సూరహ్ అల్ మా’ఊన్ (సూరహ్ నం.107) అనువాదం, వ్యాఖ్యానం [ఆడియో]

బిస్మిల్లాహ్

ఈ సూరాను సూరయె దీన్‌గా, సూరయె అరఐత్‌గా, సూరయె యతీమ్‌గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్‌హుల్‌ ఖదీర్‌).

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్‌’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

1 తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు

2. కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచిపనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

[అహ్సనుల్ బయాన్ నుండి]


ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (35 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సూరతుల్ మాఊన్ – 107

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా? అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్ أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు. ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీం فَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారు వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు. ఫవైలుల్ లిల్ ముసల్లీన్ فَوَيْلٌ لِلْمُصَلِّينَ

 

5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారో అల్లదీన హుమ్ అన్ సలాహితిహిం సాహూన్ الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో, అల్లదీన హుమ్ యురాఊన్ الَّذِينَ هُمْ  يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో. వయంన ఊనల్ మాఊన్ وَيَمْنَعُونَ المَاعُونَ

అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు అన్హు) ప్రాముఖ్యత [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (25 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తౌబా (పశ్చాత్తాపం), ఇస్తిగ్ ఫార్ అంటే ఏమిటి? వాటి లాభాలు ఏమిటి? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: (40 నిమిషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్
ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్‌ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్‌ – ౩7)

మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్‌ – ౩)

“విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్‌ వైపుకు మరలండి.” (తహ్రీమ్‌ – 8)


దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)


ఇతరములు:

ఇస్లామీయ నిషిద్ధతలు: భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం

బిస్మిల్లాహ్

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం (anal sex)

కొందరు బలహీనవిశ్వాసులు తమ భార్యలతో మలమార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇలా చేసేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారని అబూ హురైరా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

anal-sex

“తన భార్యతో మలమార్గం ద్వారా సంభోగించేవాడిపై శాపం కురియుగాక”.
(అహ్మద్‌ 2/479, సహీహుల్‌ జామి 5865).

దీనికి ముందు పాఠంలోని హదీసులో ఉంది:

“రుతుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును”. (తిర్మిజి 135, సహీహుల్‌ జామి 5918).

స్వాభావిక గుణంగల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు అయితే భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి, ఈ విధానం యోగ్యమని ఖుర్‌ఆన్‌ యొక్క ఈ ఆయతు చూపుతారు:

Anal Sex

మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులు ఖుర్‌ఆన్‌ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి అన్న విషయం తెలిసినదే. నిశ్చయంగా దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, వెనక నుండి ఎలా వచ్చినా సరే, కాని సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి”. అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం తెలియనిది కాదు.

ఇంతటి ఘోరపాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటంటే: పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుష్చేష్టలకు, నిషిద్ధమైన భిన్నమైన, అసాధారణ పద్ధతులకు అలవాటు పడి, లేదా నీలచిత్రాల్లోని కొన్ని సంఘటనలు జ్ఞాపకశక్తిలో నాటుకొని ఉన్న వాటిని వదులుకోరు, అల్లాహ్‌తో స్వచ్ఛమైన తౌబా కూడా చేయరు.

భార్యభర్తలిద్దరూ ఏకమై ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే ఉంటుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మం సమ్మతం కాజాలదు.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇస్లాంలో సమాధి శిక్ష లేదా? [ఆడియో]

బిస్మిల్లాహ్

సమాధిలో అనుగ్రహాలు అనుభవించడం, లేదా శిక్షలు చవిచూడడం తిరస్కరించడానికి ఏ తావు లేని సత్యం అయినా కొందరు ఈ రోజుల్లో తిరస్కరించడానికి ఎలా సాహసిస్తున్నారో ఆశ్చర్యం కలుగుతుంది. సమాధి శిక్షల గురించి ఖుర్ఆన్, హదీసుల సంక్షిప్త సమాచారం తెలుగులో ఈ ఆడియోలో వినండి.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: [ 10 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


ఒక సందర్భంలో షేఖ్ బిన్ బాజ్ (సఊదీ Ex గ్రాండ్ ముఫ్తీ) రహిమహుల్లాహ్ గారితో ప్రశ్నించడం జరిగింది ‘కొందరు సమాధి శిక్షలను నమ్మట్లేదు, ఎందుకనగా దాని ప్రస్తావన ఖుర్ఆనులో లేదట? వారికి ఏదైనా ఉపదేశం చేయండి!‘

అందుకు షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇలా జవాబిచ్చారు:

సమాధి శిక్ష సత్యం, “తవాతుర్” (అంటే అసత్యం అన్న సందేహం లేని) సంఖ్యలో హదీసులున్నాయి, దీనిపై ముస్లిములందరీ ఏకాభిప్రాయం ఉంది. ఖుర్ఆనులో దీని గురించి ఆధారాలున్నాయి. ఉదాహరణకు చూడండి:

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ

(ఇదిగో) అగ్ని – దాని ఎదుట వారు ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. (ఇది సమాధి శిక్ష) మరి ప్రళయం సంభవించిననాడు, “ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి” (అని సెలవీయబడుతుంది). (దివ్య ఖురాన్ 40:46)

అల్లాహ్ సమాధి మరియు నరక శిక్షల నుండి రక్షించుగాక.

చెప్పే విషయం ఏమిటంటే: సమాధి శిక్షలను తిరస్కరించే వ్యక్తికి తౌబా చేయమని చెప్పాలి.అతను తౌబా చేయడానికి ఒప్పుకోక పోతే (ఇస్లామీయ ప్రభుత్వంలో) అతడ్ని కాఫిర్ గా డిక్లేర్ చేసి చంపేసెయ్యాలి. (అతని దుర్మార్గం ప్రబలకుండా). అల్లాహ్ ఇలాంటి దుర్గతి నుండి కాపాడుగాక.

https://binbaz.org.sa/fatwas/9795/حكم-من-ينكر-عذاب-القبر-لانه-لم-يذكر-في-القران

కృతజ్ఞుడైన ధనవంతుడు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )

బిస్మిల్లాహ్

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు :

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ

ఎవరు (దైవమార్గంలో) ధనాన్ని వినియోగించాడో, (దైవ అవిధేయతకు) భయపడ్డాడో, మంచిని సత్యమని అంగీకరించాడో అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. (అల్‌ లైల్‌ 92:5 – 7)

وَسَيُجَنَّبُهَا الْأَتْقَى الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ وَلَسَوْفَ يَرْضَىٰ

పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చు చేసే పరమ దైవభీతిపరుడు దానికి (నరకానికి) దూరంగా ఉంచబడతాడు. అతనికి ఎవ్వరూ ఏ విధమైన ఉపకారం చెయ్యలేదు, దానికి అతను బదులు తీర్చేందుకు. అతను కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. ఆ ప్రభువు తప్పకుండా అతడంటే సంతో షిస్తాడు. (అల్‌ లైల్‌ 92: 17 – 21)

إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

“మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరు పేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ వల్ల జరిగిన దుష్కార్యాలెన్నో దానివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహ్‌కు తెలుస్తుంది. (అల్‌ బఖర 2: 271)

لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (దైవమార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” (ఆలి ఇమ్రాన్‌ 3: 92)


وعن عبد الله بن مسعود رضي الله عنه قال‏:‏ قال رسول الله صلى الله عليه وسلم ‏:‏ “ لا حسد إلا فى اثنتين ‏:‏ رجل آتاه الله مالاً ، فسلطه على هلكته فى الحق، ورجل آتاه الله حكمة فهو يقضي بها ويعلمها” ‏(‌‏(‏متفق عليه وتقدم شرحه قريباً‏)‌‏)‏ ‏.‏

571. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. వారిలో ఒకడు : అల్లాహ్ సిరిసంపదలను ప్రసా దించి, వాటిని సత్యమార్గంలో ఖర్చుపెట్టే సద్బుద్దిని ప్రసాదించినవాడు. రెండో వ్యక్తి: అల్లాహ్ విజ్ఞతా వివేచనాలను ప్రసాదిస్తే వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ వివేచనను ఇతరులకు కూడా బోధించేవాడు. (బుఖారీ – ముస్లిం)

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇందులోని విషయం సదరు అధ్యాయానికి కూడా వర్తిస్తుండటంతో దీనిని మళ్లీ ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. అల్లాహ్‌ ఎవరికైనా ధనం ఇస్తే వారు అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్‌ ఆదేశించిన మార్గంలో ఆ ధనాన్ని ఖర్చుపెడితే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నట్లవుతుంది. అదేవిధంగా విద్యను అభ్యసించిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడమే ఆ దైవానుగ్రహానికి కృతజ్ఞతలు! మరో విషయం, ఇతరులకు మంచి చేసే ఉద్దేశ్యంతో విద్యనభ్యసించాలనీ, ధనం సంపాదించాలని ఆశపడటంలో తప్పులేదు.


572. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరిపట్లా అసూయ చెందరాదు. ఒకరు: అల్లాహ్ ఖుర్‌ఆన్‌ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండోవాడు: అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (దైవమార్గంలో) ఖర్చుపెట్టే వ్యక్తి. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం)

ముఖ్యాంశాలు

ఇంతకు ముందు హదీసులో ఇక్కడ ‘ఖుర్‌ఆన్‌’ అని చెప్పినచోట ‘వివేచనం’ అన్న పదం వాడబడింది. ‘వివేచనం’ అన్నా ‘ఖుర్‌ఆన్‌’ అన్నా అర్ధం ఒక్కటే! ఖుర్‌ఆన్‌ను ఆచరించటం అనే మాటలో దాన్ని పారాయణం చేయటం, దాన్ని ఇతరులకు బోధించటం, దాని ఆధారంగా తీర్పులు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేయటం అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా పై రెండు హదీసులకూ భావం ఒక్కటే.


573. హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం : ముహాజిర్లలో పేద ప్రజలైన కొంతమంది ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చి, “(దైవప్రవక్తా!) ధనికులు (మాకన్నా) గొప్ప స్థానాలను, శాశ్వత సుఖాలను పొందుతారు” అని అన్నారు. “అదెలాగూ?” అని అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికి వారు సమాధానమిస్తూ, “వారూ మాలాగే నమాజులు చేస్తున్నారు. ఉపవాసాలు పాటిస్తున్నారు. అయితే వారు దానధర్మాలు కూడా చేస్తున్నారు. కాని (స్తోమత లేనికారణంగా) మేము (దానధర్మాలు) చేయటం లేదు. వారు బానిసల్ని కూడా విడిపిస్తున్నారు. మేము ఆ పని చేయలేకపోతున్నాం” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అయితే నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు పాటిస్తే, మిమ్మల్ని మించిపోయినవారి స్థాయికి మీరూ చేరుకుంటారు. మీ తరువాత వచ్చిన వారికంటే కూడా మీరు మించిపోతారు. మీ పద్ధతిని పాటించేవారు తప్ప మీకన్నా శ్రేష్ఠులు మరెవ్వరూ ఉండబోరు” అని అన్నారు.

“తప్పకుండా తెలియజేయండి దైవప్రవక్తా!” అని విన్నవించుకున్నారు సహచరులు. అప్పుడాయన “ప్రతి నమాజు తరువాత “సుబ్‌హానల్లాహ్‌”, “అలిహందులిల్లాహ్”, “అల్లాహు అక్బర్‌” అని (ప్రతి ఒక్కటి) ముఫ్ఫై మూడుమార్లు చొప్పున పఠించండి” అని అన్నారు. (పేద ప్రజలు దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు. కొంతకాలానికి ధనికులకు కూడా ఆ విషయం తెలిసి పోయింది. వాళ్ళు కూడా దాన్ని పాటించసాగారు). అప్పుడు ముహాజిర్‌ నిరుపేదలు మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి, “మేము చేస్తున్నది ధనిక సోదరులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళూ మాలాగే దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు” అని ఫిర్యాదు చేసుకున్నారు. దానికాయన “అది అల్లాహ్ అనుగ్రహం. అల్లాహ్ తాను కోరినవారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు” అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

(వాక్యాలు మాత్రం ముస్లింవి).

(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)


హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
64.   కృతజ్ఞుడైన ధనవంతుడు

అల్లాహ్ పై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[ 15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]