అల్లాహ్ యేతరులపై ప్రమాణం చెయ్యవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

[4:42 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [4:42 నిముషాలు]

 

తౌహీద్ & షిర్క్:
https://teluguislam.net/five-pillars/belief-iman-telugu-islam/

మిడతల దండు & వాటి గురుంచి ఇస్లాంలో కొన్ని ముఖ్యమైన విషయాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [28 నిముషాలు]

ఇస్లాంలో మిడతల ప్రస్తావన

మిడతల ప్రస్తావన ఖుర్ఆన్ లో రెండు సార్లు వచ్చింది. (ఆరాఫ్ 7:133, ఖమర్ 54:7). మిడతల ప్రస్తావన హదీసుల్లో ఎన్నో సార్లు ఉంది.

మిడతలు అల్లాహ్ సైన్యాల్లోని ఓ సైన్యం. ఈ మాట స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సందర్భంలో చెప్పారు:

فَإنه جُنْدٌ مِنْ جُنُودِ اللَّهِ الأَعْظَمٌ
మిడతలు అల్లాహ్ సైన్యాల్లో ఓ గొప్ప సైన్యం”. (సహీహా 2428).

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) చెప్పారు: మిడతలు “అల్లాహ్ సైన్యాల్లో ఓ సైన్యం. సృష్టిలో చాలా బలహీనమైనవి, వింత కూర్పు దానిది. గుంపుగా వచ్చినప్పుడు లేదా అనండీ దండయాత్ర చేసినప్పుడు వాటిని లెక్కించడం గాని, వాటిని ఎదురుకోవడం గాని కాని పని. ఎంతటి శక్తి గల రాజు కూడా తన సైన్యాలన్నిటిని వాటికి ఎదురుగా నిలబెట్ట లేడు. మీరు చూడరా! అవి పర్వతాలపై, ఊర్లపై, గ్రామాలపై, నగరాలపై ఎంత పెద్ద సంఖ్యలో వాలుతాయంటే సూర్యుని కాంతిని కూడా కప్పి వేస్తాయి. ఆకాశం సయితం కనబడకుండా అయిపోతుంది… “(మిఫ్తాహు దారిస్సఆదహ్ 1/252).

అరబీలో జరాద (బహువచనం: జరాద్) అంటారు, అంటే అవి వచ్చిన, వాలిన చోటును ఖాళీ చేసి పారేస్తాయి.

మిడతలు అల్లాహ్ యొక్క శిక్షనా?

అల్లాహ్ తలచినప్పుడు కొందరి పట్ల పరీక్షగా, మరి కొందరి పట్ల శిక్షగా, ఇంకొదరి పట్ల వరంగా చేసి పంపవచ్చు. ఫిర్ఔన్ వారిపై విరుచుకుపడ్డ నానా రకాల విపత్తుల్లో ఒకటి మిడతలు కూడా.

సూర ఆరాఫ్ 7:133-136లో ఉంది:

فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُّفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ

ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను, కప్పలను, రక్తాన్నీ వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమయిన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు.

وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ ۖ لَئِن كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ

వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు, “ఓ మూసా! నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మానుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతతి వారిని కూడా (విడుదల చేసి) నీతో పంపిస్తాము” అని అనేవారు.

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُم بَالِغُوهُ إِذَا هُمْ يَنكُثُونَ

ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకూ ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు.

فَانتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ

ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే, వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు.

ప్రస్తుతం జరుగుతున్న వాటికి ఖుర్ఆన్ సాక్ష్యాలు ఇవ్వడం తప్పా?

కాదు, గుణపాఠం నేర్చుకోండని చెప్పడానికి తెలుపవచ్చు. ఈ పద్ధతి స్వయంగా ఖుర్ఆన్ నేర్పినదే, శ్రద్ధగా సూర ఖమర్ (54) చదవండీ. మహిమలను మరియు ఖుర్ఆన్ ను తిరస్కరించిన అవిశ్వాసులను అల్లాహ్ హెచ్చరిస్తూ, సమాధుల నుండి ఎలా లేపబడతారో తెలిపి, వెంటనే ఐదు ప్రవక్తల జాతులపై విరుచుకుపడ్డ శిక్షల గురించి తెలియజేశాడు.

అలాగే సూర ముద్దస్సిర్ (74) చదవండీ: ఆయత్ 30లో: నరకానికి 19 మంది దైవదూతలు కాపాలా- దారులుగా ఉన్నారని తెలిపినప్పుడు అవిశ్వాసులు; మాలో పది మంది ఒక్కో దైవదూతను చూసుకుంటారని, ఇంకా నానా రకాలుగా గేళి చేశారు, అప్పుడు అల్లాహ్ ఆయత్ 31 అవతరింపజేశాడు, మీరు పూర్తిగా అనువాదంతో పాటు వ్యాఖ్యానం కూడా చదవండీ. చివరలో తెలిపాడు: “నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు”.

మిడతలను తినవచ్చా, ప్రవక్త తిన్నారా?

అవును, తినవచ్చు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిన్నారని సహీ బుఖారీ (5495), సహీ ముస్లిం (1952)లో ఉంది:

«غَزَوْنَا مَعَ النَّبِيِّ سَبْعَ غَزَوَاتٍ أَوْ سِتًّا، كُنَّا نَأْكُلُ مَعَهُ الجَرَادَ»
“మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండి ఏడు యుద్ధాలు చేశాము, మేము ఆయన వెంట ఉండి మిడతలు తినేవారిమి” అని అబ్దుల్లాహ్ బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిడతలు తినలేదు అని (అబూ దావూద్ 3813, ఇబ్ను మాజ3219లో వచ్చిన హదీసు సహీ కాదు).

బైహఖీ కుబ్రా 18999, మువత్త3443లో ఉంది: హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హుతో ప్రశ్నించడం జరిగింది మిడతల గురించి, అప్పడు ఆయన చెప్పారు:

وَدِدْتُ أَنَّ عِنْدَنَا قَفْعَةً نَأْكُلُ مِنْهَا
ఓ బుట్ట నిండా మిడతలు ఉండి, మనము తింటూ ఉంటే ఎంత బావుండునని కోరుతున్నాను.

మిడతలు ఎలా తినాలి?

సహీ బుఖారీ వ్యాఖ్యానం అయిన ఫత్హుల్ బారీ (9/621) లో ఉంది:

وَقَدْ أَجْمَعَ الْعُلَمَاءُ عَلَى جَوَازِ أَكْلِهِ بِغَيْرِ تَذْكِيَةٍ إِلَّا أَنَّ الْمَشْهُورَ عِنْدَ الْمَالِكِيَّةِ اشْتِرَاطُ تَذْكِيَتِهِ وَاخْتَلَفُوا فِي صِفَتِهَا

మిడతలను జిబహ్ చేయకుండా తినడంపై ఉలమాల ఇజ్మాఅ (ఏకాభిప్రాయం) ఉంది. అయితే మాలికియ వద్ద జిబహ్ చేయడం షరతు అన్న మాటే ఫేమస్, కాని దాని పద్ధతి విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమాం నవవీ కూడా ఇజ్మాఅ ఉందని చెప్పారు.

చనిపోయిన మిడతలు హలాలేనా?

చనిపోయిన మిడతలు తినవచ్చు.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ أَنَّ رَسُولَ اللَّهِ قَالَ: أُحِلَّتْ لَنَا مَيْتَتَانِ: الْحُوتُ، وَالْجَرَادُ.

మన కొరకు రెండు మృతులు హలాల్ (ధర్మసమ్మతం) చేయబడ్డాయి: చేప మరియు మిడతలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ఇబ్ను మాజ 3218, ముస్నద్ అహ్మద్ 5723. సహీహా 1118).

మిడతలను చంపవచ్చా?

నీవున్న చోట నీకు నీ చుట్టు ప్రక్కన ఎవరికీ, ఏ పంటకు ఏ నష్టము చేకూర్చని కొన్ని మిడతలున్నాయి వాటిని చంపడం జాయిజ్ లేదు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహా 5/554లో ‘తహ్రీము ఖత్లిల్ జరాది ఇల్లా లిల్ అక్లి ఔ లిదఫ్ఇ జరర్’ (తినడానికి లేదా నష్టం దూరం చేయుటకు తప్ప మిడతలను చంపడం నిషద్ధం) అని ఛాప్టర్ పేర్కొని ఈ క్రింది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) వారి హదీసు ప్రస్తావించారు:

لَا تَقْتُلُوا الْجَرَادَ، فَإِنَّهُ مِنْ جُنْدِ اللهِ الْأَعْظَمِ
మిడతలను చంపకండీ, అవి అల్లాహ్ సైన్యాల్లో ఓ సైన్యం”. (సహీహా 2428).

الصحيحة 2428 – ” لا تقتلوا الجراد، فإنه جند من جنود الله الأعظم “.
الصحيحة 2429 – ” لا تقوم الساعة حتى تقاتلوا قوما صغار الأعين عراض الوجوه كأن أعينهم حدق الجراد، كأن وجوههم المجان المطرقة، ينتعلون الشعر ويتخذون الدرق، حتى يربطوا خيولهم بالنخل “.
الصحيحة 1056 – ” خير ماء على وجه الأرض ماء زمزم، فيه طعام من الطعم وشفاء من السقم، وشر ماء على وجه الأرض ماء بوادي برهوت بقية حضرموت كرجل الجراد من الهوام، يصبح يتدفق ويمسي لا بلال بها “.

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బఖర: ఆయత్ 142 – 143 (ఖిబ్లా దిశ మార్పు) [వీడియో]

బిస్మిల్లాహ్

[8:41 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [8:41 నిముషాలు]

అహ్సనుల్ బయాన్ నుండి:

2:142  سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖ జనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.

2:143  وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ

అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్‌ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్‌ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు.


ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్

సీరత్ పాఠాలు – 4: హబషాకు హిజ్రత్ (వలస), దుఃఖ సంవత్సరం [వీడియో]

బిస్మిల్లాహ్

[15:13 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [15:13 నిముషాలు]

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

ఈద్ సందర్భంలో చదివే తక్బీర్ పదాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఈద్ సందర్భంలో చదివే తక్బీర్ పదాలు ఏమిటి
ఈ వీడియో చూసి నేర్చుకోండి
ఇతరులకు నేర్పి అధిక పుణ్యం పొందండి

[2:31 నిముషాలు]


అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్


అల్లాహు అక్బర్ కబీరా, వల్ హందులిల్లాహి కసీరా , వ సుబ్ హానల్లాహి బుక్రతన్ వ అసీలా
అల్లాహు అక్బర్ వలా న’బుదు ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన్ వలవ్ కరిహల్ కాఫిరూన్
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ద సదఖ వ’అద వ నసర అబ్ద వ హజమల్ అహ్జాబ వహ్ద
లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఈద్ (పండుగ) నెలవంక కనిపించిన వెంటనే అల్లాహ్ యొక్క గొప్పతనం చాటండి [వీడియో]

బిస్మిల్లాహ్

“అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
వ లిల్లాహిల్‌ హమ్ద్”

[2 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ యూట్యూబ్ ఛానల్ 

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [2 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

లాక్ డౌన్ లో ఈద్ సున్నతు ఆచరణలను ఎలా పాటించాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[9:19 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [9:19 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

సీరత్ పాఠాలు – 3: ప్రవక్త పదవి, ప్రచారం [వీడియో]

బిస్మిల్లాహ్

[18:04 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:04 నిముషాలు]

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

లాక్ డౌన్ పరిస్థితుల్లో ఈద్ (పండుగ) నమాజ్ ఇంట్లో తప్పనిసరిగా చెయ్యాలా? [వీడియో]

బిస్మిల్లాహ్

[0:58 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [0:58 నిముషాలు]

సౌదీ గ్రాండ్ ముఫ్తీ, షేక్ అబ్దుల్ అజీజ్ ఆల్-షేక్, కోరోనావైరస్ యొక్క పరిస్థితి ఈద్ వరకు కొనసాగితే,, అప్పుడు ఈద్‌ నమాజు ఖుత్బా /ఉపన్యాసం లేకుండా సొంత ఇళ్లలోనే జరుగుతుంది అని ఫత్వా జారీ చేసారు.సొంత ఇళ్లలో ప్రార్థన చేయడానికి షేఖ్ ఫౌజాన్ ఈ అభిప్రాయంతో అంగీకరించారు

లాక్ డౌన్ పరిస్థితుల్లో ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ ఇంట్లో తప్పనిసరిగా చెయ్యాలా

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఈద్ (పండుగ) నమాజ్ లో చదివే తక్బీర్ల (అల్లాహు అక్బర్) గురించి చిన్న వివరణ [వీడియో]

బిస్మిల్లాహ్

[2:36 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [2:36 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/