నరక విశేషాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Naraka Visheshalu – (Jahannam ka Bayan)
సంకలనం: ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం: ముహమ్మద్ జాకిర్‌ ఉమ్రీ (Mohd. Zakir Umari)
హదీస్‌ పబ్లికేషన్స్‌. హైదరాబాద్‌

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
127 పేజీలు PDF

విషయ సూచిక 

 1. నరకయాతనలు
 2. నరకం ఉనికి పట్ల సాక్ష్యం
 3. నరక ద్వారాలు
 4. నరకంలోని తరగతులు
 5. నరక వైశాల్యం
 6. నరక శిక్ష తీవ్రత
 7. నరకాగ్ని కాఠిన్యత
 8. అతిస్వల్పమైన నరక శిక్ష
 9. నరకవాసుల పరిస్థితి
 10. నరకవాసుల అన్నపానీయాలు మరియు ఆహారం
 11. దాహం ద్వారా శిక్ష
 12. మరిగే నీటిని తలపై పోసే శిక్ష
 13. నరకవాసుల వస్త్రాలు
 14. నరకవాసుల పడకలు
 15. నరకవాసుల గొడుగులు, షామియానాలు
 16. అగ్ని సంకెళ్ళులు, హారాల ద్వారా శిక్ష
 17. ఇరుకైన చీకటిగల అగ్నిగదుల్లోనికి నెట్టివేయబడే శిక్ష బంధించే శిక్ష
 18.  ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష
 19. విషపూరితమైన వడగాలి మరియు నల్లపొగ ద్వారా శిక్షించుట
 20. విపరీతమైన చలి శిక్ష
 21. నరకంలోని అవమానకరమైన శిక్ష
 22. నరకంలో దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష
 23. బోర్లా పడవేసి నడిపించటం, ఈడ్చుకుపోయే శిక్ష
 24. అగ్ని కొండలపై ఎక్కించే శిక్ష
 25. అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష
 26. నరకంలో ఇనుప గదలు, సుత్తులతో కొట్టే శిక్ష
 27. నరకంలో పాములు, తేళ్ళ ద్వారా శిక్ష
 28. శరీరాలను పెంచే శిక్ష
 29. ఇతర శిక్షలు
 30. నరకంలో కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలు
 31. నరకవాసుల గురించి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యలు
 32. నరకంలో మార్గభ్రష్టులైన పండితులు, స్వాములు…..పరస్పర కలహాలు
 33. గుణపాఠాలు నేర్చే సంభాషణలు
 34. ఫలించని కోరికలు
 35. ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం
 36. నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించుట
 37. నరకంలో ఇబ్లీసు
 38. పాత జ్ఞాపకాలు
 39. నరకంలోనికి కొనిపోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి
 40. స్వర్గవాసుల, నరకవాసుల నిష్పత్తి
 41. నరకంలో స్త్రీల ఆధిక్యం
 42. నరక శుభవార్త పొందినవారు
 43. నరకంలో శాశ్వతంగా ఉండేవారు
 44. స్వల్ప కాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు
 45. నరక సంభాషణ
 46. మిమ్మల్నీ మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి
 47. నరకం, దైవదూతలు
 48. నరకం, దైవప్రవక్తలు
 49. నరకం, ప్రవక్త (సహాబాలు) అనుచరులు
 50. నరకం, పూర్వీకులు
 51. ఆలోచనా సందేశం
 52. నరకాగ్ని నుండి శరణుకోరే దుఆలు
 53. వివిధ రకాల అంశాలు

స్వర్గవాసులారా! ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇక (మీకెవరికీ) మరణం రాదు

బిస్మిల్లాహ్

1811. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుదరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు : (ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు” అని అంటాడు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు  దినం గురించి భయపెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)

(సహీహ్‌ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్ , 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అన్జిర్  హుమ్‌ యౌ మల్‌హస్రా)

[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]

నరక విశేషాలు (Decription of Hell Fire) E-Book

Naraka Vishesaalu

రచయిత : ముహమ్మద్ ఇఖ్బాల్ కీలానీ

ఈ పుస్తకంలో నరకంలోని విశేషాల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారాలతో చక్కగా వివరించారు. దీనిని తెలుగులో జనాబ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అనువదించారు

[ఇక్కడ చదవండి / Download చేసుకోండి]