తలాక్ (విడాకులు), దాని ఆదేశాలు – لطلاق وأحكامه [వీడియో]

బిస్మిల్లాహ్

Talaq (Divorce and it’s rulings)
వ్యవధి: 45:22 నిముషాలు 

తలాక్ (విడాకులు) కు సంబంధించిన ధర్మాదేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ, దీని పట్ల ప్రజల్లో ప్రబలి ఉన్న తప్పుడు భావాలు, ఆచారాలను మృదువుగా ఖండించడం జరిగింది

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భార్య భర్తల పరస్పర హక్కులు [వీడియో]

వ్యవధి: 40 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయు ఘనత!

బిస్మిల్లాహ్

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్! అమ్మా బ’అద్

అల్లాహ్ (సుబహాన వ త’ఆలా) ఆదేశం చదవండి:

يَٰأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَدْخُلُوا۟ بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّىٰ تَسْتَأْنِسُوا۟ وَتُسَلِّمُوا۟ عَلَىٰٓ أَهْلِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌۭ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి ‘సలామ్‌’ చేయనంతవరకూ ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది). (ఖుర్’ఆన్  24 : 27)

ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయుట వలన హదీసులలో మంచి ప్రతిఫలం మరియు ఉన్నతమైన ప్రయోజనాలు కలిగివున్నాయి.

దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి భోదనలు చదవండి:

عَنْ أَبِي أُمَامَةَ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللهِ – صلى الله عليه وسلم – قَالَ: «ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِي، وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللهُ الْجَنَّة، مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ …»

హజ్రత్ అబూ ఉమామా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

ముగ్గురు; వారిలో ప్రతి ఒక్కరి గురించి అల్లాహ్ పూచి (జమానత్) తీసుకున్నాడు, వారు బ్రతికి ఉంటే అల్లాహ్ ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారికి సరిపోతాడు. ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఆ ముగ్గురిలో ఒకరు: తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసే వ్యక్తి గురించి అల్లాహ్ పూచి తీసుకున్నాడు. [సహీ ఇబ్ను హిబ్బాన్ 499, సహీహుత్ తర్గీబ్ 321]

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ لِي رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا بُنَيَّ إِذَا دَخَلْتَ عَلَى أَهْلِكَ فَسَلِّمْ يَكُونُ بَرَكَةً عَلَيْكَ وَعَلَى أَهْلِ بَيْتِكَ»

హజ్రత్ అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు ఇలా తెలిపారు:

“ఓ సుపుత్రుడా! నీవు ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి సలాం చేయి, ఇందులో నీ కొరకు మరియు నీ ఇంటి వారి కొరకు శుభము గలదు.”

(తిర్మిజి 2698, సహీహుత్ తర్గీబ్ 1608).

సారాంశం:

 • 1- ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయాలి.
 • 2- ప్రవేశించు వ్యక్తి చేయాలి, అతను చిన్నవాడైనా, పెద్దవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే.
 • 3- సలాం చేసే వారు అల్లాహ్ పూచిలోకి వస్తారు.
 • 4- బ్రతికి ఉంటే ఉపాధి, అల్లాహ్ రక్షణ పొందుతారు.
 • 5- సలాం చేసేవారికి, ఇంటి వారికి శుభం ప్రాప్తమవుతుంది.
 • 6- మరణిస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు.
 • 7- సహీ హదీసులో వచ్చిన సలాం పదాలు: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరుకాతుహు.
 • 8- అస్సలాము అలైకుం అంటే పది (10) పుణ్యాలు.
 • 9- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ఇరువై (20) పుణ్యాలు
 • 10- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు అంటే ముప్పై (30) పుణ్యాలు.
 • 11- అస్సలాము అలైకుం…. తప్ప గుడ్ మార్నింగ్ అని లేదా వేరే పదాలు పలకుతూ ఇంట్లో ప్రవేశించడం ముస్లింలకు తగదు.

అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ ఙ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

మీసోదరుడు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్