Salah (నమాజు, ప్రార్ధన)

జనాజ నమాజు

సలాతుల్ జనాజ విధానం :

 1. జనాజ (శవపేఠిక)ను ఇమాం మరియు ఖిబ్లాకి మధ్యలో ఉంచవలెను.
 2. మృతదేహం పురుషునిదైతే తల దగ్గర, స్త్రీ దైతే మధ్యలో ఇమాం నుంచోవలెను.
 3. తక్బీర్ చెప్పిన తర్వాత చేతులు కట్టుకుని సూరె ఫాతిహా నిశ్శబ్దంగా చదవవలెను.
 4. రెండవ తక్బీర్ చెప్పి అందరూ నిశ్శబ్దంగా దరూద్ చదవవలెను.
 5. మూడవ తక్బీర్ చెప్పి అందరూ నిశ్శబ్దంగా మృతుని కొరకు దుఆ చేయవలెను.

1 దువాఅల్లాహుమ్మగ్ ఫిర్లి హయ్యినా, వ మయ్యితినా, వ షాహిదినా,వ గాఇబినా, వ సగీరినా, వ కబీరినా, వదకరినా, వఉన్ థానా, అల్లాహుమ్మ మన్అహ్ యయ్ తహు మిన్నా ఫఅహ్ యిహి అలల్ ఇస్లామి వ మన్ తవఫ్ఫయ్ తహు మిన్నా ఫత వఫ్ఫహు అలల్ ఈమాని అల్లాహుమ్మ లాతహ్ రింనా అజ్.రహు వ లాతఫ్ తిన్నాబఅదహు.

ఓ అల్లాహ్! నన్ను మాలో బ్రతికి ఉన్నవారినీ, చనిపోయినవారినీ, ఇక్కడున్నవారినీ, ఇక్కడ లేని వారినీ, పిన్నలనూ, పెద్దలనూ, మా మగవారినీ, మా ఆడవారినీ అందరినీ క్షమించు. ఓ అల్లాహ్! మాలో ఎవరిని  సజీవంగా ఉంచినా ఇస్లాంపైనే ఉంచు. ఎవరికి మరణం ప్రసాదించినా విశ్వాసస్థితిలో మరణింప జేయి. ఈ మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించడం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్నిదూరం చెయ్యకు. ఇతని తరువాత మమ్మల్ని పరీక్షలకు గురిచేయకు (సన్మార్గానికి దూరం చేయకు).

2 వ దువా -

“اللهم اغفر له، وارحمه، وعافه، واعف عنه، وأكرم نزله، ووسع مدخله، واغسله بالماء والثلج والبرد، ونقه من الخطايا كما ينقى الثوب الأبيض من الدنس، وأبدله دارا خيراً من داره، وأهلاً خيراً من أهله، و زوجاً خيراً من زوجه، وأدخله الجنة، وقه فتنة القبر وعذاب النار.

అల్లాహుమ్మగ్ ఫిర్ లహు, వర్ హంహు వ ఆఫిహి, వ అఫ్ఉ అన్ హు, వ అకరిమ్ నుజులహు, వవస్సి ముద్ ఖలహు, వగ్ సిల్ హు, బిల్ మాయి వథ్థల్ జి, వల్ బరది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖితథ్థౌబుల్ అబ్ యదు మినద్దనసి, వ అబ్ దిల్ హు, దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్ లన్ ఖైరన్ మిన్ అహ్ లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహి, వ అద్ ఖిల్ హుల్ జన్నత వఖిహి ఫిత్నతల్ ఖబ్రి వ అజాబిన్నారి.

ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతని మీద దయ చూపు, అతన్ని క్షమించి శిక్షనుండి కాపాడు, అతన్ని మన్నించు, అతనికి ఉత్తమ స్థానము ప్రసాదించు, అతనికి విశాలమైన నివాసము ప్రసాదించు, అతని పాపములను నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి, తెల్లని వస్త్రాన్ని మురికి నుండి శుభ్రపరచినట్లు అతన్ని పాపాలనుండి శుభ్రపరుచు. అతనికి ఇహలోకపు ఇల్లు కంటే మంచి ఇల్లుని, ఇహలోకపు సంతతి కంటే ఉత్తమ సంతతిని, ఇహలోకపు ఇల్లాలి కంటే మంచి ఇల్లాలిని ప్రసాదించు. అతనిని స్వర్గంలో ప్రవేశింపజేయి. సమాధి శిక్షనుండి నరకాగ్ని శిక్షనుండి అతన్ని రక్షించు.

6.  ఆ తర్వాత 4వ తక్బీర్ పలికి సలాంచేసి కుడి వైపు తిరగవలెను,

ఈద్ నమాజు

పండ నమాజు

 1. ఈదుల్ ఫిత్ ర్ (రమదాన్ పండగ) రమదాన్ నెల ఉపవాసములు పూర్తయిన తర్వాత షవ్వాల్ 1వ తారీఖున జరుపుకోబడును.
 2. ఈదుద్దుహా దిల్ హజ్జ 10వ తారీఖున జరుపుకోబడును.
 3. పండుగ నిర్వచనం: మాటిమాటికీ సంతోషసంబరాలతో మరలి వచ్చేది. పండగ రోజు సంతోషంగా తిని, తినిపించి అల్లాహ్ ను స్తుతించురోజు.

సలాతుల్ ఈద్ షరతులు:

 1. సమయం: సూర్యుడు ఉదయించిన 20 నిమిషాల తర్వాత సలాతుల్ ఈద్ సమయం ప్రారంభమగును. ఆలస్యం చేయకుండా ప్రారంభపు సమయంలోనే ఈద్ నమాజ్ పూర్తి చేయటం ఉత్తమమం
 2. సలాహ్: సలాతుల్ ఈద్ రెండు రకాతులు బిగ్గరగా చదవవలెను. అదాన్ మరియు ఆఖామహ్ పలుకబడదు. మొదటి రకాతులో ప్రారంభ తక్బీర్ కాకుండా 6 తక్బీర్ లు అధికంగా పలుక వలెను. మరియు రెండవ రకాతులో 5 తక్బీర్ లు పలుక వలెను.
 3. సలాతుల్ ఈద్ తర్వాత రెండు ఖుత్బాలు ఇవ్వబడును.

సలాతుల్ ఈద్ లోని సున్నతులు

 1. స్నానం చేయుట, మంచి దుస్తులు ధరించుట, సువాసన పూసుకొనుట.
 2. ఈదుల్ ఫితర్ లో బేసి సంఖ్యలో ఖర్జూరపు పళ్ళు తిని ఈద్ గాహ్ కు వెళ్ళుట. సలాతుల్ ఈద్ పట్టణం లేదా గ్రామం బయటకు వెళ్ళి ఆచరించుట సున్నహ్.
 3. ఈదుల్ అద్ హా లో ఈద్ గా నుంచి వచ్చి ఖుర్బాని మాంసంతో భోజనం చేయుట   ఈద్ గాహ్ వెళ్ళే టప్పుడు ఒకదారిన వచ్చే టప్పుడు వేరే దారిన రావటం.
 4.  తక్బీర్ – అల్లాహు అక్బర్, అల్లాహ్ అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్,  అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హంద్

(الله أكبر     الله أكبر     لا اله إلا الله،     والله أكبر     الله أكبر     ولله الحمد)

       గమనిక: తక్బీర్ ఒక్కొక్కరు వేర్వేరుగా పలకాలి. మూకుమ్మడిగా పలకరాదు.

సలాతుల్ జుమహ్

సలాతుల్ జుమహ్ (శుక్రవారపు మధ్యాహ్న నమాజు):

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

ఖుర్ఆన్, సూర జుమహ్ 62 ఆయత్ 9 -“ఓ విశ్వాసులారా !  శుక్రవారం సమావేశం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారాలు(లావాదేవీలను) వదిలేసి అల్లాహ్ స్మరణ (ధర్మబోధ) వైపు పరుగెత్తండి. మీరు అర్థం చేసుకో గలిగితే (జ్ఞానవంతులైతే) ఇది మీకెంతో శ్రేయస్కరమైనది.”

జుమహ్ ప్రాముఖ్యత:

ముస్లిం హదీథ్:  అబూహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు “సూర్యుడు ఉదయించే రోజులలో అన్నింటి కంటే ఉత్తమమైన రోజు జుమ్అహ్ రోజు. ఆ రోజునే ఆదం అలైహిస్సలామ్ సృష్టించబడ్డారు. అదే రోజున స్వర్గంలో ప్రవేశింపజేయబడ్డారు. అదే రోజున స్వర్గం నుండి తీయబడ్డారు. మరియు జుమ్అహ్ రోజునే ప్రళయదినం వాటిల్లుతుంది.”

సలాతుల్ జుమహ్ యొక్క వివరములు:

 1. జుమహ్ సమయము: జుహర్ నమాజు సమయమే.
 2. వ్యక్తుల సంఖ్య: కనీసం ముగ్గురు మగవారు ఉన్నప్పుడు మాత్రమే జుమ్అహ్ నమాజు జరుగును. వారిలో ఒకరు ఇమాం అవుతారు.
 3. ప్రసంగం: రెండు ప్రసంగములు జరుపవలెను. అల్లాహ్ పై ప్రజల విశ్వాసాన్ని బలపరచే బోధనలు ప్రసంగించడం తప్పని సరి. సమాజములోని చెడులను దూరం చేసేటట్లు బోధించవలెను.
 4. సలాహ్: రెండు  రకాతులు ఫరద్ బిగ్గరగా చదవవలెను.

గమనిక: ఎవరైనా ఇమాము రెండవ రకాతు రుకూ నుండి నిలబడిన తర్వాత వచ్చిన ఎడల అతను 4 రకాతులు జుహర్ చదవవలెను. అంటే అతను జుమహ్ కోల్పోయెను.

 1. జమహ్ తర్వాత చదివే సున్నహ్ నమాజులు: సలాతుల్ జుమహ్ తర్వాత మస్జిద్ లోనే సున్నతులు చదివిన ఎడల 4 రకాతులు, ఇంటిలో సున్నతులు చదివిన ఎడల రెండు రకాతులు చదవవలెను.

క్రింది విషయాలు అస్సలు చేయకూడదు:

 1. జుమహ్ ఖుత్ బా సమయంలో ఎవ్వరితోను ఎట్టి పరిస్థితులలోను మాట్లాడరాదు.
 2. మోకాళ్ళను నుంచోబెట్టి, కూర్చోరాదు. అనవసరమైన, అసహ్యకరమైన చేష్టలు చేయరాదు.
 3. ముందు వచ్చినవాళ్ళు ముందు వరుస (సఫ్)లో తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత సఫ్ లలో క్రమశిక్షణతో కూర్చోవలెను. ప్రజల పై నుండి దాటి వెళ్ళరాదు.

జుమహ్ సలాహ్ కొరకు యారవ్వవలసిన విధానం(సున్నహ్) :  

 1. స్నానం చేసి శుభ్రమైన మంచి బట్టలు ధరించుట
 2. మస్జిద్ లో తొందరగా హాజరవడం
 3. అతి ఎక్కువగా దరూద్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై) పంపుట.
 4. సూరె కహాఫ్ (18 వ సూర) చదువుట.
 5. జుమహ్ రోజున సూర్యాస్తయమమునకు ముందు మేలు కొరకు, క్షమాపణ కొరకు దుఆ చేయుట
 6. జుమహ్ కు ముందు రెండు రకాతులు తహయ్యతుల్ మస్జిద్ తప్పక చదవవలెను.

జుమహ్ ప్రసంగ విధానము:

 1. ఖతీబ్ మెంబరు పై ప్రజల వైపుకు తిరిగి నిలుచొని‘అస్సలాముఅలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతహు’ అని పలికి కూర్చోవలెను.
 2. ఖతీబ్ కూర్చొన్న తర్వాత ముఅద్దిన్ అదాన్ పలక వలెను.
 3. అదాన్ తర్వాత ఖతీబ్ నుంచుని మొదటి ఖుత్బా చదవవలెను.

a)    ఖుత్బాలో ఇన్నల్ హందులిల్లాహ్ తో ప్రారంభించాలి.

b)   ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై దరూద్ సలాం పంపాలి. ప్రసంగ విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఖుర్ఆన్ ఆయహ్ పఠించాలి.

c)    ప్రజలను అల్లాహ్ యొక్క భయభక్తుల వైపుకు పిలవాలి.

d)   ఖుత్బా అల్లాహ్ పై విశ్వాసము దృఢపరిచే విధంగా ఉండాలి.

e)    ఆ సమయపు కష్టముల నుండి, తప్పుల నుండి దూరం అయ్యే విధంగా ప్రజలకు సూచనలు చేయాలి.

f)    ఖతీబ్ తన కొరకు మరియు ముస్లింల కొరకు అల్లాహ్ తో క్షమాపణ కోరాలి, “అస్తగ్ ఫిర్ అల్లాహ్” అంటే “ఓ అల్లాహ్ నన్ను, మమ్మల్ని క్షమించు” అనాలి.

g)   ఖుత్బా క్లుప్తంగా మరియు ఆ సమయానుసారం హితబోధ అయి ఉండాలి.

గమనిక: కొంచెం బిగ్గరగా ఖుత్బా ప్రసంగం చేయడం చాలా ఉత్తమం.

h)   రెండవ ఖుద్బాకి ముందు ఖతీబ్ కొంచెం సేపు కూర్చోవలెను.

i)     మళ్ళీ నుంచొని 2వ ఖుత్బా ఇన్నల్ హందులిల్లాహ్ – అల్లాహ్ స్తోత్రములతో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై సలాంతో మరియు కొన్ని ఖుర్ఆన్ వచనాలతో ప్రారంభించాలి.

j)     జుమహ్ సలాహ్ లో అప్పుడప్పుడు సూరె ఆలా మరియు సూరె గాషియ చదువుట సున్నత్.

k)   జుమహ్ ప్రసంగం ప్రారంభము కాకముందు మస్జిద్ లో చేరాలి. 

సజ్దా సహూ

సలాహ్ లో ఏదైనా పొరపాటు (ఎక్కువ లేదా తక్కువ లేదా భయం వల్ల) జరిగితే దానికి బదులుగా 2 సజ్దాలు చేయవలెను.

 عن ابن مسعود رضي الله عنه قال- قال الرسول r: ” إذا زاد الرجل أو نقص فليسجد سجدتين”(رواه البخاري ومسلم)

ముస్లిం హదీథ్ : అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉద్బోధించారు “సలాహ్ లో హెచ్చుతగ్గులు తప్పులు జరిగిన ఎడల రెండు సజ్దాలు చేయవలెను.”

గమనిక: సజ్దా సహూ, పొరబాటును బట్టి, సలాము తిరగక ముందుగాని తర్వాత గాని చేయవలెను.

ఎప్పుడు సజ్దా సహూ అనివార్యము?

 1. నమాజులో మరచిపోయి ఎక్కువ రకాతులు లేక సజ్దాలు చేసినప్పుడు సజ్దా సహూ చేయాలి
 2. నమాజులో మరచిపోయి తక్కువ రకాతులు చేసిన ఎడల ఆ రకాతు పూర్తిచేసి తర్వాత సజ్దా సహూ చేయవలెను. సలాము తిర్గిన తర్వాత గుర్తుకు వస్తే లేదా వేరే వారు వెంటనే గుర్తు చేస్తే, తగ్గిన రకాతు పూర్తిచేసి, సజ్దా సహూ చేయవలెను.
 3. మరచిపోయి వాజిబ్ వదలినట్లయితే, ఆ వాజిబ్ ని మళ్ళీ పూర్తి చేయనవసరం లేదు.
 4. అనుమానం వచ్చినప్పుడు రెండు రకాతులా, మూడు రకాతులా అని అప్పుడు రెండు రకాతులు నిర్ధారించుకుని మిగిలిన రకాతులు పూర్తి చేసి సజ్దా సహూ చేయవలెను.

ఇమాం వెనుక నమాజు చేస్తున్నప్పుడు, ఒకవేళ ఇమాం గనుక తప్పు చేస్తే సుబ్ హానల్లాహ్ అని పలుక వలెను.

సలాతుల్ జమాహ్

సలాతుల్ జమాహ్: అందరూ కలిసి, సమూహంగా ఒకేసారి నమాజు చేయటం

 సలాతుల్ జమాహ్ యొక్క ప్రాధాన్యత:

قال الله تعالى: )وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ مَعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَى لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ( (النساء 102)

“ప్రవక్తా!  ఒకవేళ నీవు ముస్లింల మధ్య ఉండి (యుద్ధం జరుగుతుండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి, వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతోపాటు నమాజు చెయ్యాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి.” దివ్యఖుర్ఆన్ సూరహ్ అన్నిసా 102

 عن أبي هريرة رضي الله عنه قال- قال رسول الله :r“أثقل صلاة على المنافقين صلاة العشاء وصلاة الفجر ولو يعلمون ما فيهما لأتوهما ولو حبوا.” (رواه البخاري ومسلم)

అబి హురైరత రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – కపటులకు ఇషా నమాజు (తొలిరేయి సమయంలో చేసే నమాజు) మరియు ఫజర్ నమాజు (ప్రాత:కాలంలో చేసే నమాజు) కంటే కష్టతరమైన నమాజు ఇంకేదీ లేదు. మరియు ఒకవేళ ఈ రెండు నమాజులలో (ఆయా సమయాలలో పూర్తిచేయటం వలన) లభించే శుభాలు (పుణ్యాలు) గనుక వారికి తెలిసినట్లయితే, పాకుతూ రావలసి వచ్చినా సరే, వారు తప్పక హాజరవుతారు.

 عن عبدالله بن عمر رضي الله عنهما قال- قال رسول اللهr: “صلاة الجماعة أفضل من صلاة الفذ بسبع وعشرين درجة.” (رواه البخاري ومسلم)

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన మరొక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – ఒంటరిగా నమాజు చేయటం కంటే సమూహంగా నమాజు చేయటమనేది 27 రెట్లు ఎక్కువగా  ఉన్నతమైనది.  బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు.

 ఇమాం (సమూహానికి నమాజు చదివించే నాయకుడి) గా ఎవరు ఉండాలి?

ఉఖ్బా బిన్ అమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – ఎవరైతే సమూహానికి నమాజు చదివించబోతున్నారో వారు అందరి కంటే ఎక్కువగా ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన వారై ఉండాలి, ఒకవేళ వారు ఖుర్ఆన్ కంఠస్థంలో సమంగా ఉన్నట్లయితే, వారిలో ఎవరైతే ఎక్కువగా సున్నహ్ యొక్క జ్ఞానం కలిగి ఉన్నారో, వారు నమాజు చేయించటానికి నాయకత్వం వహించాలి. ఒకవేళ అందులో కూడా సమంగా ఉన్నట్లయితే, ఎవరైతే ముందుగా హిజ్రత్ (మక్కా నుండి వలస పోవటం) చేసారో వారు నమాజు చదివించాలి. ఒకవేళ అందులో కూడా సమంగా ఉన్నట్లయితే, వారిలో ఎవరు ముందుగా ఇస్లాం స్వీకరించారో వారు నమాజు చదివించాలి. – ముస్లిం హదీథ్ గ్రంథం.

కాబట్టి ఇమాం కు ఉండవలసిన అర్హతలు, వరుస క్రమంలో -

1)   ఖుర్ఆన్ కంఠస్థం

2)   సున్నహ్ జ్ఞానం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క జీవిత విధానపు జ్ఞానం)

3)    ముందుగా హిజ్రత్ (మక్కా నుండి వలస పోయినవారు) చేసినవారు & ముందుగా ఇస్లాం స్వీకరించిన వారు

నమాజు చదివే సహచరులలో, ఇమాం (నాయకుడి) యొక్క స్థానం

1)   ఖిబ్లా (కాబా) దిక్కున, మిగిలిన వారి కంటే ముందుగా ఇమాం నిలబడ వలెను.

2)   నమాజు చేసే సహచరులు ఇమాం వెనుక నిలబడవలెను.

3)   మొదటి పంక్తులు చివరి పంక్తుల కంటే ఉత్తమమైనవి. పంక్తిలో ఎడమ వైపు కంటే కుడి వైపు ఉత్తమమైనది. ఇమాంకు దూరంగా ఉండటం కంటే చేరువలో ఉండటం ఉత్తమమైనది,

ఇమాం వెనుక నమాజు చేసే సహచరులు పాటించవలసిన జాగ్రత్తలు

1)   నమాజులోని ఏ ఆచరణనూ, సహచరులు ఇమాం కంటే ముందుగా  లేదా ఇమాంతో సమానంగా అదే సమయంలో చేయకూడదు. ఇమాం ఆచరించిన తర్వాతనే చేయవలెను.

2)   ఒకవేళ ఎవరైనా ఇమాం రుకూ నుండి లేవక ముందే వచ్చి సమూహంతో పాటు నమాజులో చేరిపోయినట్లయితే, వారు ఆ రకాతును పొందిన వారవుతారు.

3)   ఒకవేళ ఎవరైనా, ఇమాం రుకూ నుండి లేచిన తర్వాత వచ్చి సమూహంతో పాటు నమాజులో చేరి నట్లయితే, వారికి ఆ రకాతు లభించలేదు. వారు మరల ఆ రకాతును పూర్తి చేయవలసి ఉంటుంది.

సుత్రాహ్

నమాజు చేసే వాని ముందు నుండి నడిచే వారు, కొంచెం అవతల నుండి పోవటానికి వీలుగా, నమాజు చేస్తున్న వ్యక్తికి ముందు ఉంచవలసిన సరిహద్దులాంటి అడ్డు. ఎందుకంటే సలాహ్ చేయువాని ముందు నుంచి వెళ్ళుట నిషిద్ధం.

1) ఏదైనా వస్తువు సలాహ్ చేయువానికి సజ్దా కంటే కాస్త దూరంగా నిట్టనిలువుగా ఉంచవలెను.

2) ఆ వస్తువు ఒక మూర పొడవు ఉంటే చాలా ఉత్తమం.

3) సుత్రాహ్ ఇమాం ముందు ఉంచిన ఎడల అది ముఖ్తదీకి (ఇమాం వెనుక నమాజు చదివే వారు) కూడా  సరిపోవును. మరల ముఖ్తదీ (ఇమాం వెనుక నమాజు చదివే వారి) ముందు కూడా ఉంచవలసిన అవసరం లేదు. ఒకవేళ ముందు నుండి ఎవరైనా వెళ్ళి నట్లయితే, అతన్ని అడ్డుకోవడం నమాజు చేయువానిపై విధిగా ఉన్నది.

గమనిక: నమాజు చేసే వ్యక్తి ముందు నుండి దాటి వెళ్ళడం నిషిద్ధం (హరాం).

అదాన్, ఇఖామహ్ (సలాహ్ కి పిలుపు)

 

 عن أبو سعيد الخدري رضي الله عنه قال- قال رسول اللهr: “لا يسمع مدى صوت المؤذن جن ولا إنس ولا شيء إلا شهد له يوم القيامة.” (رواه البخاري)

బుఖారి హదీథ్ – జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలిపారు “ముఅద్దిన్ యొక్క అదాన్ ఎంత దూరం వినపడునో అంతదూరంలో విన్నవారందరూ (మనుషులు, జిన్నాతులే కాక విన్న ప్రతిదీ) ప్రళయదినం రోజు ముఅద్దిన్ కొరకు సాక్ష్యము పలికెదరు.”

దాన్ పలుకులు :  صفة الأذان :

1) అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ -

2) అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్

3) అష్ హదు అల్..లా ఇలాహ ఇల్లల్లాహ్  -      అష్ హదు అల్..లా ఇలాహ ఇల్లల్లాహ్

4) అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ – అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్

5) హయ్..య్య అలస్సలాహ్ –        హయ్..య్య అలస్సలాహ్

6) హయ్..య్య అలల్ ఫలాహ్ –                హయ్..య్య అలల్ ఫలాహ్

7) అల్లాహు అక్బర్ –  అల్లాహు అక్బర్

8) లా ఇలాహ ఇల్లల్లాహ్

1- الله اكبر -  الله اكبر.

2- الله اكبر -  الله اكبر.

3- أشهد أن لا إله إلا الله  -  أشهد أن لا اله إلا الله.

4- أشهد أن محمدا رسول الله  -  أشهد أن محمدا رسول الله.

5- حي على الصلاة  -  حي على الصلاة.

6- حي على الفلاح  -  حي على الفلاح.

7- الله اكبر- الله اكبر.

8- لا آله إلا الله.

ఫజర్ సలాహ్ యొక్క అదాన్ లో హయ్ య్య అలల్ ఫలాహ్ తర్వాత అస్సలాతు ఖైరుంమినన్నోమ్ – అస్సలాతు ఖైరుంమినన్నోమ్ అని పలుక వలెను. అదాన్ యొక్క జవాబులో  హయ్య అలస్సలాహ్ మరియు హయ్ య్య అలల్ ఫలాహ్ కి మాత్రం “లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అని పలుక వలెను. మిగిలిన పలుకులను అదే విధంగా అంటే ముఅద్దిన్ పలుకునట్లుగా పలుకవలెను.

దాన్ తర్వాత పఠించ వలసిన దులు :

عن جابر بن عبد الله رضي الله عنهما قال- قال رسول الله r: “من قال حين يسمع النداء: (اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته) حلت له شفاعتي يوم القيامة” (رواه البخاري)

హదీథ్:  జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు “ఎవరైతే అదాన్ విన్న తర్వాత ఈ దుఆ (“అల్లాహుమ్మ రబ్బహాదిహిద్దావతిత్ త్తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి , ఆతి ముహమ్మదనిల్ వసీలత, వల్ ఫదీలత వబ్అథ్ హు మఖామం మహ్.మూదల్లదీ వఅత్తహు”) పఠించారో వారు ప్రళయదినం రోజున నా సిఫారసు పొందుటకు అర్హులగుదురు” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం

అర్థం – ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు, ప్రారంభం కాబోయే నమాజుకు అధిపతీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీలా మరియు ప్రత్యేకమైన ఘనతను ప్రసాదించు. నీవు ఆయనకు వాగ్దానం చేసిన “మఖామెమహమూద్”పై ఆయనను అధిష్టింపజేయి. (బుఖారి మరియు ముస్లిం)

 عن أنس بن مالك رضي الله عنه قال- قال رسول الله r: “الدعاء لا يرد بين الأذان والإقامة”(رواه أبو داود والترمذي)

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన మరో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – అదాన్ మరియు ఇఖామహ్ ల మధ్య చేయు ప్రార్థన (దుఆ) రద్దుచేయబడదు. అబుదావూద్, అత్తిర్మిథీ హదీథ్ గ్రంథాలు

ఇఖామహ్ - పలుకులు صفة الإقامة

1) అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్

2) అష్ హదు అల్.. లా ఇలాహ ఇల్లల్లాహ్

3) అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్

4) హయ్..య్య  అలస్సలాహ్

5) హయ్..య్య అలల్ ఫలాహ్

6) ఖద ఖామతిస్సలాహ్ – ఖద ఖామతిస్సలాహ్

7) అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్

8) లా ఇలాహ ఇల్లల్లాహ్

1- الله أكبر -  الله أكبر.

2-أشهد أن لا إله إلا الله.

3- أشهد أن محمدا رسول الله.

4- حي على الصلاة.

5- حي على الفلاح.

6- قد قامت الصلاة  -   قد قامت الصلاة.

7- الله اكبر- الله اكبر.

8- لا اله إلا الله.

సలాహ్ (నమాజు) చేయు విధానం

బుఖారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శెలవిచ్చారు“సల్లూ కమా రఅయితమూని ఉసల్లి” – మీరు అలాగే నమాజు చదవండి, నన్ను ఏ విధంగా నమాజు చదవుతూ చూస్తున్నారో.

నమాజు చేయు విధానం వివరంగా క్రింద ఇవ్వబడినది.

01. ఖియామ్ ׃ అంటే నమాజు చదువుటకు నిలబడుట

02. తక్బీర్తహ్ రీమ ׃ అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం

 • రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
 • కుడిచేతిని ఎడమచేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచవలెను.
 • “సుబహానకల్లాహుమ్మ వబిహందిక వతబారకస్ముక వతఆల జద్దుక వలా ఇలాహగైరుక” అని చదవాలి
 • సజ్దా చేయనున్న చోట దృష్టిని ఉంచాలి

03. సూరతల్ ఫాతిహా ׃

 • మొదట “అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీం” చదవాలి
 • “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అనాలి
 • తరువాత సూరతల్ ఫాతిహా చదవాలి

గమనిక׃ సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీన్( అల్లాహ్! మా విన్నపాల్ని అంగీకరించు) అనాలి

 • సూరతుల్ ఫాతిహా తరువాత ఏదైనా ఒక పూర్తి సూరహ్ లేదా సూరహ్ లోని కొన్ని వచనాలు (ఆయత్ లు) చదవాలి.

04. రుకూ చెయ్యాలి ׃

 • రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
 • నడుమును (వీపును) ముందుకు వంచి, రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకుని, కంటి చూపు సజ్దా చేసేచోట ఉంచవలెను. దీనిని రుకూ అంటారు
  • రుకూ లో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీం అనాలి.

05. రుకూ నుండి లేవాలి

 • రుకూ నుంచి లేచి నిలబడుతూ, రెండుచేతులను భుజాల వరకు లేదా రెండు చెవులకు సమంగా లేపుతూ నమాజు చదివించే వారైనా లేదా ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి అయినా సమిఅల్లాహు లిమన్ హమిద అనాలి
  • అందరూ రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి

06. సజ్దా చేయాలి׃

 • సజ్దాలోకి వెళ్లడానికి ముందు అల్లాహు అక్బర్ అనాలి
 • సజ్దానందు  మూడుసార్లు సుబహానరబ్బియల్ ఆఁలా అనాలి
 • సజ్దా లో ఏడు అంగాలు భూమిని తాకాలి – 1. ముఖం(నుదురు,ముక్కు) 2. రెండు చేతులు 3. రెండు మోకాళ్ళు 4. రెండు పాదాల వ్రేళ్ళు

07. జల్స ఇస్తిరాహత్ చేయాలి – అంటే రెండు సజ్దాల నడుమ కూర్చోడం

 • సజ్దా నుండి తల ఎత్తునప్పుడు అల్లాహు అక్బర్ అనాలి
 • రెండు సజ్దాల నడుమ నిదానంగా కూర్చొని మూడుసార్లు రబ్బిగ్ ఫిర్ లి అనాలి

08. తొలి సజ్దా తరువాత రెండవ సజ్దా చేయడం ׃

 • సజ్దాలోకి వెళ్లునప్పుడు అల్లాహు అక్బర్ అనాలి
 • సజ్దానందు  మూడుసార్లు సుబహానరబ్బియల్ లా అనాలి

గమనిక ׃ పైన పేర్కొన్న ఈ ప్రక్రియలన్నీ కలసి ఒక రకాతు అనబడును

09. మొదటి రకాతు పూర్తి అయ్యాక రెండవ రకాతుకై ఖియామ్ చేయ్యడం అంటే లేచి నిలబడడం

 • లేచి నిలబడుతూ అల్లాహు అక్బర్ అనాలి

10. మొదటి తషహ్హుద్ చేయాలి׃ అంటే రెండు రకాతుల తరువాత తషహ్హుద్ లో కూర్చోవాలి

 • రెండు రకాతుల తర్వాత కూర్చుని ఈ దుఆ చదవాలి

“అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు వస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వ అలాఇబాదిల్లా హిస్సాలిహీన్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్ దుహు వ రసూలుహు”

అనువాదం׃ స్తుతి, శారీరక – ఆర్ధిక పరమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే, ఓప్రవక్తా! మీపై అల్లాహ్ కరుణా కటాక్షాలు మరియు శుభాలు కురియుగాక,  అల్లాహ్ శుభాలు మాపై మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసులపై కురియుగాక, నేను సాక్ష్యమిస్తున్నాను వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడు లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప మరియు సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని.

11. ఆఖరి తషహ్హుద్ ׃ అత్తహియ్యాతు తరువాత దరూద్ షరీఫ్ చదవాలి.

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.

అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”

అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై కరుణ చూపించు మరియు ఆయన పరివారం పై కూడా – ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై కరుణ చూపించావో, నిశ్చయంగా నీవు ప్రశంనీయుడవూ, విధాతవూనూ.

అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారం పై కూడా , ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై శుభాలు కురిపించావో, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవూ, విధాతవూనూ.

12. దరూద్ షరీఫ్ తరువాత ఈదుఆ చదవాలి“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ అదాబి జహన్నమ వ అదాబిల్ ఖబ్ రి వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్” – ఓ అల్లాహ్! నేను నీ శరణు వేడుతున్నాను నరకయాతన నుండి మరియు సమాధి యాతన నుండి, మరియు శరణువేడుకుంటున్నాను జీవన్మరణాల నుండి మరియు మసీహ్ దజ్జాల్ చెడు నుండి.

13. సలాం చేయడం ׃

 • నమాజు ముగించునప్పుడు ముఖాన్ని కుడివైపునకు మరల్చి అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అనాలి
 • మళ్ళీ ఎడమవైపుకు కూడా ముఖాన్ని మరల్చి, అదే విధంగా అనాలి

14. నమాజు చేస్తున్నప్పుడు లగ్నము-వినమ్రతలతో పాటు నెమ్మది-నిదానం కూడా ఉండాలి. More

ఆఖరి తషహ్హుద్ తరువాత దుఅ

 దరూద్ షరీఫ్ తరువాత ఈదుఆ చదవాలి

“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ అదాబి జహన్నమ వ అదాబిల్ ఖబ్ రి వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్”

-ఓ అల్లాహ్! నేను నీ శరణు వేడుతున్నాను నరకయాతన నుండి మరియు సమాధి యాతన నుండి, మరియు శరణువేడుకుంటున్నాను జీవన్మరణాల నుండి మరియు మసీహ్ దజ్జాల్ చెడు నుండి.

దుఅ – ఆఖరి తషహ్హుద్

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.

అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”

అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై కరుణ చూపించు మరియు ఆయన పరివారం పై కూడా – ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై కరుణ చూపించావో, నిశ్చయంగా నీవు ప్రశంనీయుడవూ, విధాతవూనూ.

అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారం పై కూడా , ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై శుభాలు కురిపించావో, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవూ, విధాతవూనూ.

From Fortress of the Muslim – Dar-us-salam

23. Prayers upon the Prophet (Peace be upon him) after the tashahhud

(53)

اللّهُـمَّ صَلِّ عَلـى مُحمَّـد، وَعَلـى آلِ مُحمَّد، كَمـا صَلَّيـتَ عَلـىإبْراهـيمَ وَعَلـى آلِ إبْراهـيم، إِنَّكَ حَمـيدٌ مَجـيد ، اللّهُـمَّ بارِكْ عَلـى مُحمَّـد، وَعَلـى آلِ مُحمَّـد،  كَمـا بارِكْتَ عَلـىإبْراهـيمَ وَعَلـى آلِ إبْراهيم، إِنَّكَ حَمـيدٌ مَجـيد .

Allahumma salli AAala Muhammad, wa-AAala ali Muhammad, kama sallayta AAala Ibraheema wa-AAala ali Ibraheem, innaka Hameedun Majeed, allahumma barik AAala Muhammad, wa-AAala ali Muhammad, kama barakta AAala Ibraheema wa-AAala ali Ibraheem, innaka Hameedun Majeed.

‘O Allah, send prayers upon Muhammad and the followers of Muhammad, just as You sent prayers upon Ibraheem and upon the followers of Ibraheem.  Verily, You are full of praise and majesty. O Allah, send blessings upon Mohammad and upon the family of Muhammad, just as You sent blessings upon Ibraheem and upon the family of Ibraheem.  Verily, You are full of praise and majesty.’

send prayers: praise and exalt him in the highest and superior of gatherings: that of the closest angels to Allah.

(al) has been translated in it’s broadest sense: some scholars are of the view that the meaning here is more specific and that it means: his (peace be upon him) followers from among his family.