నమాజ్ ప్రాముఖ్యత, సామూహిక నమాజ్ ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు సామూహికంగా నమాజు చేసే ఘనత ఎంత గొప్పగా ఉందో చాలా సోదర సోదరీమనులకు తెలియకనే మస్జిదులకు దూరంగా ఉన్నారు, అయితే మీరు స్వయంగా ఈ వీడియో చూడండి, ఇతరులకు చూపించండి, నరక శిక్షల నుండి తమను, ఇతరులను కాపాడండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/hS6r]
[33 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

మస్జిదులో చేసే సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఫజ్ర్ నమాజు సామూహికంగా చేయడంలోని ఘనత హదీసుల ఆధారంగా తెలుపబడింది.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/Dytr]
[9 నిమిషాల వీడియో]
فضل صلاة الفجر مع الجماعة

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

నమాజు కొరకు మస్జిదుకు నడచి వెళ్ళే ఘనత (فضل المشي إلى الصلاة) [వీడియో]

బిస్మిల్లాహ్

మనలో ఎంతో మందికి నమాజు కొరకు నడచి వెళ్ళడంలో ఉన్న ఘనత తెలియదు గనక సామూహిక నమాజులో వెనక ఉండిపోతారు, అయితే ఈ వీడియో చూసి లాభాలు తెలుసుకొని మీరు స్వయంగా మస్జిద్ కు వెళ్తూ ఉండండి ఇతరులను తీసుకెళ్ళండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/6utr]
[3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు:

నమాజ్ చేయవలసిన మరియు చేయరాని సమయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/gbir]
[ 30 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఏ నమాజు యొక్క ఏ సమయం ఉంది, మరియు నమాజు చేయరాని సమయాలు ఏమిటి తెలుసుకోండి, ఇతరులకు తెలుపండి

నమాజు సమయాలు

عَنِ ابْنِ عَبَّاسٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: أَمَّنِي جِبْرِيلُ عَلَيْهِ السَّلَام عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ، فَصَلَّى بِيَ الظُّهْرَ حِينَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرَ الشِّرَاكِ، وَصَلَّى بِيَ الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِيَ يَعْنِي الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، وَصَلَّى بِيَ الْعِشَاءَ حِينَ غَابَ الشَّفَقُ، وَصَلَّى بِيَ الْفَجْرَ حِينَ حَرُمَ الطَّعَامُ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ، فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِي الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ، وَصَلَّى بِيَ الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، {وفي رواية أبي موسى: وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَغِيبَ الشَّفَقُ} وَصَلَّى بِيَ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَصَلَّى بِيَ الْفَجْرَ فَأَسْفَرَ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః జిబ్రీల్ అలైహిస్సలాం కాబా వద్ద రెండు సార్లు నాకు నమాజు చేయించారు;

 • పొద్దు వాలి, నీడ చెప్పు గూడంత ఉన్నప్పుడు నాకు జొహ్ర్ నమాజు చేయించారు,
 • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు నాకు అస్ర్ నమాజు చేయించారు,
 • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు,
 • ఎర్రని కాంతులు మరుగైన తర్వాత ఇషా నమాజ్ చేయించారు,
 • ఉపవాసముండే వ్యక్తిపై తినత్రాగడం నిషిద్ధం అయినప్పడు నాకు ఫజ్ర్ నమాజు చేయించారు.

మరుసటి రోజు;

 • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు జొహ్ర్ నమాజ్ చేయించారు,
 • ప్రతి వస్తువు నీడ దాని రెండింతలు అయినప్పుడు అస్ర్ నమాజ్ చేయించారు,
 • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు, [అబూ మూసా ఉల్లేఖనంలో ఉందిః ఎర్రని కాంతి మరుగుపడే ముందు మగ్రిబ్ నమాజ్ చేయించారు]
 • రాత్రి మూడవ భాగం గడిశాక ఇషా నమాజ్ చేయించారు,
 • తెలుపుగా ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజు చేయించారు.  (అబూ దావూద్ 393, 395).

ప్రతి నమాజు తొలి సమయంలో చేయడం ఉత్తమం

عنْ أُمِّ فَرْوَةَ، قَالَتْ: سُئِلَ رَسُولُ اللهِ ﷺ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ فِي أَوَّلِ وَقْتِهَا»

ఉమ్మె ఫర్వా ఉల్లేఖనం ప్రకారం, కార్యాల్లో ఏదీ అతిఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించబడినప్పుడు, నమాజు దాని తొలి సమయంలో చేయడం అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్ 426).

తెలిసీ సమయం దాటనివ్వకూడదు

عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ ﷺ: «كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءُ يُؤَخِّرُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ – أَوْ – يُمِيتُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟» قَالَ: قُلْتُ: فَمَا تَأْمُرُنِي؟ قَالَ: «صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا، فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ، فَصَلِّ، فَإِنَّهَا لَكَ نَافِلَةٌ»

హజ్రత్ అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మీ నాయకులు నమాజులను ఆలస్యంగా చేసినప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అలాంటప్పుడు నేనేమి చేయాలో మీరే ఆదేశించండి అని విన్నవించుకున్నాను, అప్పుడు ఆయన చెప్పారు: నీవు నమాజు దాని సమయంలో చేసుకో, వారితో కూడా నీకు అదే నమాజు మరోసారి చేయవలసి వచ్చినప్పుడు, వారితో కూడా చేయి, అది నీకు నఫిల్ అవుతుంది. (ముస్లిం 648).

ఇషా నమాజు ఆలస్యం చేయవచ్చును

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: «لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ أَنْ يُؤَخِّرُوا العِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ»

ప్రవక్త సల్లల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నా అనుచర సంఘానికి కష్టతరంగా ఉంటుందన్న భయం నాకు లేకుంటే రాత్రి మూడవ భాగం లేదా అర్థ రాత్రి వరకు ఇషా నమాజును ఆలస్యంగా చేయండని ఆదేశించేవాడిని. (తిర్మిజి 167).

అయితే జమాఅతు (సామూహిక) నమాజు వదలి ఆలస్యం చేయకూడదు. ఏదైనా మస్జిదు వారందరూ ఏకమై ఆలస్యం చేస్తే అభ్యంతరం లేదు.

పడుకున్న లేదా మరచిపోయిన వ్యక్తి ఎప్పుడు నమాజు చేయాలి?

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t، قَالَ: قَالَ نَبِيُّ اللهِ ﷺ: «مَنْ نَسِيَ صَلَاةً، أَوْ نَامَ عَنْهَا، فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే లేదా ఆ నమాజు సమయంలో నిద్రిస్తూ ఉంటే దాని పరిహారం ఏమిటంటే గుర్తు వచ్చిన (లేదా మేల్కొన్న) వెంటనే ఆ నమాజు చేసుకోవాలి. (ముస్లిం 684).

నమాజు చేయరాని సమయాలు

عن عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيَّ t يَقُولُ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ ﷺ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: «حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ» {مسلم 831}

హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మూడు వేళల్లో నమాజు చేయడం మరియు శవాలను ఖననం చేయడం నుండి వారించేవారుః

 • సూర్యోదయం అయ్యే వేళ అది పైకెక్కే వరకూ,
 • నడి నెత్తిన మీది కొచ్చిన సూర్యుడు వాలే వరకూ,
 • సూర్యాస్తమయం అయ్యే వేళ పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం 831).

عن أَبي سَعِيدٍ الخُدْرِيّ t يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: «لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ العَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ»

నేను ప్రవక్త ﷺ ఉద్బోధించగా విన్నాను అని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ t ఉల్లేఖించారుః ఉదయం నమాజు నెరవేర్చిన తర్వాత సూర్యోదయం వరకూ మరే నమాజు లేదు. అలాగే అస్ర్ నమాజ్ నెరవేర్చిన తర్వాత సూర్యాస్తమయం వరకూ ఏ నమాజూ లేదు. (బుఖారి 586, ముస్లిం 827).

*  ఫజ్ర్ కు ముందు గల సున్నతులు ముందే చేయ లేక పోతే ఫజ్ర్ తర్వాత చేయవచ్చును (తిర్మిజి 422).

కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇతరములు:

ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు

బిస్మిల్లాహ్

“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్‌ అన్‌కబూత్‌:45)

హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).

ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్‌ మర్యం:59).

నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్‌:34-35).

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్‌ అల్‌ జామీ :2020).

నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్‌ ముద్దసిర్‌:42-47).

నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్‌ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్‌, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్‌ జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌”’ (ముస్లిం).

ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్‌ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


ఈద్ (పండుగల) నమాజు

బిస్మిల్లాహ్

ఈద్ పండుగల నమాజు :

రమజాన్‌ మరియు బక్రీద్‌ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ  పండుగ నమాజు వాజిబు.

పండుగ రోజు స్నానం చేయడం మన శక్తిని బట్టి మంచి దుస్తులు ధరించడం సున్నతుగా భావించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్ల దుస్తులు ధరించేవారు. తెల్ల దుస్తులంటే చాలా ఇష్టపడేవారు. మరియు సువాసనలో అన్నిటికంటే మంచి సువాసన పూసుకునేవారు. అలాగే యమని అబాయా తొడిగేవారు” (తబ్రాని).

రమజాన్‌ పండుగ నమాజుకు బయలుదేరక ముందు అల్పాహారం చేయడం సున్నతు. బక్రీద్‌ పండుగ నమాజు తరువాత అల్పాహారం చేయడం సున్నతు. (సహీహుల్‌ జామీ :4845, ఇబ్నుమాజా)

బక్రీద్‌ పండుగ నమాజుకు, రమజాన్‌ పండుగ నమాజుకు బయలు దేరేటప్పుడు బిగ్గరగా తక్బీర్ చెబుతూ ఈద్‌గాహ్‌ చేరుకోవాలి.

అరఫా రోజు ఫజర్‌ నమాజు నుండి అయ్యాముత్‌ తష్‌రీఖ్‌ (బక్రీద్‌ నెల 9,10,11,12,13) రోజుల్లో తక్బీర్ పదాలు పఠిస్తూ ఉండాలి.

అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ్‌ అక్బర్‌, అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌హమ్ద్”. అలాగే బక్రీద్‌ నాలుగు (10,11,12,139) రోజులలో ఖుర్చాని ఇవ్వవచ్చును.

(సహీహుల్‌ జామీ  :5004, ఇర్వావుల్‌ గలీల్‌:654).

బక్రీద్‌ పండుగ రోజు తరువాత మూడు రోజులు ఖుర్బానీ చెయ్యవచ్చును. కాని పండుగ (జుల్‌హజ్‌10వ) రోజు ఖుర్బానీ చెయ్యడం ఉత్తమమైనది.

అయ్యాముత్‌ తష్‌రిఖ్‌ అంటే జిల్‌హజ్‌ నెల 11,12,13, రోజులు ఖుర్బానీ రోజులే. జిల్‌హజ్‌ 13వ రోజు సూర్యాసమయం వరకూ ఖుర్బానీ చెయ్యవచ్చును.

ఖుర్చానీ ఇవ్వదలుచుకున్నవారు తమ చేతులతోనే ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యడం మంచిది. అలాగే స్త్రీలు కూడా తమ ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యవచ్చును. లేక ఇతరుల ద్వారా జబహ్‌ చెయ్యించడం కూడా ధర్మమే.

పండుగ నమాజు తరువాత ఒక మంచి ధారుగల కత్తిని తీసుకొని “ఖుర్బానీ దుఆ” పఠించి జంతువును జబహ్‌ చేయాలి. తరువాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని బీదవారికి, మరొక భాగాన్ని బంధువులకు పంచాలి. మూడవ భాగాన్ని తమ సొంతానికై ఉంచుకోవాలి.

ఖుర్బానీ దుఆ:

ఇన్నీ వజ్జహతు వజ్‌హియ లిల్లజీ ఫతరస్‌ సమావాతి వల్‌ అర్జ, హనీఫఃవ్‌ వమా అనా మినల్‌ ముష్‌రికీన్‌, ఇన్న సలాతి వ నుసుకీ వ మహ్‌యా వమమాతీ లిల్లాహి రబ్బిల్‌ ఆలమీన్‌, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్‌తు వ అన అవ్వలుల్‌ ముస్లీమీన్‌. అల్లాహుమ్మ మిన్‌క వ లక అన్‌ ……” ఖుర్బానీ ఎవరిపేరుతో ఇవ్వబడుతుందో వారి పేరు పేర్కొని “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్‌” అని జబహ్‌ చెయ్యాలి.

రమజాన్‌ పండుగ నమాజుకు బయలదేరక ముందు ‘ఫిత్రా దానం చెల్లించాలి. బక్రీద్‌ పండుగ నమాజుకు తరువాత ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి, ముస్లిం)

ఫిత్రా దానం చెల్లించే స్తోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఫిత్రా దానం చెల్లించాలి. ఇంట్లో ఉన్నవారి ప్రతి వ్యక్తికి బదులు ఒక ‘సా’ (2.500 కి.) హిజాజి ధాన్యాలు (బియ్యం లేక గోదుమలు లేదా మనం నిరంతరాయంగా వాడుకునే ధాన్యం) దానంగా ఇవ్వాలి. (అహ్మద్‌)

ముస్లిం సమాజానికి చెందిన బీదవారికి మాత్రమే ఫిత్రా దానం ఇవ్వాలి. అది ధాన్యం రూపంలో దానం చెయ్యడం ఉత్తమమైన ఆచారం.

హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రి;ఈ కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: “ప్రతి పండుగ నమాజు ఆచరించుటకై ఈద్‌గాహ్‌ వెళ్ళేవారు” (బుఖారి, ముస్లిం).

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు కాలి నడన వెళ్ళేవారు” (సహీహుల్‌ జామీ :4710).

ప్రవక్త ముహమ్మద్‌: ఈద్‌గాహ్‌కు చిన్నారి పాపలను, యువతులను, వయసు మీరిన స్త్రీలను మరియు ఎవరి దగ్గరనైతే దౌని (స్కార్ఫ్) లేదో, వారు తమ సహోదరి వద్దనుండి దౌని తీసుకొని ఈద్‌గాహ్‌ పోవాలని ఆజ్ఞాపించారు. దీని ఉద్దేశ్యం ఏమంటే, స్త్రీలుకూడా ముస్లిం సమూహంలో వారి దుఆ పొందగలరని. దీనికి ఆధారంగా ఒక హదిసులో ఉమ్మే అతియ్యా ఈ ఉల్లేఖించారు: “పురిటి స్త్రీలు, బహిష్టు స్త్రీలు, పరదాలో ఉన్న మహిళలు నమాజ్‌ నెరవేర్చుటకై ఈద్‌గాహ్‌ పోవాలని, ముస్లిం పురుషులతో పాటు దుఆలో పాల్గొనాలనీ మాకు ఆజ్ఞాపించారు. కాని బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు నుండి తప్పుకోవాలనీ ఆదేశించారు” (బుఖారి, ముస్లిం).

పండుగ నమాజుకు ముందు ఎలాంటి నఫిల్‌ నమాజు నెరవేర్చకూడదు.హజ్రత్ అబూ సయీద్‌ ఖుద్రి (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు ముందు (నఫిల్‌) నమాజు నెరవేర్చలేదు. కాని పండుగ నమాజు తరువాత ఇంటికి వచ్చి రెండు రకాతులు (నఫిల్‌) చదివేవారు. (బుఖారి, ముస్లిం)

పండుగ నమాజాకై అజాన్‌ లేక ఇఖామత్‌ చెప్పకూడదు. హజత్‌ జాబిర్‌ బిన్‌ సముర (రధి అల్లాహు అన్హు) కథనం: “నేను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో పండుగ నమాజు ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు అజాన్‌ మరియు ఇఖామత్‌ లేకుండానే చదివాను.” (ముస్లిం)

పండుగల నమాజు సమయం: హజ్రత్‌ జున్దుబ్‌-ఈ కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు రెండింతలు అయిన తరువాత రమజాన్‌ నమాజు చదివేవారు. మరియు సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు సమానంగా అయిన తరువాత బక్రీద్‌ నమాజు చదివేవారు”

ఇమామ్‌ షౌకానీ (రహిమహుల్లాహ్ అలైహి) గారు ఇలా తెలియజేసారు. “ఈ హదీసు పండుగ నమాజు సమయాల హదిసులలో చాలా ప్రామాణికమైన హదీస్‌గా భావించారు” (ఫిఖ్‌హుస్‌ సున్నా:1/279).

[అరబ్‌ దేశాలలో ఈద్‌ నమాజ్‌ సున్నత్‌ సమయం ప్రకారం నెరవేర్చుచున్నారు. కాని మన దేశాలలో ఈద్‌ నమాజ్‌ చాలా ఆలస్యంగా నెరవేర్చే అలవాటుకు గురికాబడ్డారు. ఇది ఎంత మాత్రం సున్నత్‌ పద్దతి కాదు.]

పండుగ రోజు పిల్లలు దఫ్‌ వాయించి ధర్మ పద్దతిలో మంచి గీతాలు మరియు ఇతర ఆటలతో ఖుషీ చేయవచ్చును. (బుఖారీ)

పండుగల రోజు ఇతరులతో కలసినప్పుడు “తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కా” అని చెప్పవలెను. (మా పుణ్యాలు మీ పుణ్య కార్యాలను అల్లాహ్‌ స్వీకరించుగాక) (తమాముల్‌ మిన్నా లిల్‌ అల్బాని:1/ 356)

పండుగల నమాజ్‌ ఆచరించే విధానము:

1) కాబతుల్లాహ్‌ దిశకు తిరిగి నిలబడాలి.

2) నమాజు కొరకై నియ్యత్‌ మనసులో అనుకోవాలి.

3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)

4) తక్సీర్‌ (అల్లాహు అక్బర్‌) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) చెవులను తాకవలసిన అక్కర లేదు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చెయ్యి మణికట్టుని పట్టుకొని రెండు చేతులను రొమ్ముపై (ఛాతిఫై) ఉంచాలి. (నసాయి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, అల్‌ అల్పానీ రహిమహుల్లాహ్ | పేజీ: 88)

5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88)

6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి.

సుబ్‌హాన కల్లాహుమ్మ వబిహమ్‌దిక వతబార కస్‌ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్‌, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93)

7) తరువాత 7 సార్లు తక్బీర్లు  (అల్లాహు అక్బర్‌ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్‌)

ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.

8) తరువాత ఇమామ్‌ బిగ్గరగా సూరతుల్‌ ఫాతిహా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు (ముఖ్తదీలు) మెల్లగా చదవాలి. ఆ తరువాత ఇమామ్‌ వేరొక సూరా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు నిశబ్దంగా వినాలి. సూరతుల్‌ ఫాతిహా మినహా ఇతర సూరాలు ముఖ్తదీలు చదవకూడదు.

9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్‌ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు  నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్‌)

10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్‌ వల్‌ ఖుర్‌ఆనిల్‌ మజీద్‌) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్‌ సాఅతు వన్‌ షఖ్బల్‌ ఖమర్‌” సూరా చదవాలి. (ముస్లిం)

లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్‌ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్‌ అతాక హదిసుల్‌ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్‌ గలీల్‌: 644)

11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్‌ అబూబకర్‌, మరియు హజ్రత్‌ ఉమర్‌ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)

12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై  ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)

అంటే ఈద్‌గాహ్‌లో మింబర్ తీసుకొపోవడం లేక అక్కడ మింబర్ లా కట్టించి దానిపై ఎక్కి ప్రసంగం చేయకూడదు. మామూలుగా నిలబడి ప్రసంగించాలి.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


జుమా నమాజుకు త్వరగా వెళ్లడంలో ఘనత, దాన్ని కోల్పొవటం గురించి హెచ్చరిక [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

493. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతరములు: