కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”

[సహీహ్ బుఖారీ  : 8 వ ప్రకరణం – సలాత్, 65 వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 4 వ అధ్యాయం – మస్జిదుల నిర్మాణం పట్ల ప్రోత్సాహం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version: Whoever built a masjid, with the intention of seeking Allaah’s pleasure ..

సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది

387. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మనిషి తన ఇంట్లోనైనా వీధిలోనైనా ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది. మనిషి శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళుతుంటే, మస్జిద్ లో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతీ అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతనికి (పరలోకపు) అంతస్తులు పెంచుతాడు. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచి వేస్తాడు. ఇక మస్జిద్ లో ప్రవేశించిన తరువాత సామూహిక నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపు అతనికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. అతను తన నమాజు స్థానంలో కూర్చుని ఉన్నంతవరకు దైవదూతలు అతని శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తూ “దేవా! ఇతని వుజూ భంగం కానంతవరకు ఇతడ్ని క్షమించు, ఇతడ్ని కనికరించు”అని అంటారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం  – సలాత్, 87 వ అధ్యాయం – అస్సలాతి ఫీ మస్జిదిస్సూఖ్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 49 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దాని ఔన్నత్యం . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండి

254. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్, ఇషా వేళల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్లడాన్ని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రధి అల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్న వేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 13 వ అధ్యాయం – హద్దసనా యూసుఫు బిన్ మూసా]

నమాజు ప్రకరణం – 30 వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా మస్జిద్ కు వెళ్ళవచ్చు.  మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Do not stop Allaah’s Imaa’ (women slaves) from going to Allaah’s mosques

ప్రయాణపు ఆదేశాలు [పుస్తకం]

Travelప్రయాణపు ఆదేశాలు (Rulings of Travel in Islam)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]

విషయ సూచిక :

 • వీడ్కోలు
 • ఒంటరి ప్రయాణం అవాంచనీయం
 • మంచి స్నేహితం గురుంచి వెతకాలి
 • స్త్రీ ఒంటరిగా ప్రయాణించ కూడదు
 • ప్రయాణపు దుఆ
 • ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి
 • ఎక్కడైనా మజిలీ చేస్తే చదవండి
 • తక్బీర్, తస్బీహ్
 • అధికంగా దుఆ  చేయాలి
 • నగరంలో ప్రవేశించినప్పుడు చదవండి
 • ముస్లింలకు భాద కలిగించకుండా ఉండాలి
 • దారి హక్కులు నెరవేర్చాలి
 • అవసరం తీరిన వెంటనే తిరిగి రావాలి
 • తిరిగి వచ్చాక ముందు మస్జిదులో రెండు రకాతులు చేసుకోవాలి
 • వచ్చినవారిని కౌగలించు కొనుట
 • ప్రయాణికుని ఫలితం
 • ప్రయాణ సౌకర్యాలు
 • ఎంత దూరంలో ఖస్ర్ చేయాలి
 • పరిశుభ్రత ఆదేశాలు
 • తయమ్ముం విధానం
 • మేజోల్ల పై మసా
 • అజాన్ ఆదేశాలు
 • నమాజు ఆదేశాలు
 • ఇమామత్ ఆదేశాలు
 • ‘జమ్అ బైనస్సలాతిన్’ ఆదేశాలు
 • నమాజు తర్వాత జిక్ర్
 • విమానంలో నమాజు
 • జుమా నమాజు ఆదేశాలు
 • ప్రయాణంలో ఉపవాసాలు (రోజాలు)

నమాజు నిధులు (Treasures of Salah) (పుస్తకం)

బిస్మిల్లాహ్

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్‌ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్‌ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్‌ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్‌) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుద్ధపతాకం ఎగిరేసి, గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్‌ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్‌ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు, మరి కొన్ని నమాజు మధ్యలో, మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము…….చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధి: (నమాజుకు ముందు) నమాజు కొరకు సిద్ధమవటం.
2- రెండవ నిధి: (నమాజు సందర్భంలో) నమాజు చేయటం.
౩- మూడవ నిధి: (నమాజు తర్వాత) జిక్ర్‌ మరియు కొన్ని ఆచరణలు.

[ఇక్కడ పుస్తకం చదవండి లేక డౌన్లోడ్ చేసుకోండి]

 విషయ సూచిక:

మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్దత

1- వుజూ
2- వుజూ తర్వాత దుఆ
౩ మిస్వాక్‌
4- నమాజు కోరకు తొలి సమయంలో వెళ్ళటం
5- అజాన్‌ కు బదులు పలకటం
6- అజాన్‌ తర్వాత దుఆ
7- నమాజ్‌ కొరకు నడచి వెళ్ళడం
8- మొదటి పంక్తి, కుడి పంక్తి
9- సున్నతె ముఅక్కద
10- అజాన్‌ మరియు అఖామత్‌ మధ్వలో దుఆ
11- నమాజు కొరకు వేచియుండుట
12- ఖుర్‌ఆన్‌ పారాయణం, జిక్ర్
13- పంక్తులు సక్రమంగా ఉంచుట

రెండవ నిధి: నమాజు చేయటం

1- నమాజు ఘనత
2- సామూహిక నమాజు ఘనత
౩- ఖుషూ (అణుకువ, వినమత)
4- సనా
5- సూరె ఫాతిహ పారాయణం
6- ఆమీన్‌ పలకడం
7- రుకూ
8- రుకూ నుండి నిలబడిన తర్వాత
9- సజ్దాలు
10- మొదటి తషహ్హుద్
11- చివరి తషహ్హుద్ (ప్రవక్తపై దరూద్‌)
12- సలాంకు ముందు దుఆ

మూడవ నిధి: నమాజు తర్వాత అజ్కార్‌

మస్నూన్ నమాజ్ (Masnoon Namaz)- హాఫిజ్ ముహమ్మద్ అబ్దుర్ రౌఫ్ ఉమ్రీ

masnoon-namaaz-telugu-islamసంకలనం: హాఫిజ్ ముహమ్మద్ అబ్దుర్ రౌఫ్ ఉమ్రీ
అనువాదం: హాఫిజ్ బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు:హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

నమాజు కొరకై 11 చిన్న సూరాలు నేర్చుకోండి తెలుగులో

11-short-surahs-quranఅంశాల నుండి : నవముస్లిం మార్గదర్శిని, దారుస్సలాం పుస్తకాలయం

తెలుగులో సూరా ఎలా చదవాలి మరియు సూరా అర్ధం

సూరతుల్ ఫాతిహా 1 

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో 7 ఆయతులు ఉన్నాయి.

1. అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
2. సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ
3. అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూను. అర్రహ్మా నిర్రహీమ్ الرَّحْمَنِ الرَّحِيمِ
4. ప్రతిఫల దినానికి యజమాని. మాలికి యోమిద్దీన్ مَالِكِ يَوْمِ الدِّينِ
5. మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కేవలం నిన్నే అర్థిస్తాము. ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
6. మాకు ఋజుమార్గం చూపించు. ఇహ్..దినశ్శిరాతల్ ముస్తఖీం إِهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ
7.అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము. నీ ఆగ్రహానికి గురికాని వారూ మరియు మార్గభ్రష్టులు కాని వారూ అనుసరించిన మార్గము. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్ , గైరిల్ మగ్దూబి అలైహిమ్  వలద్దాల్లీన్ ! صِرَاطَ الَّذِينَ أَنْـعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

 సూరతుల్ ఫీల్ – 105

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయతులు ఉన్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. ఏమిటీ, ఏనుగుల వారితో నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదా? అలమ్ తర కైఫ ఫఅఁల రబ్బుక బిఅశ్ హాబిల్ ఫీల్ أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الفِيلِ
2. ఏమిటీ, ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? అలమ్ యజ్అఁల్ కైదహుమ్ ఫీ తద్లీల్ أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ
3. మరియు వారి పైకి పక్షుల గుంపులను పంపాడు. వ అర్సల అఁలైహిమ్ తైరన్ అబాబీల్. وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
4. అవి వారి మీద బాగా కాల్చిన మట్టి గడ్డల వర్షం కురిపించాయి. తర్మీహింమ్ బిహిజారతిమ్మిం మిన్ సిజ్జీల్ تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ
5.ఆ విధంగా ఆయన వారిని (పక్షులు) తిని వదిలి వేసిన పొట్టుగా మార్చివేశాడు. ఫజఅఁలహుమ్ కఅఁశ్ఫిమ్మఁకూల్ فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ

 సూరతు ఖురైష్ – 106

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయతులున్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (చూడండి) ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో! లి ఈలాఫి ఖురైష్ لِإِيلَافِ قُرَيْشٍ
2. చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో! ఈలాఫి హిమ్ రిహ్లతష్షితాఇ వశ్శైఫ్ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِوَالصَّيْفِ
3. కనుక వారు ఈ గృహపు ప్రభువును ఆరాధించాలి. ఫల్ యఅఁబుదూ రబ్బహాదల్ బైత్ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا البَيْتِ
4. ఆయనే వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు,శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు. అల్లదీ అత్అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్ الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ

وَآَمَنَهُمْ مِنْ خَوْفٍ

 సూరతుల్ మాఊన్ – 107

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఏడు ఆయతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా? అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్ أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు. ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీం فَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారు వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు. ఫవైలుల్ లిల్ ముశల్లీన్ فَوَيْلٌ لِلْمُصَلِّينَ

 

5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారో అల్లదీన హుమ్ అన్ శలాహితిం సాహూన్ الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో, అల్లదీన హుమ్ యరాఊన్ الَّذِينَ هُمْ  يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో. వయం నఊనల్ మాఊన్ وَيَمْنَعُونَ المَاعُونَ

 సూరతుల్ కౌథర్ – 108

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) మేము నీకు కౌథర్ (సరస్సు) ను ప్రసాదించాము. ఇన్నా  అఅతైనా కల్ కౌథర్ إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ
2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి. ఫశల్లి లి రబ్బిక వన్ హర్ فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు. ఇన్న షానిఅక హువల్ అబ్తర్ إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

సూరతుల్ కాఫిరూన్ – 109

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) ప్రకటించు!  ఓ అవిశ్వాసులారా ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ قُلْ يَا أَيُّهَا الكَافِرُونَ
2. నేను ఆరాధించను మీరు ఆరాధించే వాటిని లా… అఅబుదు మా తఅబుదూన్ لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
3. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడిని వలా..అన్..న్ తుం ఆబిదూన మా…అఅబుద్ وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
4. మరియు నేను ఆరాధించను మీరు ఆరాధిస్తున్న వాటిని వలా..అన ఆబిదుమ్మా అబత్తుం وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ
5. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడిని వలా అన్..న్ తుం ఆబిదూన మా అఅబుద్ وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
6. మీ ధర్మం మీదే మరియు నా ధర్మం నాదే. లకుం దీనుకుమ్ వ లి యదీన్ لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ

 సూరతున్నస్ర్ – 110

ఇది మక్కాలోనే అవతరించినా మదీనా సూరహ్ అనబడుతుంది. దీనిలో మూడు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వచ్చినదో మరియు విజయం లభించినదో ఇదా జాఅ నశ్రుల్లాహి వల్ ఫత్ హ్ إِذَا جَاءَ نَصْرُ اللهِ وَالفَتْحُ
2. మరియు ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు వ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజా وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللهِ أَفْوَاجًا
3. నీ ప్రభువు స్తోత్రంతో పాటు (ఆయన) పవిత్రనామాల్ని స్మరించు మరియు అతడి మన్నింపును అర్థించు, నిస్సందేహంగా అతడు పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు. ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబా فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا

 సూరతు లహబ్ (సూరతుల్ మసద్) – 111

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. అబీ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వనాశనం అయిపోయాడు తబ్బత్ యదా అబీ లహబింవ్ వతబ్బ్ تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
2. అతడి మొత్తం ఆస్తిపాస్తులు, సంపాదనా దేనికీ పనికి రాకుండా పోయింది. మాఅగ్ నా అన్హు మాలుహూ వమా కసబ్బ్ مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
3. అతడు అతి త్వరలో భగభగ మండే అగ్నిలో చేరతాడు. సయశ్లానారన్ దాత లహబ్బ్ سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ
4. అంతే కాదు (అతడితోపాటు) అతడి భార్యా అందులో చేరు తుంది. (ఆమె చాడిలుచెబుతూ కలహాలురేపే స్త్రీ) వమ్రఅతుహూ హమ్మా లతల్ హతబ్బ్ وَامْرَأَتُهُ حَمَّالَةَ الحَطَبِ
5. ఆమె మెడలో దృఢంగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్మసద్ద్ فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ

సూరతుల్ ఇఖ్లాస్ – 112

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయాతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ఓ ప్రవక్తా!) ప్రకటించు! అల్లాహ్ ఏకైక అద్వితీయుడు. ఖుల్ హువల్లాహు అహద్ద్ قُلْ هُوَ اللهُ أَحَدٌ
2. అల్లాహ్ ఎలాంటి అక్కరా లేనివాడు (సమర్ధుడు). అల్లాహు శ్శమద్ద్ اللهُ الصَّمَدُ
3. ఆయనకు సంతానం లేదు  ఆయనెవరి సంతానం కాదు లమ్ యలిద్ద్ వ లమ్ యూలద్ద్ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
4. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు. వ లమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ద్ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًاأَحَدٌ

సూరతుల్ ఫలఖ్ – 113

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా!) ప్రకటించు! నేను ఉదయం యొక్క ప్రభువును శరణు కోరుతున్నాను. ఖుల్ అ, ఊదు బిరబ్బిల్ ఫలఖ్ఖ్ قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ
2. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి. మిన్ షర్రి మా ఖలఖ్ఖ్ مِنْ شَرِّ مَا خَلَقَ
3. కమ్ముకునే చీకటి రేయి కీడు నుండి. వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్బ్. وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
4. ముడులపై మంత్రించే వారి కీడు నుండి.

 

వ మిన్ షర్రిన్ నఫ్పాసఆతి ఫిల్ ఉఖద్ద్. وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ
5. మరియు ఈర్ష్యాపరుడు, ఈర్ష్య చెందేటప్పటి కీడు నుండి వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ద్ وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

 సూరతున్నాస్ – 114

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. అను: నేను మానవుల ప్రభువు యొక్క శరణు వేడుకుంటున్నాను, ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్. قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
2. మానవుల పరిపాలకుడి (శరణు వేడు కుంటున్నాను), మలికిన్నాస్ مَلِكِ النَّاسِ
3. మానవుల ఆరాధ్యుడి (శరణు వేడు కుంటున్నాను), ఇలాహిన్నాస్ إِلَهِ النَّاسِ
4. మాటిమాటికీ మరలివస్తూ దుష్టభావాలు రేకేత్తించేవాడి కీడు నుండి, మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్ مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ
5. వాడు ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు, అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
6. వాడు జిన్నాతుల జాతిలోని వాడు లేదా మానవజాతిలోని వాడు. మినల్ జిన్నతి వన్నాస్ مِنَ الجِنَّةِ وَالنَّاسِ

 

మస్నూన్ నమాజు (Masnoon Namaz)


makkahసంకలనం
: ముఖ్తార్ అహ్మద్ అన్నదవీ
అనువాదం : మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఉమ్రి
ప్రకాశకులు: అబ్దుస్సలాం ఉమ్రీ
మస్జిద్ -ఎ -ఫరూఖియః , హకీంపేట్ , టోలిచౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Tolichowki, Hyderabad)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన నమాజు పద్ధతి, ఆయన స్వయంగా నమాజు చేసిన పద్ధతి మరియు సహాబాలకు నేర్పిన పద్ధతి.

అద్దారుసలఫియ్యహ్  నుండి ప్రచురించబడిన ఈ పుస్తకం సలాతున్నబీ  యొక్క సంక్షిప్త రూపం.ఇందులో నమాజుకు సంభందించిన ముఖ్య విషయాలను , దుఆ లను చేర్చటం జరిగింది. అంతేకాక  ప్రతి విషయాన్ని ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా నిరూపించడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)  యొక్క నమాజు పద్ధతి యొక్క ప్రామాణిక స్వరూపం ముందుంచబడింది.

[ఇక్కడ PDF చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

దైవ ప్రవక్త ( సల్లలాహు అలైహి వ సల్లం) నమాజు విధానం – బిన్ బాజ్

The Prophet’s Prayer – Imam Ibn Baz

how-to-pray-ibn-baaz-telugu

మూలం : షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ (Sahykh Abdul Azeez bin Abdullah bin Baaz)
అనువాదం :  మౌలానా ముహమ్మద్ ఉమరి అబూ అబ్దుల్లా (Moulana Muhamamd Umari Abu Abdullah) :

[Read or Download PDF Book Here]

Co-Operative Office for call and guidance in AL-Batha, Under the Supervision of Ministry of Islamic Affairs, Endowments,Propagations and Guidance, Riyadh

వ్యాధిగ్రస్తుని నమాజు (సలాహ్)

[لَا يُكَلِّفُ اللهُ نَفْسًا إِلَّا وُسْعَهَا لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِنْ قَبْلِنَا رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنْتَ مَوْلَانَا فَانْصُرْنَا عَلَى القَوْمِ الكَافِرِينَ] {البقرة:286}

అల్లాహ్ ఎవ్వరికీ అతని స్థోమతను మించి కష్టపెట్టడు. (దివ్యఖుర్ఆన్ 2:286)

 1. عن عمران بن حصين رضي الله عنه قال: كانت بي بواسير فسألت النبيr عن الصلاة فقال: “صل قائما، فإن لم تستطع فقاعدا، فإن لم تستطع فعلى جنب.” (رواه البخاري)

ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. నేను మొలలు (బవాసిర్కి piles) వ్యాధిగ్రస్థుడునై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సలాహ్ గురించి ప్రశ్నించితిని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు “నుంచొని చదువు ఒకవేళ నుంచో లేకపోతే కూర్చొని చదువు లేక పడుకొని చదువు” బుఖారీ హదీథ్ గ్రంథం.

 1. ఒకవేళ వ్యాధిగ్రస్థుడు నుంచో లేకపోతే తిన్నగా పడుకొని సలాహ్ చేయవలెను. రుకూ, సుజూద్ కొరకు తలతో సైగ చేస్తుండవలెను.
 2. ఒకవేళ వ్యాధిగ్రస్థుని వ్యాధి విపరీతంగా ఉంటే అతను రెండు నమాజులు (జుహర్ మరియు అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా) ఒకేసారి చదువుకోవలెను.