తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 25[ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 25
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 25

1) మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి ?

A)  అల్లాహ్ శరణు అర్జించాలి
B) “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని పలకాలి
C) పై రెండూ యదార్థమే

2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిచే మదీనాలో నిర్మించబడిన తొలి మస్జిద్ ఏది?

A) మస్జిద్ ఏ ఖుభా – మదీనా
B) మస్జిద్ ఏ నభవి – మదీనా
C) మస్జిదుల్ హరామ్

3) “పరమ పవిత్రుడు” అనే భావంను ఈ క్రింది వాటిలో ఏ పేరు సూచిస్తుంది?

A) అల్ ఖాలిఖ్
B) అల్ ఖహ్హర్
C) అల్ ఖుద్దూస్

క్విజ్ 25: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [20:01 నిమిషాలు]


1) మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు ” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి?

A] అల్లాహ్ శరణు అర్జించాలి
B] ” నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని పలకాలి
C] పై రెండూ యదార్థమే

షైతాన్ మన శాశ్వత శత్రువు, అల్లాహ్ ఖుర్అన్ లో ఈ విషయం స్పష్టంగా తెలిపాడు,

إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ (فاطر 35:6)

నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.

వాని ప్రయత్నాల్లో అతి ముఖ్యమైనది, అల్లాహ్ గురించి మన విశ్వాసాన్ని పాడుచేయడం. అందుకే ఈ సృష్టంతటిని అల్లాహ్ పుట్టించాడు, మరి అల్లాహ్ ను ఎవరు పుట్టించాడు అని సందేహం కలుగజేస్తాడు. అలాంటప్పుడు ఈ పనులు చేయండి, వాని సందేహాలకు దూరంగా ఉండండి:
1- ఆమంతు బిల్లాహ్ అనాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను, కనుక అల్లాహ్ గురించి ఇలాంటి ఆలోచనల్లో పడను.
2- అల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ చదవాలి.
3- ఎడమ ప్రక్కన మూడు సార్లు ఉమ్మి వేయాలి.
4- షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి.
5- ఇలాంటి సందేహాలు, అనుమానాలు, చెడు ఆలోచనలను మనస్సులో నుంచి తొలగించాలి. (సహీహా అల్బానీ 134).

ఈ ఐదు విషయాలు హదీసు ద్వారా రుజువైనవి :

సహీ ముస్లిం 134లో ఉంది, హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“لَا يَزَالُ النَّاسُ يَتَسَاءَلُونَ حَتَّى يُقَالَ: هَذَا خَلَقَ اللهُ الْخَلْقَ، فَمَنْ خَلَقَ اللهَ؟ فَمَنْ وَجَدَ مِنْ ذَلِكَ شَيْئًا، فَلْيَقُلْ: آمَنْتُ بِاللهِ”
وفي رواية مسلم 134:- “يَأْتِي الشَّيْطَانُ أَحَدَكُمْ فَيَقُولَ: مَنْ خَلَقَ كَذَا وَكَذَا؟ حَتَّى يَقُولَ لَهُ: مَنْ خَلَقَ رَبَّكَ؟ فَإِذَا بَلَغَ ذَلِكَ، فَلْيَسْتَعِذْ بِاللهِ وَلْيَنْتَهِ”.
وفي رواية أبي داود 4722:- فَإِذَا قَالُوا ذَلِكَ فَقُولُوا: اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ ثُمَّ لِيَتْفُلْ عَنْ يَسَارِهِ ثَلَاثًا وَلْيَسْتَعِذْ مِنَ الشَّيْطَانِ “

ప్రజలు పరస్పరం ప్రశ్నించుకుంటారు, చివరికి ఈ సృష్టిని అల్లాహ్ సృష్టించాడు, అయితే అల్లాహ్ ను ఎవరు సృష్టించాడు అన్న వరకు పోతారు. ఇలాంటి విషయం ఎవరైనా చూసినప్పుడు వెంటనే ఆమంతు బిల్లాహ్ చదవాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను.

మరో ఉల్లేఖనంలో ఉంది: షైతాన్ మీలో ఎవరి వద్దకైనా వచ్చి దీనిని ఎవరు పుట్టించారు, ఫలానా దానిని ఎవరు పుట్టించారు అని ప్రేరణ కలిగిస్తాడు, చివరికి నీ ప్రభువుని ఎవరు పుట్టించాడు అని మాట వేస్తాడు, ఈ స్థితికి చేరుకున్నప్పుడు వెంటనే అల్లాహ్ శరణులోకి రావాలి, ఈ దురాలోచనను వీడాలి.

అబూదావూద్ 4722లోని ఉల్లేఖనంలో ఉంది … మరి అల్లాహ్ను ఎవరు సృష్టించారు?’ అని చెప్పటం జరుగుతుంది. ప్రజలు ఇలా అన్నప్పుడు, మీరు ‘అల్లాహ్ ఒక్కడే, ఆయన అక్కర లేనివాడు, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానం కాడు, ఆయనకు సరిసమానుడెవడూ లేడు’ అని పలికి, మూడుసార్లు ఎడమవైపు ఉమ్మి, షై’తాన్ కుతంత్రాల నుండి అల్లాహ్ను శరణుకోరండి.’

ఈ దురాలోచన కలిగితే చేయవలసిన మన బాధ్యత తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ అందరికంటే ముందు ఆయనకు ముందు ఏదీ లేదు అని కూడా ఆధారాలున్నాయి:

సహీ ముస్లిం 2713లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవరైనా నిద్రించేకి ముందు కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదవాలి:

«اللهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ، رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ، فَالِقَ الْحَبِّ وَالنَّوَى، وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ، اللهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ، وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ، اقْضِ عَنَّا الدَّيْنَ، وَأَغْنِنَا مِنَ الْفَقْرِ»

”అల్లాహుమ్మ రబ్బి స్సమావాతి వ రబ్బల్ అర్’ది వ రబ్బ కుల్లి షయ్ఇన్ ఫాలిఖల్ ‘హబ్బి వన్నవా, వ మున్’జిల త్తౌరాతి వల్ ఇన్జీలి, వల్ ఖుర్ఆని. అ’ఊజు’బిక మిన్ షర్రి కుల్లి జీ’ షర్రిన్, అంత ఆ’ఖిజు’న్ బి నా’సియతిహీ. అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆ’ఖిరు ఫలైస బ’అదక షయ్ఉన్, వ అంత ”జ్జాహిరు ఫలైస ఫౌఖక షయ్ఉన్ వ అంతల్ బా’తిను ఫలైస దూనక షయ్ఉన్ ఇఖ్’ది అన్నిద్దైన. వ అ’గ్నినీ మినల్ ఫఖ్రి!”

‘ఓ అల్లాహ్! సప్తాకాశాలకు భూమికి ప్రభువు నువ్వే అన్నిటికీ ప్రభువువీ, బీజాన్ని చీల్చేవాడా! గింజలను మొలకెత్తించే వాడా, తౌరాతు, ఇంజీలు, ఖుర్ఆన్ను అవతరింపజేసిన వాడా! నిన్ను నేను శరణుకోరు తున్నాను. ప్రతి చెడు వస్తువు యొక్క చెడు నుండి అంటే ప్రతి హాని తలపెట్టే వస్తువు నుండి. దాని నుదురు నీ చేతిలోనే ఉంది. నీవే అందరికంటే ముందు వాడవు. నీ కంటే ముందు ఏదీలేదు. నీవే అందరికంటే చివరి వాడవు. నీ తర్వాత ఏదీ లేదు. నీవు బహిర్గతుడవు, నీవు అంతర్గతుడవు. నీకంటే రహస్యమైనది ఏదీలేదు. నీవు నన్ను రుణం తీర్చివేయడంలో, దారిద్య్రం దూరం కావడంలో నాకు సహాయం చేయి.

2 ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) గారిచే మదీనాలో నిర్మించబడిన తొలి మస్జిద్ ఏది ?

A]మస్జిదె ఖుబా – మదీనా

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా వైపునకు హిజ్రత్ చేసినప్పుడు మదీనాకు సుమారు 6 లేదా 7 కిలో మీటర్ల ముందు ఖుబా అను ప్రాంతం ఉంది, అక్కడ కొద్ది రోజులు బస చేశారు, అక్కడే మస్జిద్ నిర్మించారు. ఆ మస్జిద్ మరియు దానిని నిర్మించినవారి ప్రశంసన ఖుర్ఆనులో కూడా ఉంది

9:108 لَمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ
అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.

సహీ బుఖారీ 3906లో ఉంది, ఇది ఇస్లాంలోని తొలి మస్జిద్ అని.

3] “పరమ పవిత్రుడు” అనే భావంను ఈ క్రింది వాటిలో ఏ పేరు సూచిస్తుంది ?

C] అల్ ఖుద్దూస్

పవిత్రుడు, పరిశుద్ధుడు, అన్ని లోపాలకు దోషాలకు అతీతుడు.

59:23 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ

ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు.

62:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ

భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.

مسلم 487 – أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ: «فِي رُكُوعِهِ وَسُجُودِهِ سُبُّوحٌ قُدُّوسٌ، رَبُّ الْمَلَائِكَةِ وَالرُّوحِ»

సహీ ముస్లిం 487లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ సజ్దాలో ఇలా అనే వారు సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇతి వర్రూహ్.

أبوداود 1430 –صحيح:- عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا سَلَّمَ فِي الْوِتْرِ، قَالَ: «سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوسِ»

అబూ దావూద్ 1430 (సహీ) లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ తర్వాత సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్ అని చదివే వారు.

أبوداود 5085 – حسن صحيح:- قَال شَرِيقٌ الْهَوْزَنِيُّ: دَخَلْتُ عَلَى عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، فَسَأَلْتُهَا: بِمَ كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَفْتَتِحُ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ؟ فَقَالَتْ: لَقَدْ سَأَلْتَنِي عَنْ شَيْءٍ مَا سَأَلَنِي عَنْهُ أَحَدٌ قَبْلَكَ، كَانَ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ كَبَّرَ عَشْرًا، وَحَمَّدَ عَشْرًا، وَقَالَ: «سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ عَشْرًا» وَقَالَ: «سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوسِ عَشْرًا» وَاسْتَغْفَرَ عَشْرًا [ص:323]، وَهَلَّلَ عَشْرًا، ثُمَّ قَالَ: «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ ضِيقِ الدُّنْيَا، وَضِيقِ يَوْمِ الْقِيَامَةِ عَشْرًا» ثُمَّ يَفْتَتِحُ الصَّلَاةَ

అబూ దావూద్ 5085 (హసన్, సహీ) లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు ఏ దుఆ చదివి నమాజు ప్రారంభించేవారు అని షురైఖ్ హౌజనీ ఆయిషా రజియల్లాహు అన్హాను అడిగారు, ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: నీవడిగిన ప్రశ్న నీకంటే ముందు ఎవరూ అడగలేదు. ప్రవక్త రాత్రి వేళ మేల్కొని నమాజు ఆరంభంలో పదిసార్లు అల్లాహు అక్బర్, పదిసార్లు అల్ హందులిల్లాహ్, పది సార్లు సుబ్ హానల్లాహి వబిహందిహీ, పది సార్లు సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్, పది సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్, పది సార్లు లాఇలాహ ఇల్లల్లాహ్ పలికేవారు. మళ్ళీ పది సార్లు అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జీఖిద్దున్యా వ జీఖి యౌమిల్ ఖియామహ్ చదివేవారు.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz