జమ్ జమ్ నీటి పవిత్రత మరియు ప్రాముఖ్యత (Zamzam Water)

well-of-zam-zam

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

అల్లాహ్ అర్ష్ నీడలో.. (Seven in the Shade of Allah’s Throne)

shade-of-allahదైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.” Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.” Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

దైవ నామ స్మరణ – Zikr and Rememberance of Allah

do-not-forget-remember-Allahదైవ నామ స్మరణ  (Zikr and Rememberance of Allah)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

 

దైవనామ స్మరణ

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూహురైర (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

దైవదూతలు కొందరు దైవనామాన్ని స్మరించే వారిని వెదుకుతూ దార్లలో తిరుగుతుంటారు. దైవ స్మరణలో నిమగ్నులై ఉన్నవారిని చూడగానే వారు, “మా అవసరార్థం ఇటు మరలిరండి’ అని పరస్పరం పిలుచుకుంటారు. దైవనామ స్మరణలో ఉన్నవారిని ఎందరు దూతలు తమ బాహువులతో ఆక్రమిస్తారంటే, వారి వరస మొదటి ఆకాశం వరకు చేరుకుంటుంది.

వారిని వారి ప్రభువు, అంతా తెలిసి కూడా అడుగుతాడు : “నా దాసులు ఏమంటున్నారు?” దైవదూతలు సమాధాన మిస్తారు – ‘వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. ఇంకా, నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఇంకా, నీ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తున్నారు. ఇంకా, నిన్ను స్తుతిస్తున్నారు. నీ పెద్దరికాన్ని వర్ణిస్తున్నారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘వారు నన్ను చూశారా?” “లేదు. అల్లాహ్‌ సాక్షి! వారు నిన్ను చూడలేదు’ అని దూతలు సమాధానమిస్తారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి  స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – ‘వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడతారు.’

ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు. ఆయన అంటాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడుతారు. ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు.’ ఆయన అంటాడు : ఒకవేళ ధాన్ని చూస్తే వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది?’ దూతలు బదులిస్తారు – “వారు గనక దాన్ని చూస్తే ఇంకా అధికంగా దాన్ని ఆశిస్తారు. దాని కోసం ఎంతగానో గాలిస్తారు. దాని వైపునకు మరింత ఎక్కువగా మళ్ళుతారు.’

ఆయన అడుగుతాడు : “వారు దేన్నుండి శరణువేడుతున్నారు?’ దూతలు సమాధానమిస్తారు – “(నరకాగ్ని నుండి.’ ఆయన అంటాడు : ‘వారు ఆ అగ్నిని చూశారా?’ దూతలంటారు – “లేదు, అల్లాహ్‌ సాక్షిగా! ఓ ప్రభూ! వారు దాన్ని చూడలేదు.’ ఆయన అంటాడు : “ఒకవేళ వారు దాన్ని చూసి ఉంటే అప్పుడు వారి స్ధితి ఏమౌను?’ వారు సమాధానమిస్తారు – ‘ఒకవేళ వారు దాన్ని చూస్తే దాన్నుండి మరింత ,దూరం పారిపోతారు. దానిపట్ల ఇంకా ఎక్కువగా భయపడతారు.’ అల్లాహ్‌ సెలవిస్తాడు : ‘నేను మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టి చెబుతున్నాను – నేను వారిని క్షమించి వేస్తాను.’ అప్పుడు ఒక దూత అంటాడు – ‘ఫలానా మనిషి స్మరణ చేసిన వారిలో లేడు. అతను మరో పని మీద అక్కడకు వచ్చేశాడు.” అల్లాహ్‌ అంటాడు : ‘వారు (దైవస్మరణ చేసేవారు) ఎటువంటి వారంటే వారితోపాటు కూర్చున్న వ్యక్తి కూడా (ఆ భాగ్యాన్ని) కోల్పోడు.” (బుఖారి)

ఈ హదీసులో “జిక్ర్‌” వాస్తవికతను, “జిక్ర్‌” చేసే వారి ఘనతను, ఇంకా జిక్ర్‌ చేసే వారితోపాటు కూర్చునే వారి భాగ్యాన్ని గురించి వివరించటం జరిగింది.

ఇక్కడ ‘జిక్ర్‌ అంటే అర్ధం ఇతర హదీసులలో పలుసార్లు నొక్కి చెప్పబడిన పవిత్ర వాక్కులను వల్లించడం. ఉదాహరణకు, ‘సుబ్‌హానల్లాహ్‌’”, ‘అల్‌హమ్‌దు లిల్లాహ్‌”, “లా ఇలాహ ఇల్లల్లాహ్‌”, “అల్లాహు అక్బర్‌. ఇంకా అదేవిధంగా ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్హాహ్‌’, ‘“బిస్మిల్లాహ్‌’, ‘హస్బునల్లాహ వ నీమల్‌ వకీల్ , “అస్తగ్‌ఫిరుల్లాహ్‌’ మొదలగు వాక్యాలను పలుకుతూ ఉండటం, ఇంకా ఇహపర శ్రేయాలను దైవం నుండి కోరటం కూడా జిక్ర్‌ కోవలోకే వస్తాయి. వాజిబ్‌ మరియు ముస్తహబ్‌ ఆచరణలను చేయటం కూడా కొన్ని సమయాలలో ‘జిక్ర్‌’ (దైవస్మరణ) గానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఖుర్‌ఆన్‌ పారాయణం, హదీసు అధ్యయనం, జ్ఞాన సదనం, నఫిల్‌ నమాజులు.

దైవ నామ స్మరణ చేసే వ్యక్తికి తాను పలికే పదాల భావం తెలిస్తేనే పుణ్యఫలం లభిస్తుందన్న నియమం లేదు. అయితే ఆయా పదాలకు వ్యతిరేక భావం మాత్రం అతని మనసులో ఉండకూడదన్నది షరతు. పలికే పదాలకు అర్థం కూడా తెలిసి ఉంటే ఆ స్మరణ పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అల్లాహ్‌ ఔన్నత్యం, ఆయన అన్ని లోపాలకు, బలహీనతలకు అతీతుడు అనే భావం మనసులో గనక సతతం మెదలుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ స్మరణ మరింత అర్థవంతం అవుతుంది. దైవమార్గంలో కృషి సలుపుతూ, ఆయన మనపై విధిగా చేసిన వాటిని తు.చ, తప్పకుండా పాటిస్తూ గనక ‘జిక్ర్‌’ చేస్తే అది ఇంకా సమగ్రతను సంతరించుకుంటుంది. సంస్కర్త గనక ఏకాగ్ర చిత్తంతో దైవం వైపునకు మరలి, సంకల్పశుద్దితో దైవాన్ని స్మరిస్తే అది మరింతగా ప్రభావవంతం అవుతుంది.

హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ బసర్‌ (రజిఅన్‌) ఉల్లేఖించిన హదీసులో దైవ నామ స్మరణ యొక్క ప్రాముఖ్యత మరోవిధంగా చెప్పబడింది. ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా! ఇస్లాం ఆదేశాలెన్నో ఉన్నాయి. మీరు నాకు ఏదో ఒక దాన్ని గురించి చెప్పండి, దాన్ని నేను అంటిపెట్టుకుని ఉంటాను” అని అన్నాడు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “నీ నోరు (నాలుక) సతతం అల్లాహ్‌ నామస్మరణలో ఉండాలి.” (తిర్మిజి)

వివిధ ఉల్లేఖనాల ద్వారా స్పష్టమయ్యేదేమంటే, దేవుని పవిత్రతను, ఆయన ఘనతను కొనియాడటం, ఆయన స్తోత్రం చేయటం, ఆయన గ్రంథాన్ని పారాయణం చేయటం, స్వర్గ నరకాలను ప్రస్తావించటం, దైవానుగ్రహాలపై కృతజ్ఞతలు వ్యక్తపరచటం వంటివి “జిక్ర్‌ సదనాలు’ అనిపించుకుంటాయి.

“అంతా తెలిసి ఉండి కూడా వారిని వారి ప్రభువు అడుగుతాడు.” సర్వజ్ఞాని అయిన్న అల్లాహ్హ్‌ తన దూతలతో తన దాసుల గురించి అలా ప్రశ్నించాడంటే, దాసుల విధేయతను వారికి తెలియపరచటానికే అలా చేసి ఉండవచ్చు. ఎందుకంటే, అల్లాహ్‌ ఆదంను సృష్టించదలచినపుడు దైవదూతలు పలికిన పలుకులను దృష్టిలో ఉంచుకుని అల్లాహ్హ్‌ ఈ విధంగా ప్రశ్నిస్తాడని కొందరు ఇస్లామీయ విద్వాంసులు వ్యాఖ్యానించారు. ధరణిలో ఒక ఖలీఫా (ప్రతినిధి) ని సృష్టించబోతున్నానని అల్లాహ్‌ అన్నప్పుడు దైవదూతలు,

“ప్రభూ! అవనిలో కల్లోలం రేకెత్తించే, రక్తపాతం సృష్టించేవాడిని నువ్వు సృష్టిస్తున్నావా?! నీ స్తోత్రంతో పాటు నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాముగా” అని విన్నవించుకున్నారు. ఆయన సెలవిచ్చాడు : “ఏదైతే నాకు తెలుసో అది మీకు తెలియదు.” (అల్‌ బఖర : 20)

“ఆనాడు నేను ఆదంను సృష్టిస్తుంటే మీరలా అన్నారు, చూడండి ఇప్పుడు ఆదం సంతతి ఏ విధంగా షైతానీ ప్రేరణలను ఎదిరించి, నా స్తోత్రం చేస్తున్నారో అని అల్లాహ్‌ తన దూతలకు పరోక్షంగా చెప్పదలిచాడు.

ఈ హదీసుపై మరికొంతమంది విద్వాంసుల వ్యాఖ్యానం ఇలా ఉంది : ఆదం బిడ్డలు చేసే ‘జిక్ర్‌ (దైవస్మరణ) దైవదూతలు చేసే స్మరణకన్నా శ్రేష్ఠమైనది. ఎందుకంటే మనిషి తన దైనందిన వ్యాపకాలను నిర్వర్తిస్తూ అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ, సైతాన్‌ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తుచేస్తూ దైవ నామస్మరణకు పూనుకుంటాడు, కాని దైవ దూతలకు ఈ ఇబ్బందులు లేవు.

“ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంద”ని ప్రశ్న.

దీనిద్వారా తెలిసిందేమంటే ఐహిక జీవితంలో అల్లాహ్‌ను చూడటం సాధ్యపడదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాన్ని ఇమామ్‌ ముస్లింగారూ అబూ అమామ ద్వారా ఉటంకించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “మీరు మీ ప్రభువును మీరు మరణించే వరకు చూడలేరని తెలుసుకోండి.” దైవచిత్తమయితే విశ్వాసులు తీర్పుదినంనాడు సర్వలోకాల ప్రభువును చూస్తారు. అయితే అల్లాహ్‌ను కళ్ళారా చూడకుండానే ఆయనకు భయపడటం, ఆయన వైపునకు మరలటమే సాఫల్యానికి నిదర్శనం.

“వారెటువంటి వారంటే వారితో పాటు కూర్చున్న వ్యక్తి కూడా (భాగ్యానికి) నోచుకోక పోడు.”

సుబ్‌హానల్లాహ్‌! వారితో కలసి కూర్చున్న వ్యక్తి సయితం అదృష్టవంతుడై పోయాడంబే దైవ నామస్మరణ చేసేవారు ఎంతటి శుభప్రదమైనవారు!

ఈ హదీసులో పేర్కొనబడిన “జిక్ర్‌ సమావేశాలు” అంటే భావం విశ్వాస భావంతో దైవ నామాన్ని, స్మరించే సమావేశాలలో విశ్వాసులను సహజమైన రీతిలో కలుసు కోవటం అని మహాప్రవక్త మరియు ఆయన సహచరుల హయాంలో అటువంటి సదనాలు సమావేశాలు జరిగేవి. విశ్వాసులు పరస్పరం కలుసుకునేవారు, పరామర్శలు జరిపేవారు. అల్లాహ్‌ను స్మరించేవారు. ఒండొకరిని మంచి వైపునకు ఆహ్వానించేవారు. చెడుల సంస్కరణకై నిర్మొహమాటంగా చెప్పేవారు. అల్లాహ్‌కు విధేయులై మెలగాలని, ఆయన ధర్మంపై స్థిరత్వం కలిగి ఉండాలని తాకీదు చేసేవారు.

ఈ హదీసు ద్వారా జిక్ర్‌ మరియు దానికోసం సమావేశమువటం యొక్క మహత్మ్యం తెలిసి వస్తోంది. ఆఖరికి సద్వర్హ్తనులతో కలిసి కూర్చునే వ్యక్తి కూడా కారుణ్య భాగ్యానికై అర్హుడైపోతాడు. “దైవనామ స్మరణ’ దైవదూతలకు ఆహారం వంటిదని వారు దానికోసం తిరుగుతూ ఉంటారని కూడా ఈ హదీసువల్ల తెలుస్తోంది. అల్లాహ్‌చే నిర్మితమైన స్వర్గం మేలైన వస్తువులతో నిండి ఉంది. దాన్ని ఆశించే వ్యక్తికై అల్లాహ్‌ మార్గం సుగమం చేస్తాడు. దానికి భిన్నంగా నరకం కష్టాలతో యాతనలతో నిండి ఉంది. ఎవరయితే నరకాగ్నిని కోరుకుని, దానికి ఆహుతి అయ్యేవనులు చేయాలనుకుంటారో అటువంటి వారికై కూడా అల్లాహ్‌ మార్గాలు తెరుస్తాడు.


1447. Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allah (sallallaahu ’alayhi wa sallam) said, “Allah, the Exalted, has teams of angels who go about on the roads seeking those who remember Allah. When they find some people remembering Allah they call to one another and say, `Come to what you are looking for;’ and they surround them with their wings till the space between them and the lowest sky is fully covered. Allah, the Exalted and Glorious, asks them (although He is best informed about every thing): `What are my slave saying?’ They say: `They are glorifying Your Tasbih, Tahmid, Takbir, Tamjid, (i.e., they were declaring Your Perfectness, praising, remembering the Greatness and Majesty of Allah).’ He asks: `Have they seen Me?’ They reply, `No, indeed, they have not seen You.’ He asks: `How would they act if they were to see Me?’ Thereupon they reply: `If they were to see You, they would engage more earnestly in worshipping and glorifying You and would extol You more.’ He would say: `What do they beg of Me?’ They say, `They beg You for Your Jannah.’ Allah says, `Have they seen My Jannah?’ They say, `No, our Rubb.’ He says: `How would they act if they were to see My Jannah?’ They reply, `Were they to see it, they would more intensely eager for it.’ They (the angels) say, `They seek Your Protection.’ He asks, `Against what do they seek My Protection?’ They (the angels) say, `Our Rubb, from the fire of Hell.’ (He, the Rubb) says, `Have they seen the fire of Hell?’ They say, `No. By Your Honour, they have not seen it.’ He says: `How would they act if they were to see My Fire?’ They say: `If they were to see it, they would more earnest in being away from it and fearing it. They beg of Your forgiveness.’ He says: `I call you to witness that I hereby grant pardon to them and confer upon them what they ask for; and grant them protection against what they seek protection from.’ One of the angels says: `Our Rubb, there is amongst them such and such slave who does not belong to the assembly of those who are participating in Your remembrance. He passed by them and sat down with them.’ He says: `I also grant him pardon because they are the people by virtue of whom their associates will not be unfortunate‘.”
[Al-Bukhari and Muslim].

(The narration in Muslim is also the same with minor changes in wordings).

Commentary: What kind of circles and gatherings of remembrance of Allah are referred to here? Obviously not those in which Allah is remembered in the ways invented by the participants themselves, i.e., repetition of the slogans “Allah-Hu”, “Haq-Allah”,  etc.,which have not been mentioned in any Hadith. The repetition of any specific word, in a specific manner and in a peculiar surrounding (such as by putting the lights off) – this manner of conducting the remembrance of Allah is also not evident from the practice of the Prophet (sallallaahu ’alayhi wa sallam) and his Companions. The circles and gatherings mentioned in this Hadith are those in which, the Prophet’s Sunnah is fully observed. The words such as Subhan-Allah, Al-hamdu lillah, La ilaha illallah, Allahu Akbar etc., are recited and Praise and Glorification of Allah are done after Salat. The groups are quietly engaged in the remembrance of Allah, and those who attend the sermons and speeches delivered in mosques on Friday also come in this category of meetings and gatherings as these are ordained in Islam. This Hadith also highlights the distinction of Muslims who are engaged in the remembrance of Allah and the Du`a they recite on the suggested times and occasions.

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

బిస్మిల్లాహ్

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ

నిర్మాణం : డా.ముహమ్మద్ తకి ఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Jesus and Muhammad (peace be upon them) in the Bible and Qur’an: Biblical evidence of Jesus being a servant of God and having no share in divinity –

By Dr.M.T.Al-Hilali,Ph.D in the appendix in the book “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఈ పుస్తకం లో క్రింది విషయాలు చర్చించ బడ్డాయి:

 • – బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను
 • – దేవుని బిడ్డ
 • – ప్రభువే తండ్రి
 • – జీసస్ అలైహిస్సలాం– ఏక దైవారాధకుడు, దైవభక్తుడు
 • – బైబిలులోని ఒక వృత్తాంతం.
 • – జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త
 • – జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.
 • – బైబిల్ సంకలనం
 • – జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు
 • – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు
 • – శిలువ గాథ పై కల్పించబడిన వాదనల పై చివరి మాట

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ 

ఉపోద్ఘాతం

అన్ని విధాల ఘనతలకు, గౌరవ మర్యాదలకు, సత్కారములకు, కీర్తిప్రతిష్టలకు యోగ్యుడైన ఆ ఏకైక సర్వలోక సర్వాధికారికే సకల ప్రశంసలు చెందుతాయి. ఆయన పరిపూర్ణమైన లక్షణాలన్నీ కలిగి ఉన్న ఏకైకుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాదు. ఆయనకు సరిసమానుడెవరూ లేరు. అయనే సర్వలోక శక్తిమంతుడైన, ఏకైక దివ్యశక్తి.

‘అన్ని రకాల ఆరాధనలకు అర్హత కలిగిన, ఏకైకుడైన ఆయననే కేవలం ఆరాధించమని బోధిస్తూ మరియు బహుదైవారాధన, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు భాగస్వాములను జతచేయడం, సృష్టితాలను ఆరాధించటం మొదలైన అత్యంత ఘోర పాపముల యొక్క శాశ్వతమైన, భయంకరమైన, భరించలేని దుష్పరిణామాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ’ మానవాళికి ఏకైక దైవత్వపు మార్గదర్శకత్వాన్ని వహించటానికి, ఆయన తన సందేశహరులను, ప్రవక్తలను పంపాడు.

 అల్లాహ్ యొక్క అందరు ప్రవక్తల పై, సందేశహరుల పై ముఖ్యంగా అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ప్రళయ దినం వరకు ఆయనను ధార్మికంగా అనుసరించే వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు కలుగు గాక . ఆమీన్!!

బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను

 బైబిల్ యొక్క క్రొత్త నిబంధనలలో అంటే మత్తాయి గోస్పెల్ లోని నాలుగవ అధ్యాయంలోని ఆరవ మరియు ఏడవ వచనంలో ‘జీసస్ – మరణాన్ని తప్పించుకోలేని ఒక విధేయుడైన దైవదాసుడని (an obedient mortal), ఇంకా దైవమే అతడి యజమాని మరియు ప్రభువని’ ఏడవ వచనంలోని జీసస్ బోధనలలో స్పష్టంగా ఉన్నది.

“ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను”.

ఈ అధ్యాయంలో వాస్తవానికి సైతాను మెస్సయ్యా ను ఒకచోట నుండి మరొక చోటుకు మోసుకుంటూ పోయాడని మనం చదువుతాం. సైతాను దేవుడిని ఎలా మోసుకు పోగలడు? సకల ప్రశంసలకు అర్హుడైన అల్లాహ్ మహోన్నతుడు.  అటువంటి అపనిందలు blasphemy ఆయన దరిదాపులకి కూడా చేరలేవు!

అప్పుడు సైతాను ఆయనను తన ముందు సాష్టాంగ పడమని మరియు తనను ఆరాధించమని ఆజ్ఞాపించినది. ఇంకా ప్రాపంచిక భోగభాగ్యాలను ప్రసాదిస్తానని ఆశ చూపినది. ఎరగా చూపించినది. సైతాను దేవుడితో నిర్భయంగా అలా పలికే సాహసం ఎలా చేయగలదు? ఎప్పుడైతే సైతాను జీసస్ ను తన ఆజ్ఞలను అనుసరించమని ఆదేశించినాడో, ఇలా (పూర్వగ్రంథాలలో) వ్రాయబడి ఉన్నదని సైతానుకు జీసస్ జవాబిస్తారు:”ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను”. Matthew 4:10 

దేవుని బిడ్డ

Son of God దేవుని బిడ్డగా జీసస్ తనను తాను ఏనాడూ పిలుచుకోలేదు కాని మనిష్య కుమారునిగా (Mark 2:10) ఆయన తనకు తాను పిలుచుకుని ఉన్నాడు. బైబిల్ తో తెలిపినట్లుగా, ఎవరైనా అలా పిలిచినా ఆయన వారించ లేదు ఎందుకంటే అలాంటి పిలుపును కేవలం తన కోసమే ప్రత్యేకించుకోలేదు.

పాత, క్రొత్త నిబంధనలలోని బైబిల్ పదాల పరిభాష ప్రకారం దేవుడి భయభక్తులు గల ప్రతి ఒక్క పుణ్యపురుషుడు ‘Son of God’ దేవుని బిడ్డగా పిలవబడును.

Matthew 5:9 లో మనం ఇలా చదువుతాం: “సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనుబడుదురు”

మత్తయి 5:44లో – “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు”

ప్రభువే తండ్రి

Matthew 5:48 లో–”మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు”

Matthew 6:1 లో– “లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు”.

Matthew 7:21 లో – “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును”.

గమనిక – ఇక్కడ వాడబడిన ‘Lord ప్రభువా’ అనే పదం అరబీ భాషలోని బైబిల్ లో ‘రబ్’ అని అనువదించబడినది. అలా చేయటం ద్వారా ప్రజలను ‘జీసస్ యే దేవుడు!’ వొప్పించవచ్చును.  కాని మిగిలిన ఆ వచనాన్ని పూర్తిగా చదివినట్లయితే, అసలైన దేవుడికి మెసయ్యా – జీసస్ విధేయతగా, అణుకువగా తన ఇచ్ఛను సమర్పించుకున్నాడనే విషయం పై  ఆ వచనం  సాక్ష్యమిస్తున్నదని గమనిస్తారు. కావున అక్కడ ఉండవలసిన సరైన అనువాదం :

“నాతో ‘ఓ యజమాని, ఓ యజమాని’ అని పలికిన ప్రతివారూ స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించరు. కాని స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛానుసారం జీవించివారే స్వర్గంలో ప్రవేశిస్తారు.”

బైబిల్ లోని పై వచనాన్ని చదవటం ద్వారా ‘Father – తండ్రి’ అనే పదం అనేక చోట్ల అసలైన దేవుడి కోసం వాడబడినది.  ఆ పదం కేవలం జీసస్ కోసమే ప్రత్యేకంగా వాడబడలేదు.

Matthew 11:25 లో – “ఆ సమయమున యేసు చెప్పినదేమనగా – తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను” 

జీసస్ అలైహిస్సలాంఏక దైవారాధకుడు, దైవభక్తుడు

Matthew 14:23 లో – “ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ యెక్కి పోయి, …”.

ఒకవేళ జీసస్ యే గనుక దేవుడైతే లేక దైవుడిలోని భాగమైతే ఆయన ఎందుకు ప్రార్థిస్తాడు? వాస్తవానికి ప్రార్థన అనేది సమర్పించుకున్న వారి వైపు నుండి, అవసరాలున్న వారి వైపు నుండి మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారి వైపు నుండి ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటిస్తున్నాడు:

“ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే. వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు” (V. 35:15)

“ఎందుకంటే భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు” (V. 19:93)

బైబిలులోని ఒక వృత్తాంతం.

Matthew 15: 22 – 28 –  “ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి – ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసెను! అందుకాయన ఆమెతో ఒక్క మాట యైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి – ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని అనెను. ఆయనను వేడుకొనగా! ఆయన – ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ లేదనెను! అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి – ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను! అందుకాయన – పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా! ఆమె – నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను! అందుకు యేసు – అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.”

కనాన్ కు చెందిన ఒక స్త్రీ కు చెందిన ఈ వృత్తాంతంలో గమనించ దగిన కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి:

ఇక్కడ ప్రవక్త జీసస్ (ఈసా) అలైహిస్సలాం పై దయాదాక్షిణ్యాలు మరియు ప్రేమాభిమానాలు లేనివారుగా ఇక్కడ భాండం వేయబడినది, నింద మోపబడినది. (ఒకవేళ ఆ వృత్తాంతం కరక్టుగా వ్రాయబడి ఉన్నట్లయితే)

 1. ఆయన తన తెగనే ఉన్నతమైన మార్గం వైపు తీసుకుపోతూ, ఇతరులను చిన్నబుచ్చి కులవిచక్షణ చూపినట్లు తెలుపబడినది.
 2. ఆయన ఇతర తెగలను కుక్కలని పిలిచి దురభిమానం చూపిస్తూ, వారిపై తన తెగ వారికి దర్పాన్ని ఇచ్చినట్లు పేర్కొనబడినది.
 3. ఇక్కడ అజ్ఞానంలో మునిగి ఉన్న బహుదైవారధకురాలైన ఒక స్త్రీ ఆయనతో వాదులాడి, గెలిచినది అని తెలియజేయబడినది.

జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త

Matthew 19:16 – 17 “ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి – బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను! అందుకాయన – మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను”.  పై వచనంలో అల్లాహ్ వైపునకు ఆయన యొక్క విధేయతా పూర్వకమైన సమర్పణ కనబడుతున్నది.

Matthew 21:45 – 46 “ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి! ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి”.

జీసస్ ను ఆయన జీవితకాలంలో విశ్వసించిన సహచరులు, వారిని దేవుడని లేక దేవుడి కుమారుడని లేక ట్రినిటీలో తెలిపిన విధంగా ముగ్గురిలో ఒకరని నమ్మలేదని ఇక్కడు ఋజువు అవుతున్నది; కాని వారు ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే విశ్వసించారని తెలుస్తున్నది.. ఎవరైతే జీసస్ కు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారో, వారికి వ్యతిరేకంగా నిరూపితమైన ఒక బలమైన ఆధారం.  కృతనిశ్చయంతో, చిత్తశుద్ధితో గమనిస్తేనే వారు దీనిని గ్రహించగలరు.

జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.

Matthew 23:8 – ‘But be not ye called Rabbi: for one is your master, even Jesus, and all ye are brethren.’ “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు”. (“Even Jesus” యొక్క  అనువాదం తెలుగు బైబిల్ లో లేదు)

జీసస్ ఇక్కడ అల్లాహ్ యొక్క దాసుడని. ఇంకా, అక్కడ ఒకే ఒక యజమాని ఉంటాడని ఆయనే అల్లాహ్ అని ఋజువు అవుతున్నది. అరబీ భాషలోని బైబిల్ లో జీసస్ ను యజమాని అనే అర్థం వచ్చేటట్లుగా అనువదించారు. కాని ఇంగ్లీషు అనువాదం లో అలా చేయక పోవటం వలన వాస్తవ భావానికి కొంచెం చేరువలో ఉన్నది.

Matthew 23:9 – “మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోక మందున్నాడు”.

పితృత్వం మరియు పుత్రత్వం అనేది దైవానికి మరియు ఆయన దాసులకు మధ్య ఉన్న సంబంధమని దీని ద్వారా మీరు గమనించగలరు: ఇది సాధారణ పదంగా వాడబడినదే గాని జీసస్ కోసం ప్రత్యేకించబడలేదు.

Matthew 24:36 – “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.”

 అంతిమ ఘడియ గురించి కేవలం ఒక్క అల్లాహ్ కు మాత్రమే తెలుసుననటానికి ఇది ఒక ఖచ్చితమైన ఋజువు. కాబట్టి జీసస్ యొక్క జ్ఞానం ఇతర మానవుల వలె అసంపూర్ణమైనది.  కేవలం అల్లాహ్ మాత్రమే అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు.

Matthew 26:39 – “కొంత దూరము వెళ్ళి సాగిలపడి – నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయనను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను”.

ఇక్కడ అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలకు సమర్పించుకోవటం గురించే కాక ఆయన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవం గురించి కూడా ప్రస్తావించబడినది. కేవలం అల్లాహ్ మాత్రమే దేనినైనా మార్చగలడు.

బైబిల్ సంకలనం

Matthew 27:7 – 8 – “కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి! అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది”.

బైబిల్ (కొత్త నిబంధనలు) జీసస్ కాలంలో వ్రాయబడలేదని, ఆ సంఘటనలు జరిగిన చాలా కాలం తర్వాత ప్రజల జ్ఞాపకాలలో నుండి వెలికితీసి వీటిని వ్రాయటం జరిగినదని ఈ వచనాల ద్వారా స్పష్టమవుతున్నది.

Matthew 27:46 – “And about in the ninth hour Jesus cried with a loud voice, saying, ‘Eli, Eli, Iama sabachthani? (My God, My god, why hast Thou forsaken me?’)”

తనను శిలువ మీద పెట్ట చిల్లులు కొట్టినప్పుడు జీసస్ పై వాక్యాలు బిగ్గరగా పలుకుతూ ఏడ్చినాడని క్రైస్తవుల అభిప్రాయం. ఇది జీసస్ పై మోపబడిన ఒక ఘోరమైన అపవాదు. ఈ పదాలను గమనించినట్లయితే, అలాంటివి కేవలం అవిశ్వాసుల నుండి మాత్రమే వెలువడగలవని తెలుస్తుంది. ఇంకా, అలాంటి పదాలు అల్లాహ్ యొక్క ప్రవక్త నుండి వెలువడినాయనటం ఒక అమితాశ్చర్యకర మైనది. ఎందుకంటే అల్లాహ్ ఎప్పుడూ తన వాదనను భంగం చేయడు మరియు ఆయన ప్రవక్తలు ఆయన వాదనాభంగం గురించి ఆయనకు ఏనాడూ ఫిర్యాదు చేయరు.

జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు

John 17:3 లో– అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము“.

Mark 12:28 – 30 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి – ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను! అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు! నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ“.

Mark 12:32 –  ఆ శాస్త్రి – బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

Mark 12:34 – “… నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను“.

పై వచనాలలో, జీసస్ అలైహిస్సలాం స్వయంగా సాక్ష్యం ఇలా ఉన్నది – అల్లాహ్ ఒకే ఒక ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆరాధ్యులు లేరు, అల్లాహ్ యొక్క ఏకైకత్వాన్ని విశ్వసించిన వారు ఆయన యొక్క సామ్రాజ్యానికి దగ్గరలో ఉంటారు. కావున, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వారు లేదా ట్రినిటీలో నమ్మకం ఉంచినవారు ఆయన యొక్క సామ్రాజ్యానికి బహుదూరంగా ఉంటారు, మరియు వారు అల్లాహ్ కు శత్రువులుగా పరిగణింపబడతారు.

Matthew 24:36 – అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు

అంతిమ ఘడియ ప్పుడు వస్తుందో ఒక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనే ఖుర్ఆన్ లోని ప్రకటన లాంటిదే మత్తాయి బైబిల్ లో కూడా ఉన్నది. ఇంకా అల్లాహ్ కు జీసస్ విధేయతాపూర్వకంగా సమర్పించుకున్నాడని మరియు దైవత్వంలో ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేదనే వాస్తవాన్ని ధృవీకరిస్తుంది: ఆయన దేవుడి అవతారమనే విషయం కేవలం కనాన్ ప్రజల కల్పితం మాత్రమే.

John 20:16 – 18 యేసు ఆమెను చూచి – మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము! యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పు మనెను! మగ్దలేనే మరియ వచ్చి – నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను“.

పై వచనాలలో జీసస్ చాలా స్పష్టంగా ‘అల్లాహ్ యే తన దైవమని మరియు మిగిలిన వారి దైవమని, అల్లాహ్ యొక్క ఆరాధనలో తనకు మరియు వారికి ఎటువంటి భేదం లేదని’ ధృవీకరించెను. జీసస్ కూడా దేవుడే అనేవారు తప్పక అల్లాహ్ పై ఘోర అపనింద మోపినవారవుతారు మరియు జీసస్ ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ, అల్లాహ్ యొక్క  సందేశహరులందరినీ  మోసం చేసిన వారవుతారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు

John 14:15 – 16“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు! నేను తండ్రీని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకైన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.”

ముస్లిం ధర్మవేత్తలు ఇలా తెలిపారు – “మరొక ఆదరణ కర్త” అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం; మరియు “ఎల్లప్పుడూ ఉండేది” అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ధర్మాదేశాలు మరియు ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్.

John 15:26 – 27 – తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన అత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును! మీరు మొదటనుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు

John 16:5 – 8 – ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్ళుచున్నాను – నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దు:ఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును

John 16:12 – 14 – నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు! అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును! ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.

John 16:16 – కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను“.

ముస్లిం ధర్మవేత్తల ఇలా ధృవీకరిస్తునారు –  పైన తెలిపిన బైబిల్ వచనాలలో జీసస్ తర్వాత వచ్చే ప్రవక్త గురించిన వివరణలు కేవలం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోనే ఏకీభవిస్తున్నాయి. తన తర్వాత వచ్చే అతని పేరును జీసస్ ‘Parqaleeta’ అని పిలిచెను. ఈ పదాన్ని తర్వాతి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, అనువాదకర్తలు తొలగించివేసి, క్రమంగా దానిని ‘Spirit of Truth’ సత్యమైన ఆత్మ అని, మరికొన్ని చోట్ల, ‘Comforter’ ఆదరణకర్త అని మరియు మరికొన్ని చోట్ల ‘Holy Spirit’ దివ్యాత్మ అని మార్చివేసినారు. దీని అసలు పదం గ్రీకు భాషలో ఉన్నది. దాని అసలు అర్థం ‘one whom people praise exceedingly – ప్రజలచే అపరిమితంగా ప్రశంసించ బడేవాడు’. ఇదే పదం అరబీ భాషలోని ‘Muhammad అంటే ప్రశంసింపబడేవాడు’ అనే పదానికి సరిగ్గా సరిపోతున్నది.

శిలువ గాథ పై  కల్పించబడిన వాదనల పై చివరి మాట

1) జీసస్ యొక్క ముఖము యూదులకు తెలుసునని బైబిల్ సాక్ష్యమిస్తున్నది; జెరుసలెంలోని సోలొమాన్ ఆలయంలో ఆయన వారికి బోధించేవారు, ఉపదేశాలు చేసేవారు. కాబట్టి, మత్తాయి బైబిల్ తెలిపినట్లు, ముప్పై వెండినాణాలకు ఒక యూదుడిని బాడుగకు కుదుర్చుకోవటం అనవసరమైన విషయం కాదా?

2) 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot అనే అతడిని జీసస్ ను చూపటానికి బాడుగకు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీసస్ ను శిక్షించటం చూసి, అతడు చాలా సిగ్గుపడి, వారి ఆ పని తనను తాను వేరు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 24గంటల లోపు జరిగి పోయినది. ఇందులోని వ్యత్యాసములు చాలా స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.

3) యూదులు జీసస్ కు మరణశిక్ష విధించి, అనుమతి కోసం పిలాతు Pontius Pilate అనే గవర్నరు వద్ద అనుమతి పొందటానికి ప్రయత్నించిన స్పష్టమైన క్రింది సంఘటన ఒక్కటి చాలు, జీసస్ యొక్క శిలువ వృత్తాంతంలోని అసత్యాలను బయటికి లాగటానికి.

Matthew 27:11 – 14 – యేసు అధిపతి యెదుట నిలిచెను; అప్పుడు అధిపతి – యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి – నీవన్నట్టే అనెను! ప్రధాన యాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు! కాబట్టి పిలాతు – నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను! అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కలి ఆశ్చర్యపడెను“.

పై వృత్తాంతానికి క్రైస్తవులు ఇచ్చే వివరణ – సమస్త మానవాళి విముక్తి కోసం, విమోచన కోసం, మోక్షం కోసం మరియు మానవాళి యొక్క పాప ప్రక్షాళణ కోసం, ఇంకా వాటిని క్షమింపజేయటానికి జీసస్ శిలువ పై కెక్కి మరణించాలని కోరుకున్నాడు. ఒకవేళ అదే నిజమైతే, జీసస్ ఎందుకని మరణం నుండి తనను తప్పించమని అడిగినాడు? శిలువ మీద నుండి (వారి అభిప్రాయం ప్రకారం) ఆయన ఎందుకు ఇలా ఏడ్చినాడు: “ఓ దేవా, నన్నెందుకు విడిచి పెట్టినావు?” సత్యాన్ని ఆక్షేపిస్తున్నప్పుడు, సవాలు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించాడు? ఆయన ఆత్మలను ప్రేరేపించే విధంగా యూదు పండితులను సవాలు చేస్తూ, ఉపన్యాసాలు ఇవ్వడంలో ప్రఖ్యాతి గాంచినాడు. ఊహలో ఉన్న ఏ వ్యక్తి అయినా దీనిని ఎలా నమ్మగలడు? ఒకవేళ శిలువ వృత్తాంతమే సత్యమైనదిగా ఋజువు కాకపోతే, దాని ఆధారం పైనా ఉన్న మొత్తం క్రైస్తవపు పునాదులే కదిలిపోతాయి.

యూదులచే జీసస్ శిలువపై చంపబడలేదు అనేది ముస్లింల విశ్వాసం. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి: మరియు వారు: ‘నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యం కుమారుడైన ఈసా మసీహ్ (యేసు క్రీస్తు) ను చంపాము’ అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువ పై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురిచేయబడ్డారు (అతని లాంటి మరొక వ్యక్తిని శిలువ పైకి ఎక్కించారు). నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊపలనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. V. 4:157, 158

మొత్తం క్రైస్తవులతో పాటు యూదులు కూడా స్వయంగా జీసస్ శిలువ పై మరణించాడనే విశ్వసించారు. వారి అభిప్రాయాలకు విరుద్ధంగా, ఇస్లామీయ ప్రకటనలోని సత్యాన్ని బైబిల్ ద్వారా నిరూపించటానికి మత్తాయి కొత్త నిబంధనల (26 మరియు 27 వ అధ్యాయం) నుండి క్రింది ప్రశ్నలు తయారు చేయబడినాయి:

1) ఎవరైతే జీసస్ ను పట్టుకున్నారో (వారి అభిప్రాయం ప్రకారం), వారు జీసస్ ను వ్యక్తిగతంగా ఎరుగుదురా? లేదా వారు జీసస్ ను ఎరుగరా?

మత్తాయి బైబిలు: వారు జీసస్ ను ఎరుగరు.

2) జీసస్ ను పట్టుకున్నది పగటి వేళలోనా లేక రాత్రి వేళలోనా?

మత్తాయి బైబిలు: అది రాత్రి వేళ.

3) జీసస్ దగ్గరికి దారి చూపినది ఎవరు?

మత్తాయి బైబిలు: 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot దారి చూపాడు.

4) అతడు వారిని ఉచితంగా దారి చూపాడా లేక వారు ఆశ చూపిన నిశ్చిత మూలధనం కోసం దారి చూపాడా?

మత్తాయి బైబిలు: 30 వెండి నాణాల బహుమతి కోసం అతడు దారి చూపాడు.

5) ఆ రాత్రి జీసస్ పరిస్థితి ఎలా ఉండినది?

మత్తాయి బైబిలు: జీసస్ భయపడుతూ ఉన్నాడు మరియు ఇలా ప్రార్థిస్తూ సాష్టాంగ పడి ఉన్నాడు: “ఓ దేవా, ఈ కప్పును నా నుండి దాటిపోనివ్వడం నీకు సాధ్యమే అయితే దీనిని దాటి పోనివ్వు.” ఇటువంటి మాటలు ఒక నిజమైన దైవవిశ్వాసి నుండి వెలువడటం అనేది నమ్మశక్యం కాని అత్యంత విడ్డూరమైన విషయం. దైవ ప్రవక్త విషయం ప్రక్కన పెట్టి, ఒక మామూలు దైవవిశ్వాసిలోని విశ్వాసమే గమనించి నట్లయితే, ఆ ఏకైక దైవానికి అన్నింటి మీదా శక్తి సామర్థ్యాలున్నాయని వారు ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు.

6) జీసస్ యొక్క మిగిలిన 11 మంది సహచరుల పరిస్థితి ఏమిటి?

మత్తాయి బైబిలు: భయం వలన (వారి అభిప్రాయం ప్రకారం) వారి బోధకుడితో పాటు వారి పైకీ నిద్ర ఆవరించినది.

7) వారి పరిస్థితితో జీసస్ పోరాడినాడా?

మత్తాయి బైబిలు (verses 40 – 46): ఆయన తృప్తి చెందలేదు. ఆయన వారి దగ్గరికి వచ్చి ఇలా పలుకుతూ, వారిని లేపినాడు: “చూడండి మరియు ప్రార్థించండి, మీరు ప్రలోభానికి గురికాకుండా ఉండటానికి; ఆత్మ నిశ్చయంగా సమ్మతిస్తున్నది కాని మాంసపు కండ బలహీనంగా ఉన్నది.” అప్పుడు ఆయన మరల వచ్చి చూడగా, వారు నిద్రలో ఉంటారు. మరియు వారిని ఆయన మరల నిద్రలేపి, పై వాక్యాలనే తిరిగి పలుకుతాడు. ఇలాంటి బలహీనత సరైన ఉత్తమమైన శిష్యులలోనే కాకుండా అతి మామూలు దైవభక్తి గల బోధకుడి మామూలు శిష్యులలో కూడా  కనబడదు, మరి ఆ బలహీనత కేవలం మర్యం కుమారుడైన జీసస్ శిష్యులలో ఎలా కనబడగలదు?

8) ఆ దుష్టులు జీసస్ ను బంధించినప్పుడు, వారు ఆయనకు సహాయపడినారా?

మత్తాయి బైబిలు: వారు ఆయనను విడిచిపెట్టి పారిపోయినారు.

9) ఆ రాత్రి జీసస్ కు తన సహచురులపై నమ్మకం ఉండినదా?

మత్తాయి బైబిలు:  వారందరూ తనను విడిచి పారిపోతారని జీసస్ వారికి తెలియజేసెను. ఆ తర్వాత జీసస్ వారితో ఇలా అనెను: నిశ్చయంగా ఈ రాత్రి కోడికూతకు ముందు, మీరు నన్ను వదిలి పారిపోతారు – ఇలా మూడు సార్లు అనగా, వారిలో నుండి పీటర్ అనే సహచరుడు – నేను చనిపోతాను గాని విడిచి పారిపోను అని పలికెను. అలాగే మిగిలిన సహచరులందరూ పలికిరి. మరియు అలా జరిగినది.

10) ఆ దుష్ట సైనికులు జీసస్ ను ఎలా పట్టుకున్నారు?

మత్తాయి బైబిలు: ఒక యూదుడు దారి చూపిస్తుండగా, వారు ఆయన దగ్గరకు కత్తులతో మరియు కర్రలతో వచ్చి, 57వ వచనంలో తెలిపినట్లుగా వారు ఆయనను పట్టుకున్నారు: “మరియు వారు ఆయనను గట్టిగా పట్టుకున్నారు, Caiaphas సియాఫస్ అనే వారి యొక్క మహాగురువు వద్దకు తీసుకుని పోయారు, అక్కడి వారి పెద్దలందరూ సమావేశమై ఉన్నారు.”

అక్కడ వారు ఆయనకు మరణశిక్ష విధించారు. ఆ దుష్టసైనికులు అక్కడి నుండి ఆయనను తీసుకుని పోయారు. ఆయన ముఖం పై ఉమ్మేశారు మరియు తమ చేతులతో ఆయనను మోదారు, ఆ తర్వాత ఆయన దుస్తులను చింపివేశారు. ఆ తర్వాత సిందూర వర్ణపు దుస్తులతో చుట్టివేశారు, ఆ పై ముళ్ళతో నిండి ఉన్న కిరీటాన్ని ఆయన తలపై ఉంచి, ఆయనను పీడిస్తూ, ఎగతాళి చేస్తూ పట్టుకుపోయారు. వారు ఆయనతో ఇలా పలికారు, ‘నీ దావా ప్రకారం నీవు ఇస్రాయీలుకు రాజువి.’ వారు ఆయనను తీవ్రంగా అవమానించారు.

11) చివరిగా ఆయనకు మరణశిక్ష విధించాలని ఎవరు నిర్ణయించారు?

మత్తాయి బైబిలు: ఆనాటి ఫలస్తీన్ దేశపు గవర్నరైన పిలాతు Pontius Pilate.

12) ఆ దుష్టసైనికులు ఆయనను, గవర్నరు ముందుకు తీసుకు వచ్చి, యూదుల గురువు వారి ధర్మశాస్త్రమైన తోరాహ్ ప్రకారం ఆయనకు శిలువ పైకి ఎక్కించి, చంపాలనే మరణశిక్షను విధించాడని తెలియజేయగా, ఆ గవర్నరు విచారించకుండానే, పరిశోధించకుండానే వారిని నమ్మినాడా?

మత్తాయి బైబిలు: ఆ గవర్నరు వారిని నమ్మలేదు, కాని ఆయనను ప్రశ్నించాడు: “వారు ఏదైతే చెప్పినారో, అది నిజమేనా?” ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయెను. ప్రశ్న మరల మరల అడుగ బడినది మరియు ఆయన అలాగే నిశ్శబ్దంగా ఉండెను. సత్యం కోసం ఆయన నిశ్శబ్దంగా ఉండెను.; ఒకవేళ ఆయన ప్రవక్త కాకపోయినా సరే, సత్యాన్ని స్పష్టం చేయటం మరియు యూదుల అపనిందలను నిరాకరించటం తప్పనిసరి. గవర్నరు భార్య,  గవర్నరు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలికినది: “మీరు ఆ మంచి వ్యక్తిని ఏమీ చేయకుండా వదలలేరా? ఆయన కారణంగా నాకు ఈ రోజున కలలో అనేక సంఘటనలు జరిగినవి.”

యూదులను తిరస్కరిస్తూ మరియు హెచ్చరిస్తూ గంటల తరబడి జీసస్ అనేక ఉపన్యాసాలు ఇచ్చేవాడని, దీని వలన వారు జీసస్ ను నిందిచేవారని బైబిల్ ప్రకటిస్తున్నది. మరి ఆ రోజున ఆయన నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయాడు? ఆయనను మాటిమాటికీ ప్రశ్నించటంలో ఆ గవర్నరు యొక్క ఉద్ధేశం సత్యం వైపు నిలబడాలని అయిఉండవచ్చును.

13) వారి ఊహల ప్రకారం జీసస్ ఎలా శిలువ పైకి ఎక్కించబడి, హత్య చేయబడినాడు?

మత్తాయి బైబిలు:  వారు జీసస్ ను ఇద్దరు దొంగల మధ్య శిలువ పైకి ఎక్కించారు, ఆ దొంగలు జీసస్ ను దూషిస్తూ ఇలా పలికినారు, “నీవే గనుక సత్యవంతుడివైతే, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో.”

14) ఇది ఒక మహా ఉపద్రవం. జీసస్ (వారి అభిప్రాయం ప్రకారం) శిలువ పై ఉండగా ఏమని పలికెను?

మత్తాయి బైబిలు  (27:46): జీసస్ ఏడుస్తూ, బిగ్గరగా ఇలా పలికినాడు “Eli, Eli, Iama sabachthani? అర్థం – నా ప్రభూ, నా ప్రభూ, నన్ను ఎందుకు విడిచి పెట్టివేసినావు?”

అన్ని ధర్మాల ప్రామాణిక నియమాలను అనుసరించి ఇది ఒక పచ్చి అవిశ్వాసపు ప్రకటన. అవతరింపజేయబడిన ధర్మాలను అనుసరించి, ఎవరైనా ఇటువంటి వాక్యాలను ఒక ప్రవక్త పై చెప్పి నట్లయితే, వారు అవిశ్వాసులు అవుతారు.

సర్వలోక శక్తమంతుడైన అల్లాహ్ ఖుర్ఆన్ లో యూదులను మరియు క్రైస్తవులను – జీసస్ అల్లాహ్ యొక్క అవతారమనే, అల్లాహ్ యొక్క కుమారుడనే, పూర్తిగా జీసస్ నే తిరస్కరించేటటు వంటి  వారి అపనిందల గురించి హెచ్చరిస్తూ, వారు జీసస్ ను కేవలం అల్లాహ్ యొక్క సందేశహరుడిగానే విశ్వసించమని దివ్యఖుర్ఆన్ (V. 4:159) లో ఆజ్ఞాపిస్తున్నాడు: మరియు గ్రంథ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ మరణం సంభవించక ముందే ఆయనను (జీసస్ ను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని) తప్పక విశ్వసించవలెను. మరియు పునరుత్థాన దినాన ఆయన (ఈసా) వారి పై సాక్ష్యమిచ్చును


రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ మొత్తం చదవటం ఎలా? (How to Read the Whole Quran in Ramadan?)

ramadhan-quranHow to Read the Whole Qur’an in Ramadan?
(రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ మొత్తం చదవటం ఎలా?)

Read the PPT (Power Point Presentation)

1. ఈ రమదాన్ నెలలో       దివ్యఖుర్ఆన్      మొత్తం చదవాలని      కోరుకుంటున్నారా?
2. మీరు చేయవలసినదల్లా ప్రతి ఫర్ద్ నమాజు తరువాత 4½ పేజీలు చదవటమే.
3. ఒకసారి దీనిని పరిశీలించండి :  పేజీలు(4.5)*ప్రతిదిన నమాజులు(5)*దినములు(౩౦) =  (604)దివ్యఖుర్ఆన్ లోని మొత్తం పేజీలు.
4. ప్రతి నమాజు తరువాత కేవలం కొన్ని నిమిషాలు వెచ్చించటం ద్వారా చాలా సులభంగా ప్రతి నెలలో ఒకసారి మొత్తం ఖుర్ఆన్ పూర్తిగా చదవుకో వచ్చనే విషయం నాకింత వరకు తెలియదే.
ఎంత లాభదాయకమైన పెట్టుబడి!!!
ఒకవేళ మీరు బిజీగా ఉంటే, ప్రతి నమాజు తరువాత కేవలం రెండు పేజీలు చదవటం ద్వారా ప్రతి రెండు నెలలలో ఒకసారి ఖుర్ఆన్ పూర్తిగా చదవుకోవచ్చు.
నమ్మలేక పోతున్నారు కదూ???
5. గుర్తుంచుకోండి! దివ్యఖుర్ఆన్ లో మీరు చదివే ఒక్కో అక్షరానికి బదులుగా 10పుణ్యాలు మీ ఖాతాలో జమ చేయబడతాయి.
మరి ఒక్కో పదానికి బదులుగా??
ఒక్కో పంక్తికి బదులుగా??
ఒక్కో పేజీకి బదులుగా??
ఒక్కో అధ్యాయానికి బదులుగా??
మొత్తం ఖుర్ఆన్ చదివినందుకు బదులుగా?
6. ఇంత మంచివిషయం తెలుసుకున్నాక మీరేమి చేయగలరు?
మీరు చేయగలిగే కనీస పని ఏమిటంటే, దీనిని ఇతరుల వరకు అందజేయటం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ పంపండి.
జజాకల్లాహ్ ఖైర్.

దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం – E-Book

Daiva Pravaktha dharmam - Telugu Islam
రచయిత
:ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

విషయ సూచిక:

 1. తొలి పలుకులు
 2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం
 3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం
 4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు
 5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ
 6. తౌహీద్ ఆల్ రుబూబియాత్
 7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్
 8. హృదయారాధనలు
 9. నోటి ఆరాధనలు
 10. ఇతర శారీరక ఆరాధనలు
 11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్
 12. తౌహీద్ ప్రయోజనాలు
 13. షిర్క్ యెక్క ఆరంభము
 14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు
 15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత
 16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు
 17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు
 18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత
 19. నలుగురు ఇమాములు
 20. సున్నత్-బిద్అత్
 21. సలఫ్ మరియు సున్నత్
 22. బిద్అత్
 23. యాసిడ్ టెస్ట్
 24. ఈమాన్
 25. ఇహ్ సాన్
– తొలి పలుకులు
– దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం
– లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం
– లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు
– లా ఇలాహ ఇల్లల్లాహ్వివరణ
– తౌహీద్ ఆల్ రుబూబియాత్
– తౌహీద్ ఆల్ ఉలూహియాత్
– హృదయారాధనలు
– నోటి ఆరాధనలు
– ఇతర శారీరక ఆరాధనలు
– తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్
– తౌహీద్ ప్రయోజనాలు
– షిర్క్ యెక్క ఆరంభము
– దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు
– ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత
– దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత – లాభాలు
– దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత – నష్టాలు
– ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత
– నలుగురు ఇమాములు
– సున్నత్-బిద్అత్
– సలఫ్ మరియు సున్నత్
– బిద్అత్
– యాసిడ్ టెస్ట్
– ఈమాన్
– ఇహ్ సాన్

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (Morning Evening Supplications)

Morning Evening Supplications ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (రోజంతా అల్లాహ్ రక్షణలో)
సంకలనం:ఎస్.ఎం.రసూల్ షర్ఫీ ,ముహమ్మద్ హమ్మాద్ ఉమరి
పునర్విచారకులు: మంజూర్ అహ్మద్ ఉమరి
ప్రకాశకులు: శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్, అక్బర్ బాగ్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి ]

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత (The Virtues of fasting on Ashura)

ashura-telugu-islamThe Virtues of fasting on Ashura

క్లుప్త వివరణ : ఆషూరాఅ రోజున ఉపవాసం ఎందుకు ఉండవలెను మరియు ఆషూరాఅ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి – అనే విషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడినాయి.
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
మూలం : షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమీన్ (రహిమహుల్లాహ్) మరియు షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్  (హఫిజాహుల్లాహ్) యెక్క గ్రంధముల నుండి గ్రహించబడినవి.

 [ఇక్కడ చదవండి/డౌన్ లోడ్ చేసుకోండి]

ముహర్రం & ఆషూరాహ్ (Muharram and Ashurah)

muharram-telugu-islamక్లుప్త వివరణ : పవిత్ర ముహర్రం నెల మరియు ఆషూరాహ్ దినపు ప్రత్యేక శుభాలు
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : నజీర్ అహ్మద్
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్

[ఇక్కడ  చదవండి /డౌన్ లోడ్ చేసుకోండి] PDF

రమజాన్ నెలలో రఫీ ఏం చేస్తాడు?

ramadhan-telugu-islam(రంజాన్ నెలలో ముస్లిం దిన చర్యను తెలిపే ఓ కల్పిత కధ)
అంశాల నుండి : దారుస్సలాం పుస్తకాలయం
అనువాదం : హాఫిజ్ S.M.రసూల్ షర్ఫీ
ప్రకాశకులు:శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్
క్లుప్త వివరణ: రమదాన్ నెలలో ముస్లింల దినచర్య గురించి తెలిపే ఒక కల్పిత కథ.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

రఫీ చాలా మంచి బాలుడు. చదివేది ఐదో తరగతి అయినా అసామాన్య తెలివి తేటలు కలిగినవాడని అందరూ అతన్ని కొనియాడుతుంటారు. అతని నడవడికలో, కదలికల్లో తెలివిని మించిన సంస్కారం ఉట్టిపడుతుంది. ముక్కుపచ్చలారని వయసులో ముద్దులొలికే అతని మంచితనం అందరిని ముచ్చట గొలుపుతుంది. మురిపెమైన అతని మాట తీరు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఐదో తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేది అతనికే. దివ్యఖుర్ఆన్ మొత్తం కంఠతా, మధురాతి మధురంగా పారాయణం చేస్తాడు రఫీ. అంతేకాదు, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఎన్నో హదీసులు కూడా అతనికి బాగా జ్ఞాపకం ఉన్నాయి.

తనకు అవసరం లేని విషయాలను రఫీ అస్సలు పట్టించుకోడు. చెడు సావాసాలకు ఎల్లప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. ఇరుగు పొరుగువారికి, టీచర్లకు, తోటి విద్యార్థులకు, అందరికి అతనంటే చాలా ఇష్టం. అతను అందర్నీ గౌరవిస్తాడు. కనుక అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను ఎవరి మనసూ నొప్పించడు. పరులకు కీడు చేయటం కలలోనైనా ఊహించలేని విషయం అతనికి.

రమజాన్ నెల అంటే రఫీకు వల్లమాలిన అభిమానం. కొన్ని నెలల ముందు నుంచే దాని కోసం అతని ఎదురు చూపులు మొదలవుతాయి. ఆ శుభప్రదమైన నెలకోసం అన్ని విధాలా సిద్ధమై ఉంటాడు. రమజాన్ ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలన్నది అతని ఆశ. అల్లాహ్ ను అమితంగా సంతోష పెట్టాలన్నది అతని తపన. పొద్దస్తమానం టి.వి. ముందు కూర్చొని సమయం వృధా చేసేవాళ్ళంటే అతనికి పరమ చిరాకు. కాలం విలువను లెక్క చేయకుండా సినిమాలు, క్రికెట్లు చూస్తూ జాలీగా గడిపేవాళ్ళ పరిస్థితి మీద ఎంతో జాలిపడతాడు రఫీ. రేపు పరలోకంలో వారు అల్లాహ్ కు సమాధానం చెప్పబోయే దృశ్యాన్ని తలచుకొని అతని మనసు పరిపరి విధాలా చింతిస్తుంది.

ఫీ మాత్రం తన ఖాళీ సమయాన్ని చక్కగా మంచి పనుల కోసమే వినియోగిస్తాడు. కాస్త వీలు దొరికితే త్వరగా ఏదైనా ధర్మకార్యం పూర్తిచేసి అల్లాహ్ ప్రసన్నత పొందాలని ఉవ్విళ్లూరుతూ ఉంటాడు.

ప్రతి సంవత్సరం షాబాన్ నెల పూర్తి కావస్తున్నప్పుడు రఫీలో ఆనందం గంతులేస్తుంది. రమజాన్ నెల దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో సంతోషం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. షాబాన్ నెల చివరి రోజైతే నెల పొడుపు కోసం అతని కళ్లు ఆకాశం కేసి ఆశగా చూస్తుంటాయి. నెలపొడుపు కనిపించగానే అప్రయత్నంగా అతని నోటి నుంచి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది ప్రార్థనా వచనాలు వెలువడుతాయి:

“అల్లాహు అక్బర్, అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ అమ్ ని వల్ ఈమాని, వస్సలామతి వల్ ఇస్లామి, వత్తాఫీఖి లిమా తుహిబ్బు వ తర్ జా, రబ్బునా వ రబ్బుకల్లాహ్”

(అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఓ అల్లాహ్! ఈనెలవంకను మా కొరకు శాంతీ విశ్వాసాలకు, ప్రశాంతం విధేయతలకు, నీవు ఇష్టపడే, నీవు ప్రసన్నుడవయ్యే మా సద్బుద్ధికి ప్రతీకగా చెయ్యి. ఓ నెలవంకా! మా ప్రభువూ, నీ ప్రభువూ అల్లాహ్ యే సుమా! )

ఇక ఆ రోజు రాత్రి, ఇషా నమాజు అనంతరం అందరితో కలిసి ఇమాము వెనుక చక్కగా తరావీహ్ నమాజు పూర్తి చేస్తాడు రఫీ. అప్పటి వరకు మస్జిద్ వదలిపెట్టి ఇంటికి వెళ్ళడు. తరావీహ్ నమాజు గొప్పదనం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన విషయాలు ఎన్నటికీ మరిచిపోలేని విధంగా అతనికి గుర్తున్నాయి.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ఎవరయితే పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం కోసమని రమజాన్ నెల (రాత్రి వేళల్లో) నమాజు చేస్తారో, వారి గడిచిన పాపాలన్నీ క్షమించబడతాయి.”

ఆయన ఇంకా ఇలా అన్నారు:

“ఇమాము వెనుక చివరికంటూ నిలబడి నమాజు పూర్తి చేసిన వ్యక్తికి ఆరాత్రంతా నిలబడి నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది.”

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ మాటలు గుర్తుకు వస్తే చాలు, అతని మనస్సు భక్తి భావంతో పొంగిపొరలుతుంది.

రమజాన్ నెల, ఉపవాసాల నెల అని మనందరికి తెలుసు. ఈ నెలలో ఉపవాసాలు పాటించే మనుషులు రెండు రకాలు. మొదటి రకం మనుషులు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలోనే కాలం గడుపుతారు. ఉపవాస కాలంలో వీరు మాటల్లోనూ, చేతల్లోనూ చాలా ఖచ్చితంగా ఉంటారు. అత్యధికంగా ఖుర్ఆన్ పారాయణం చేస్తారు. మస్జిదులో సామూహికంగా నమాజులు పాటిస్తారు. ఆకలిగొన్న వారికి అన్నం పెడతారు. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. తమ దగ్గర వున్న డబ్బుల్లో నుంచి కొంత డబ్బు తీసి నిరుపేదలకు సహాయం చేస్తారు. ఏ చిన్న మంచి పనినీ వారు అల్పంగా భావించరు. పుణ్యం తెచ్చిపెట్టే ఏ అవకాశాన్ని చేజారనివ్వరు. ఆ నోట ఈ నోట విన్న మాటల్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా నలుగురిలో వ్యాపింపజేస్తూ తిరుగరు. చాడీలు చెప్పటం, ఇతరుల్ని మోసం చేయటం లాంటి విషయాల్లో తమ విలువైన సమయాన్ని వారు అస్సలు వృధా కానివ్వరు. ఒకవేళ ఎవరైనా తమ మీద కొట్లాటకు గాని, తగవులాటకు గాని దిగితే మర్యాదగా వారితో, “మేము ఉపవాసం ఉన్నామండీ” అని చెప్పి, తెలివిగా ఆ తప్పుడు కార్యం నుంచి తప్పించుకుంటారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా చేయమని బోధించారో అలాగే చేస్తారు. మరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏం ప్రబోధించారో తెలుసా?!

“(యుద్ధంలో సైనికుడు ఉపయోగించే) డాలు వంటిది ఉపవాసం. మీలో ఎవరయినా ఉపవాసం పాటిస్తున్నట్లయితే వారు ఆ రోజు వ్యర్ధమైన మాటలు మాట్లాడరాదు. నోరు పారేసుకోరాదు. మూర్ఖంగా ప్రవర్తించరాదు. ఒకవేళ తమ మీద ఎవరయినా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో, ‘నేను ఉపవాసం ఉన్న మనిషినండీ’ అని చెప్పేయాలి.”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు :

“అన్నపానీయాలకు దూరంగా ఉండటం మాత్రమే ఉపవాసం కాదు సుమా! వ్యర్ధమైన పలుకులకు, అశ్లీల మాటలకు దూరంగా మసలుకోవటమూ ఉపవాసంలో అంతర్భాగమే!”

ఉపవాసం పాటించే వారిలో మరి కొందరుంటారు. వారు పొద్దస్తమానం తిండి గురించే ఆలోచిస్తుంటారు. పడమట దిక్కు సూర్యుడు అస్తమించాడో లేదో ఇక వారు భోజనం మీద పడతారు. తినే వస్తువులు ఏవి దొరికితే అవి గబగబా లాగించేస్తారు. పీకల దాకా మెక్కిన తర్వాత ఇక వారి ఇక్కట్లు మొదలవుతాయి. లేచి నిలబడాలన్నా వారికి కష్టంగా ఉంటుంది. అందుకని టి.వి. ముందు కుర్చీలకు అతుక్కొని కూర్చుంటారు. బాగా పొద్దుపోయే దాకా టి.వి. ఛానెళ్ళు మార్చి మార్చి చూస్తూ ఉంటారు. . ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఫలితంగా రాత్రిపూట వారికి నిద్ర సరిపోదు. ఇక తెల్లవారు జామున సహ్రీ కోసం నిద్ర లేవటం చాలా భారంగా అనిపిస్తుంది.  తప్పదు గనక సహరీ పేరుతో బలవంతాన రెండు ముద్దలు మింగుతారు.  సహరీ కార్యం అయిపోగానే మళ్లీ మంచం పట్టెలు వెతుక్కుంటారు. నడుంలో అసలు బలమే లేనట్టు పడకల మీద వాలిపోతారు. ఇంకేమవుతుంది?! తెల్లవారు జామున తప్పకుండా చేయవలసిన ఫజ్ర్ నమాజుకు ఎగనామం!!

రమజాన్ నెల, మనుషుల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చే నెల అన్న మాట నిజమే, కాని అది ఇలాంటి వారి కోసం కాదు. అసలు మనసుల్లో మారాలన్న తలంపే లేనివారిని ఎవరూ మార్చలేరు. అందుకనే రమజాన్ నెలలోనూ ఇలాంటి వారి అలవాట్లలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. వీరి దృష్టిలో రమజాన్ మాసం ఆరాధనల మాసం కాదు. వరాలు పొందే వసంతం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని పారాయణం చేయవలసిన పుణ్యకాలమూ కాదు. అల్లాహ్ విధేయతలో గడపాల్సిన శుభ ఘడియలూ కావు.

పైగా వీరి దృష్టిలో రమజాన్ అంటే ఇతర రోజుల్లో కంటే ఎక్కువగా తిని, తాగి సోమరితనాన్ని పెంచుకునే మాసం. రమజాన్ పేరుతో దొరికే సెలవల్ని అనవసరమైన పనుల్లో ఖర్చుచేసే కాలం. సందేహం లేదు. ఇలాంటి వాళ్లు జీవితంలో చాలా నష్టపోతున్నారు. రమజాన్ మాసం గొప్పదనాన్ని వీరు గ్రహిం చలేకపోతున్నారు. రమజాన్ నెలలోనూ వ్యర్ధ విషయాల్లో కాలం గడపటం పరమ దురదృష్టం. రమజాన్ నెలను పొంది, అందులో సత్కార్యాలు చేసి తద్వారా తమ పాపాలకు క్షమాభిక్ష సంపాదించుకోలేని వారు పరమ దౌర్భాగ్యులని ఒక హదీసులో చెప్పబడింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఆ మాట గుర్తొస్తే చాలు, రఫీ నిలువెల్లా కంపించిపోతాడు. రమజాన్ మాసం అతని దృష్టిలో వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాల నిధుల కన్నా ఎంతో ఎక్కువ. అంత శుభవంతమైన మాసాన్ని వృధాగా పోనివ్వటం అతని వల్ల కాని పని. పైగా అలా చేసేవాళ్ల అమాయకత్వం మీద అతను చాలా జాలి పడతాడు.

ఖుర్ఆన్లో మొత్తం ముప్పయి పారాలు (కాండములు)  ఉన్నాయి కదా! వాటిలో ప్రతి రోజూ మూడు పారాలను పారాయణం చేయటం నియమంగా పెట్టుకుంటాడు రఫీ. రమజాన్ నెల సాంతం ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు.

ఒక యేడు రమజాన్ నెల పదవ తేదినాటి సంఘటన. అస్ర్ నమాజు ముగిసింది. చాలా మంది జనం ఇండ్లకు వెళ్ళ లేదు. మస్జిదులోనే ఉండి వివిధ పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కొంతమంది ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. దైవగ్రంథ పారాయణ శబ్దం తుమ్మెద గానంలా ఇంపుగా వినిపిస్తోంది. మరి కొంత మంది మస్జిదులోనే ఓ పక్కకు వాలి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకొందరు పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్లవెంట వచ్చిన చిన్న పిల్లలు పరుగెత్తుతూ అల్లరి చేస్తున్నారు. మస్జిదులో వారు అల్లరి చేస్తున్నా వారి పెద్దలు వారిని ఏమీ అనటం లేదు. ప్రశాంతంగా ఉండవలసిన మస్జిదులో పిల్లలు అల్లరి చేయటం రఫీకు నచ్చలేదు. అందుకని అతను ఆ పిల్లలకు, ఇంకా మస్జిదులో పడుకొని మాట్లాడుకుంటున్న వారికి దూరంగా ఒక మంచి స్థలం చూసుకున్నాడు. మధురమైన కంఠంతో దివ్యఖుర్ఆన్ పారాయణం మొదలు పెట్టాడు. అతని స్వరం చాలా ఇంపుగా, వినసొంపుగా ఉంటుంది. అతను గొంతెత్తి ఖుర్ఆన్ పారాయణం చేస్తే విన్నవారెవరైనా ముగ్ధులవుతారు.

రఫీ ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు అతని పక్కనే ఆతిఫ్ మాస్టారు కూర్చొని ఉన్నారు. అతను ఆయన్ని గమనించ లేదు. అతని మంచితనం, తెలివి తేటలు మాస్టారుకు చాలా బాగా తెలుసు. రఫీని అమితంగా మెచ్చుకుంటారాయన. బయట కనిపించినప్పుడల్లా ప్రేమగా పలకరిస్తుంటారు.

ఖుర్ఆన్ పారాయణం పూర్తయింది. గ్రంథం మూసి ప్రక్కకు తిరిగి చూశాడు రఫీ. ఆతిఫ్ మాస్టారు తన ప్రక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మాస్టారును గమనించుకో నందుకు మనసులో అతనికి కొద్దిగా అసంతృప్తి కలిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు సలాం చెప్పాడు. మాస్టారు రఫీని ఆప్యాయంగా దగ్గరకు పిలిచారు. అతను దగ్గరకు రాగానే, “రఫీ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం అవసరమా?! ” అని అడిగారు. ప్రక్కనున్నవారు కూడా వినాలని కాస్త బిగ్గరగానే మాట్లాడారు.

“లేదు మాస్టారూ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం విధి కాదు. అయితే కాస్త పెద్ద పిల్లలకు ఉపవాసం అలవాటు చేయటం మంచి విషయమే.”

ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు రఫీ.

ఆ సంగతి మాస్టారుకూ తెలుసు. కాని అక్కడున్న వాళ్లలో చాలామందికి వయోజనులైన పిల్లలు ఉన్నారు. అయినా వాళ్ళు తమ పిల్లలకు ఉపవాసాలు పాటించమని ఆజ్ఞాపించటం లేదు. అలాంటి వారికి విషయం బోధపడాలని మాస్టారు బిగ్గరగా అడిగారు. మాస్టారు ఉద్దేశం పసికట్టిన రఫీ కూడా నలుగురికీ వినపడేలా గట్టిగా సమాధానమిచ్చాడు. –

వారి మాటలు మస్జిదులో కాలక్షేపం చేస్తున్న చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. గురుశిష్యుల సంభాషణను వినటానికి వారూ దగ్గరకు జరిగి కూర్చున్నారు.

“అంత రూఢీగా ఎలా చెప్పగల్గుతున్నావు రఫీ!?” మళ్లీ అడిగారు మాస్టారు.

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితం, ఆయన సహచరుల ఆచరణ, పండితుల పలుకులు ఆ విషయమే కదా బోధిస్తున్నవి?” అంటూ అసలు ఆ విషయంలో సందేహమే అక్కర్లేదన్నట్లు చాలా గట్టిగా సమాధానం చెప్పాడు రఫీ.

“ఏంటేంటి? అందరికి వినపడేలా, ఇంకాస్త వివరంగా చెప్పు?” – మస్జిదులో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్న వారి వైపు సైగ చేస్తూ అడిగారు మాస్టారు.
ఆయన మాటలు పడుకున్న వారందరిని లేపి కూర్చో బెట్టాయి. రఫీ సమాధానం వినటానికి అందరూ చెవులు రిక్కించారు.

అందరి కళ్ళు తనవైపే చూస్తున్నాయి. తాను అక్కడున్న వారందరి కంటే చిన్నవాడు. అలాంటప్పుడు తాను వారికి బోధ పరచటం అమర్యాద అవుతుందేమోనని రఫీ కాస్త తటపటాయించాడు. కాని మాస్టారు మాత్రం అతన్ని మళ్ళీ మళ్లీ అడుగుతున్నారు.

“చెప్పు రఫీ! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏం బోధించారు?” – మాస్టారు మాటను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని భావించాడు రఫీ. “సరే, చెబుతానండీ” అంటూ మొదలుపెట్టాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏమని బోధించారంటే:

“పిల్లలకు ఏడేళ్లు రాగానే వారికి నమాజు చేయమని ఆజ్ఞాపించండి. పదేళ్ళ ప్రాయంలోనూ వారు నమాజును అలవర్చుకోకపోతే (కాస్త) దండించండి. ఇంకా వారిని వేర్వేరుగా పడుకోబెట్టండి.” (అహ్మద్, అబూదావూద్, హాకిమ్ గ్రంథాలలో ఈ హదీసు ఉంది.)

పై హదీసు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడే వారికి నమాజు గురించి ఆజ్ఞాపించాలన్న నియమం ఏమీ లేదు. పైగా పసితనం నుంచే వారిలో నమాజు పట్ల శ్రద్ధను, ఆశక్తిని పెంచాలి. బాల్యం నుంచే నమాజు అలవాటు చేయాలి. ప్రాజ్ఞ వయస్సు దగ్గర పడుతున్న ప్పటికీ పిల్లలు నమాజుకు అలవాటు కానట్లయితే తల్లిదండ్రులు తమ పెంపకం గురించి పునరాలోచించుకోవాలని పై హదీసు చూచాయగా బోధపరుస్తోంది. అంతేకాదు, మంచి ఫలితం ఉంటుందని భావిస్తే, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను దండించినా ఫర్వాలేదని కూడా దైవప్రవక్త ప్రవచనం చెబుతోంది.

విధి రీత్యా ఉపవాసం కూడా నమాజు లాంటిదే. కనుక కొన్ని గంటలపాటు ఆకలిని, దప్పికను అవలీలగా తట్టుకోగల దశకు పిల్లలు చేరుకోగానే తల్లిదండ్రులు అటువంటి పిల్లలను ఉపవాసం పాటించమని ఆదేశించాలి. ఆ వయసు నుంచే పిల్లలకు ఉపవాసం పాటించటం అలవాటు చేయాలి. ప్రవక్త సహచరులు (సహాబీలు) తమ పిల్లల్ని చిన్నతనం నుంచే ఉపవాసాలు పాటించేందుకు ప్రోత్సహిస్తుండేవారని ఇస్లామీయ చరిత్ర చెబుతోంది. బుఖారీ, ముస్లిం ఉభయ పండితులు తమ గ్రంథాల్లో ఒక హదీసును ఉల్లేఖించారు. రుబయీ బిన్తె ముఅవ్విస్ చెప్పిన విషయం అది:

ఒకనాటి సంఘటన. అది ముహర్రమ్ నెల పదో తేది (అంటే ఆషూరా రోజు) ఉదయం. అన్సార్ సహచరులు ఉండే ప్రదేశానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక మనిషిని పంపించారు. ప్రవక్త ఆదేశం మేరకు ఆ మనిషి ఇలా ప్రకటించాడు:

“తెల్లవార్లు ఏదైనా తిని వున్నవారు ఇక సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. అలాగే ఏమీ తినకుండా ఉన్నవారు కూడా రోజంతా ఉపవాసాన్ని కొనసాగించాలి.”

ఇక అప్పట్నుంచి మేము ప్రతి యేడు ముహర్రమ్ నెల పదో తేదీన తప్పకుండా ఉపవాసం పాటిస్తూ ఉండేవాళ్లం. అంతేకాదు, మా పిల్లల చేత కూడా ఉపవాసాలు పెట్టించే వాళ్ళం.పిల్లల కోసం మేము ఉన్ని బొమ్మలు తయారు చేసి పెట్టుకునే వాళ్ళం. ఏ పిల్లవాడైనా అన్నం కోసం ఏడిస్తే ఉపవాసాన్ని విరమించే సమయం దాకా అతన్ని ఆ బొమ్మలతో బుజ్జగించే వాళ్ళం .

రఫీ బోధిస్తున్న తీరును చూసి అక్కడున్న పెద్దవాళ్లు విస్తు పోయారు. ఇంత పసితనంలోనే అతనిలో అంతటి ఇస్లామీయ పరిజ్ఞానం వారిని ఔరా అనిపించింది. మొత్తానికి అతని తెలివి తేటల్ని, ప్రతిభను అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. మంత్రముగ్ధులై గురుశిష్యుల సంభాషణనువినసాగారు.

రఫీకు తెలుగు సామెతలు చాలా తెలుసు. సామెతల ద్వారా ప్రజలకు ఖుర్ఆన్ హదీసులను చక్కగా వివరించవచ్చని కూడా అతను అర్థం చేసుకున్నాడు. కనుక తరచూ ఆ ప్రయోగం చేస్తుండేవాడు. ఈ సందర్భంగా అతనికి ఓ మంచి సామెత గుర్తొచ్చింది.

“మొక్కై వంగనిది మ్రానై వంగునా?” అని ప్రశ్నించాడు

అతని మాట తీరు అక్కడున్న వారిని కట్టిపడేస్తోంది. ఒంటి మీద పిచ్చుకలు వాలినట్లు కదలకుండా కూర్చొని ఆసక్తిగా ఆ బుడతడి మాటల్ని వింటున్నారు.

– “చిన్న మొక్కను మనం ఎలా కోరుకుంటే అలా వంచవచ్చు. ఆ మొక్కే పెరిగి మ్రానైనప్పుడు ఇక దాన్ని వంచటమూ చేతకాదు, మనకు నచ్చిన రీతిలో పెంచటమూ చేతకాదు. అందు కనే పిల్లలకు పసితనంలోనే అన్నీ నేర్పించాలి. మంచి విషయాలు అలవాటు చేయాలి. పెద్దయిన తర్వాత అవి వారికి చాలా . ఉపయోగపడతాయి. అంతేకాదు, వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు కూడా సౌకర్యాన్ని కలుగజేస్తాయి.”

“యధా రాజా తథా ప్రజ.”

మరో సామెతను ప్రయోగించాడు రఫీ.

చిన్న పిల్లలు ప్రతిదీ తమ చుట్టుప్రక్కల వాతావరణం నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు ఏది చేస్తే పిల్లలూ అదే చేయటానికి ప్రయత్నిస్తారు. కనుక పెద్దవారు చిన్న పిల్లల అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలతో, చేతలతో వీలైనంత వరకు వారికి మంచి విషయాలు నేర్పించటానికి ప్రయత్నించాలి. మంచి అలవాట్లు వచ్చేలా చూడాలి. చిన్నప్పుడు నమాజులు, ఉపవాసాలు పాటిస్తుండేవారికి పెద్దయిన తర్వాత అవి ఏమాత్రం కఠినంగా అనిపించవు.

రఫీ ఇక్కడ ఆగి కాసేపు ఏదో ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు:

అల్లాహ్ మా నాన్న గారిని కరుణించాలని నేను నిత్యం ప్రార్థిస్తుంటాను. ఆయనే నాకు నమాజు అలవాటు చేశారు. క్రమశిక్షణతో జీవితం గడపటం నేర్పారు. అందరితో కలిసి నమాజు చేయటానికి గాను ఆయన ఎల్లప్పుడూ నన్ను తన వెంట మస్జిదకు తీసుకువెళ్తుండేవారు. నేను బడికి వెళ్లటం మొదలు పెట్టకముందే ఆయన నాకు రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం అలవాటు చేశారు. కాని నేను ఉపవాసం ఉండటం మా అమ్మకు నచ్చేది కాదు. ఆకలితో బాధపడతానని అమ్మకు భయం. అయితే నాన్నగారు ఆమెకు నచ్చజెప్పేవారు.

“వీణ్ణి కనీసం సగం రోజైనా ఉపవాసం ఉండనీ. భయ పడాల్సిన విషయం ఏమీ లేదు. ఉపవాసం వల్ల లాభమే గాని నష్టం అస్సలు లేదు. ఉపవాసం జీవితంలో కష్టాలను, బాధలను ఎదుర్కోవటం నేర్పుతుంది. ఓర్పును, ధైర్యసాహసాలను నూరి పోస్తుంది. ఉపవాసం వల్ల స్థిరమైన వ్యక్తిత్వం అలవడుతుంది” అని అమ్మకు ఆయన బోధిస్తుండేవారు.

ఈ మాటలు చెబుతున్నప్పుడు రఫీకు దుఃఖం ముంచు కొచ్చింది. కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలాయి. నాన్న గుర్తుకు రాగానే ఇక అతనికి ఏడ్పు ఆగలేదు.

నిజం ఏమిటంటే, రఫీ ఒక అనాధ పిల్లవాడు. కొన్ని నెలల క్రితమే అతని తండ్రి చనిపోయాడు. ఆ పసివాడి రోదన అక్క డున్న చాలామంది పెద్దలను కంటతడి పెట్టించింది. వాళ్లందరికి అతని తండ్రి బాగా తెలుసు. అతని తండ్రి ఆత్మీయులు కూడా వారిలో కొందరు ఉన్నారు. వారైతే నిగ్రహించుకోలేక పోయారు. ఉద్వేగంతో వచ్చి ఆ బాలుణ్ణి కావలించుకున్నారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న ఏడ్పును బలవంతాన ఆపుకోగలిగారు.

ఇక అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటిముఖం పట్టాడు రఫీ. మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. దూరం నుంచే అమ్మ కనిపించింది. ఇక అతని కాలు ఆగలేదు. పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను చుట్టు కున్నాడు. వలవలా ఏడ్చాడు. తల్లి ఎంత అడిగినా సమాధానం చెప్పలేకపోయాడు.

కాసేపటికి అతని ఏడ్పు ఆగింది. మస్జిద్ లో జరిగిన దంతా తల్లికి వివరించాడు. భర్త జ్ఞాపకం ఆ ఇల్లాలినీ శోక సంద్రంలో ముంచివేసింది. కళ్లల్లో నీళ్లు సుడిగుండాలై పొంగాయి. గుండె చెరువు అయినట్లు అనిపించింది. పిల్లవాడి ముందు రోదించటం సబబు కాదని భావించింది ఆమె. గట్టిగా నోరు అదిమిపట్టుకుంది. దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకో గల్గింది. తరువాత కుమారుణ్ణి ఓదార్చటానికి ప్రయత్నించింది.

సూర్యుడు అస్తమించే సమయం. చెల్లి తమ్ముళ్లతో కలసి ఇంట్లోనే ఒక శుభ్రమైన స్థలంలో కూర్చున్నాడు రఫీ. సాయంత్రం పూట పఠించవలసిన ప్రార్థనా వచనాలు పఠిస్తున్నాడు. మధ్యలో తమ్ముళ్లకు కూడా నేర్పిస్తున్నాడు. కాసేపటికి సూర్యాస్తమయం అయింది. జనం కొందరు ఇండ్లల్లో, మరికొందరు మస్జిదుల్లో ఉపవాసం విరమిస్తున్నారు. ఉపవాసం విరమించటాన్ని “ఇఫ్తార్” అంటారు. అందరితోపాటు రఫీ కూడా కొన్ని ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేశాడు. మామూలుగా అతను ఖర్జూర పండ్లతోనే ఇఫ్తార్ చేస్తాడు. ఒకవేళ ఇంట్లో ఖర్జూర పండ్లు లేకపోతే కాసిన్ని మంచినీళ్లు త్రాగి ఉపవాసం ఆపేస్తాడు. తర్వాత ఈ వచనాలు పఠిస్తాడు:

“జహబజ్జమవు వబ్ తల్లతిల్ ఉరూఖు వ సబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్” (దాహం తీరింది. నరాలు తడిచాయి. అల్లాహ్ తలిస్తే పుణ్యం కూడా తప్పకుండా లభిస్తుంది.)

ఇంకా తనకు ఆహారం తినిపించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రఫీ ఇలా పలుకుతాడు:
.
“అల్ హము లిల్లాహిల్లజీ అత్ అమనీ హాజా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వతిన్” (నాకు ఈ భోజనం తినిపించిన, నా శక్తియుక్తుల ప్రమేయం లేకుండానే నాకు ఈ ఆహారం ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.)

‘ఇఫ్తార్’ సమయంలో మరెన్నో ప్రార్థనలు చేస్తాడు రఫీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ క్రింది మాట రమజాన్ నెల మొత్తం అతనికి గుర్తుంటుంది.

“ఉపవాసం విరమించేటప్పుడు ఒక ఉపవాసి చేసుకునే విన్నపం మన్నించబడకుండా ఉండదు. (అంటే అతని ప్రార్థన తప్పక నెరవేరుతుంది)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ విషయం కూడా అతని మనసులో బాగా నాటుకుపోయింది.

“ముగ్గురి ప్రార్థనలు తిరస్కరించబడవు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు న్యాయం చేసే రాజు. మరొకరు ఇఫ్తార్ చేస్తున్న ఉపవాసి. ఇంకొకరు పరుల చేత పీడించబడిన వ్యక్తి.”

ఆహా! ఎంత మనోహరమైనది రమజాన్ మాసం! ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో అపారమైన మేళ్లు ఉన్నాయి. అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ మానవుల సన్మార్గం నిమిత్తం ఈ నెలలోనే అవతరించింది; అల్లాహ్ ఎంతో మందిని ఈ నెలలోనే నరకాగ్ని నుంచి రక్షిస్తాడు. స్వర్గ ద్వారాలు తెరుచు కునేది, నరక ద్వారాలు మూతపడేది ఈ శుభమాసంలోనే. అంతేకాదు, ఈ నెలలో షైతానులను సంకెళ్ళతో బంధించటం జరుగుతాయి. తన దాసుల పాపాలను అల్లాహ్ ఈ నెలలో విపరీతంగా మన్నిస్తాడు. మామూలు రోజుల్లో ఒక మంచి పనికి ఒక పుణ్యం మాత్రమే లభిస్తుంది. కాని రమజాన్ నెలలో అదే మంచి పనికి మరెన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. స్వర్గంలో స్థానాలు ఉన్నతమయ్యేది ఈ నెలలోనే.

రమజాన్ నెలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్! సంవత్సరంలో మరే నెలలోనూ రాని ఒక ఘనమైన రేయి ఈ నెలలో వస్తుంది. ఆ రేయి మానవాళి కొరకు ఒక మహత్తర వరం. దానికి “లైలతుల్  ఖద్ర్” అని పేరు. తెలుసా మీకు?! ఈ ఒక్క రాత్రి కొన్ని వేల రాత్రుల కంటే గొప్పది. కావాలంటే ఖుర్ఆన్ తీసి చదవండి. 97వ అధ్యాయంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“నిశ్చయంగా – మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవ దూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భువికి) దిగివస్తారు. ఆ రాత్రి ఆసాంతం శాంతి యుతమైనది – తెల్లవారే ‘ వరకూ (అది ఉంటుంది).”.

ఈ నెల ముస్లింలకు దానధర్మాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం నేర్పిస్తుంది. పసిపిల్లల్లోనూ ఉదార భావాన్ని అలవరు స్తుంది. ఈ నెల చలువతో ఒక పిసినారి మహా దానశీలిగా మారి పోయినా ఆశ్చర్యం లేదు. భయభక్తులు (తఖ్వా)తో కూడుకున్న జీవితాన్ని పొందాలనే ఆశతో ముస్లింలు ఈ నెలలో ఎన్నో మంచి పనులు చేస్తారు. ఈ దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
.
“ఓ విశ్వసించిన వారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు (తఖ్వా) పెంపొందే అవకాశం ఉంది.” (ఖుర్ఆన్ 2 : 183)

మరి “తఖ్వా” అంటే ఏమిటో తెలుసా? తఖ్వా అనేది ఓ గొప్ప సుగుణం. విశ్వాసికి అత్యంత విలువైన సంపద. అల్లాహ్ పట్ల భీతితో, భక్తితో చెడులకు దూరంగా జీవితం గడపటమే తఖ్వా. విశ్వాసి జీవిత మహాశయం తఖ్వా. ముస్లింలైనవారు ఈ “తఖ్వా” స్థానాన్ని పొందటానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. రమజాన్ నెలలో అందుకు మార్గాలు మెండుగా ఉంటాయి. అందుకే ముస్లింల మనసుల్లో రమజాన్ నెలకు అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత!

రమజాన్ నెల రాక కోసం ముస్లింలు కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తుంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ రమజాన్ నెలను సాదరంగా ఆహ్వానిస్తారు. సగౌరవంగా ఆ నెల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ నెలలో ఉపవాసాలు ఉండటానికి, ప్రార్థనలు జరుపుకోవటానికి, మంచి పనులు చేసుకోవటానికి శక్తిసామర్థ్యాలను ప్రసాదించమని సంవత్సరమంతా అల్లాహ్ సన్నిధిలో దీనంగా వేడుకుంటూ ఉంటారు.

అందరికి తెలిసిన సత్యమే ఇది. సంతోషకాలం కర్పూరంలా కరిగిపోతుంది. కాని దుఃఖ ఘడియలు దుర్భరంగా గడుస్తాయి. రమజాన్ నెల ముస్లింల కోసం ఒక పండుగ కాలం. ప్రతి రోజూ ఆ నెలలో ఓ పర్వదినమే. కాబట్టి ముస్లింల కళ్ళకు రమజాన్ పుణ్యకాలం కర్పూరంలా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ముప్పయి రోజులు ముప్పయి ఘడియల్లోనే అయిపోతున్న అనుభూతి కలుగుతుంది. రమజాన్ మాసపు ప్రతి నిమిషం ఓ పుణ్యకాలం. అనుక్షణం ఆధ్యాత్మికత వెల్లివిరిసే శుభసమయం. కనుకనే ఈ నెలలో మరెప్పుడూ లేనంతగా దైవారాధన భావన మనుషుల్లో జాగృతమవుతుంది.

ఇరవై రోజుల ఉపవాసం అనంతరం ముస్లింల కోసం ఈ నెలలో ఒక తాయం వేచి ఉంటుంది. ఆఖరి పదిరోజుల్లో అమితంగా అల్లాహ్ ను ఆరాధిస్తూ, గత పాపాల మన్నింపు కోసం వేడుకుంటూ కాలం గడిపిన వారికి మాత్రమే అది ప్రాప్తమవుతుంది. రమజాన్ నెల చివరి పది రోజుల్లో ఒక మహత్తరమైన రాత్రి ఉంది. అది వెయ్యి రాత్రుల కంటే గొప్పది. ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే 83 యేండ్లు ఆరాధన చేసినంత పుణ్యం లభి స్తుంది. ఆ రేయి ద్వారా ప్రయోజనం పొందగలిగినవారు ఎంతో అదృష్టవంతులు. మన ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రేత్రికి ఎనలేని ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభఆచరణను ఆదర్శంగా తీసుకుని ముస్లిం లందరూ ఈ నెల ఆఖరు పది రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేస్తారు. విరివిగా ధర్మవిధులు ఆచరించి అల్లాహ్ తమ కోసం రాసివుంచిన పుణ్యాన్ని పొందేందుకు కృషి చేస్తారు.

“రమజాన్ నెలలో చివరి పది రోజులు మొదలైనప్పుడు (ప్రార్థనల్లో నిమగ్నులవటం కోసం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు మేల్కొని ఉండేవారు. ఇంట్లో వారిని కూడా నిద్రలేపేవారు. అమితంగా అల్లాహ్ ను ఆరాధించటానికి సన్నద్ధులయ్యేవారు.”

అల్లాహ్ తన పొరపాట్లన్నిటినీ క్షమించినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విరివిగా సత్కార్యాలు చేస్తుండేవారు. ఎంత గొప్ప విషయం!

ప్రతి యేడు రమజాన్ నెల చివరి పది రోజులు రఫీ మస్జిద్ లోనే గడుపుతాడు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో, ప్రార్ధనల్లో నిమగ్నుడై ఉంటాడు. ఆరాధన కోసం ఇలా మస్జిద్ లో వుండిపోవటాన్ని “ఏతికాఫ్” అంటారు. రఫీ తన స్నేహితులకు కూడా ఏతికాఫ్ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంటాడు. కాని ఈ సంవత్సరం అతని ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. నాన్న చనిపోయారు. ఇంట్లో అమ్మకు తోడుగా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కనుక ఈ సంవత్సరం ఎతెకాఫ్ పాటించే ప్రయత్నం మానుకోవాలని భావించాడు రఫీ. ఇంటిపట్టున ఉండి చెల్లి తమ్ముళ్ల బాగోగులు చూసుకోవాలనుకున్నాడు. ఇంటి పనుల్లో అమ్మకు సాయంగా ఉందామనుకున్నాడు. ఈ అతని తండ్రి బ్రతికి వున్నప్పుడు తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి మస్జిద్ లో ఎతెకాఫ్ పాటించేవారు. ఆ అనుభూతి రఫీకు చెప్పలేని ఆనందాన్నిచ్చేది. కాని ఈ సంవత్సరం తను ఒంటరివాడైపోయాడు. గతం గుర్తుకురాగానే మళ్ళీ ఏడ్పు ముంచుకు వచ్చింది అతనికి. “నాన్నా, ఎక్కడున్నావు?!” అనేశాడు అప్రయత్నంగానే. పాలుగారే అతని బుగ్గల మీద అశ్రువులు ధారలై ప్రవహించాయి. కాసేపటికి నాన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ నాన్న వస్తువులు కనపడగానే భోరుమన్నాడు. పిల్లవాడి ఏడ్పు విని పరుగెత్తుకుంటూ వచ్చింది తల్లి. విషయం అర్ధం చేసుకుంది. కొడుకుని ఓదార్చటానికి ప్రయత్నించింది.

అలవికాని ఒక రొద ఆమె ఎదలోనూ కాసేపు పెనుగులాడింది. ముఖం చాటుకు తిప్పుకోని గుట్టుగా కన్నీళ్ళు తుడుచుకుంది. … “ఎందుకు ఏడుస్తున్నావు కన్నా! నీ కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకు రాలేవురా!” అంది కొడుకుని గాఢంగా గుండెలకు . హత్తుకుంటూ. – “నాకు తెలుసమ్మా! అయినా ఏం చేయను. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ప్రతిదీ నేర్పించారు. చిన్న తనంలోనే నాకు నమాజ్, ఉపవాసాలు అలవాటు చేశారు. ఖుర్ఆన్ చదివించారు. ఆయన్ని నేను సులువుగా మరిచి పోలేనమ్మా!” ఏడుస్తూనే సమాధానమిచ్చాడు రఫీ. ఆ పసివాడి మాటలు తల్లిని మరింత దుఃఖానికి గురి చేశాయి. “మీ నాన్నను ఎవరూ మరిచిపోలేరు చిన్నా! అల్లాహ్ తోడు, నేనెప్పుడూ మీ నాన్ననే తలచుకొని ఏడుస్తుంటాను. కాని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? ఇది అల్లాహ్ రాసిన రాత. మనమంతా అల్లాహ్ కు చెందిన వాళ్ళం. ఒకరి తర్వాత ఒకరం అందరం ఆయన వద్దకు చేరుకోవలసిన వాళ్ళమే. ఈ బాధలో సహనం వహిస్తున్నందుకు పుణ్యం ప్రసాదించమని మాత్రం మనం అల్లాహ్ ను వేడుకుంటూ ఉండాలి. సరేగాని రఫీ! నువ్వు ఎప్పటిలాగా ఈ సారి కూడా మస్జిద్ కు వెళ్ళి ఈ చివరి పది రోజులు ‘ఏతికాఫ్’ పాటించు. మీ నాన్న కోసం బాగా ప్రార్థించు. మా గురించి దిగులుపడొద్దు. మమ్మల్ని చూసుకోవటానికి మీ మామయ్య మన ఇంట్లో ఉంటానంటున్నారు.”రఫీ కన్నీళ్లు తుడుస్తూ, అతనికి ధైర్యం చెప్పింది తల్లి.

ప్రతి యేడులాగే ఈ యేడు కూడా మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే అవకాశం లభించగానే అతని ముఖంలో ఆనందం తొంగిచూసింది. మనసుని మెలిపెట్టిన దుఃఖం సయితం క్షణాల్లో ఆవిరయింది. తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. ప్రేమగా ఆమె చెంపను ముద్దాడి మస్జిద్ కు బయలుదేరాడు.

రమజాన్ నెల చివరి పది రోజులు మస్జిద్ లోనే గడిచాయి. అందరితో కలిసి నమాజ్ చేయటం, ఖుర్ఆన్ పారాయణం చేయటం, క్షమాభిక్షకై వేడుకోవటం, అల్లాహ్ ను స్తుతించటం – ఈ పది రోజులు ఇవే అతని నిత్యకృత్యాలు. అన్ని రోజులు మస్జిద్ లో ఉన్నా అతనికి ఏమాత్రం విసుగు అనిపించలేదు. పైగా అతని మనసు అల్లాహ్ ధ్యానంలో లీనమై పోయింది, అల్లాహ్ ఆరాధనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఏతికాఫ్ దీక్షలో అతను ఈ క్రింది ప్రార్థనా వచనాన్ని ఎన్ని వందలసార్లు పఠించాడో. అతనికే తెలియదు.

“అల్లాహుమ్మ ఇన్నక అపువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ”

ఓ అల్లాహ్! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నిం పును ఇష్టపడతావు. నన్ను మన్నించు (ప్రభూ!)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది హిత వచనాలను కూడా రఫీ నిత్యం గుర్తుపెట్టుకునేవాడు.

“పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం దొరుకుతుందన్న ఆశతో ఘనమైన రేత్రిన నమాజుకై నిలబడినవాని గత పాపాలన్నీ క్షమించబడతాయి.” (బుఖారి, ముస్లిం గ్రంథాల్లో ఈ హదీసు ఉంది)

“ఘనమైన రేయిని (లైలతుల్ ఖద్రీను) రమజాన్ నెలలోని చివరి పది రోజుల్లో వెతకండి.” (బుఖారీ గ్రంథంలో ఈ హదీసు ఉంది).

పండుగ రేపు అనగా ఈ రోజు సాయంత్రానికి ఏతికాఫ్ దీక్ష ముగిసిపోతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దీక్షను పరిపూర్ణంగా నెరవేర్చినందుకు రఫీ మది ఆనందంతో నిండి పోయింది. మస్జిద్ లో మగ్రిబ్ నమాజు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాడు. అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని కిలోలు బియ్యం కొనుగోలు చేశాడు. నిరుపేదలకు, అభాగ్యులకు ఆ బియ్యం పంచిపెట్టాడు. పండుగ నాడు అందరి మొహాలు ఆనందంతో కళకళలాడాలన్నది అతని కోరిక. పండుగ రోజు అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటే అతని మది పులకించిపోతుంది. రఫీ కోరిక ప్రకారమే అతని ఇంట్లో, బంధుమిత్రుల్లో ఫిత్ర (రమజాన్) పండుగ చాలా సంతోషంగా గడిచిపోయింది.

ఇప్పుడు అతని మనసు మరుసటి రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తోంది. వచ్చే యేడాది మరిన్ని పుణ్యకార్యాలు చేసి “తఖ్వా” (దైవభీతి) స్థానాన్ని పొందే అవకాశం కోసం అది నిరీక్షిస్తోంది.