ఖుర్ఆన్ మజీద్ – మౌల్వీ అబ్దుల్ గపూర్ [పుస్తకం]

ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం.
మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని నేరుగా అరబీ భాష నుండి అనువదించినారు.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [621 పేజీలు]

జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం [పుస్తకం]

ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్‌ ఖలీలుర్‌ రహ్మాన్‌, కొత్తగూడెం.
ముద్రణ: అల్‌ ఇదారతుల్‌ ఇస్తామియ, కొత్తగూడెం.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [673 పేజీలు]

శుక్రవారపు నమాజు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం దాని ఖుత్బా (ప్రసంగం). దీనిలో వివరించాల్సిన విషయాలను దివ్య ఖురాను మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో, సలఫుస్సాలిహీన్ల దృక్పథంతో సమగ్రంగా, పూర్తి ఆధారా లతో సహా వివరించే పుస్తకం ఏదియూ తెలుగు భాషలో ఇంతవరకు అందుబాటులో లేదన్న విషయం తెలుగు పాఠక లోకానికి తెలుసు. అందుకే, అల్ ఇదారతుల్ ఇస్లామియ, కొత్తగూడెం ఈ లోటును పూరిస్తూ తెలుగు పాఠక లోకానికి – శుక్రవారపు ఖుత్బాల గురించి డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ హఫిజహుల్లాహ్ ‘జాదుల్ ఖతీబ్’ పేరుతో ఉర్దూ భాషలో గ్రంథీకరిం చిన వివిధ సంపుటాలలో మొదటి సంపుటం యొక్క తెలుగు అనువాదాన్ని ‘జాదుల్ ఖతీబ్’ (ఖుత్బాల సంగ్రహము), సంపుటం-1 అనే పేరుతో మీకు సమర్పిస్తోంది! జనాబ్ ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్ గారు ఈ బాధ్యతను చేపట్టి, ఎంతో పట్టుదలతో శ్రమించి, సామాన్య ప్రజానీకానికి సయితం అర్థమయ్యేలా అత్యంత సులభమైన శైలిలో ఈ అనువాద ప్రక్రియను పూర్తి చేశారు. అల్లాహ్ కే సమస్త స్తోత్రాలు, ఆయన అనుగ్రహం ద్వారానే సదాచరణలు సంపూర్ణం గావించబడతాయి.

విషయ సూచిక

 • ముందుమాట
 • మొహర్రం మాసపు ఖుత్బాలు
  • 1) మొహర్రం నెల మరియు ఆషూరా దినం
  • 2) సహాబాల (ప్రవక్త సహచరులు) మహత్యం
  • 3) మదీనాకు వలస (హిజ్రత్)
 • సఫర్ మాసపు ఖుత్బాలు
  • 1) సఫర్ నెల మరియు దుశ్శకునాలు
 • రబీ ఉల్ అవ్వల్ మాసపు ఖుత్బాలు
  • 1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మహత్యం , అద్భుతాలు
  • 2) షరీయత్తు (ధర్మశాస్త్రపరంగా మిలాదున్నబీ ఉత్సవానికి గల విలువ
  • 3) అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవప్రవక్త హక్కులు
  • 4) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అత్యుత్తమ గుణగణాలు.
 • రజబ్ మాసపు ఖుత్బాలు
  • 1) రజబ్ మాసపు కొత్త పోకడ(బిద్దత్)లు
  • 2) ఇస్రా వ మేరాజ్
  • 3) మేరాజ్ కానుక – నమాజు
 • షాబాన్ మాసపు ఖుత్బాలు
  • 1) షాబాన్ నెల – విశేషాలు, ఆదేశాలు
  • 2) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం
 • రమజాన్ మాసపు ఖుత్బాలు
  • 1) శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం
  • 2) దివ్య ఖుర్ఆన్ మహత్యం
  • 3) తౌబా మరియు అస్తగ్ ఫార్ – ప్రయోజనాలు, ఫలాలు
  • 4) రమాజన్ మాసపు ఆఖరి పది రోజులు
 • షవ్వాల్ మాసపు ఖుత్బాలు
  • 1) ఈదుల్ ఫితర్ ఖుత్బా
 • జిల్ ఖాదా మాసపు ఖుత్బాలు
  • 1) హరమైన్ షరీఫైన్ మహత్యాలు
  • 2) హజ్ మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదలు-1
  • 3) హజ్ మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదలు-2
 • జిల్ హిజ్జ మాసపు ఖుత్బాలు
  • 1) జిల్ హిజ్ఞ మొదటి పది రోజుల మహత్యాలు మరియు ఆచరణలు
  • 2) ఈదుల్ అద్ హా ఖుత్బా
  • 3) హజ్జతుల్ విదా ఖుత్బా-1
  • 4) హజతుల్ విదా ఖుత్బా-2

నాస్తికత్వం & దైవాస్తికత [పుస్తకం]

రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీమ్
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ


[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి] [38పేజీలు] [PDF]
https://teluguislam.files.wordpress.com/2022/03/daivastikatha-teluguislam.net-mobile-friendly.pdf

నాస్తికత – మానవ సమాజంపై దాని తప్పుడు ప్రభావాలు :

మానవ జీవితాన్ని సమస్యలు, చిక్కులనుండి రక్షించి పరిశుద్ధ ప్రశాంత జీవనమార్గం చూపాలని గొప్పలు చెప్పుకొనే తత్వశాస్త్రవాదులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. సమస్యల పరిష్కారానికై వారు చేసిన ప్రయత్నాలు యుక్తులవల్ల సత్ఫలితానికి బదులు మరిన్ని చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. ఉన్న వాటికంటే అనేక రెట్లు ఎక్కువ సంకటాలు ఏర్పడ్డాయి. వారి అపజయాలకు వైఫల్యాలకు కారణమేమిటంటే వారు నాస్తికతను ఆధారంగా చేసుకుని ప్రయత్నించారు. ఈ దృక్పధమే సర్వవినాశాలకు, దుష్కార్యాలకు మూలం. అసలు వాస్తవ విషయమేమిటంటే సర్వమానవాళిని ప్రస్తుత ఆరాచక భావాలు, సాంఘిక వైకల్యం, నీచబుద్ధి మొదలగు వాటి బారినుండి విముక్తి కలిగించాలనుకుంటే మొట్టమొదట ప్రసుత్త నాగరికతకు ఆధారాలుగా పరిగణింపబడుతున్న నాస్తికతా, దైవ తిరస్కారాలను సంపూర్ణంగా నిర్మూలించాలి.

మానవుడు తన ఉనికి యొక్క కారణం మరియు తత్వాన్ని మరచి తన వాస్తవ సృష్టికర్తయైన అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి గడిపే ప్రతిజీవితం అజ్ఞాన కాలపు ఆంధకార జీవితమని ఇస్లాం పేర్కొంటుంది. ఎందుకంటే అటువంటి జీవితం వినాశానానికి దారితీస్తుంది. కావున ప్రస్తుత నాస్తిక నాగరికత అజ్ఞాన కాలపు జీవితాలకంటే మరింత ఎక్కువ దిగజారి వుంది. ప్రస్తుత కాలమైన సరే ప్రాచీన కాలమైనా సరే ఇస్లాం దృక్పధమేమిటంటే మానవ జీవితాన్ని సహజ సిద్ధ మార్గాలనుండి తప్పించి, పనికిమాలిన ఆ తప్పుడు దారులు పట్టించే ప్రయత్నాలు చేయటం వల్లనే సర్వ వినాశాలు ఏర్పడతాయి కావున మానవాళి మార్గదర్శకానికి కావలసిన ఒకే ఒక చిట్కా యేమిటంటే అజ్ఞాన పూరిత భావాలను నిర్మూలించడం. అనగా మానవుడు యదార్థ కృతార్థత పొందాలనుకుంటే తన జీవితం యొక్క వాస్తవ ఉద్దేశ్యాన్ని విడనాడకుండా, తప్పుదారి పట్టకుండా పూర్తి బాధ్యతా భావంతో దాన్ని స్వీకరించాలి. తనను సృష్టించిన అల్లాహ్ పై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్నే తన జీవిత ప్రయాణ ప్రారంభంగా తలచి ఆయన మార్గదర్శకం ప్రకారం తన జీవన ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే దేవుడైన అల్లాహ్ మానవాళినే కాక సర్వలోక సృష్టిరాశులను సృష్టించెను. ఆయనే సర్వలోక , యదార్థయజమాని మరియు సర్వాధికారి అతీతుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయన అత్యంత గొప్ప వినువాడు.అతి సమీపంగా నున్నవాడు. ఆయనే అందరి మొరలు ఆలకించును. ఆయనే ప్రభువు, దాత, సహాయకుడు. తత్వజ్ఞాని, సర్వజ్ఞాని, మనమందరం అతని పాలితులం. పోషితులం, దాసులం బానిసలం.

ప్రియమైన అమ్మకు .. [పుస్తకం]

సంకలనం: నసీమ్ గాజీ

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF] 

అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ పేరుతో

ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్‌ ఫలాహ్‌, బిలేరియా గంజ్‌ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్‌ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్‌ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్‌ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.

నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.

ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.

ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్‌ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్‌ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్‌ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.

ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.

నసీమ్‌ గాజి
జూన్‌: 1980

కితాబ్ అత్-తౌహీద్ (ఏక దైవారాధన) – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

రచయిత: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ
హదీసు పబ్లికేషన్స్, హైదరాబాద్ ఎ. పి., ఇండియా

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/03/kitab-at-tawheed-iqbal-kailani-mobile-friendly.pdf
[194 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయ సూచిక

 1. తొలిపలుకులు.
 2. సంకల్ప ఆదేశాలు
 3. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండటం
 4. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం- దాని ప్రాముఖ్యత
 5. దివ్య ఖుర్ఆన్ – అల్లాహ్ యొక్క అద్వితీయత
 6. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం – దాని వివరణ దాని రకాలు
 7. అల్లాహ్ ఒక్కడే సత్య దేవుడు
 8. అల్లాహ్ ఒక్కడే సర్వ విధాల ఆరాధనలకు, అన్ని రకాల పూజలకు అర్హుడని విశ్వసించటం
 9. అల్లాహ్ తన సద్గుణ విశేషణాల యందు అద్వితీయుడని విశ్వసించటం
 10. దైవత్వంలో అల్లాహ్ కు సాటి కల్పించటం – దాని రకాలు
 11. దివ్య ఖుర్ఆన్ ద్వారా ద్వైత విశ్వాస ఖండన
 12. ప్రవక్తగారి ప్రవచనాల ద్వారా ద్వైత విశ్వాస ఖండన
 13. స్వల్ప ద్వైత వివరాలు
 14. నిరాధార, కల్పిత వచనాలు

డౌన్లోడ్ ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books):
https://telugusialm.net/?p=4259

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం, వీడియో పాఠాలు] [మర్కజ్ దారుల్ బిర్ర్]

బిస్మిల్లాహ్


Usool-Thalatha & Qawaid-al-Arba
Shaykh Muhamamd bin AbdulWahhab (rahimahullah)
ఇస్లాం మూల సూత్రాలుషేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
[ఉసూలె సలాస (త్రి సూత్రాలు] & [షిర్క్ నాలుగు సూత్రాలు]
[Download the Book] [ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/03/usool-thalatha-qawaid-al-arba-mobile-friendly.pdf
[32పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వీడియో పాఠాలు:

జకాత్ ఆదేశాలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

జకాత్ (విధి దానం) ఆదేశాలు
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [12 పేజీలు]

రచయిత : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

జకాత్ ఆదేశాలు (Fiqh of Zakat) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1ojW-FuiGAt8MtqQ5Cssyt

విషయ సూచిక

 • జకాత్ అంటే ఏమిటి?
 • జకాత్ వల్ల కలిగే లాభాలు,మేళ్లు 
 • జకాత్ ఏ  వస్తువుల పై  విధిగా ఉంది?
 • బంగారం, వెండి జకాత్ 
 • వ్యాపార సామాగ్రి యొక్క జకాత్ 
 • షేర్ల యొక్క జకాత్ 
 • భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్ 
 • పశువుల జకాత్ 
 • ఒంటెల జకాత్ 
 • ఆవుల జకాత్ 
 • మేకల జకాత్ 
 • జకాత్ హక్కుదారులు 

వీడియో పాఠాలు

ఇతర లింకులు:

ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
PDF. 138 పేజీలు 

రచయిత : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన ఇస్లాం ధర్మంలో లేని బిదఆతులు అంటే నూతన కల్పితాల గురించి ఈ పుస్తకంలో రచయిత సవివరంగా ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.

విషయ సూచిక

 • 1. ఇస్లామీయ విధేయతా విధానం
 • 2. మంచి వైపుకు పిలుపునివ్వడం మరియు చెడుల నుంచి వారించడం విధి
 • ౩. బిద్‌అత్‌ (నూతన పోకడలు)
  1. ఇస్లామీయ పరిభాషలో బిద్‌అత్‌ అంటే?
  2. బిద్‌అత్‌ విధాలు
  3. ముస్లిం సమాజంలో నూతన వర్గాల పూర్వపరాలు
  4. ముస్లిం సమాజం నూతన పోకడలుకు గురికాబడిన కారణాలు
  5. ఆరాధన పరంగా బిద్‌అత్‌ రెండు విధాలు
 • 4. సమాజంలో ప్రసిద్ధి చెందిన నూతన పోకడలు
  • ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినం లేక ఆయన పేరుతో సంభందించిన ఇతర అధర్మ ఉత్సవాలు
  • ప్రత్యేక స్థలాల్లొ ప్రత్యేక వస్తువుల ద్వారా మరియు పుణ్యాత్ముల సమాధుల వద్ద శుభాలను (తబర్రుక్) కాంక్షిస్తూ చేసే ఆరాధనలు
  • ధర్మపరంగా ఉన్న ఆరాధనలలో కొన్ని నూతన కార్యాలను జొప్పించి ఆరాధించడం
 • 5. ముహర్రం నెల వాస్తవికత
  • ముహర్రం నెల విశిష్టత
  • ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం
  • అహ్లె బైత్‌ ( ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటివారి విశిష్టత
  • హజ్రత్ హసన్‌ మరియు హుసైన్‌ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత
  • కర్బల సంఘటన
  • కర్బల సంఘటనానంతరం
  • మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం
  • అతిశయిల్లటం (హద్దు మీరటం)
  • ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు
 • 6. నెల్లూరు రొట్టెల పండుగ
 • 7. సఫర్‌ నెల వాస్తవికత
 • 8. ఆఖరి చహార్పుంబా
 • 9. శకునాలు ధర్మ పరిధిలో
 • 10. రజబ్‌ నెల వాస్తవికత
 • 11. రజబ్‌కీ కుండే
 • 12. మేరాజున్‌ నబి పండుగ
 • 13. పవిత్రమైన మేరాజ్‌ సంఘటన వాస్తవం
 • 14 షాబాన్‌ నెల వాస్తవికత
  • షాబాన్‌ నెలలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం
  • షాబాన్ 15 వ రోజు తరువాత ఉపవాసం పాటించడం నిషిద్ధం
  • షాబాన్‌ 15వ రోజు కొన్ని బిద్‌అత్‌ కార్యాల వాస్తవికత
  • షాబాన్‌ 15వ రోజు గురించి కొన్ని నిరాధారమైన హదిసులు
 • 15. వసీలా ధర్మ పరిధిలో
  • అధర్మమైన వసీలా!
 • 16. ఉరుసుల వాస్తవికత
  • దర్గాల అలంకరణ
  • ఉరుస్‌ ఆచారాలు
  • దర్గాల గురువులు మరియు వారి వాస్తవికత
  • ఇస్లాం ధర్మంలో సమాధుల కట్టడాలు, వాటిపై ముజావర్లుగా కూర్చొవటం నిషిద్ధం
  • సమాధుల ఆరాధన
 • 17. తావీజు మరియు మంత్రించడం ధర్మ పరిధిలో తావీజు అర్థం
  • తావీజులు (తమీమా) వేసుకోవడం నిషిద్ధం
 • 18. మంత్రించడం (రుఖాా) ధర్మం
  • మంతించుటకై కొన్ని సూరాలను మరియు ఆయతులను,
  • దుఆలను చదవడం ధర్మ సాంప్రదాయం
 • 19. చేతబడి మరియు ఇంద్రజాలం వాస్తవికత
 • 20. మాంత్రికులు మరియు జ్యోతిష్కులు
 • 21. సమాజంలో విస్తరించిన కొన్ని బిద్‌అత్‌ కార్యాలు
 • 22. ఇస్లాం ధర్మానికి సంబంధంలేని కొన్ని పండుగలు
  • ప్రేమికుల రోజు
  • ముస్లింలు వాలెంటైన్స్‌ డే ఎందుకు చేయకూడదు?
  • ప్రేమంటే ఇదేనా…?
  • అల్లాహ్‌ పట్ల ప్రేమంటే…?
  • ఈనాడు మనం….

ఇతరములు 

స్వర్గ సందర్శనం [పుస్తకం]

బిస్మిల్లాహ్

స్వర్గ సందర్శనం (Swarga Sandarsanam)
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం : ముహమ్మద్‌ జీలాని (Muhammad Jeelani)
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
PDF (పిడిఎఫ్) 176 పేజీలు 
మొబైల్ ఫ్రెండ్లీ బుక్

విషయ సూచిక 

 • 01. రచయిత పరిచయ వాక్యాలు 
 • 02. స్వర్గలోకపు ఉనికి, నిరూపణ
 • 03. స్వర్గం పేర్లు 
 • 04. ఖుర్‌ఆన్‌ వెలుగులో స్వర్గం
 • 05. స్వర్గం వైభవం
 • 06. స్వర్గం విస్తృతి 
 • 07. స్వర్గలోకపు ద్వారాలు
 • 08. స్వర్గపు స్థాయిలు
 • 09. స్వర్గలోకపు భవంతులు
 • 10. స్వర్గపు గుడారాలు
 • 11. స్వర్గలోకపు సంత
 • 12. స్వర్గలోకపు చెట్లు 
 • 13. స్వర్గలోకపుపండ్లు 
 • 14 స్వర్గలోకపు కాలువలు
 • 15. స్వర్గలోకపు సెలయేళ్ళు
 • 16. కౌసర్‌ కాలువ
 • 17. కౌసర్‌ కొలను
 • 18. స్వర్గవాసుల అన్నపానీయాలు
 • 19. స్వర్గవాసుల వస్త్రాలు, ఆభరణాలు
 • 20. స్వర్గవాసుల సభలు, సింహాసనాలు
 • 21. స్వర్గవాసుల సేవకులు
 • 22. స్వర్గలోకపు స్త్రీలు
 • 23. స్వర్గలోకపు సుకన్యలు (హూర్‌)
 • 24. స్వర్గంలో అల్లాహ్  ప్రసన్నత
 • 25. స్వర్గంలో అల్లాహ్‌ దర్శనం
 • 26. స్వర్గవాసుల లక్షణాలు
 • 27. మానవజాతికి, స్వర్గవాసులకు, నరకవాసులకు మధ్య నిష్పత్తి
 • 28. స్వర్గంలో దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచర సమాజమే (ఉమ్మత్‌) ఎక్కువ సంఖ్యలో ఉంటుంది
 • 29. స్వర్గానికి కొనిపోయే ఆచరణలు కష్టంతో కూడుకున్నవి
 • 30. స్వర్గలోకపు శుభవార్తను పొందినవారు
 • 31. స్వర్గంలోకి ప్రవేశించేవారు
 • 32. ప్రారంభంలో స్వర్గానికి దూరంగా ఉండేవారు
 • 33. ఒక నిర్ణీత వ్యక్తిని స్వర్గవాసిగా పేర్కొనడం ధర్మసమ్మతం కాదు
 • 34. స్వర్గంలో గడచిన దినాల జ్ఞాపకాలు
 • 35. ఆరాఫ్‌ ప్రజలు
 • 36. రెండు విరుద్ధమైన విశ్వాసాలు, రెండు విరుద్దమైన పర్యవసానాలు
 • 37. ఇహలోకంలో కొన్ని స్వర్గలోకపు సౌఖ్యాలు
 • 38. స్వర్గాన్ని కోరుకునేందుకు ఉద్దేశించబడిన ప్రార్ధనలు
 • 39. వివిధ అంశాలు

నరక విశేషాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Naraka Visheshalu – (Jahannam ka Bayan)
సంకలనం: ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం: ముహమ్మద్ జాకిర్‌ ఉమ్రీ (Mohd. Zakir Umari)
హదీస్‌ పబ్లికేషన్స్‌. హైదరాబాద్‌

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
127 పేజీలు PDF – మొబైల్ ఫ్రెండ్లీ పుస్తకం

విషయ సూచిక 

 • నరకయాతనలు
 • నరకం ఉనికి పట్ల సాక్ష్యం
 • నరక ద్వారాలు
 • నరకంలోని తరగతులు
 • నరక వైశాల్యం
 • నరక శిక్ష తీవ్రత
 • నరకాగ్ని కాఠిన్యత
 • అతిస్వల్పమైన నరక శిక్ష
 • నరకవాసుల పరిస్థితి
 • నరకవాసుల అన్నపానీయాలు మరియు ఆహారం
 • దాహం ద్వారా శిక్ష
 • మరిగే నీటిని తలపై పోసే శిక్ష
 • నరకవాసుల వస్త్రాలు
 • నరకవాసుల పడకలు
 • నరకవాసుల గొడుగులు, షామియానాలు
 • అగ్ని సంకెళ్ళులు, హారాల ద్వారా శిక్ష
 • ఇరుకైన చీకటిగల అగ్నిగదుల్లోనికి నెట్టివేయబడే శిక్ష బంధించే శిక్ష
 •  ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష
 • విషపూరితమైన వడగాలి మరియు నల్లపొగ ద్వారా శిక్షించుట
 • విపరీతమైన చలి శిక్ష
 • నరకంలోని అవమానకరమైన శిక్ష
 • నరకంలో దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష
 • బోర్లా పడవేసి నడిపించటం, ఈడ్చుకుపోయే శిక్ష
 • అగ్ని కొండలపై ఎక్కించే శిక్ష
 • అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష
 • నరకంలో ఇనుప గదలు, సుత్తులతో కొట్టే శిక్ష
 • నరకంలో పాములు, తేళ్ళ ద్వారా శిక్ష
 • శరీరాలను పెంచే శిక్ష
 • ఇతర శిక్షలు
 • నరకంలో కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలు
 • నరకవాసుల గురించి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యలు
 • నరకంలో మార్గభ్రష్టులైన పండితులు, స్వాములు…..పరస్పర కలహాలు
 • గుణపాఠాలు నేర్చే సంభాషణలు
 • ఫలించని కోరికలు
 • ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం
 • నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించుట
 • నరకంలో ఇబ్లీసు
 • పాత జ్ఞాపకాలు
 • నరకంలోనికి కొనిపోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి
 • స్వర్గవాసుల, నరకవాసుల నిష్పత్తి
 • నరకంలో స్త్రీల ఆధిక్యం
 • నరక శుభవార్త పొందినవారు
 • నరకంలో శాశ్వతంగా ఉండేవారు
 • స్వల్ప కాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు
 • నరక సంభాషణ
 • మిమ్మల్నీ మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి
 • నరకం, దైవదూతలు
 • నరకం, దైవప్రవక్తలు
 • నరకం, ప్రవక్త (సహాబాలు) అనుచరులు
 • నరకం, పూర్వీకులు
 • ఆలోచనా సందేశం
 • నరకాగ్ని నుండి శరణుకోరే దుఆలు
 • వివిధ రకాల అంశాలు
%d bloggers like this: