీరాంగములను ఏదేని వస్తువు కప్పి ఉంచినట్లైతే దానిని తొలగించవలెను. ఉదా,, చేతిలో టైట్ గా ఉండి నీరు చొరబడనీయని స్థితిలో ఉన్న గడియారము, క్రీడాకారుల చేతిబంధం.

ుదూ ప్రత్యేకతలు׃ అంటే వుదూ నందు గల విధులు, పద్ధతులు(సున్నతులు)

ుదూ నందు గల విధులు (తప్పకుండా చేయవలసినవి

 1. ముఖం పూర్తిగా కడగాలి (నీరు పుక్కలించడం, గర్ గర చెయ్యడం, ముక్కును శుభ్ర పరచడం కూడా చెయ్యాలి)
 2. రెండు చేతులను మోచేతుల వరకు కడగాలి
 3. తల మరియు చెవులు తడపాలి
 4. రెండు కాళ్లను, చీలమండలాల వరకు కడగాలి
 5. క్రమపద్ధతిని పాటించాలి. అంటే దేని తర్వాత ఏది చెయ్యాలో అదే క్రమంలో చెయ్యాలి

ుదూ నందు సున్నతులు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన పద్దతులు

(ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, కాబట్టి వీటిని తప్పక పాటించటానికి ప్రయత్నించవలెను)

 1. “బిస్మిల్లాహ్” అని ఉచ్ఛరించడం
 2. రెండు చేతులనూ మణికట్టువరకు నీటితో మూడుసార్లు కడగాలి, మరియు చేతివేళ్ల నడుమ ఖిలాల్ చేయాలి (అప్పుడే నిదుర నుండి లేచిన వారికైతే ఇది అనివార్యం)
 3. మూడుసార్లు నోట నీరుతీసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. అదేవిధంగా మూడుసార్లు ముక్కు నందునూ నీరు ఎక్కించి తీసివేయాలి
 4. మూడుసార్లు ముఖం కడగాలి
 5. గడ్డమునందు నీటితో ఖిలాల్ చేయాలి.
 6. మొదట కుడి చేతిని మోచేతి వరకు కడగాలి, తరువాత అదే విధంగా ఎడమ చేతిని కూడా కడగాలి.
 7. తల యొక్క మసహ్ చేయాలి. ముందు నుదుటి వైపునుండి తడిచేతులను తల వెనుక వరకు తీసుకెళ్లి మరల అక్కడ నుండి ముందుకు తీసుకురావాలి.
 8. మొదట కుడికాలిని పాదం యొక్క పై కట్టు (చీలమండలం) వరకు కడగాలి. తరువాత ఎడమకాలిని కూడా కడగాలి.
 9. కుడివైపు నుండి మొదలు పెట్టాలి
 10. తప్పనిసరిగా వజూను ఒక క్రమపద్ధతిలో మాత్రమే చేయాలి. (అంటే ఖుర్ఆన్ నందు ఆదేశించబడిన క్రమంలో)
 11. వుదూ తరువాత ఈ దుఆ చేయాలి “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్” – నేను సాక్ష్యమిస్తున్నాను – (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప. ఆయనకు ఎవ్వరూ సాటికారు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను   ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసుడు మరియు అల్లాహ్ యొక్క వాస్తవమైన ప్రవక్త. ఓ అల్లాహ్! నన్ను పశ్చాత్తాపపడు మరియు పరిశుద్ధంగా ఉండే వారిలోని వాడిగా చేయుము.

హదస్ అల్ అస్గర్ ׃ వజూను భగ్నపరచు విషయాలు

 1. మల-మూత్రాదుల విసర్జన మరియు (అపానవాయువు)నిష్క్రమణ వలన
 2. దీర్ఘనిద్ర – మరుపుచేత
 3. కామవాంఛ లేదా మామూలుగాగానీ నేరుగా మర్మాంగాలను స్పర్శించుట వలన
 4. ఒంటె మాంసం తినడం వలన

Source: ఫిఖ్ హ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్)
అనువాదం : –  బాషా ముహమ్మద్ (సాబ్ బాషా)

సహజ సిద్ధ (సృష్టి) ఆచారములు

عن عائشة رضي الله عنها ، أن رسول الله r قال : (عشر من الفطرة قص الشارب وإعفاء اللحية والسواك واستنشاق الماء وقص الأظفار وغسل البراجم ونتف الإبط وحلق العانة وانتقاص الماء قال زكرياء قال مصعب ونسيت العاشرة إلا أن تكون المضمضة) (رواه مسلم)

ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఒకసారి ఇలా బోధించారు – “పది విషయాలు ఫిత్రాలో (సహజ ధర్మంలో) ఉన్నాయి –  మీసాలు కత్తిరించడం, గెడ్డాన్ని వదలటం, మిస్వాక్ (పళ్ళు తోముకునే పుల్ల) వాడటం, ముక్కులో నీరు పంపి శుభ్రపరచుకోవటం, గోళ్ళను కత్తిరించడం, వ్రేళ్ళ మధ్య కడగటం, చంకలలోని వెంట్రుకలను తొలగించటం, మర్మాంగం దగ్గర (నాభి క్రింద) పెరిగే వెంట్రుకలను తొలగించటం, మర్మాంగాలను నీటితో శుభ్రపరచుకోవటం” ఉల్లేఖకురాలు ఇంకా ఇలా తెలిపారు: “నేను పదవ విషయాన్ని మరచిపోయాను, కాని బహుశా అది నోటిని పుక్కిలించటం అయివుంటుంది” ముస్లిం హదీథ్ గ్రంథం.

ఇంకో హదీథ్ లో అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  బోధించిన విషయాన్ని ఇలా ఉల్లేఖించారు – “ప్రకృతికి  అనుగుణమైన ఐదు విషయాలున్నాయి.

 1. ఖత్నా (వడుగు) చేసుకోవడం
 2. నాభి క్రింది వెంట్రుకలు తొలగించడం
 3. చంకలోని వెంట్రుకలు తొలగించటం
 4. గోళ్ళు కత్తిరించడం
 5. మీసాలు కత్తిరించడం” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం

కాబట్టి కనీస సృష్టి ఆచారములు ఇలా ఉన్నాయి

 1. మిస్వాక్ (తోముడు పుల్ల)తో నోటిని మరియు దంతములను ఎల్లప్పుడు శుభ్రపరచుకొనుట.
 2. బొడ్డు క్రింద  మరియు చంకలలోని వెంట్రుకలను తొలిగించుట.
 3. సున్నతి (ఖత్నా, ఒడుగులు) చేయించుట.
 4. మీసాలను కత్తిరించుట, గెడ్డము పెంచుట.
 5. గోళ్ళను కత్తిరించుట
 6. పూర్తిగా శుభ్రత పాటించుట

టాయిలెట్లో అనుసరించవలసిన నియమములు

మరుగుదొడ్డికి (టాయిలెట్ –హమ్మాము) పోవునప్పుడు అనుసరించవలసిన నియమములు: 

 1. మరుగుదొడ్డి (Toilet -హమ్మామ్)లో ప్రవేశించే ముందు చదవవలసిన దుఆ. ఇది బయటచదవవలెను.
 2. అల్లాహుమ్మ ఇన్ని అఁఊదుబిక మినల్ ఖుబ్ థి వల్ ఖబాయిథ్

  ఓ అల్లాహ్! నీచులైన మగ మరియు ఆడ జిన్నాతుల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.

 3. ఎవ్వరికీ కనబడని ప్రదేశములలో మాత్రమే మలమూత్ర విసర్జన చేయవలెను.
 4. ఖిబ్లా వైపు ముఖం గాని వీపుగాని చేయకూడదు.
 5. తొడలు కడుపును నొక్కేటట్లు కూర్చోవలెను.
 6. మలమూత్రములు ఒంటికి, బట్టలకు అంటకుండా జాగ్రత్త పడవలెను.
 7. మరుగుదొడ్డిలో నుండి మాట్లాడకూడదు.
 8. నిషేధ ప్రాంతములలో మలమూత్ర విసర్జన చేయరాదు.
 9. మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రపరచుకొను విధానం – a) ఎడమచేతితో  b) నీటితో c) నీరులేనిచోట బేసి సంఖ్యలో ఇటుక, మట్టి(గడ్డలు) లేదా శుభ్రపరచగల వేరే వాటితో శుభ్రపరచవలెను.
 10. బైటికి వచ్చిన తర్వాత “గుఫ్ రానక్” అర్థం – “ఓ అల్లాహ్! నేను క్షమాపణ వేడుకొనుచున్నాను” అని పలకవలెను. లేదా “అల్ హందులిల్లాహిల్లదీ అద్ హబఅన్నిల్ ఆదా వ ఆఫాని” సకల స్త్రోత్రములు అల్లాహ్ కొరకే, ఆయనే నన్ను ఈ అపరిశుభ్రత నుండి శుభ్రపరచి నాకు ప్రశాంతత నొసంగెను.

10. మరుగుదొడ్డిలో ప్రవేశించునప్పుడు ముందు ఎడమకాలు లోపల పెట్టవలెను. బయటకు వచ్చునప్పుడు ముందు కుడికాలు బయట పెట్టవలెను.

తయమ్మమ్

నీరు అందుబాటులో లేని సమయంలో లేదా అనారోగ్యం కారణంగా నీటిని వాడలేని సమయంలో సుభ్రమైన మట్టి ద్వారా శుభ్రత పొందుట.

وَإِنْ كُنْتُمْ مَرْضَى أَوْ عَلَى سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ مَا يُرِيدُ اللهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِنْ حَرَجٍ وَلَكِنْ   يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ المائدة :6

దివ్యఖుర్ఆన్ అల్ మాయిద 5:6ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేదా ప్రయాణావస్థలో ఉంటే, లేదా మలమూత్ర విసర్జన చేస్తే, లేదా భార్యను కలుసుకుంటే – అప్పుడు నీళ్ళుదొరకని పక్షంలో పరిశుభ్రమైన మట్టి ఉపయోగించండి. అంటే మట్టిపై చేతులు తట్టి వాటితో ముఖం, చేతులు రుద్దుకోండి. అల్లాహ్ మీ జీవితాన్ని కష్టాలకు గురి చేయదలచ లేదు. మీరు కృతజ్ఞులై ఉండేందుకు ఆయన మిమ్ముల్ని పరిశుభ్రపరచి, మీకు తన అనుగ్రహాలను పూర్తిగా ప్రసాదించదలిచాడు.

తయమ్మమ్ ఎప్పుడు విధి (తప్పనిసరి) అగును ?

 1. నీరు లభించని సమయంలో
 2. నీరు ఉన్నా త్రాగడానికి సరిపడేదానికంటే ఎక్కువలేని యెడల.
 3. నీటితో శుభ్రత పొందిన ఎడల అతనికి ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉన్న ఎడల.
 4. విపరీతమైన చలి ఉండి, వేడి నీళ్ళు దొరక నప్పుడు.

గమనిక తయమ్మమ్ స్నానం మరియు వుదూ రెండింటికీ బదులుగా సరిపడును.

తయమ్మమ్ చేయు విధానము:

 1. శుభ్రమైన ఇసుక లేదా మట్టిని వాడవలెను. భూమిని కప్పబడి ఉన్న శుభ్రమైన మట్టి అంటే మెత్తటి మట్టి లేదా రాళ్ళపై పడి ఉండే దుమ్మూ దూళిని వాడవలెను.
 2. సంకల్పము చేయవలెను.
 3. బిస్మిల్లాహ్ అని తయమ్మమ్ చేయుట సున్నత్
 4. ముస్లిం హదీథ్: అమ్మార్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు. మేము అపవిత్రమైనాము. మాకు నీరు లభించలేదు. అప్పుడు మేము భూమిపై దొర్లినాము మరియు నమాజు ఆచరించాము. తర్వాత ఈ సంఘటనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు తెలిపాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. మీరు ఈవిధంగా చేస్తే సరిపోయేది – ఆని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండుచేతులను భూమిపై కొట్టి ఆ చేతులకు అంటుకున్న దుమ్మును నోటితో ఊదివేసి తన ముఖముపై మరియు తన అరచేతులపై రుద్దుకొనెను.

గమనిక : ఎడమచేతితో కుడిచేతిపై, కుడి చేతితో ఎడమచేతిపై మణికట్టువరకు రుద్దవలెను. భూమిపై ఎక్కువ దుమ్ము ఉన్నచో చేతులు కొట్టిన తర్వాత చేతులపై ఊదుట సున్నత్.

తయమ్మమ్ ను భంగపరచే విషయములు :

 1. వుదూ మరియు గుసుల్ ని భంగపరచే అన్ని విషయములు తయమ్మంను భంగపరుచును.

నీరు లభించిన ఎడల మరియు నీటిని వాడడము హానికరముగా లేనట్లయితే తయమ్మమ్ భంగమగును.

గుసుల్ (శుద్ధి స్నానం చేయటం) – Ghusl

గుసుల్ (స్నానం చేయటం)׃ ] {المائدة:6} ……. وَإِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوا….. [

దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిద 5׃6 “వ ఇన్ కున్ తుమ్ జునుబన్ ఫత్తహ్హరూ ”-“మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి శుద్ధులు కండి”

ఏఏ కారణ వలన గుసుల్ వాజిబ్ (విధి) అయిపోతుంది?

 1. వీర్యస్ఖలనం చేత – స్వప్నం వలన కానీ, స్త్రీలతో సరసాలాడడం వలన కానీ.
 2. రతిక్రియలలో పాల్గొనడం వలన – వీర్యస్ఖలనం అయిననూ, అవకపోయిననూ
 3. స్త్రీల వస్త్రస్రావం నిలిచిపోయాక అంటే బహిష్టు ఆగిపోయిన తరువాత
 4. పురుటి ముట్టు నిలిచిపోయాక అంటే ప్రసవానంతర రక్తస్రావం నిలిచిపోయాక
 5. అవిశ్వాసి ఇస్లాం స్వీకరించాక
 6. ముస్లిం యొక్క మరణం తర్వాత (అంటే మృతశరీరానికి గుసుల్ ఇవ్వడం)

గుసుల్ విధానం ׃ గుసుల్ నందు చేయవలసిన తప్పనిసరి కార్యలు׃

 1. పరిశుద్ధతను పొందు సంకల్పం చేయాలి
 2. దేహం మొత్తాన్ని నీటితో కడగాలి (ముక్కులో నీరు ఎక్కించడం, గరగరచేయడం, నోటిలో నీరు తీసుకుని పుక్కిలించడం కూడా భాగమే)
 3. వెంట్రుకల మధ్య కూడా వేళ్ళతో శుభ్రం (ఖిలాల్) చేయాలి.

గుసుల్ లోని సున్నతులు ׃

 1. ఆరంభానికి ముందు బిస్మిల్లాహ్ అనడం
 2. రెండు అరిచేతులను మూడేసి సార్లు కడగడం
 3. మర్మస్థానాన్ని ఎడమచేతితో కడగడం, దుర్గంధాన్ని దూరం చేయడం
 4. వుదూ చేయడం
 5. తల వెంట్రుకలను మూడుసార్లు కడగడం
 6. మొత్తం శరీరాన్ని కడగడం, మొదట కుడిభాగాన్ని కడుగుతూ ప్రారంభించాలి. తరువాత ఎడమభాగం కడగాలి.