క్విజ్: 76: ప్రశ్న 03: అల్లాహ్ నామ స్మరణ: వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకడం [ఆడియో]

బిస్మిల్లాహ్

3వ ప్రశ్న సిలబస్:

అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. వాటిలో కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలుసుకుందాము

1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ 6324).

2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి 606, బుఖారీ 142). అయితే తిర్మిజి (142)లో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’

3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం 2018).

5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం 2202, అబూదావూద్ 3891). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది.

ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5:11 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(3) కాల కృత్యాలు తీర్చుకునే సమయంలో షైతానులు మన మర్మాంగాలను చూడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

A) బలమైన తావీజు వేసుకోవాలి
B) అల్లాహ్ పేరుతో దుఆ చేసి కాల కృత్యాలకు వెళ్ళాలి
C) చీకటిలోనే వెళ్ళాలి

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

పుస్తకాలు: 

సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు అల్లాహు అక్బర్ యొక్క ఘనత – హిస్న్ అల్ ముస్లిం నుండి

బిస్మిల్లాహ్

130. సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు అల్లాహు అక్బర్ యొక్క ఘనత

ఈ పదాల అర్ధములు:

సుబ్ హానల్లాహ్ (అల్లాహ్ పరమ పవిత్రుడు, నిష్కళంకుడు)
అల్ హమ్దు లిల్లాహ్ (సర్వ స్తోత్రములు మరియు కృతఙ్ఞతలు అల్లాహ్ కే చెందును)
లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరెవరూ ఆరాధనకు అర్హులు కారు)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ చాలా గొప్పవాడు)
లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (అల్లాహ్ ఆజ్ఞ తప్ప ఏ శక్తీ ఏ బలమూ లేదు)


254.“‘సుబ్ హానల్లాహి వబిహమ్దిహి’ అని రోజుకు వందసార్లు స్మరించినట్లయితే సముద్రంలోని నురుగుకు సమానమైన పాపాలైనా సరే క్షమించబడతాయి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.” (బుఖారీ)

سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ
సుబ్ హానల్లాహి వబిహమ్దిహి

[అల్ బుఖారీ 7/168, ముస్లిం 4/2071 మరియు చూడుము : ఈ పుస్తకంలోని దుఆ నెం. 91 ఎవరైతే దీనిని ప్రొద్దున మరియు రాత్రి వంద సార్లు పఠిస్తారో.]


255. “ఎవరైనా రోజుకు పదిసార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పఠించినట్లయితే ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానం నుండి నలుగురు బానిసలను విముక్తి గావించినంత పుణ్యము లభిస్తుంది” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.” (బుఖారీ).

لَا إِلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وهُوَ عَلى كُلِّ شَيءٍ قَديرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్

[అల్ బుఖారీ 7/67, ముస్లిం 4/2071 మరియు చూడుము ఈ పుస్తకము దుఆ నెం. 92 ఎవరైతే దీనిని రోజుకి దినానికి వందసార్లు పఠిస్తారో దాని ప్రాముఖ్యత]


256. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “రెండు వచనాలు నాలుకపై చాలా తేలికైనవి, త్రాసులో చాలా బరువైనవి మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి, అవి “సుబహానల్లాహి వబిహమ్దిహీ” “సుబ్ హానల్లాహిల్ అదీమ్” (బుఖారీ, ముస్లిం).

سُبْحانَ اللهِ وَبِحَمْدِهِ وسُبْحَانَ اللهِ العَظِيمِ
సుబ్ హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్ హానల్లాహిల్ అదీమ్

[అల్ బుఖారీ 7/168 మరియు ముస్లిం 4/2072. 4. ముస్లిం 4/2072]


257. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్” ఇవి నాకు వేటి పైనైతే సూర్యుడు ఉదయిస్తాడో వాటన్నింటికన్నా ఉత్తమమైనవి (ముస్లిం 4/2072).

سُبْحَانَ اللهِ، والحَمْدُ للهِ، لَا إِلَهَ إلَّا اللهُ واللهُ أَكْبَرُ
సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్


258. హజ్రత్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కూర్చోని ఉండగా ఆయన “మీలో ఎవరయినా రోజుకు వెయ్యి పుణ్యాలను సంపాదించు కోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ కూర్చున్న వారిలో ఒకరు లేచి అది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. బదులుగా ప్రవక్త గారు “వందసార్లు “తస్బీహ్” (సుబహానల్లాహ్) స్మరించినట్లయితే వెయ్యి పుణ్యాలు లభిస్తాయి, లేక అతని వెయ్యి పాపాలు క్షమించ బడతాయి” అని సెలవిచ్చారు. (ముస్లిం 4/2073).

سُبْحَانَ اللهِ
సుబ్ హానల్లాహ్


259. ఎవరైతే “సుబ్ హానల్లాహిల్ అదీమి వబిహమ్దిహీ” పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.

سُبْحَانَ اللهِ العَظِيمِ وبِحَمْدِهِ
సుబ్ హానల్లాహిల్ అదీమి వబిహమ్దిహీ

[దీనిని అత్తిర్మిదీ ఉల్లేఖించారు 5/511, అల్ హాకిం 1/501 ఆయన దీనిని సహీహ్ అన్నారు. అజ్ జహబీ ఏకీభవించారు. చూడుము సహీహ్ అల్ జామిఅ 5/ 531 మరియు ఆయనను దీనిని అత్తిర్మిదీ సహీహ్ అన్నారు 3/160]


260. ఓ అబ్దుల్లా బిన్ ఖైస్ “నేను నీకు స్వర్గ నిధులలో నుండి ఒకదాని గురించి నీకు చెప్పనా! అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ప్రశ్నించారు. ఓ ప్రవక్తా తప్పకుండా సెలవివ్వండని నేను అన్నాను. అయితే నీవు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” పలకమని చెప్పినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ, ముస్లిం).

لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ
లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

[అల్ బుఖారీ అల్ ఫతహ్ 11/213, మరియు ముస్లిం 4/2076]


261. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు “అల్లాహ్ వద్ద నాలుగు వచనాలు అన్నింటికంటే ప్రియమైనవి. అవి “సుబ్ హానల్లాహి వల్ హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” (ముస్లిం 3/1685).

سُبْحَانَ اللهِ، والحَمْدُ للهِ، ولَا إِلَهَ إِلاَّ اللهُ واللهُ أَكْبَرُ
సుబ్ హానల్లాహి వల్ హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్


262. ఒక పల్లెటూరివాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి నాకు కొన్ని వచనాలు నేర్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ, అల్లాహు అక్బర్ కబీరన్, వల్ హందు  లిల్లాహి కసీరన్, సుబ్ హానల్లాహి రబ్బిల్ ఆలమీన, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా హిల్ అజీజిల్ హకీమి” అని చెప్పమన్నారు. అప్పుడు అతను ఇది నా ప్రభువు కోసం మరి నా కోసం ఏమిటి? అని అడిగాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా అడగమని చెప్పారు: “అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హంనీ, వహ్ దినీ, వర్ జుఖ్నీ” (అబూ దావూద్)

لَا إِلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، اللهُ أَكْبَرُ كَبيراَ والْحَمْدُ للهِ كَثيراً، سُبْحَانَ اللهِ رَبِّ العَالَمينَ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلّا باللهِ العَزيزِ الْحَكِيمِ.اللَّهُمَّ اغْفِرْ لِي، وارْحَمْنِي، واهْدِنِي، وارْزُقْنِي

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ, అల్లాహు అక్బర్ కబీరన్, వల్ హందు  లిల్లాహి కసీరన్, సుబ్ హానల్లాహి రబ్బిల్ ఆలమీన, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా హిల్ అజీజిల్ హకీమి,అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హంనీ, వహ్ దినీ, వర్ జుఖ్నీ

[ముస్లిం 4/2072 మరియు అబుదావూద్ : “పల్లెటూరి వ్యక్తి మరలిపోగా నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : (నిస్సందేహంగా ఈ వ్యక్తి తన రెండు చేతులూ శుభంతో నింపుకున్నాడు)” అను పదాలు ఉల్లేఖించారు 1/220]


263. ఎవరైనా వ్యక్తి ఇస్లాం స్వీకరించినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అతనికి నమాజు నేర్పి, ఈ క్రింది పదాలతో దుఆ చెయ్యమని నేర్పేవారు : “అల్లాహుమ్మగ్ ఫిర్లీ, వర్ హంనీ, వహ్ దినీ, వ ఆఫినీ,వర్ జుఖ్నీ“- (ముస్లిం).

اللَّهُمَّ اغْفِرِ لِي، وارْحَمْنِي، واهْدِنِي، وعَافِنِي وارْزُقْنِي
అల్లాహుమ్మగ్ ఫిర్లీ, వర్ హంనీ, వహ్ దినీ, వ ఆఫినీ,వర్ జుఖ్నీ

[ముస్లిం 4/2073 మరియు ముస్లిం యొక్క మరొక ఉల్లేఖనలో (నిస్సందేహంగా ఈ పదాలు నీ కొరకు ప్రపంచము మరియు పరలోకమును జతచేయును)]


264. నిశ్చయముగా ఉత్తమమైన దుఆ “అల్ హమ్దు లిల్లాహ్” మరియు ఉత్తమమైన అల్లాహ్ స్మరణ “లా ఇలాహ ఇల్లల్లాహ్

الْحَمْدُ للهِ.لَا إِلَه إِلَّا اللهُ
అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్

[అత్తిర్మిదీ 5/462, ఇబ్ను మాజహ్ 2/1249, అల్ హాకిం 1/503 సహీహ్ అన్నారు మరియు అజ్జహబీ ఏకీభవించారు. చూడుము సహీహ్ అల్ జామిఆ 1/362]


265. చిరస్థాయిగా నిలిచిపోయే పుణ్యములు “సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (నిసాయి, అహ్మద్).

سُبْحَانَ اللهِ، والْحَمْدُ للهِ، لَا إِلَهَ إَلَّا اللهُ واللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إلَّا باللهِ
సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

[అహ్మద్ సంఖ్య 513 అహ్మద్ షాకిర్ దీని పరంపరలు సహీహ్ చూడుము మజ్ముఅ అజ్ఞవాఇద్ 1/297, దీనిని ఇబ్బుహజర్ బులూగల్ మరామ్ లో అబిసఈద్ ఉల్లేఖనతో అన్నిసాఈ ద్వారా ఉల్లేఖించారు మరియు ఇబ్ను హిబ్బాన్ మరియు అల్ హాకింలు సహీహ్ అన్నారని తెలిపారు]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 18 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 18
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 18

1 ) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

A) మూసా (అలైహిస్సలాం)
B) ఇబ్రాహీం (అలైహిస్సలాం)
C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

2 ) ఏ జిక్ర్ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు ?

A) లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
B) సుబ్ హానల్లాహ్
C) లా ఇలాహ ఇల్లల్లాహ్

3 ) నేనూ ప్రవక్తను అని ఆరోపన చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A) మిర్జా గులామ్ అహ్మద్
B) అబూ లహాబ్
C) హామాన్

సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [26 నిమిషాలు]


1) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

JAWAB: D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

ఖుర్ఆనులో ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా చేసిన ప్రస్తావన ఉంది

4:125 وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు.
صحيح البخاري 6565 … ائْتُوا إِبْرَاهِيمَ الَّذِي اتَّخَذَهُ اللَّهُ خَلِيلًا،

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ప్రళయదినాన ప్రజలందరూ హషర్ మైదానంలో ఓపిక వహించలేక, అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని ముందు ఆదం అలైహిస్సలాం వద్దకు, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం వద్దకు వస్తారు, అయితే నూహ్ సిఫారసు చేయరు. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి అల్లాహ్ ఆయన్ని ఖలీల్ గా చేసుకున్నాడు అని అంటారు.

అయితే హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు అని ఉంది అయితే ఇద్దరూ కూడా ఖలీల్ అవడంలో రవ్వంత సందేహం లేదు. కాకపోతే ప్రజలలో ఫేమస్ మాట ఇబ్రాహీం ఖలీల్, మూసా కలీం అని.
సహీ ముస్లిం 532లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కేవలం 5 రోజుల ముందు ఇలా చెప్పగా నేను విన్నానని, జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

مسلم 532 … «إِنِّي أَبْرَأُ إِلَى اللهِ أَنْ يَكُونَ لِي مِنْكُمْ خَلِيلٌ، فَإِنَّ اللهِ تَعَالَى قَدِ اتَّخَذَنِي خَلِيلًا، كَمَا اتَّخَذَ إِبْرَاهِيمَ خَلِيلًا، وَلَوْ كُنْتُ مُتَّخِذًا مِنْ أُمَّتِي خَلِيلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيلًا، أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ، إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ

మీలో ఎవరు నాకు ఖలీల్ కారని స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఖలీల్ గా చేసుకున్నట్లు నన్ను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు. ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్ గా చేసుకునేవాడినేనైతే అబూ బక్ర్ ని ఖలీల్ గా చేసుకునేవాడిని. వినండీ! మీకంటే ముందు గడిసినవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా (ఆరాధనాలాయంగా) చేసుకునేవారు! జాగ్రత్తగా వినండి! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. ఇలా చేయడం నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను.

ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా ఎన్నుకున్నది ఆయనలో ఉన్న ఎన్నో అత్యుత్తమ గుణాల కారణంగా:

1- ఇమాం, ఒంటరిగానైనప్పటికీ నాయకత్వం గుణాలు ఆయనలో ఇమిడి ఉండినవి. సూర నహల్ 16:120,121
2- వఫాదార్, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ నెరవేర్చారు. సూర నజ్మ్ 53: 37
3- హలీం (సహనశీలి)
4- అవ్వాహ్ (అధికంగా అల్లాహ్ ముందు వినమ్రులై, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దుఆలో ఉండేవారు
5- అల్లాహ్ ను గుర్తెరిగి సంపూర్ణ ప్రేమతో ఆయన వైపుకు మరలేవారు, ఇతరుల పట్ల ఏ ఆశ లేకుండా ఉండేవారు. సూర హూద్ 11:75
6- చాలా ఉపకారం చేసేవారు, అతిథికి మర్యాదనిచ్చేవారు. సూర జారియాత్ 51:24-27
7- ఓపిక సహనాల్లో ఉన్నత శిఖరానికి చేరినవారు. సూర అహ్ ఖాఫ్ 46:35, సూర షూరా 42:13
 ఆయన ఉత్తమ గుణాల్లోని రెండు గుణాలు అతిముఖ్యమైనవి, మనం వాటిని మరవకూడదు :  ఎవరూ తోడులేనప్పుడు, ఒంటరిగా ఉండి కూడా తౌహీద్ పై ఉన్నారు, షిర్క్ కు వ్యెతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ముమ్ తహన 60:4
 వయస్సు పై బడిన తర్వాత కలిగిన ఏకైక సంతానం యొక్క ప్రేమ ఎంతగా ఉంటుందో చెప్పనవసరం లేదు, అలాంటి ఏకైక పుత్రుడిని అల్లాహ్ ప్రేమలో బలిచేయుటకు సిద్ధమయ్యారు. సాఫ్ఫాత్ 37:100-111


2) ఏ జిక్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు

JAWAB: A ] లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ النبي: “يَا عَبْدَ اللهِ بْنِ قَيْسٍ :أَلَا أَدُلُّكَ عَلَى كَنْزِ مِّنْ كُنُوْزِ الْجَنَّةِ ؟” فَقُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ قَالَ : “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”.

అబూ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ”ఓ ‘అబ్దుల్లా బిన్ ఖైస్! నేను నీకు స్వర్గనిధుల్లో ఒక నిధిని చూపనా?” అని అన్నారు. దానికి నేను, ‘చూపండి ఓ అల్లాహ్ ప్రవక్తా!’ అని అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ”లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” స్వర్గ నిధుల్లోని ఒక నిధి అని ప్రవచించారు. (బు’ఖారీ 4205, ముస్లిమ్ 2704)
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ చదివిన పాపాలు మన్నించబడతాయి, అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే. (తిర్మిజి 3460, హసన్)

ఇవి మరియు వీటితో పాటు అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హమ్నీ వఆఫినీ వర్ జుక్నీ వహ్దినీ దుఆ ఒక గ్రామినుడికి నేర్పి ఇతను సర్వ మేళ్ళను తీసుకుళ్తున్నాడు అని ప్రవక్త చెప్పారు. (అబూదావూద్ 832). ప్రవక్త దీనిని గిరాసుల్ జన్నహ్ అన్నారు. (ఇబ్ను హిబ్బాన్ 821)


2) నేనూ ప్రవక్తను అని ఆరోపణ చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A ] మిర్జా గులామ్

అబూ దావూద్ 4333 లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَخْرُجَ ثَلَاثُونَ دَجَّالُونَ، كُلُّهُمْ يَزْعُمُ أَنَّهُ رَسُولُ اللَّهِ»

30 అబద్ధాల కోరులు అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించదు, ప్రతి ఒక్కడు తన భ్రమలో పడి తాను దైవప్రవక్త అన్న ఆరోపణ చేసుకుంటాడు.

వారిలో ఒకడు అబుల్ అస్వద్ అల్ అనసీ యమన్ లో రెండోవాడు ముసైలమా కజ్జాబ్ యమామలో ప్రవక్త కాలంలోనే దావా చేశారు. అబుల్ అస్వద్ అనతికాలంలోనే హతమార్చబడ్డాడు. మసైలమా ప్రవక్త వద్దకు వచ్చిన సంగతి సహీ బుఖారీ 3620లో ఉంది

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَدِمَ مُسَيْلِمَةُ الكَذَّابُ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَعَلَ يَقُولُ: إِنْ جَعَلَ لِي مُحَمَّدٌ الأَمْرَ مِنْ بَعْدِهِ تَبِعْتُهُ، وَقَدِمَهَا فِي بَشَرٍ كَثِيرٍ مِنْ قَوْمِهِ، فَأَقْبَلَ إِلَيْهِ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَعَهُ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ وَفِي يَدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قِطْعَةُ جَرِيدٍ، حَتَّى وَقَفَ عَلَى مُسَيْلِمَةَ فِي أَصْحَابِهِ، فَقَالَ: «لَوْ سَأَلْتَنِي هَذِهِ القِطْعَةَ مَا أَعْطَيْتُكَهَا، وَلَنْ تَعْدُوَ أَمْرَ اللَّهِ فِيكَ، وَلَئِنْ أَدْبَرْتَ ليَعْقِرَنَّكَ اللَّهُ، وَإِنِّي لَأَرَاكَ الَّذِي أُرِيتُ فِيكَ مَا رَأَيْتُ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ముసైలమా కజ్జాబ్ ప్రవక్త కాలంలో వచ్చి, ముహమ్మద్ గనక తన తర్వాత నాకు ఖిలాఫత్ మాట ఇచ్చాడంటే నేను ఆయన్ని అనుసరిస్తాను, అతని వెంట అతని జాతి వారు కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ తో సహా అతని వద్దకు వచ్చారు, అప్పుడు ప్రవక్త చేతిలో ఒక ఖర్జూరపు కర్ర ముక్క ఉంది, ముసైలమా మరియు అతని అనుచరుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: నీవు ఈ కర్ర ముక్క అడిగినా, నేను అది నీకివ్వను. అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దాన్నుండి నీవు ఏ మాత్రం తప్పించుకోలేవు. నీవు నా నుండి ముఖం తిప్పుకున్నావు. అందుచేత అల్లాహ్ నిన్ను (త్వరలోనే) అంతమొందిస్తాడు. నీవు నా కలలో ఎలా కన్పించావో ఇప్పుడు నేను నిన్ను అదేవిధంగా చూస్తున్నాను. అతని హత్య విషయం కూడా సహీ బుఖారీ 4072లో ఉంది

హజ్రత్ హంజా రజియల్లాహు అహు గానికి హతమార్చిన వహ్ షీ తర్వాత ఇస్లాం స్వీకరించారు, అయితే అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరిపాలన కాలంలో యమామా యుద్ధంలో పాల్గొన్నారు. ముసైలమాను హతమార్చారు.

చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అసత్యవాదులు వచ్చారు, వారిలో ఒకడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ.ఇతడు 13 ఫిబ్రవరీ 1835లో ప్రస్తుత పంజాబ్ రాష్టం, గోర్దాస్ పూర్ జిల్లాహ్ ఖాదీయన్ గ్రామంలో పుట్టాడు. 26 మే 1908లో ప్రస్తుత పాకిస్తాన్ లో చాలా హీనంగా చనిపోయాడు.ఇతని గురించి ఈ లింక్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

https://teluguislam.net/2015/04/07/the-lies-of-mirza-ghulam-ahmad-qadiayni/

ప్రారంభంలో అతడు ముస్లిమేతరులో ఇస్లాం సపోర్టులో డిబేట్లు చేస్తున్నట్లు ప్రదర్శించాడు, చేశాడు కూడా తర్వాత మెల్లమెల్లగా అతని అసలు నల్లరూపం బయటపడింది. అతని వాక్చాతుర్యాన్ని చూసి బ్రిటిష్ వారు వాడుకున్నారు, కాని వానికి అది తెలియలేదా, లేక ప్రాపంచిక వ్యామోహానికి లోనై అమ్ముడుపోయాడా కాని పరలోకానికి ముందు ఇహలోకంలోనే అల్లాహ్ వాడిని అవమానపరిచాడు

అతడు ప్రవక్త అన్న ఆరోపణ ఒక్కట కాదు చేసింది, ఎన్నో రంగులు మార్చాడు, ఎన్నో రూపుల వేశాడు ఎన్నో ఆరోపణలు చేశాడు, వాని కాలంలో వానికి ధీటుగా నిలబడిన ధర్మపండితులు మాలానా సనాఉల్లా అమ్రత్సరీ రహిమహుల్లాహ్. అతని ప్రతి అసత్యవాదానికి జవాబిస్తూ పోయారు పై లింకులో తప్పక వివరాలు చూడగలరు.

సంక్షిప్తంగా వాడు చేసిన ఆరోపణల్లో కొన్ని:

* అల్లాహ్ అర్ష్ పీఠంపై నన్ను ప్రశంసిస్తున్నాడు (అంజామె ఆథమ్ 55)
* మృతులకు ప్రాణం పోసే, జీవులను మరణింపజేసే శక్తి నాకు ప్రసాదించబడింది. (ఖుత్బయే ఇల్హామియా 23)
* మీరు తెలుసుకోండి! అల్లాహ్ కరుణ కటాక్షాలు నాతోనే ఉన్నాయి. అల్లాహ్ ఆత్మ నాలోన చెబుతుంది. (అంజామె ఆథమ్ 176).
* తానె మసీహె మౌఊద్ అని చెప్పుకున్నాడు. అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ 2222, ముస్లిం 155లో ఇచ్చిన శుభవార్త

«وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَيُوشِكَنَّ أَنْ يَنْزِلَ فِيكُمْ ابْنُ مَرْيَمَ حَكَمًا مُقْسِطًا، فَيَكْسِرَ الصَّلِيبَ، وَيَقْتُلَ الخِنْزِيرَ، وَيَضَعَ الجِزْيَةَ، وَيَفِيضَ المَالُ حَتَّى لاَ يَقْبَلَهُ أَحَدٌ» وفي رواية: فَيَطْلُبُهُ حَتَّى يُدْرِكَهُ بِبَابِ لُدٍّ، فَيَقْتُلُهُ 2937

ఈ ఈసా నేనే అని అంటాడు. ఒక ఖాదీయాని సోదరుడు నాతో చర్చలో ఉన్నప్పుడు ఈ హదీసు తెలిపి మీరు నమ్మే మిర్జా న్యాయశీలి నాయకుడయ్యాడా? శిలువను విరగ్గొట్టారా? పందిని చంపారా? జిజ్ యా పన్ను లేకుండా చేశారా ? జకాత్ తీసుకునేవాడు లేని విధంగా ధనం వృద్ధి అయిందా? దజ్జాల్ ను హతమార్చాడా? అని అడిగాను. ఇప్పటికీ ఏ సమాధానం రాలేదు.

..ప్రస్తుతానికి కూడా వారి అనుచరులు ఉన్నారు వారిని మనం కూడా ఖండిస్తూనే ఉండాలి వారి ఉచ్చులో పడకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి.


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

100 సార్లు చదివితే 5 రకాల గొప్ప లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ, లా షరీక లహూ, లహుల్‌ ముల్కు వలహుల్‌ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్‌ ఖదీర్‌.

అల్లాహ్‌ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే  అన్నింటి పై అధికారం కలవాడు.
(బుఖారీ, ముస్లిం).

ఎవరైతే దీనిని రోజు వందసార్లు పఠిస్తారో అతడు పదిమంది బానిసలను విముక్తి చేసినట్లు అతడికి వ్రాయబడతాయి. వంద పుణ్యాలు లభిస్తాయి. అతని వంద తప్పులు తుడిచి వేయబడతాయి. అతడికి అది ఆరోజంతా ప్రొద్దుగూకే వరకు షైతాను బారినుండి రక్షణవుతుంది. మరియు అతడు ఖయామత్‌ రోజున తీసుకుని వచ్చే ఈ ఆచరణ కంటే శ్రేష్టమైనది మరెవ్వరూ తీసుకుని రాలేరు కాని దీనికంటే ఎక్కువ ఆచరించిన వారుతప్ప.

[అల్‌బుఖారీ 4/95 మరియు ముస్లిం  4/2071]

నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1 [వీడియో]

బిస్మిల్లాహ్

دروس الصلاة -3-من أحكام الصلاة
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1

ఈ 13:47 నిమిషాల వీడియోలో

సలాం చెప్పిన  తర్వాత దుఆలు,
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు,
నమాజును భంగపరిచే కార్యాలు,
నమాజ్ చేయరాని సమయాల గురించి
తెలుసుకుంటారు. ఇన్ షా అల్లాహ్

మీరు శ్రద్ధగా నేర్చుకోని, ఇతరులకు తెలిపి అధిక పుణ్యాలు సంపాదించండి.

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


నమాజ్ తర్వాత జిక్ర్:

సలాం చెప్పిన  తరువాత ఈ దుఆలు చదవండి:

అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం, వ మిన్ కస్సలాం, తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. (ముస్లిం 591).

أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله. اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.

అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను. ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు.

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. (బుఖారీ 844, ముస్లం 593).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు.

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనాఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللّهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).

తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందులిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).

తర్వాత ఆయతుల్ కుర్సీ ఒకసారి చదవాలి.

అల్లాహు  లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా తఅఖుజుహూ సినతువ్ వలా నౌమ్, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బిఇజ్ నిహీ యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమాషాఅ వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం.

సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్, సూర నాస్ ప్రతి నమాజ్ తర్వాత ఒక్కోసారి ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు చదవాలి.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వమిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, మవిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, మవిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజును భంగపరుచు కార్యాలు:

1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.

2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.

3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.

4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.

5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.

6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.

7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజులు చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:

1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.

2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.

3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


నమాజు కు సంబందించిన ఇతర  వీడియోలు పుస్తకాల కొరకు క్రింది లింక్ క్లిక్ చెయ్యండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

నమాజు యొక్క దుఆలు మరియు స్మరణలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [23 పేజీలు]

విషయ సూచిక

 • వుజూ కు ముందు
 • వుజూ తర్వాత దుఆ
 • అజాన్‌ సమాధానం, దాని పిదప దుఆ
 • మస్జిద్ వైపునకు వెళ్తూ చదవండి
 • మస్జిద్ లో ప్రవేశించినప్పుడు చదవండి
 • మస్జిద్ నుండి బైటికి వెళూ చదవండి
 • తక్బీరే తహ్రీమా తర్వాత చదవండి
 • రుకూలో చదవండి
 • రుకూ నుండి నిలబడి చదవండి
 • సజ్దాలో చదవండి
 • రెండు సజ్దాల మధ్యలో చదవండి
 • తషహ్హుద్‌లో చదవండి
 • తషహ్హుద్‌ తర్వాత చదవండి
 • సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి
 • నమాజ్‌ తర్వాత జిక్ర్
 • జనాజ నమాజులోని దుఆ
 • విత్ర్‌ నమాజు తర్వాత చదవండి
 • ఇస్తిఖార నమాజు యొక్క దుఆ

జిన్నాతుల యొక్క పెరుగుదల

షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :

‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’

[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]

من أقوال ابن العثيمين رحمه  الله

  ولمَّا غفل النَّاس عن الأوراد الشَّرعية كثرت فيهم الجنُّ الآن، وتلاعبت بهم .

لقاء الباب المفتوح ١٩٧

తెలుగు అనువాదం: teluguislam.net

నుండి: https://followingthesunnah.com/2019/10/18/the-increase-of-jinn/

నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, అల్లాహ్ ను స్మరించండి [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/oU6r]
[3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, అల్లాహ్ ను స్మరించండి

[జిక్ర్ ,దుఆ] – https://teluguislam.net/dua-supplications/

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/ZYPq]

సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ – الذكر عند النوم (Telugu – تلغو)
Dhikr better than having a servant
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

3- నిద్రించునప్పుడు జిక్ర్ : అలీ (రదియల్లాహు అన్హు)  ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లంతో) పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఇలా చెప్పారు: “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు అల్లాహు అక్బర్‌, 33 సార్లు సుబ్‌ హానల్లాహ్‌, 33 సార్లు అల్‌ హందులిల్లాహ్‌ అని పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్టమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727). [శత సాంప్రదాయాలు (100 Sunan ) అను పుస్తకం నుండి]

ఇతరములు:

జిక్ర్ & దుఆ : https://teluguislam.net/dua-supplications/