దివ్యఖుర్ఆన్ మరియు దాని విభజన (The Divison of Quran into Parts)

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : సయ్యద్ యూసుఫ్ పాషా

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం

దివ్యఖుర్ఆన్ లోని విభిన్న విషయాలకు అనుగుణంగా మరియు ఒక నిర్ణీత సమయంలో దానిని పూర్తిగా పఠించే పాఠకుల సౌకర్యానికి అనుగుణంగా ఆ దివ్యగ్రంథం అనేక అధ్యాయాలుగా, భాగాలుగా, అంశాలుగా విభజించబడినది. ఈ విభజనకు ఇవ్వబడిన అరబీ భాషా పదాలు – మన్ జిల్,  జుజ్, సూరహ్, రుకూ మరియు ఆయహ్. ఒక్కో అనువాదంలో ఈ అరబీ పదాలు ఒక్కో విధంగా అనువదించబడినవి. అంటే వేర్వేరు అనువాదములలో వీటికి వేర్వేరు అర్థములు, వివరణలు వేర్వేరుగా ఇవ్వబడెను. కాని తరచుగా సూరహ్, ఆయహ్ వంటి కొన్ని పదములను వాటి అసలు భాష అయిన అరబీ భాషలోనే వాడటం జరుగుతున్నది. అంతే కాని, అరబీ భాషాపదాలకు బదులుగా వాటి అనువాదపు పదములు అంతగా వాడుకలో లేవు.

– ఆయహ్ آية

ఆయహ్ అనేది ఖుర్ఆన్ యొక్క ఒక యూనిట్ అంటే ఒక అతి చిన్నభాగం, ఇది అల్లాహ్ తరఫున మానవజాతికి పంపబడిన మార్గదర్శకత్వము. కాబట్టి, ఖుర్ఆన్ యొక్క ఆ అతి చిన్నభాగాలు ఆయహ్ అంటే అల్లాహ్ యొక్క వివేకానికి చిహ్నాలు అని పిలవబడటంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ఖుర్ఆన్ అనేది ఒక కావ్యగ్రంథం కాదు కాబట్టి, ఆయహ్ కు బదులుగా వచనం, శ్లోకం లేదా సూక్తి అనే పదాలు వాడటం సరైన పద్ధతి కాదు. ఖుర్ఆన్ లోని ప్రతి ఆయహ్ ఒకే సైజులో ఉండదు. వేర్వేరు సూరహ్ లలో వేర్వేరు సైజులలో ఉన్నది. కేవలం రెండే అక్షరాలతో ఒక్కో ఆయహ్ అతి చిన్న సైజులో ఉండవచ్చు లేదా అనేక పదాలతో పెద్ద సైజులో ఉండవచ్చు. ఉదాహరణకు ‘హా-మీమ్’ అనేది ఖుర్ఆన్ లోని అతి చిన్న ఆయహ్. దీనిలో కేవలం రెండే అక్షరాలు ఉన్నాయి. ఖుర్ఆన్ లో ఒక్కోచోట ఆయహ్ యొక్క  పరిమాణం ఆయతుల్ కుర్సీ అంతటి పెద్దది కూడా కావచ్చు. అది అరబీభాషా వ్యాకరణంలోని ఏ నియమం పైనా ఆధారపడిలేదు. కాబట్టి ఆయహ్ యొక్క సైజును లేదా ఆయహ్ యొక్క విభజనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన ప్రకారం మాత్రమే స్వీకరించవలెను. ఖుర్ఆన్ లో మొత్తం ఎన్ని ఆయహ్ లు ఉన్నాయి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే దివ్యఖుర్ఆన్ లో కనీసం 6500 ఆయహ్ లు ఉన్నాయనేది పండితుల అభిప్రాయం.

– సూరహ్ سورة

సూరహ్ (బహువచనం సువర్) అంటే అరబీ భాషాపరంగా వరుస, పంక్తి, క్రమము, కంచె అని అర్థం. అయితే సాంకేతిక భాషాపరంగా సూరహ్ అనేది విభజింపబడిన ఖుర్ఆన్ గ్రంథపు భాగాలకు ఇవ్వబడిన పేరు. దివ్యఖుర్ఆన్ లో 114 సూరహ్ లు ఉన్నాయి. అవన్నీ ఒకే సైజులో లేవు. అతి చిన్ని సూరహ్ లో కేవలం మూడే ఆయహ్ లు ఉన్నాయి. ఉదాహరణ – సూరహ్ అల్ అసర్, సూరహ్ అన్నస్ర్ మరియు సూరహ్ అల్ కౌథర్. అతి పెద్ద సూరహ్ అయిన అల్ బఖరహ్ లో 286 ఆయహ్ లు ఉన్నాయి. మనం చదివే ఇతర గ్రంథాల మాదిరిగా దివ్యఖుర్ఆన్ లో సూరహ్ ల(భాగాల) విభజన విషయం, చర్చ లేదా అంశం ఆధారంగా జరుగలేదు. సూరహ్ లో చర్చించబడుతున్న విషయం ఆకస్మికంగా ఒక అంశం నుండి వేరే అంశానికి మారడాన్ని పాఠకులు తరచుగా గమనిస్తారు. ఇతర ఏ గ్రంథంలోనూ కనబడని ఈ ప్రత్యేకతే దివ్యఖుర్ఆన్ కు ఒక విశేష గుర్తింపును ఆపాదిస్తున్నది. అలాగే, ఒక సూరహ్ లో మరల చిన్న అధ్యాయాలు గాని, పేరాలు గాని లేవు. కాబట్టి అధ్యాయం అవేది ‘సూరహ్’ అనే ఈ అరబీ పదానికి అనువాదం కాజాలదు.

– రుకూ رُكو

రుకూ అనబడే చిన్న భాగాలుగా ఖుర్ఆన్ లోని సూరహ్ లు విభజింపబడినవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో గాని లేదా వారి సహచరుల (సహాబాల) కాలంలో గాని జరుగలేదు. తర్వాత కాలంలో హజ్జాజ్ బిన్ యూసుఫ్ అనే ఒక ఇస్లామీయ రాజ్యపాలకుని అధ్వర్యంలో పాఠకుల సౌలభ్యం కోసం ఖుర్ఆన్ లోని సూరహ్ లు రుకూలుగా విభజింపబడినవి. ఖుర్ఆన్ లో ع అనే అరబీ అక్షరం, దాని పై నుండే సంఖ్యల ద్వారా అవి గుర్తింప బడును.

– జుజ్ جُز

జుజ్ అనబడే దాదాపు 30 సమానమైన భాగాలుగా ఖుర్ఆన్ విభజింబడినది. పాఠకులు సులభంగా పఠించడానికి, ప్రత్యేకంగా రమదాన్ పవిత్ర మాసంలో ప్రతి రాత్రి పఠించడానికి వీలుగా ఇలా విభజింపబడినది. ఈ భాగాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల (సహాబాల) కాలంలో కూడా ఉండేవని ఔస్ బిన్ హుదైఫా ఉల్లేఖించిన ఈ హదీథ్ ద్వారా తెలుస్తున్నది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వారి సహచరులు (సహాబాలు) ఖుర్ఆన్ ను ఎలా విభజించినారని సహాబాలను ఔస్ బిన్ హుదైఫా ప్రశ్నించగా, వారు ఇలా జవాబిచ్చినారు, “మూడో వంతు, ఐదో వంతు, ఏడో వంతు, తొమ్మిదవ వంతు, పదకొండవ వంతు, పదమూడవ వంతు & ముఫశ్శిల్ నుండి చివరి వరకు”.

– హిజ్బ్

ఖుర్ఆన్ లోని ప్రతి జుజ్ నాలుగు హిజ్బ్ లుగా విభజింపబడినది. మరల ప్రతి హిజ్బ్ నాలుగు భాగాలుగా విభజింపబడినది – పేజీ ప్రక్కభాగంలో నిర్ణీత ఆయహ్ లకు ఎదురుగా నాలుగింట మొదటిది రుబు (1/4), నాలుగింట రెండోది నిస్ఫ్ (1/2) మరియు నాలుగింట మూడోది థులుథ్ (3/4) అని సూచింపబడి ఉండును.

– మన్జిల్ منزل

ఖుర్ఆన్ గ్రంథం మరల మన్జిల్ అనబడే సమానమైన ఏడు భాగాలుగా విభజింపబడినది. ఇది మన్జిల్ منزل అనే చిహ్నం దానికి సంబంధించిన వరుసక్రమ సంఖ్యతో సహా పేజీ ప్రక్కన ఉండే మార్జిన్ స్థలంలో కనబడును. ఒక వారంలో ఖుర్ఆన్ గ్రంథ పఠనాన్ని పూర్తి చేసేందుకు వీలుగా సహాబాలు ఈ విభజన చేసినారు. మొదటి మన్జిల్ లో సూరహ్ ఫాతిహా కాకుండా ఖుర్ఆన్ లోని మొదటి మూడు సూరహ్ లు ఉన్నాయి, రెండవ మన్జిల్ లో ఐదు, మూడవ మన్జిల్ లో ఏడు, నాలుగవ మన్జిల్ లో తొమ్మిది, ఐదవ మన్జిల్ లో పదకొండు, ఆరవ మన్జిల్ లో పదమూడు మరియు ఏడవ మన్జిల్ లో మిగలిన అరవై ఐదు సూరహ్ లు ఉన్నాయి.

– జతలు, జంటలు, జోడీ

ఖుర్ఆన్ లోని కొన్ని సూరహ్ లు జంటలుగా గుర్తింపబడినాయి. ఉదాహరణకు – సూరహ్ అల్ బఖరహ్ మరియు సూరహ్ ఆలే ఇమ్రాన్. అలాగే సూరహ్ బని ఇస్రాయీల్ మరియు అల్ కహఫ్. వాటిలో ఉపదేశింపబడిన విషయపు సారూప్యం వలన అవి జంటలుగా గుర్తింపబడినవి. అయితే ఇతర ఏ సూరహ్ కూ జోడీగా గుర్తింపబడని కొన్ని ప్రత్యేక సూరహ్ లు కూడా ఉన్నాయి ఉదారహణకు సూరహ్ యాసీన్.

– మక్కా మరియు మదీనాహ్ సూరహ్ ల విభజన

అవతరణ క్రమాన్ని పరిశోధిస్తూ, వాటి అవతరణ సమయాన్ని బట్టి ఖుర్ఆన్ గ్రంథంలోని సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు మదీనాహ్ సూరహ్ లుగా పండితులు విభజించారు.  ఈ విభజన ద్వారా ఖుర్ఆన్ సూరహ్ లలో కొన్ని మక్కా సూరహ్ లని మరియు మిగిలినవి మదీనాహ్ సూరహ్ లని ప్రసిద్ధి చెందినవి. హిజ్రహ్ కు (అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మక్కా నగరం నుండి మదీనా పట్టణానికి వలస పోయిన సమయం) పూర్వం అవతరించిన సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు హిజ్రహ్ తర్వాత అవతరించిన సూరహ్ లను మదీనాహ్ సూరహ్ లుగా విభజింపబడినవి. ఈ విధానం ప్రకారం మొత్తం సూరహ్ లు ఏడు మక్కా – మదీనాహ్ సూరహ్ ల సమూహాలుగా  విభజించబడినవి – వీటిలో మొత్తం మక్కా సూరహ్ ల సంఖ్య 86 & మదీనాహ్ సూరహ్ ల సంఖ్య 28. కేవలం కొన్ని సూరహ్ ల అవతరణ పై తప్ప, ఈ అవతరణ క్రమం పై దాదాపు పండితులందరి ఏకాభిప్రాయం ఉన్నది. కొన్ని సూరహ్ లలోని ఆయహ్ లన్నీ అవతరణ క్రమాన్ని అనుసరించి, ఒకే విభాగం లోనికి అంటే మక్కా సూరహ్ లేక మదీనాహ్ సూరహ్ ల విభాగంలోనికి రావని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు సూరహ్ హజ్జ్ లోని ఆయహ్ లన్నీ మక్కాలో అవతరించినవని కొందరు, మదీనాహ్ లో అవతరించినవని మరికొందరు అభప్రాయపడుతున్నారు. అయితే రెండు అభిప్రాయాలూ సరైనవే. ఎందుకంటే దానిలో మక్కాలో అవతరించిన కొన్ని ఆయహ్ లు మరియు మదీనాహ్ లో అతవరించిన కొన్ని ఆయహ్ లు ఉన్నాయి.

చివరిగా –ఖుర్ఆన్, సూరహ్ అల్ ఇస్రా  17: 80 – “ఓ నా రబ్ (ఓ నా ప్రభూ)!నీవు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు.ఎక్కడ నుండి తీసినా, సత్యంతో తియ్యి. నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా.”

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన అత్తిర్మిథీ & ఇబ్నె మాజా హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించేవారని తెలుపబడినది – “ఓ అల్లాహ్, నీవు ఉపదేశించిన దానిలో నాకు శుభాన్ని ప్రసాదించుము. నాకు ప్రయోజనం చేకూర్చే వాటిని నాకు బోధించుము. మరియు నాలో జ్ఞానాన్ని పెంపొందించుము. అన్ని పరిస్థితులలోనూ సకల ప్రశంసలు నీకే చెందును. నరకంలోనికి వెళ్ళేవారి పరిస్థితి (జీవనవిధానం) నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.” ఆమీన్.

80% ఖురాన్ పదాలకు అర్ధాలు

80% of Quranic Words in Telugu80% words of the Holy Quran have been compiled for ease of learning. This is just pocket sized booklet consisting of 28 pages (14 papers)

[Download PDf Here]

 

ఇస్లామిక్ తెలుగు డిక్షనరీ – Dr. Muhammad Taqiuddeen al-Hilaalee & Dr. Muhammad Muhsin Khan

The Islamic Telugu Dictionary – From the Translation of Meanings of Noble Quran By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee and Dr. Muhammad Muhsin Khan

[Download the PDF Here]

అహ్సనుల్ బయాన్ – తెలుగు

అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్

Telugu Quran Commentry -Translation based on the Urdu translation of Moulana Muhammad Jonagari (Ahlulhadith) with brief commentry named “Tafseer Ahsan-ul-Bayan” by Hafizh Salah-ud-deen yusuf

టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
పేజీలు : 1657

లింకు : Read or Download Book Here [PDF]

S.No Telugu Surah Name Read (Scribd) Download (pdf)
1 అల్ ఫాతిహా [చదవండి] 001
2 అల్ బఖర [చదవండి] 002
3 అలి ఇమ్రాన్ [చదవండి] 003
4 అన్ నిసా [చదవండి] 004
5 అల్ మాయిద [చదవండి] 005
6 అల్ అన్ ఆం [చదవండి] 006
7 అల్ ఆరాఫ్ [చదవండి] 007
8 అల్ అన్ ఫాల్ [చదవండి] 008
9 అత్ తౌబా [చదవండి] 009
10 యూనుస్ [చదవండి] 010
11 హూద్ [చదవండి] 011
12 యూసుఫ్ [చదవండి] 012
13 అర్ రాద్ [చదవండి] 013
14 ఇబ్రాహీమ్ [చదవండి] 014
15 అల్ హిజ్ర్ [చదవండి] 015
16 అన్ నహ్ల్ [చదవండి] 016
17 బనీ ఇస్రాయీల్ [చదవండి] 017
18 అల్ కహఫ్ [చదవండి] 018
19 మర్యమ్ [చదవండి] 019
20 తాహా [చదవండి] 020
21 అల్ అంబియా [చదవండి] 021
22 అల్ హజ్ [చదవండి] 022
23 అల్ మూ’మినూన్ [చదవండి] 023
24 అన్ నూర్ [చదవండి] 024
25 అల్ ఫుర్ఖాన్ [చదవండి] 025
26 అష్ షుఅరా [చదవండి] 026
27 అన్ నమ్ల్ [చదవండి] 027
28 అల్ ఖసస్ [చదవండి] 028
29 అల్ అన్ కబూత్ [చదవండి] 029
30 అర్ రూమ్ [చదవండి] 030
31 లుఖ్మాన్ [చదవండి] 031
32 అన్ సజ్ దహ్ [చదవండి] 032
33 అల్ అహ జాబ్ [చదవండి] 033
34 సబా [చదవండి] 034
35 ఫాతిర్ [చదవండి] 035
36 యాసీన్ [చదవండి] 036
37 అస్ సాఫ్ఫాత్ [చదవండి] 037
38 సాద్ [చదవండి] 038
39 అజ్ జుమర్ [చదవండి] 039
40 అల్ మూ’మిన్ [చదవండి] 040
41 హా మీమ్ అన్ సజ్ దహ్ [చదవండి] 041
42 అష్ షూరా [చదవండి] 042
43 అజ్ జుఖ్ రుఫ్ [చదవండి] 043
44 అద్ దుఖాన్ [చదవండి] 044
45 అల్ జాసియహ్ [చదవండి] 045
46 అల్ అహ్ ఖాఫ్ [చదవండి] 046
47 ముహమ్మద్ [చదవండి] 047
48 అల్ ఫత్ హ్ [చదవండి] 048
49 అల్ హుజురాత్ [చదవండి] 049
50 ఖాఫ్ [చదవండి] 050
51 అజ్ జారియాత్ [చదవండి] 051
52 అత్ తూర్ [చదవండి] 052
53 అన్ నజ్మ్ [చదవండి] 053
54 అల్ ఖమర్ [చదవండి] 054
55 అర్ రహ్మాన్ [చదవండి] 055
56 అల్ వాఖి అహ్ [చదవండి] 056
57 అల్ హదీద్ [చదవండి] 057
58 అల్ ముజాదలహ్ [చదవండి] 058
59 అల్ హష్ర్ [చదవండి] 059
60 అల్ ముమ్ తహినహ్ [చదవండి] 060
61 అస్ సఫ్ [చదవండి] 061
62 అల్ జుముఅహ్ [చదవండి] 062
63 అల్ మునాఫిఖూన్ [చదవండి] 063
64 అత్ తగాబున్ [చదవండి] 064
65 అత్ తలాఖ్ [చదవండి] 065
66 అత్ తహ్రీమ్ [చదవండి] 066
67 అల్ ముల్క్ [చదవండి] 067
68 అల్ ఖలమ్ [చదవండి] 068
69 అల్ హాఖ్ఖహ్ [చదవండి] 069
70 అల్ మఆరిజ్ [చదవండి] 070
71 నూహ్ [చదవండి] 071
72 అల్ జిన్న్ [చదవండి] 072
73 అల్ ముజ్జమ్మిల్ [చదవండి] 073
74 అల్ ముద్ధస్సిర్ [చదవండి] 074
75 అల్ ఖియామహ్ [చదవండి] 075
76 అద్ దహ్ర్ [చదవండి] 076
77 అల్ ముర్సలాత్ [చదవండి] 077
78 అన్ నబా [చదవండి] 078
79 అన్ నాజి ఆత్ [చదవండి] 079
80 అబస [చదవండి] 080
81 అత్ తక్వీర్ [చదవండి] 081
82 అల్ ఇన్ ఫితార్ [చదవండి] 082
83 అల్ ముతఫ్ఫిఫీన్ [చదవండి] 083
84 అల్ ఇన్ షిఖాఖ్ [చదవండి] 084
85 అల్ బురూజ్ [చదవండి] 085
86 అత్ తారిఖ్ [చదవండి] 086
87 అల్ ఆలా [చదవండి] 087
88 అల్ గాషియహ్ [చదవండి] 088
89 అల్ ఫజ్ర్ [చదవండి] 089
90 అల్ బలద్ [చదవండి] 090
91 అష్ షమ్స్ [చదవండి] 091
92 అల్ లైల్ [చదవండి] 092
93 అజ్ జుహా [చదవండి] 093
94 అలమ్ నష్రహ్ [చదవండి] 094
95 అత్ తీన్ [చదవండి] 095
96 అల్ అలఖ్ [చదవండి] 096
97 అల్ ఖద్ర్ [చదవండి] 097
98 అల్ బయ్యినహ్ [చదవండి] 098
99 అజ్ జిల్ జాల్ [చదవండి] 099
100 అల్ ఆదియాత్ [చదవండి] 100
101 అల్ ఖారిఅహ్ [చదవండి] 101
102 అత్ తకాసుర్ [చదవండి] 102
103 అల్ అస్ర్ [చదవండి] 103
104 అల్ హుమజహ్ [చదవండి] 104
105 అల్ ఫీల్ [చదవండి] 105
106 ఖురైష్ [చదవండి] 106
107 అల్ మాఊన్ [చదవండి] 107
108 అల్ కౌసర్ [చదవండి] 108
109 అల్ కాఫిరూన్ [చదవండి] 109
110 అన్ నస్ర్ [చదవండి] 110
111 అల్ లహబ్ [చదవండి] 111
112 అల్ ఇఖ్లాస్ [చదవండి] 112
113 అల్ ఫలఖ్ [చదవండి] 113
114 అన్ నాస్ [చదవండి] 114

అయతుల్ కుర్సీ Ayat-al-Kursi


اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ  యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము  మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా  య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).

ఆయన  అల్లాః . ఆయన తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు . ఆయన హమేషా సజీవుడుగా వుంటాడు . అందరినీ  ఆదుకునే వాడు . ఆయనకు నిద్ర , కునుకూ రావు . భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే . ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు  చేసేవారు ఎవరున్నారు ?  ప్రాణులకు ముందూ వెనుకలలో ఏమున్నదో ఆయన ఎరుగు. ఆయన కోరిన మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమి గ్రహించలేరు . ఆయన పీటం భూమి ఆకాశాలను ఆవరించి వుంది . ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు . ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు .

సూరతుల్ ఫాతిహ (Sura al-Fatihah)

سُورَةُ الْفَاتِـحَةసూరతుల్ ఫాతిహా :001
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అర్రహ్మా నిర్రహీం
ప్రతి ఫల(తీర్పు)దినానికి యజమాని మాలికి యౌమిద్దీన్
మేము కేవలం నిన్నేఆరాధిస్తున్నాము మరియు సహాయం కోసం కేవలం నిన్నేఅర్థిస్తున్నాము ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
మాకు ఋజుమార్గం చూపించు ఇహ్..దీ నశ్శిరాతల్ ముస్తఖీం
అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ ఆగ్రహానికి గురి కానివారూ మరియు మార్గభ్రష్టులు కానివారూ నడిచిన మార్గము. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِالْحَمْدُ للّهِ رَبِّ الْعَالَمِينَ

الرَّحْمـنِ الرَّحِيمِ

مَالِكِ يَوْمِ الدِّينِ

إِيَّاكَ نَعْبُدُ وإِيَّاكَ نَسْتَعِينُ

اهدِنَــــا الصِّرَاطَ المُستَقِيمَ

صِرَاطَ الَّذِينَ أَنعَمتَ عَلَيهِمْ غَيرِ المَغضُوبِ عَلَيهِمْ وَلاَ الضَّالِّينَ

దివ్యఖుర్ఆన్ – అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ

The Noble Quran – a Miracle from Allah (Subhanahu wa Ta’ala)
రచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ – తఖీయుద్దీన్ అల్ హిలాలీ
అంశాల నుండి : కింగ్ ఫహద్ దివ్యఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్ (ముద్రణాలయం) సంస్థ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ ,పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్

క్లుప్త వివరణ: దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను

(సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ , తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన అంతిమ సందేశం) – ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల వెలుగులో………

[وَمَـا  كَانَ  هـٰــذَا  الْــقُــرْآَنُ   أَنْ  يُــفْــتَــرَى  مِـنْ دُوْنِ  اللهِ  وَلـٰـكِــنْ  تَــصْـدِيْـقَ  الَّذِي   بَــيْـنَ  يَــدَيْــهِ  وَتَــفْـصِـيْـلَ الْـكِـتـٰـبِ  لَا  رَيْــبَ فِــيْــهِ  مِـنْ  رَّبِّ  الْعـٰـلَـمِـيْـنَ] (3710:)

“మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ సంభవం కాదు: వాస్తవానికిది పూర్వగ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది: మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం: ఇది సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ తరుపు నుండి వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు!”

{ఖుర్ఆన్ 10వ అధ్యాయం ‘యూనుస్’ లోని 37వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

[وَ مَـنْ  يَـبْـتَـغِ  غَـيْـرَ الْإِسْـلَامِ  دِيْـنًا  فَـلَـنْ  يُـقْـبَـلَ  مِـنْـهُ  وَهُـوَ  فِــيْ  الْأَخِـرَ ةِ   مِـنَ  الْـخَـٰـسِـرِيْـنَ ]  (853:)

“మరియు ఎవరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించ బడదు మరియు అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు”

{ఖుర్ఆన్ 3వ అధ్యాయం ‘ఆలె ఇమ్రాన్’ (మర్యం తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబం) లోని 85వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

حدثنا عبدُ الله بنُ يُوسفَ : حدثنا الليث :حدثنا سعيد الـمقبري، عن أبيه، عن أبي هريرة قال:قال النبي ^ :(( ما مِنَ الأنبياءِ نَبيٌّ إلا أعطي من الآيات ما مِثله آمن عليهِ البَشرُ، وَإنَّمـا كان الَّذي أوتيتُـه وحيا أوحاهُ الله إليَّ،  فأرجُو أن أكُونَ أكثرَهُم تَابعاً يوم القِيامَـةِ)).

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 379వ హదీథ్ లో నమోదు చేయబడిన అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ప్రవక్తలలో అద్భుతాలు ఇవ్వబడని ప్రవక్తలు లేరు, వేటి వలనైతే ప్రజలు విశ్వసించేవారో. అలాగే నాకు ఈ దివ్యవాణి (ఒక మహిమగా) ఇవ్వబడినది దేనినైతే అల్లాహ్ నా పై అవతరింపజేసాడో. కాబట్టి, పునరుత్థాన దినమున వేరే ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్య కంటే నా అనుచరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను”

حدثنا محمد بن عبادة : أخبرنا يزيد : حدثنا سليم بن حيان، وأثنى عليه : حدثنا سعيد بن ميناء: حدثنا أو سمعت جابر بن عبدالله يقول: جاءت ملا ئكة إلى النبي ^  و هو نائم، فقال بعضُهم : إنه نائم ، وقال بعضهم :إن العين نائمة والقلب يقظان، فقالوا : إنَّ لصا حبكم هذا مثلاً، فاضربوا له مثلاً، فقال بعضهم : إنه نائم، و قال بعضهم : إنَّ العين نائمةٌ، والقلب يقظان، فقالوا: مثله كمثل رجل بنى داراً، وجعل فيها مأدبة وبعث داعياً، فمن أجاب الداعي دخل الدار وأكل من المأدبة، ومن لم يجب الداعي لم يدخل الدار و لم يأكل من المأدبة. فقالوا : أوَّلوها  له يفقهها، فقال بعضهم : إنه نائم، وقال بعضهم إن العين نائمة والقلب يقظان، فقالوا : فالدار، الجنة، والداعي محمد ^ ،  فمن أطاع محمداً  ^ فقد أطاع الله، ومن عصى محمداً   ^    فقد عصى الله،  و محمد ^  فرق بين الناس.  تابعه قتيبة، عن ليثٍ، عن خالدٍ، عن سعيد بن أبي هلالٍ، عن جابرٍ: حرج علينا النبي ^.

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 385వ హదీథ్ లో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు-

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుకుని ఉన్నప్పుడు కొందరు దైవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఇలా పలికారు “ఆయన నిద్ర పోతున్నారు”. అప్పుడు మిగిలిన వారు ఇలా వ్యాఖ్యానించారు “ఆయన కళ్ళు నిద్ర పోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది”. అప్పుడు వారిలా పలికారు “మీ యొక్క ఈ సహచరుడిలో ఒక నిదర్శనం ఉన్నది”. ఆ తర్వాత వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన లోని నిదర్శనాన్ని కనిబెడదాం” అప్పుడు వారిలోని మరొక దైవదూత ఇలా జవాబిచ్చారు “ఆయన నిద్రపోతున్నారు” మరొక దైవదూత మళ్ళీ “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అని తిరిగి పలికారు.

అప్పుడు వారిలా పలికారు “ఆయనలోని నిదర్శనం (ఉదాహరణ) ఇలా ఉన్నది – క్రొత్తగా ఇల్లు కట్టిన ఒక వ్యక్తి, విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రజలను ఆహ్వానించటానికి దూతను (వార్తాహరుడిని) పంపినాడు. అప్పుడు ఎవరైతే ఆ దూత యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఆ ఇంటిలో ప్రవేశించారో, వారు విందు భోజనం ఆరగించారు (తిన్నారు). ఇంకా ఎవరైతే ఆ వార్తాహరుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదో, వారు ఆ ఇంటిలో ప్రవేశించనూ లేదు మరియు విందు భోజనం తిననూ లేదు” అప్పుడు మిగిలిన దైవదూతలు ఇలా పలికారు “ఈ దృష్టాంతాన్ని (ఉదాహరణను) ఆయనకు వివరించినట్లయితే, ఆయన కూడా దీనిలోని నిగూఢార్థాన్ని తెలుసుకోగలరు” అప్పుడు వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన నిద్రపోతున్నారు” మిగిలిన వారు మళ్ళీ ఇలా పలికారు “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అప్పుడు వారు మళ్ళీ ఇలా పలికారు “ఉదాహరణలోని క్రొత్త ఇల్లు స్వర్గానికి ఉపమానంగా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు భోజనానికి పిలిచిన దైవదూత (వార్తాహరుడు) కు ఉపమానంగా మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విధేయతగా అనుసరిస్తారో, వారు అల్లాహ్ ను విధేయతగా అనుసరించినట్లే. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపుతారో, వారు అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యసందేశం ద్వారా ప్రజలలోని దైవభక్తులను వేరు చేసారు, చెడు నుండి మంచిని వేరుపర్చారు మరియు అవిశ్వాసుల నుండి విశ్వాసులను విడదీశారు”

حدَّثنا مُحَمَّد بن سِنانٍ: حدَّثنا فليح بن سليمان: حدَّثنا هلال بن علي‘ عن عبد الرَّحمنِ بنِ أبي عمرة، عن أبي هريرة قال : قال رسول الله^: أنا أوْلى النَّاسِ بعيسى ابنِ مريم في الدُّنيا والآخرة، والأنبِـياء إخوةٌ لعَلاَّت، أُمَّهاتهم شتَّى ودينهم واحد. وقال إبراهيم بن طهمان، عن موسى بن عُقبة، عن صفوان بن سُليم، عن عطاء بن يسار، عن أبي هريرة رضي الله عنه قال :قال رسول الله ^

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 4వ గ్రంథపు 652వ హదీథ్ లో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఈ లోకంలోను మరియు పరలోకంలోను మర్యం కుమారుడైన ఈసా-యేసు (అలైహిస్సలాం) కు మొత్తం మానవజాతిలో నేనే అత్యంత దగ్గరి వాడిని. ప్రవక్తలు తండ్రి తరుపున సోదరులు, వారి తల్లులు వేరు, కాని వారి ధర్మం ఒక్కటే (అదే ఏకైక దైవారాధన)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరుడనే సత్యాన్ని  (Prophethood ను) తప్పక విశ్వసించవలెను.

حدَّثني يونس بن عَبدالأعلى: أخبرنا ابنُ وهْب قال: وأخبرني عمرو أنَّ أبا يونس حدَّثه عن أبي هُريرة عن رسول الله صلّى الله عليه و سلَّم أنَّه قال: والذي نَفْس مُحمَّد بِيده لا يَسمَعُ بِي أحدٌ من هذه الأُمَّةِ يهودي ولا نصراني ثمَّ يموت ولم يؤمن بالذي أُرسلْتُ بِه إلاَّ كان من أصحاب النَّار. (رواه مسلم في كتاب الإيمان)

సహీహ్ ముస్లిం హదీథ్ సంకలనంలోని – విశ్వాసమనే మొదటి హదీథ్ గ్రంథపు 24వ భాగంలో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఎవరి చేతిలో ముహమ్మద్ యొక్క ఆత్మ ఉన్నదో ఆయన (అల్లాహ్) సాక్షిగా, యూదులలో మరియు క్రైస్తవులలో నా గురించి విని, ఏ దివ్యసందేశంతో (ఏకైక దైవారాధనా సందేశం) నేను పంపబడినానో, దానిని విశ్వసించకుండా చనిపోయే వారెవరూ ఉండరు. కాని వారిలో ఎవరైతే అలా విశ్వసించక చనిపోతారో, వారు నరకాగ్ని నివాసులుగా మిగిలిపోతారు.”

(ఖుర్ఆన్ లోని 3:116వ వచనం కూడా చూడండి)