Qur'an Telugu – Surah 92. AL-Layl (The Night) – Youtube Video

Qur'an Telugu – Surah 29. Al Ankaboot (The Spider) – Youtube

Qur’an Telugu – Surah 29. Al Ankaboot (The Spider)

పరిచయం :
ఇది మక్కాలో అవతరించిన సూరా. ఇందులో 69 ఆయతులు ఉన్నాయి. ఎకధైవారాధన, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడటం, ప్రవక్తలందరినీ విశ్వసించడం, వారు తీసుకు వచ్చిన దైవగ్రంధాలన్నింటిని విశ్వసించడం మొదలైన మౌలిక ధార్మిక విశ్వాసాలను ఇందులో నొక్కిచెప్పడం జరిగింది. ఈ సూరాలో సాలీడు గురించి, దాని సాలెగూటి గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. అవిశ్వాసులకు – సాలీడుకు మధ్య పోలికలు చెప్పడం జరిగింది. సాలీడు ఒక బలహీనమైన ప్రాణి, అది తన బలహీనమైన సాలెగూటిలో రక్షణ పొందాలని చూస్తుంది. కాని ఈ సాలెగూడు దానిని బయటి ప్రమాదాల నుంచి కాపాడలేదు. అదేవిధంగా అవిశ్వాసులు కూడా బలహీనమైనవారు, తాము ఆరాధించే బలహీనమైన, సామర్ధ్యం లేని విగ్రహాల ద్వారా రక్షణ పొందాలని చూస్తున్నారు. ఈ కుహనా దేవుళ్ళుకాని, మానవులు కాని, కలపతో లేదా రాళ్ళతో చేయబడిన దేవుళ్ళు కాని అవిశ్వాసులకు రక్షణ ఇవ్వలేరు. వారి ప్రయోజనాలు కాపాడలేరు. వారికి హాని కూడా కలిగించలేరు. కాగా విశ్వాసులు విశ్వప్రభువు, సర్వ శక్తిసంపన్నుడైన అల్లాహ్ ను రక్షణ కోరుతారు. అల్లాహ్ వారికి బహుమానాలు ప్రసాదించే శక్తికలిగినవాడు, అహంభావులకు, దేవునికి భాగస్వాములను కల్పించిన వారికి శిక్ష విధించే సామర్ధ్యం కలిగినవాడు.

అల్లాహ్ కే గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని ఈ సూరా క్లుప్తంగా తెలియజేసింది. ఆయనకున్న శక్తిసామర్ధ్యాలను స్పష్టం చేసింది. అల్లాహ్ ఈ సృష్టిని ప్రారంభించాడు. ఆయనే దీనిని మళ్ళీ పునరావృత్తం చేస్తాడు. ఆయన స్వర్గాన్ని, భూమిని ఒక ఉద్దేశ్యంతో సృష్టించాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం ఆయనకు తెలుసు.

Telugu Qur'an – Surah Al Sajdah – Youtube Video

Telugu Qur'an – Surah Al-Zukhruf – Youtube Video

అజ్ జుఖ్ రుఫ్ (బంగారు ఆభరణాలు) సూరా  పరిచయం

Telugu Quran: 18 Surah Al-Kahf : Youtube Video

అల్ కహఫ్ (గుహ) సూరా పరిచయం : ఆహ్సనుల్ బయాన్ తఫ్సీర్ నుండి:

ఈ సూరా మక్కా కాలానికి చెందినా సూరా. ఈ సూరా ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను చర్చించింది. అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల, మరణానంతర జీవితం పట్ల విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్చ ఉద్దేశించింది. ప్రారంభ వచనాలు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఆయన మహొన్నత వ్యక్తిత్వాన్ని చాటిచెప్పాయి.

ఈ సూరాలోని 9 వ ఆయతులో ఒక గుహలో నిద్రపోయిన కొందరు విశ్వాసుల ప్రస్తావన ఉంది. ఈ కదా ఒక అద్భుతమైన సంఘటనను తెలిపింది. వారి సుదీర్ఘమైన నిద్ర దేవుని మహాత్యాలలో ఒకటి. ఈ కధ ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. వారు కొందరు యువకులు. బహుధైవారాధనను  తిరస్కరించిన యువకులు. విగ్రహాలను లేక ఇతర దేవుళ్ళను ఆరాధించడాన్ని ఇష్టపడని యువకులు. అందువల్ల దౌర్జన్యాలకు గురయిన ఆ యువకులు తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయి వచ్చారు. వారు ఒక గుహలోకి వచ్చి నిద్రపోయారు. అలాగే నిద్రలో దాదాపు 309 సంవత్సరాలు గడిపారు. కాని వారు నిద్రలేచి తాము మహా అయితే కొన్ని గంటలు నిద్రపోయి ఉంటామని భావించారు. గుహలో నిద్రపోయిన ఆ యువకులు అల్లాహ్ ను విశ్వసించిన యువకులు. అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ అర్ధించనివారు. వారి కధ త్యాగాన్ని, స్థిరచిత్తాన్ని, అల్లాహ్ పట్ల ధృడమైన విశ్వాసాన్ని, సత్యం కోసం పోరాడటాన్ని ప్రతిబింబిస్తుంది. గుహలో వారి సుదీర్ఘ నిద్ర మరణాన్ని, మరణానంతరం మళ్ళీ లేపడాన్ని సూచిస్తుంది. మరణం, మరణానంతర జీవితం రెండూ అనివార్యమైనవిగా తెలుపుతుంది.

ఈ సూరాలో మూసా (అలైహిస్సలాం) గురించిన కధ కూడా ప్రస్తావించబడింది. ధైవప్రవక్తగా, దేవుని సందేశాన్ని తీసుకువచ్చిన మహానీయునిగా అత్యున్నత స్థానం కలిగినప్పటికీ మూసా ప్రవక్త (అలైహిస్సలాం) జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలన్న కుతూహలం మెండుగా కలిగినవారు, ఆయన మరో వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మూసా ప్రవక్త(అలైహిస్సలాం) ఖిజర్ అనే మహనీయుని నుంచి జ్ఞానబోధ స్వీకరించడానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పినట్లు సహనం వహించడానికి ప్రయత్నించారు.

ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన మూడో కధ జుల్ ఖర్ నైన్ కు సంబంధించినది. ఆయన న్యాయశీలుడైన గొప్ప పాలకుడు. ఒక పొరుగు దేశం ప్రజలు ఆయనకు మొరపెట్టుకొని, తమపై దాడులు చేస్తున్న అరాచక, అనాగరిక
జాతులు యాజూజ్, మాజూజ్ ల నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోరారు. బలహీనమైన పొరుగువారిని కాపాడటానికి ఆ న్యాయశీలుడైన రాజు సంకల్పించాడు. యాజూజ్,మాజూజ్ ల నుంచి వారిని రక్షించటానికి ఒక ధృడమైన గోడను నిర్మించాడు. ఈ సూరా తౌహీద్ (ఏక దైవారాధన)గురించి బలంగా చెబుతూ ముగుస్తుంది.

Telugu Qur’an : Surah Al Mu’minoon- [Video : Ar – Telugu Subtitles]

అల్-మూ’మినూన్(విశ్వాసులు) సూరా పరిచయం: ఆహ్సనుల్ బయాన్ నుండి

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 118 ఆయతులు ఉన్నాయి. ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ముఖ్య సూత్రాలను ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది. తౌహీద్ (ఏకధైవారాధన), ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడటం వంటి విశ్వాసాలను ఇందులో ప్రభావవంతంగా ప్రస్తావించటం జరిగింది. ఈ సూరా ప్రారంభంలో విశ్వాసుల గురించి, వారి గుణగణాల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టటం జరిగింది.

ఈ సూరాలో ప్రస్తావించబడిన విశ్వాసుల గుణగణాలు:
– వారు తమ నమాజుల్లో అణకువగా ఉంటారు.
– వ్యర్ధ ప్రసంగాలకు దూరంగా ఉంటారు.
– జకాత్ చెల్లిస్తారు.
– అక్రమ సంబంధాలకు పాల్పడరు.
– తమకు అప్పగించబడిన వాటి విషయంలో నిజాయితీగా ఉంటారు.
– తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు.
– తమ నమాజులను ఖచ్చితంగా పాటిస్తారు.

ఈ సూరా అవిశ్వాసుల గుణగుణాలను వర్ణించింది. వారు పరిధులు అతిక్రమించేవారు, జ్ఞానం లేనివారు, అహంభావులు,అయోమయానికి గురయిన వారు,వారు అల్లాహ్ ను విశ్వసించడానికి నిరాకరించినవారు, దేవుని చిహ్నాలపై ఆలోచించడానికి సిద్ధపడని వారు, సత్యాన్ని అసహ్యించుకుంటారు, రుజుమార్గం నుంచి తప్పుకుంటారు, వారు దేవుడు పంపిన ప్రవక్తలను తిరస్కరిస్తారు, ప్రవక్తలు పిచ్సివారని, మంత్రగాళ్ళని ఆరోపిస్తారు.

077 Al-Mursalaat – Telugu Quran – Youtube Video

అహ్సనుల్ బయాన్ :
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 50 ఆయతులు ఉన్నాయి.ఈ సూరాలో ముఖ్యంగా ప్రళయం,మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురుంచి ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో వచ్చింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది తప్పనిసరిగా జరిగే సంఘటన అని ఈ సూరా నొక్కి చెప్పింది.ఆ రోజున నక్షత్రాలు మసకబారి పోతాయి.ఆకాశం తునా తునకలవుతుంది.పర్వతాలు దుమ్ము మాదిరిగా  ఎగురుతాయి.ఆ రోజున ప్రవక్తలందరినీ పిలిచి వారు అల్లాహ్ సందేశాన్ని మానవాళికి అందించటం జరిగిందా లేదా  అన్న విషయమై వాంగ్మూలం ఇవ్వమని కోరడం జరుగుతుంది.

ఈ సూరాలో అల్లాహ్ శక్తి సామర్ధ్యాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మరణించిన తరువాత మళ్ళీ లేపడం ఆయనకు చాలా తేలికని నిరూపించడం జరిగింది. సత్యతిరస్కారుల వాదన అసత్యంగా  రుజువవుతుందని చెప్పడం జరిగింది. తీర్పు దినాన్ని చాలా కఠినమైన రోజుగా, దుస్థితి దాపురించే రోజుగా అభివర్ణించటం జరిగింది. ఆ రోజున భారీ నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఆ రోజున సత్యతిరస్కారులు మాట్లాడే స్థితిలో ఉండరు. వారికి ఎలాంటి సాకులు చెప్పే అనుమతి కూడా ఉండదు. దైవభీతి కలిగిన వారు చల్లని నీడలో,సెలయేర్లతో,వివిధ రకాల ఫలాలతో సంతోషాన్ని పొందుతారు.