ఎడ తెగని పుణ్యం

sadaqa zjariya

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సంతాన శిక్షణ – Training the Children


santana-sikshanaసంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
రచయిత : Adil bin al Ashuddi عادل بن علي الشدي
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]

 

సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు

 • విశ్వాసం పట్ల శ్రద్ధ
 • నమాజు పట్ల శ్రద్ధ
 • ముందు జాగ్రత్త వైద్యం కంటే మేలు
 • ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట
 • సమంజసమైన మందలింపు
 • ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం నేర్పుట
 • సధ్వర్తన నేర్పుట
 • సధ్వర్తునలకు బహుమానం
 • పిల్లల్ని ప్రేమిస్తున్నానని తెలియజేయుట
 • సంతానం మధ్య న్యాయం
 • క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

 • శిక్షణ పట్ల నిర్భాధ్యత
 • తండ్రుల ఆధిపత్యం
 • వైరుద్ధ్య ఆదర్శం
 • కఠినత్వం
 • చెడును చూసి నిర్లక్ష్యం చేయడం
 • యధా పూర్వ పరిస్థితిని వదలటం
 • తప్పును ఒప్పుకోకపోవడం
 • వ్యక్తిగతంగా  నిర్ణయాలు తీసుకోవడం
 • ప్రత్యేకతలను గౌరవించక పోవడం
 • దూర దూరంగా ఉంచడం

సంతాన శిక్షణలో 130 మార్గాలు

 • విశ్వాసం
 • ఆరాధన
 • ప్రవర్తన
 • సభ్యత సంస్కారం
 • శారీరక నిర్మాణం
 • మానసిక నిర్మాణం
 • సామాజిక నిర్మాణం
 • ఆరోగ్యకరమైన నిర్మాణం
 • సంస్కృతి మరియు విద్యాపరమైన శిక్షణ
 • సత్పలితం, దుష్పలితం
%d bloggers like this: