ముహర్రం దురాచారాలు – గౌరవప్రదమైన మాసాల్లో ‘దౌర్జన్యం’ చేసుకోకండి [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/vycr]
[6 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

దీనికి సంబంధించిన పోస్టులు:

వడ్డీ తినుట

బిస్మిల్లాహ్

అల్లాహ్‌ తన దివ్య గ్రంథంలో వడ్డీ తినేవారితో తప్ప మరెవ్వరితోనూ యుద్ధ  ప్రకటన చేయలేదు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ

“విశ్వసించిన ప్రజల్లారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే, అల్లాహ్‌కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీపై అల్లాహ్‌ తరపున ఆయన ప్రవక్త తరపున యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి.” (సూరహ్ బఖర 2: 278, 279).

ఇది అల్లాహ్‌ వద్ద ఎంత చెడ్డ పాపమో తెలియుటకు పై ఆయతులే చాలు.

ప్రజలు, ప్రభుత్వాలు వడ్డీ కారణంగా వినాశపు చివరి హద్దులోకి చేరుకున్నాయన్న నిజాన్ని వాటిపై దృష్టిసారించిన వ్యక్తి గమనించగలడు. వడ్డీ వ్యవహారాల వలన దారిద్య్రం, మార్కెట్లో సరుకు రాకపోవుట, ఆర్ధిక దివాలా , అప్పులు చెల్లించే స్థోమత లేకవోవుట, జీవనాభివృద్ధిలో ఆటంకాలు, నిరుద్యోగ సమస్యలు పెరుగుట, అనేక కంపెనీలు, ఆర్ధిక సంస్థలు మూతబడుట, ఇంకా రోజువారి కష్టార్జితము, చెమట ధారాపోసి సంపాదించే సంపాదన కూడా వడ్డీ తీర్చడానికి సరిపడకపోవుట చూస్తునే ఉన్నాము. లెక్కలేనంత ధనం కొందరి చేతుల్లో తిరగటం వలన సమాజంలో వర్గాల తారతమ్యం ఉత్పన్నమవుతుంది. వడ్డీ వ్యవహారంలో పాల్గొన్న వారికి అల్లాహ్‌ హెచ్చరించిన యుధ్ధ రూపాలు బహుశా ఇవేకావచ్చు.

ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏవిధంగానైనా వడ్డీ వ్యవహారం చేసే వారినీ, అందుకు సహాయం చేసే వారినీ (దలాలి, ఏజెంట్‌) అందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు:

వడ్డీ

“వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).

ఈ హదీసు ఆధారంగా వడ్డీ ఇచ్చిపుచ్చుకొనుట, వడ్డీ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేయుట, వడ్డీ వ్యవహారాల్లో క్లర్కుగా, దాని లావాదేవీలు రిజిస్టర్‌ చేయుటకు, మరియు అందులో వాచ్‌ మేన్‌గా ఉద్యోగం చేయుట యోగ్యం కాదు. వాస్తవం ఏమిటంటే వడ్డీకి సంబంధించిన ఏ వ్యవహారంలో కూడా, ఏ విధంగానైనా పాల్గొనుట నిషిద్ధం.

ఘోరపాపంతో కూడిన ఈ చెడును ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎంత స్పష్టంగా చెప్పారో, అబ్దుల్లాహ్ బిన్‌ మస్ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

వడ్డీ

“వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్‌ హాకిం: 2/37, సహీహుల్‌ జామి: 3533. ).

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పినట్లు అబ్దుల్లాహ్ బిన్‌ హంజలా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

వడ్డీ

బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్‌: 5/225, సహీహుల్‌ జామి:3375).

వడ్డీ అందరిపై నిషిద్ధం. బీదవాళ్ళ, ధనికుల మధ్య ఏలాంటి తేడా లేదు. తేడా ఉంది అని కొందరనుకుంటారు. కాని అది తప్పు. అందరిపై, అన్ని పరిస్థితుల్లోనూ నిషిద్ధం. పెద్ద పెద్ద వ్యాపారులు, ధనికులు దీని వల్లే దీవాలా తీస్తున్నారు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

వడ్డీ ద్వారా వచ్చే ధనం చూడడానికి ఎక్కువ కనబడినా ఆ ధనంలో బర్కత్‌ (శుభం) అనేది నశించిపోతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

వడ్డీ

“వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్‌: 2/37, సహీహుల్‌ జామి: 3542.)

వడ్డీశాతం పెరిగినా లేక తరిగినా, ఎక్కువ ఉన్నా లేక తక్కువ ఉన్నా తీసుకోవడం, తినడం ఎట్టిపరిస్థితుల్లోనూ యోగ్యం కాదు. అన్ని విధాలుగా నిషిద్ధం. వడ్డీ తినే వ్యక్తి ఉన్మాది వలే ప్రళయదినాన నిలబడతాడు. ఇది ఎంత చెడు అయినప్పటికి అల్లాహ్‌ తౌబా చేయమని ఆజ్ఞాపించి, దాని విధానం కూడా స్పష్టం చేశాడు. వడ్డీ తినేవారిని ఉద్దేశించి ఇలా ఆదేశించాడు:

فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ

ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడి (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. (సూరహ్ బఖర 2: 279).

ఇదే వాస్తవ న్యాయం.

విశ్వాసుని మనుస్సు ఈ ఘోరపాపాన్ని అసహ్యించుకొనుట, దాని చెడును గ్రహించుట తప్పనిసరి. దొంగలించబడే లేక నష్టమయ్యే భయం లాంటి గత్యంతరంతో వడ్డీఇచ్చే బ్యాంకుల్లో తమ సొమ్మును డిపాజిట్‌ చేసే వాళ్ళు, వారి గత్యంతరం ఎంతమటుకు ఉంది, గత్యంతరంలేక మరణించిన జంతువును తినువారి లాంటి లేదా అంతకంటే కఠిన స్ధితిలో ఉన్నారా? అనేది గ్రహించాలి. అందుకు అల్లాహ్‌ క్షమాపణ కోరుతూ ఉండాలి. ఎంత సంభవమైతే అంత వరకు (దాని నుండి దూరమై) దాని స్థానంలో వేరే (ధర్మ సమ్మతమైన) ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం తమ సొమ్ము ఉన్న బ్యాంకుల నుండి తమ సొమ్ముపై రావలసిన వడ్డీని వారితో అడగకూడదు. వారు స్వయంగా తన అకౌంటులో జమ చేస్తే దాన్ని దానం ఉద్దేశంతో కాకుండా ఆ పాపపు సొమ్ముతో తన ప్రాణం వదులుకొనుటకు (కడు బీదవారికి) ఇచ్చేయాలి. నిశ్చయంగా అల్లాహ్‌ పవిత్రుడు. పవిత్రమైన వాటినే స్వీకరి స్తాడు. దాని నుండి స్వలాభం పొందడం ఎంత మాత్రం యోగ్యం కాదు. తినుత్రాగు, ధరించు ప్రయాణ ఖర్చు రూపంలో గాని లేక గృహనిర్మాణం లేక అతనిపై విధిగా ఉన్న భార్యబిడ్డల, తల్లిదండ్రుల ఖర్చు రూపంలోగాని లేక అందులో నుంచి జకాత్‌, ట్యాక్స్‌ వగైరా చెల్లించడానికిగాని లేక కనీసం తనపై జరిగిన అన్యాయాన్ని దూరం చేయడానిక్కూడా దాన్ని ఉపయోగించరాదు. కేవలం అల్లాహ్‌ యొక్క బహుగట్టి పట్టు నుండి తప్పించుకోడానికి ఎవరికైనా ఇచ్చివేయాలి.

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకుబడింది]

దీనికి సంబంధించిన  పోస్టులు:

 

పురుషులు బంగారం వేసుకొనుట

బిస్మిల్లాహ్

పురుషులు బంగారం వేసుకొనుట

బంగారం ఏ రూపంలో ఉన్నా దానిని పురుషులు వాడుట నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో అబు మూసా అష్‌అరి (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ఉంది:

పురుషులు బంగారం వేసుకొనుట

“బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురుషులకు నిషిద్ధం”.
(ముస్నద్‌ అహ్మద్‌: 4/393. సహీహుల్‌ జామి 207).

ఈ రోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్‌ పేరుతో బంగారపు లేక బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నవి. ఇంకా పురుషులకు స్వర్ణగడియారం అని కొన్ని కాంపిటిషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

పురుషులు బంగారం వేసుకొనుట

అబ్దుల్లాహ్ బిన్‌ అబ్బాస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు”. అప్పుడు అతనన్నాడు: “లేదు. అల్లాహ్‌ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను” (ముస్లిం 2090).

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకుబడింది]

వుజూ ఘనత, విధానం, దానిని భంగపరుచు విషయాలు (فضل الوضوء وكيفيته و نواقضه) [వీడియో]

బిస్మిల్లాహ్

వుజూ చేయడమే కాదు, దాని ఘనతలను తెలుసుకొని మరీ వుజూ చేయడం ద్వారా పుణ్యాలు పెరుగుతాయి. అందుకే ఇందులో వాటి ఘనతలతో పాటు ఏ విషయాలు వుజూ భంగమగుటకు కారణం అవుతాయో కూడా తెలుసుకుంటారు.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/wMXq]
[27 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


ఇతరములు:

మేజోళ్ళ (సాక్స్) పై మసహ్ (المسح على الخفين) [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లాం ధర్మం యొక్క మానవజాతిపై ఉన్న అనేకానేక వరాల్లో, కారుణ్యాల్లో ఒక్క గొప్ప వరం, కారుణ్యం మేజోళ్ళ (సాక్స్ లు, బూట్లు )పై మసహ్ (తుడవడం) చేయుటకు అనుమతివ్వడం. అయితే ఎవరు ఏ సందర్భంలో చేయాలో ఇందులో మీరు తెలుసుకోగలరు.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/BJXq]
[27 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


మేజోళ్ళ పై ‘మసహ్‌ ‘

ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్‌’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్‌’ చేసేవారని రుజువైనది.

మేజోళ్ళ (సాక్స్) పై మసహ్ (المسح على الخفين)

అమ్ర్  బిన్‌ ఉమయ్య చెప్పారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపై ‘మసహ్‌’ “చేస్తున్నది నేను చూశాను. (బుఖారి 205).

మేజోళ్ళ (సాక్స్) పై మసహ్ (المسح على الخفين)

ముగీరా బిన్‌ షాఅబ చెప్పారు: ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు,  అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్‌’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274)

వాటి పై ‘మసహ్‌’ చేయుటకు ఒక నిబంధన ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్‌’ చేయాలి, క్రింది భాగాన కాదు.

ఇక ‘మసహ్‌ ‘ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్‌ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్‌’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).

‘మసహ్‌’ భంగమయ్యే కారణాలు: గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్‌’ భంగమైపోతుంది. ‘మసహ్‌’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్‌’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్‌’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]


ఇతరములు :

అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి [పుస్తకం]

బిస్మిల్లాహ్

అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి
పుస్తకం చదవడం కోసం పైన బొమ్మ మీద క్లిక్ చెయ్యండి

అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి
ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [PDF] [291 పేజీలు ]

కూర్పు: జాఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హాఫిజహుల్లాహ్)

సంక్షిప్త విషయ నూచిక

 • 01) అల్లాహ్‌ ప్రేమ పొందుటకు మౌలిక అంశాలు
 • 02) భయభక్తులతో అల్లాహ్‌ వైపుకు మరలండి
 • 03) ఇస్లామీయ విధులను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 • 04) నఫిల్‌ ఆరాధనలు పాటించువారిని అల్లాహ్‌ (ప్రేమిస్తాడు
 • 05) అల్లాహ్‌ ప్రేమ పొందుటకై ముఖ్యమైన మార్గాలు
 • 06) అల్లాహ్‌ ప్రీతిని పొందుటకు అతి గొప్ప సమయాలు
 • 07) ప్రత్యేకమైన సందర్భాల్లో చేసే ప్రార్థనలను అల్లాహ్‌ తప్పక ఆలకిస్తాడు
 • 08) అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన స్థలాలు
 • 09) ధర్మాన్ని నేర్చుకోవటం మరియు దాన్ని విస్తరింపజేయటం
 • 10) సుగుణవంతులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 • 11) తోటి మనిషిని ప్రేమిస్తే అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు
 • 12) అల్లాహ్‌ ప్రియతముల పరలోక ప్రయాణం
 • 13) ప్రియమైన దాసులకు అల్లాహ్‌ స్వర్గాన్ని (ప్రసాదిస్తాడు

పూర్తి విషయసూచిక:

అధ్యాయం 01:  అల్లాహ్‌ ప్రేమ పొందుటకు మౌలిక అంశాలు

 1. అల్లాహ్‌ ప్రీతి పొందుటకై తొలి అంశం.
 2. అల్లాహ్‌ ప్రేమకు కారణమయ్యే మౌలిక విశ్వాసాలు.
 3. ఇస్లాం ధర్మాన్నే ప్రేమించాలి 
 4. సర్వజనులకన్నా అల్లాహ్‌ను మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రేమించాలి .
 5. ధృఢమయిన విశ్వాసంతో అల్లాహ్‌ను ప్రేమించాలి.
 6. విశ్వాసం మరియు ఏకదైవారాధన అల్లాహ్‌ ప్రేమకు ప్రతిరూపం.
 7. అల్లాహ్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతే ప్రేమకు పునాది.

అధ్యాయం 02 : భయభక్తులతో అల్లాహ్‌ వైపుకు మరలండి

 1. క్షమాపణ వేడుకొనేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 2. పశ్చాత్తాపం చెందేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 3. మన్నింపు మరియు పశ్చాత్తాపం వలన ప్రజలు అనుగ్రహింపబడతారు.
 4. మన్నింపు మరియు పశ్చాత్తాపం అంగీకరింపబడిన కొందరి మహాత్ముల గాధలు.

అధ్యాయం 03 : ఇస్లామీయ విధులను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు

 1. అల్లాహ్‌ ప్రేమకు కారణమయ్యే విధులు.
 2. అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన కార్యం వేళకు నమాజు చేయడం
 3. తల్లిదండ్రుల సేవలు చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 4. అల్లాహ్‌ మార్గంలో (షహీద్‌) అమరులైన వారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు .
 5. ఉపవాసాలు పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 6. జకాత్‌ విధిగా చెల్లించేవారిపై అల్లాహ్‌ కారుణ్యం ఉంటుంది.
 7. హజ్జ్‌ చేసినవారి సర్వ పాపాలు క్షమించబడతాయి.

అధ్యాయం 04: నఫిల్‌ ఆరాధనలు పాటించువారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు

 1. అల్లాహ్‌ ప్రేమకు కారణమయ్యే అదనపు ఆరాధనలు
 2. అల్లాహ్‌ తన దాసుల పుణ్యాలను రెట్టింపు చేస్తాడు
 3. సున్నత్‌ మరియు నఫిల్‌ నమాజులను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 4. క్రమం తప్పకుండా చేసే పుణ్యాలు అల్లాహ్‌కు ప్రీతికరమైనవి
 5. తహజ్ఞుద్‌ నమాజు
 6. విత్ర్ నమాజు
 7. చాష్త్‌ నమాజు (జుహా లేక అవ్వాబీన్ నమాజు)
 8. తస్‌బీహ్‌ నమాజు
 9. పశ్చాత్తాపం నమాజు
 10. వుజూ చేసిన తరువాత రెండు రకాతుల నమాజు
 11. నఫిల్‌ ఉపవాసాలు

అధ్యాయం 05: అల్లాహ్‌ ప్రేమ పొందుటకై ముఖ్యమైన మార్గాలు

 1. దానధర్మాలు చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు మరియు అనుగ్రహిస్తాడు.
 2. కృతజ్ఞతలు చెల్లించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 3. అల్లాహ్‌ను ఎప్పుడు మొరపెట్టుకున్నా ఆలకిస్తాడు.
 4. ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
 5. అల్లాహ్‌ నామస్మరణ కారణంగా ప్రేమించబడతారు.

అధ్యాయం 06: అల్లాహ్‌ ప్రీతిని పొందుటకు అతి గొప్ప సమయాలు

 1. ఇస్లాం ధర్మంలో సమయాల వాస్తవికత
 2. ముహర్రం నెల విశిష్టత
 3. రజబ్‌ నెలవిశిష్టత
 4. షాబాన్‌ నెల విశిష్టత
 5. రమజాన్‌ నెల విశిష్టత
 6. జుల్‌ హజ్జ్‌ (బక్రీద్‌) నెల విశిష్టత
 7. రమజాన్‌ మరియు జుల్‌ హజ్జ్‌ పది రోజుల విశిష్టత
 8. ఘనమైన రాత్రి (లైలతుల్‌ ఖద్ర్‌) విశిష్టత
 9. జుల్‌ హజ్జ్‌ పది రోజులు అల్లాహ్‌కు అతి ప్రియమైనవి
 10. ముహర్రం పదొవరోజు విశిష్టత
 11. షాాబాన్‌ 15వ రాత్రి విశిష్టత
 12. జుల్‌హజ్జ్‌ తొమ్మిదవ (అరఫా) రోజు అల్లాహ్‌ తన దాసులను మెచ్చుకుంటాడు
 13. అరఫా రోజు ఉపహూసం విశిష్టత
 14. శుక్రవారం రోజు విశిష్టత
 15. సోమ, గురువారాల విశిష్టత

అధ్యాయం 07: ప్రత్యేకమైన సందర్భాల్లో చేసే ప్రార్థనలను అల్లాహ్‌ తప్పక ఆలకిస్తాడు

 1. అజాన్ మరియు ఇఖామత్ సమయం 
 2. అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే సమయం 
 3. వర్షం కురుస్తున్నప్పుడు అల్లాహ్ కారుణ్యం అవతరిస్తుంది 
 4. శుక్రవారం రోజు 
 5. అర్థరాత్రి సమయం 

అధ్యాయం 08: అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన స్థలాలు

 1. ప్రపంచంలోనే అతి విశిష్టమైన మసీదులు 

అధ్యాయం 09: ధర్మాన్ని నేర్చుకోవటం మరియు దాన్ని విస్తరింపజేయటం

 1. అల్లాహ్‌ తన ప్రియమైన దాసులకు ధర్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు
 2. ధర్మ జ్ఞానం బోధించేవారిఫై అల్లాహ్‌ తన కారుణ్యాన్నికురిపిస్తాడు
 3. పరస్పరం ఉపన్యాసం చేసుకునే విశిష్టత
 4. అల్లాహ్‌కు ప్రియమైన సభ, సమావేశం

అధ్యాయం 10: సుగుణవంతులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు

 1. కోపాన్ని దిగమింగేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 2. సహనమూర్తులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 3. పేదవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 4. సత్యవంతులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 5. న్యాయమూర్తులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 6. భయంభక్తిగా జీవించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 7. పరిశుద్దులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 8. తుమ్ముల కారణంగా ప్రేమింపబడతారు
 9. బిడియం స్వర్గానికి మార్గం

అధ్యాయం 11: తోటి మనిషిని ప్రేమిస్తే అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు

 1. పరస్పరం ప్రేమానుబంధాలను పెంచుకోవాలి
 2. పరామర్శించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 3. ఒండొకరిని సందర్శించుకునే వారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 4. ఉపకారం (ఇహ్సాన్ ) చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 5. తోటి సహోదరులకు సహాయపడితే అల్లాహ్‌ ప్రేమిస్తాడు
 6. అనాధులను ఆదరిస్తే అల్లాహ్‌ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు
 7. ఆడ పిల్లలను పెంచి పొపిస్తే అల్లాహ్‌ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు

అధ్యాయం 12: అల్లాహ్‌ ప్రియతముల పరలోక ప్రయాణం

 1. అల్లాహ్‌ను ప్రేమించే దాసులకు మంచి చావు 
 2. అల్లాహ్‌ సన్నిధిలో ప్రియమైన ఆత్మలకు లభించే గౌరవం
 3. సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత స్వర్గ సుఖాలు
 4. పరలోకంలో అల్లాహ్‌ తన ప్రియమైన దాసుల పాపాలను క్షమిస్తాడు
 5. పరలోకంలో విశ్వాసులకు జ్యోతి ప్రసాదించబడుతుంది
 6. విచారణ లేకుండానే కొందరు స్వర్గంలోనికి ప్రవేశిస్తారు
 7. అందరికంటే ముందు స్వర్గానికి ప్రవేశించే ప్రియమైన దాసులు
 8. అందరికంటే చివరిన స్వర్గంలోనికి పోయే దాసులు

అధ్యాయం 13: ప్రియమైన దాసులకు అల్లాహ్‌ స్వర్గాన్ని (ప్రసాదిస్తాడు

 1. స్వర్గం అతిసుందరమైనది 
 2. స్వర్గంలో అందమైన మేడలు మరియు గుడారాలు
 3. స్వర్గం వృక్షాలు మరియు పండ్లూ ఫలాలు
 4. స్వర్గవాసులు తినే, త్రాగే పాత్రలు
 5. స్వర్గవాసులకు పుణ్యవతులైన భార్యలు
 6. స్వర్గ స్త్రీలకు పుణ్యభర్త మరియు గొప్ప సౌందర్యం అనుగ్రహించబడును
 7. స్వర్గవాసులకు ప్రాప్తమయ్యే శక్తి
 8. స్వర్గవాసుల కొరకు సేవకులు
 9. స్వర్గవాసులు అల్లాహ్‌ను దర్శించుకునే మహా భాగ్యం పొందుతారు
 10. తస్‌బీహ్‌, తక్సీర్‌ స్వర్గం అనుగ్రహాలు

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/wWVq]
[30 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః

اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్‌ ఖుబుసి వల్ ఖబాయిస్ .
(అల్లాహ్‌ పేరుతో, ఓ అల్లాహ్‌ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

غُفْرَانَك َ

గుఫ్రానక
(నీ మన్నింపుకై అర్ధిస్తున్నాను) (తిర్మిజి 7).

2- అల్లాహ్‌ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.

4- సతర్‌ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్‌ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్‌ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]


ఇతరములు :