ఏకత్వం వాస్తవికత (Hakeekath-Tawheed)

tawheed-telugu-islam
సంకలనం
: మౌలానా  అబ్దుస్ -సలాం  ఉమ్రి (Moulana Abdus-Salam Umri)
అనువాదం : మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఉమ్రి (Moulana Muhammad Zakir Umri)
మస్జిద్ -ఎ -ఫరూఖియః ,హకీంపేట్ , టోలిచౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Tolichowki, Hyderabad)
ప్రకాశకులు: ఐదార ఫిక్రే ఆఖిరత్

ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.

[PDF చదవండి /డౌన్ లోడ్ చేసుకోండి]

విషయ సూచిక :

 1. ముందు మాట
 2. తౌహీద్ (ఏకత్వం) అంటే ఏమిటి?
 3. ఇబాదత్ (ఆరాధన) అంటే ఏమిటి?
 4. షిర్క్ (సాటి కల్పించటం) అంటే ఏమిటి?
 5. మొక్కుబడులు, నైవేద్యాలు, ఆరాధనలు
 6. దుఆ  (ప్రార్ధన) ఆరాధనే
 7. తౌహీద్ మూడు రకాలు
 8. తౌహీదే జాత్
 9. తౌహీదే ఆస్మా  వసిఫాత్
 10. అల్లాహ్ దూరం దగ్గర అన్నీ చూస్తాడు
 11. అల్లాహ్ అర్ధిస్తే సంతోషిస్తాడు , అర్ధించని యెడలఆగ్రహం వ్యక్తం చేస్తాడు
 12. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా అల్లాహ్ నే ప్రార్ధించాడు
 13. తౌహీదే రుబూబియత్
 14. విగ్రహాల పట్ల విగ్రహారాధకుల వ్యర్ధ నమ్మకాలు
 15. మానవ అవసరాలు రెండు రకాలు
 16. తౌహీదే ఉలూహియత్
 17. ఓ ప్రజలారా!
 18. ఏకత్వమే ఆరాధనకు పునాది
 19. తౌహీద్ ప్రాధాన్యం
 20. తౌహీద్ ఇస్లాం ధర్మం పునాది రాయి
 21. తౌహీద్ అన్నిటి కంటే విలువైనది, బరువైనది
 22. తౌహీద్ పాపలన్నిటినీ తుడుచి వేస్తుంది
 23. ప్రతి వ్యక్తి ఎకదైవారాధకుడుగానే  జన్మిస్తాడు
 24. వాస్త ఏక దైవరాధకుడు విచారణ లేకుండా స్వర్గంలోనికి ప్రవేసిస్తాడు
 25. తౌహీద్ విధులు
 26. శక్తి యుక్తులు వినియోగించడం, నమ్మకం రెండూ తప్పనిసరి
 27. అల్లాహ్ నూహ్ జాతిని ముంచి వేశాడు
 28. తవక్కుల్ తౌహీద్ ఆత్మ మరియు జీవిత సామగ్రి
 29. షిర్క్ వాస్తవం
 30. షిర్క్ కి రెండు కారణాలున్నాయి
 31. బహు దైవరాధకులు నరకంలో శాశ్వతంగా ఉంటారు
 32. షిర్క్ నాలుగు రకాలు
 33. బహు దైవరాధకులు వారి చిల్లర దైవాలు ఇద్దరూ బలహీనులే
 34. విగ్రహారాధకుల సాక్ష్యాదారాలు
 35. విశ్వ సృష్టికర్త మాత్రమే సర్వ జ్ఞాని
 36. సృష్టికర్తేనే ఆరాధించాలి
 37. అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు పరిపూర్నుడూనూ
 38. సంతానం దైవత్వానికి వ్యతిరేకం
 39. లాభ నష్టాలు విశ్వసృష్టికర్త పాలకుడైన అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి
 40. అల్లాహ్ పరిపూర్ణ శక్తియుక్తులు గలవాడు
 41. అల్లాహ్ గోచర అగోచర జ్ఞాని
 42. మార్గదర్శకున్నే అనుసరించాలి
 43. వాసీఅహ్
 44. షరీఅత్తులో షిఫాఅత్ స్థానం
 45. షఫాఅత్  వాస్తవికత
 46. షఫాఅత్ కు విశ్వాసులే అర్హులు
 47. గులూ అంటే గౌరవాభిమనాల్లో హద్దు మీరి ప్రవర్తించటం
 48. అగోచర జ్ఞానం వాస్తవికత
 49. జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు
 50. దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు
 51. అగోచర జ్ఞానం లేని మూసా (అలైహిస్సలాం)
 52. ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూ అగోచర జ్ఞానం లేదు

కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) – Kitabut Touheed

kitab-at-tawheed-AbdulWahhab-book-coverTouheed (Eka Daivaradhana) (Telugu) – Kitabut Touheed
Compiled by : Allama Mohammad bin Abdul Wahhab
Translated by : Abdul Rab bin Shaik Silar
Edited by : Dr. Sayeed Ahmed Oomeri Madani, S.M. Rasool Sharfi
Publisher : Markaz Darul Bir, Ahmad Nagar, Pedana A.P. India

[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]

విషయ సూచిక :

 1. ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత
 2. ఏక దైవారాధన యొక్క ప్రాముఖ్యత, సకల పాప సంహారిణి
 3. ఏక దైవారాధకుడు విచారణ  లేకుండానే స్వర్గమున ప్రవేశించును
 4. బహు దైవరాధాన్ గురించి భయపడవలసిన ఆవశ్యకత
 5. “లా ఇలాహ ఇల్లల్లాహ్” నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితభోద చేయుట
 6. తౌహీద్ మరియు కలిమయే తౌహీద్ ధృవీకరణల సారాంశం
 7. కష్ట నష్టాల విముక్తికి తాయత్తులు  , దారాలు, రక్ష రేకులు ధరించుట
 8. ఊదుట మరియు తాయత్తులు ధరించుట నిషిద్దం
 9. రాళ్ళను, చెట్లను శుభం కల్గించే విగా  భావించుట
 10. అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు
 11. అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్నామముపై అర్పణ కూడా నిషేధము
 12. అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే
 13. అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే
 14. అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే
 15. నిరాధారమైన సృష్టిని వేడుకొనుట
 16. “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు” –   (సబా  34 :23)
 17. సిఫారసు వాస్తవికత
 18. “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందిరికీ మార్గదర్శకత్వము ప్రసాదించగలడు 28 :56 “
 19. ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే
 20. పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం
 21. పుణ్యాత్ముల సమాధుల   విషయంలో హద్దు మీరుట ధైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలు గా మార్చుట
 22. ఏక ధైవోపాసనను భధ్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను
 23. ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట
 24. చేతబడి
 25. జాదులోని కొన్ని విధానాలు
 26. జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి
 27. జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట
 28. దుశ్శకున (అపశకున) దర్శనము
 29. జ్యోతిష్యం గురించి
 30. నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట
 31. అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది
 32. అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉండుట
 33. ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను
 34. అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండరాదు – అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదు
 35. అల్లాహ్ నిర్ణయించిన విధి పై సహనం ఈమాన్ లోని అంతర్భాగమే
 36. ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే
 37. ఇహలోక లబ్ధికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’లాంటివి
 38. అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట
 39. ‘విశ్వసించితిమి ‘అను వారి వాస్తవము
 40. అల్లాహ్ నామములో, గుణ గణాలలో కొన్నింటిని తిరస్కరించటం
 41. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట
 42. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు
 43. అల్లాహ్ పై ప్రమాణం తో సంతృప్తి చెందని వాడు
 44. అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే
 45. కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు భాధ కలిగించినట్లే
 46. ఎవరినైనా రాజాధిరాజు అని పిలుచుట
 47. అల్లాహ్ నామాలను గౌరవించుట
 48. అల్లాహ్ ను , ఖుర్ ఆనును, ప్రవక్త (సల్లాలహు అలైహి వసల్లం) ను హేళన చేసే వారి కోసం శాసనము
 49. అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత
 50. అల్లాహ్ సనతానం ప్రసాదిన్చినప్పుడు షిర్క్ కు పాల్పడుట
 51. అల్లాహ్ మహోన్నత నామములు
 52. అల్లాహ్ పై సలాం అని పలుకరాదు
 53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని పలుకరాదు
 54. “నా బానిస” అని పలుకరాదు
 55. అల్లాహ్ నామముతో యాచించు వానిని ఒట్టి చేతులతో పంపరాదు
 56. అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమె కోరవలెను
 57. కష్ట నష్టాలు సంభవించినప్పుడు “ఒక వేళ ఇలా జరిగి ఉంటే” అని పలుకుట
 58. గాలిని తిట్టుట నిషిద్దం
 59. అల్లాహ్ ను శంకించుట నిషిద్దం
 60. అల్లాహ్ నిర్ణఇంచిన  విధిని తిరస్కరించేవారు
 61. చిత్రాలు,శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని
 62. ఎక్కువగా ప్రమాణములు చేయుట
 63. అల్లాహ్ ప్రవక్త పేరా పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట
 64. అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట
 65. సృష్టిరాశులను సంతోష పెట్టడానికి అల్లాహ్ నుసిఫారసుదారుగా చేయరాదు
 66. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తౌహీదును పరిరక్షించారు, షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు
 67. అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము)

పరలోకం – Belief in the Hereafter [E-Book]

paralokam

Published by: The Cooperative office for call and guidance, Riyadh, Saudi Arabia, Under the Superision of Ministry of Isamic Affairs Endowment and Call and Guidance. ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి డౌన్లోడ్ చేసుకోండి]

విశ్వాస మూల సూత్రాలు (Fundamentals of Belief in Islam)


usul-al-aqidah-fundamental-beliefs-in-islam_imgఉసుల్  అల్  అఖీదా (Fundamentals of Belief in Islam)

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ : ఇస్లామీయ మూల విశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

 [Read or Download PDF]

విషయ సూచిక :

తౌహీద్, దాని రకాలు
కలిమయే తౌహీద్ – లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం
‘ముహమ్మదుర్ రసూలిల్లా:’ భావం
విశ్వాసం, దాని ఆరు మూల సూత్రాలు
షిర్క్ (బహు దైవారాధన, దాని రకాలు)
ఫిర్క్హయే నాజియ

ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింప జేసే కార్యములు – Nullifiers of Islam

the-nullifiers-telugu-islamక్రింద తెలుప బడిన అతి ఘోరమైన ఈ పది కార్యములు మానవుణ్ణి ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింపచేయును.

1. అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు ముస్లింలు కాజాలరు.

(إِنَّ اللّهَ لاَ يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِـمَن يَشَاء وَمَن يُشْرِكْ بِاللّهِ فَقَدْ ضَلَّ ضَلاَلاً بَعِيدًا (النساء:116

అన్నిసా 4:116 :- “అల్లాహ్‌కు సాటి (భాగస్వామ్యం) కల్పించు వారిని అల్లాహ్ అస్సలు క్షమించడు. షిర్క్ తప్ప వేరే పాపములను అల్లాహ్ తన ఇష్టానుసారం క్షమిస్తాడు”

قال الله تعالى:)إِنَّهُ مَن يُشْرِكْ بِاللّهِ فَقَدْ حَرَّمَ اللّهُ عَلَيهِ الْـجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِـمِينَ مِنْ أَنصَارٍ( الـمـائدة:72

అల్ మాయిద 5:72:- “నిశ్చయంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించువారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు అతని నివాసము నరకమే, పాపాత్ములకు సహాయం చేయువారు ఎవ్వరూ లేరు”. అంటే అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు అవిశ్వాసులు. చనిపోయిన వారిని వేడుకొనుట, సమాధులకు మొక్కుట, అల్లాహ్ పేరుమీద కాకుండా వేరేవాని పేరుమీద బలి ఇచ్చుట..మొదలైనవన్నీ షిర్క్‌లోని విధానములు.

2. తమకి మరియు అల్లాహ్‌కి మధ్య ఎవరినైనా మధ్యవర్తి (సిఫార్సు చేసేవాడు)గా చేసి వేడుకొనుట, మరియు వారిని నమ్ముట వారి సిఫారసుపై నమ్మకం ఉంచుట అవిశ్వాసమే అవుతుందని ఇస్లామీయ పండితులందరి అభిప్రాయం.

3. ఎవరైనా, అవిశ్వాసిని, లేదా బహుదైవారాధకుడిని, అవిశ్వాసి అని నమ్మనివారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే, వారు కూడా అవిశ్వాసులుగా భావించబడతారు.

4. ఎవరైనా వేరే విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లమ్ తెచ్చిన నిబంధనల (షరిఅహ్) కంటే ఉత్తమమైన విధానమని అనుకుంటే వారు అవిశ్వాసులు. వేరే వారి మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ మాటపై ప్రాముఖ్యత ఇచ్చువారు అవిశ్వాసులు.

5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క షరిఅహ్ (నియమనిబంధనల) ను  హృదయపూర్వకంగా స్వీకరించకపోవుట అవిశ్వాసము. అతను దానిపై అమలు చేస్తున్నా మనస్సు దానికి వ్యతిరేకంగా నిర్ణయించిన ఎడల అతను అవిశ్వాసి అగును.

قال الله تعالى:)ذَلِكَ بِأَ نَّـهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَـالَـهُمْ( [محمد:9].

ముహమ్మద్ 47:9:- “ఎందుకంటే వారు అల్లాహ్ అవతరించిన షరియత్‌ను అంగీకరించలేదు. అందుచే అల్లాహ్ వారి కార్యములను వ్యర్ధము చేసేను.”

6. అల్లాహ్ గురించి గాని ప్రవక్త గురించి గాని లేదా షరిఅహ్ ను ఎగతాళి చేసినవారు అవిశ్వాసులు.

قال الله تعالى: )وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَـا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِؤُونَ *      لاَ تَعْتَذِرُواْ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَـانِكُمْ إِن نَّعْفُ عَن طَآئِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَآئِـفَةً بِأَ نَّهُمْ كَانُواْ مُـجْرِمِينَ( التوبة:65-66

అత్తౌబా 9:65–66:-  “ప్రకటించండి! ఏమిటీ, అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయటానికా? మరియు ఆ ప్రవక్తతో ఎగతాళియా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”

7. జాదు (చేతబడి) చేయుట మరియు చేయించుట కూడా అవిశ్వాసుల పని.

قال الله تعالى:)وَمَا كَفَرَ سُلَيْمَـانُ وَلَكِنَّ الشَّيْاطِينَ كَفَرُواْ يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْـمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ وَمَا يُعَلِّمَـانِ مِنْ أَحَدٍ حَتَّى يَقُولاَ إِنَّمَـا نَحْنُ فِتْنَةٌ فَلاَ تَكْفُرْ( [البقرة:102]

అల్ బఖర 2:102 :- “వారిద్దరూ అప్పుడు వరకూ ఎవ్వరికీ జాదు నేర్పించేవారు కాదు. ఇలా అనే వరకూ మేము ఒక పరీక్ష నీవు అవిశ్వాసానికి పాల్పడకు”

8. విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు.

قال الله تعالى:)يَا أَ يُّـهَا الَّذِينَ آمَنُواْ لاَ تَتَّخِذُواْ الْيَهُودَ وَالنَّصَارَى أَوْلِيَاء بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ وَمَن يَتَوَلَّـهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ إِنَّ اللّهَ لاَ يَـهْدِي الْقَوْمَ الظَّالِـمِينَ( [الـمـائدة:51]

అల్ మాయిద 5:51:- “మీలో ఎవరైనా వారితో (అవిశ్వాసులతో) స్నేహం చేసిన యెడల నిశ్చయంగా వారు వారిలో వారే. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ ఋజుమార్గం చూపడు.”

9. ఇస్లామీయ షరిఅహ్‌లో కొన్నింటిని విడిచిపెట్టే సదుపాయం కొందరికుందని భావించువారు అవిశ్వాసులు.

قال الله تعالى:)وَمَن يَـبْتَغِ غَيْرَ الإِسْلاَمِ دِينًا فَلَن يُقْبَـلَ مِنْـهُ وَهُوَ فِي الآخِرَةِ مِنَ الْـخَاسِرِينَ( [آل عمران:85]

ఆలె ఈమ్రాన్  3:85 :- “ఎవరైనా విధేయతా ధర్మం (ఇస్లాం) కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల, వారి విధానం స్వీకరించబడదు. ప్రళయదినం రోజున అతడు నష్టపోయేవారిలోని వాడగును.”

10. అల్లాహ్ యొక్క దీన్ (ధర్మం)తో సంబంధం లేకుండా జీవించువారు, ఇస్లాం గురించి నేర్చుకోనివారు, ఆచరించనివారు అవిశ్వాసులు.

قال الله تعالى:)وَمَنْ أَظْلَمُ مِـمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا إِنَّا مِنَ الْـمُجْرِمِينَ مُنـتَقِمُونَ( [السجدة:22]

అస్సజ్దా 32:22:- “తన ప్రభువు వాక్యాల ద్వారా బోధించబడినపుడు, వాటి పట్ల విముఖుడయ్యే వానికంటే దుర్మార్గుడెవరు? అటువంటి అపరాధులతో మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాము.”
పైన తెలుపబడిన అవిశ్వాసకార్యముల నుండి మేము చాలా జాగ్రత్త వహించాలి. అల్లాహ్ యొక్క భయంకర శిక్షల నుండి భయపడుతూ, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకుంటుండాలి మరియు అల్లాహ్ ఈ పాపాల నుండి మమ్మల్ని రక్షించమని, కాపాడమని వేడుకుంటుండాలి. యా అల్లాహ్! మమ్మల్ని అవిశ్వాసం నుంచి కాపాడు. ఆమీన్.