Hadeeth (హదీసులు)

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ (రహమతుల్లా అలై) మరియు ఇమామ్ ముస్లిం (రహమతుల్లా అలై) గురుంచి

Brief Biography of Imam Bukhari & Imam Muslim
రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

[ఇక్కడ చదవండి] [ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]

రెండు ఉత్తమ వచనాలు [కలామే హిక్మత్ – 1 వివేక వచనం]

రెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి] [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]

అల్లాహ్ అర్ష్ నీడలో.. (Seven in the Shade of Allah’s Throne)

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి] [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]

More

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – 2 వ భాగము – ఇమామ్ నవవి

Hadeesu Kiranaalu (Riyadus Saliheen) – [Part 01 -Part 02]

Compiled by: Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi
Urdu Translation by: Hafiz Salahuddin Yousuf
Telugu Translation by: Hafiz S.M.Rasool Sharfi
Edited by:Muhammad Azeez-ur-Rahman
Published by: AL-Huq Telugu Publications, Akbarbagh, Hyderabad

You can read chapter by chapter @ the link:Riyad-us-Saleheen-Hadeesu-Kiranaalu

More

కపటుడి చిహ్నాలు (Signs of Hypocrite)

హదీథ్׃ 12

علامـــــــــة المـنـــــــــافــــق కపటుడి చిహ్నాలు -

حَدَّثَنَا سُلَيْمَانُ أَبو الرَّبِيعَ قال: حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ جَعْفَرٍ قَالَ:حَدَّثَنَا نَافِعُ بْنُ مَالِكِ بْنُ أَبِي عَامِرٍ أَبو سُهَيْلٍ عَنْ أَبِيهِ عَنْ أَبِي هُرَيرَة

” عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:آيَةُ المُنَافِقِ ثَلاَثٌ إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اُؤْتُمِنَ خَانَ “  رواة صحيح البخاري

హద్దథనా సులైమాను అబు అర్రబీఅ ఖాల హద్దథనా ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ఖాల హద్దథనా నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్ అన్ అబీహి అన్ అబీహురైరత అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల   ఆయతుల్ మునాఫిఖి థలాథున్, ఇదా హద్దథ కదబ, ఇదా వఆఁద అఖ్లఫ, ఇదా ఉఁతుమిన ఖాన రవాహ్ సహీ బుఖారి..

More

ఇస్లాంలో పరిశుభ్రత (Cleanliness in Islam)

హదీథ్׃ 11

ఇస్లాంలో పరిశుభ్రత - النظافة من الإسلام

حَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ مُحمَّدُ بْنُ بَشَّارٍ وَ إِبْرَاهِيمُ بْنُ دِينَارٍ جَمِيعاً عَنْ يَحْيَىٰ بْنِ حَمَّادٍ . قَالَ ابْنُ الْمُثَنَّى : حَدَّثَنِي يَحْيَىٰ بْنُ حَمَّادٍ . أَخْبَرَنَا شُعْبَةُ عَنْ أَبَانُ بْنِ تَغْلِبَ عَنْ فُضَيْلٍ الْفُقَيْمِيِّ عَنْ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ ، عَنِ النَّبِيِّ قَالَ:”  لاَ  يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ. قَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَناً، وَنَعْلُهُ حَسَنَةً. قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ.اَلْكِبْرُ: بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ“رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా వ ముహమ్మదుబ్ను బష్షారిన్ వ ఇబ్రాహీముబ్ను దీనారిన్ జమీఅన్ అన్ యహ్యాబ్ని హమ్మాదిన్, ఖాల ఇబ్ను అల్ ముథన్నా, హద్దథనీ యహ్యాబ్ను హమ్మాదిన్, అఖ్బరనా షొబతు అన్ అబానుబ్ని తగ్లిబ అన్ ఫుదైలిన్ అల్ ఫుఖైమియ్యీ అన్ ఇబ్రాహీమ అన్నఖఇయ్యి అన్ అల్ఖమత అన్ అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్, అనిన్నబియ్యి ఖాల లా యద్ఖులు అల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిథ్ఖాలు దర్రతిన్ మిన్ కిబ్రిన్ఖాల రజులున్ఇన్న అర్రజుల యుహిబ్బు అయ్యకూన థౌబుహు హసనన్, నఅలుహు హసనతన్ఖాలఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల, అల్ కిబ్రు, బతరుల్ హఖ్ఖి గమ్తున్నాసి రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధకర్త ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా,  ముహమ్మదుబ్ను బష్షారిన్ , ఇబ్రాహీముబ్ను దీనారిన్  (వీరందరు) ← యహ్యాబ్ని హమ్మాదిన్  ← ఇబ్ను అల్ ముథన్నా ← యహ్యాబ్ను హమ్మాదిన్ ← షొబతు ← అబానుబ్ని తగ్లిబ ← ఫుదైలిన్ ఫుఖైమియ్యి  ← ఇబ్రాహీమ అన్నఖయియ్యి ← అలఖమత ← అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఎవరి హృదయములో నైతే అణువంత అహంభావం (గర్వం) ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, (అప్పుడు అక్కడ ఉన్న) ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు మరి మానవుడు నిశ్చయంగా మంచి దుస్తులు ధరించాలని, మరియు మంచి పాదరక్షలు (చెప్పులు,బూట్లు) తొడగాలని ఇష్టపడతాడు కదా!” ప్రవక్త ఇలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా అల్లాహ్ సౌందర్యవంతుడు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంభావం (గర్వం) అంటే ఏమిటంటే వాస్తవాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను నీచంగా (హీనంగా) భావించడము. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఈ హదీథ్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దురహంకారాన్ని, గర్వాన్ని నిరోధిస్తున్నది. హృదయంలో అణువంత అహంకారం (గర్వం) ఉన్నా సరే అతడు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. ఒకవేళ అదే అహంకారం అతడిని అల్లాహ్ యొక్క ఉనికిని మరియు అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించేటట్లు చేస్తే, అతడు తప్పక నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. దివ్యసందేశం గురించి అయిష్టం చూపటం, ఇంకా ఐశ్వర్యం, భౌతిక సౌందర్యం, సామాజిక మరియు ప్రాపంచిక ఔన్నత్యం మరియు పేరుప్రఖ్యాతులున్న వంశమని గర్వపడటం మొదలైనవి అతడిలో గర్వాన్ని, దురహంకారాన్ని పెంచి, ఇతరులను తక్కువగా, నీచంగా చూడటం వైపుకు మళ్ళిస్తుంది. తర్వాత తర్వాత వీటి వలన దివ్యసందేశాన్ని కూడా తిరస్కరించటం మొదలు పెడతాడు. మొదట అతడు నరకశిక్ష అనుభవిస్తాడు,  అతడు ముస్లిం అవటం వలన ఆ తర్వాత స్వర్గంలోనికి చేర్చబడతాడు. ఏదేమైనా గాని చక్కని మంచి దుస్తులు అహంకారానికి, గర్వానికి చిహ్నం కాజాలదు. ఇంకా ఇస్లాం పరిశుభ్రంగా, హుందాగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం: అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు,  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవసందేశాన్ని ప్రాంరంభంలోనే స్వీకరించిన ప్రముఖులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి ఖుర్ఆన్ లోని 70 అధ్యాయములు (సూరహ్ లు) కంఠస్థం చేసినారు. 32వ హిజ్రీ సంవత్సరంలో దాదాపు 70 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో చనిపోయారు. 

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. అహంకారం మరియు ప్రజలను నిర్లక్ష్యం చెయ్యటం నిషేధించబడినది.
 2. పరిశుభ్రత అంటే ప్రతి దానికీ సంబంధించనది – ధరించే దుస్తులు, వాడే ఇతర వస్తువులతో సహా.
 3. ఇంటిని, పాఠశాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచటం పై జాగ్రత్త వహించవలెను.
 4. వారానికి కనీసం ఒక్కసారైనా స్నానం చేయటం మెచ్చుకో దగిన విషయం.

ప్రశ్నలు

 1. ఈ హదీథ్ నుండి మీరు నేర్చుకున్న విషయాలు క్లుప్తంగా వ్రాయండి.
 2. ఈ హదీథ్ ఉల్లేఖకుడి గురించి వ్రాయండి.
 3. అహంకారం వలన కలిగే నష్టాల గురించి వ్రాయండి.

అనవసరపు విషయాల జోలికి పోకూడదు (Leaving off unnecessary matters)

హదీథ్׃ 10

అనవసరపు విషయాల జోలికి పోకూడదు - ترك المسلم ما لا يعنيه

حَدَّثَنَا أَحمَدُ بْنُ نَصْرٍ النَّيْسَابُورِيُّ وَغَيرُ وَاحِدٍ قَالوا حَدَّثَنَا أَبو مُسْهِرٍ عَنْ إسماعِيلَ بنِ عَبْدِ اللهِ بْنِ سَمَاعَةَ ، عَنْ الأوْزَاعيِّ ، عَنْ قُرَّةَ ، عَنْ الزُّهْرِيِّ عَنْ أَبي سَلَمَةَ عَنْ أَبي هُرَيْرَةَ قال.  قَالَ رَسُولُ اللَّه ”مِنْ حُسْنِ إِسْلاَمِ المَرْءِ تَرْكُهُ مَا لاَ يَعْنِيهِ “ رواه الترمذي

హద్దథనా అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు వ గైరు వాహిదిన్ ఖాలూ, హద్దథనా అబుముస్హిరిన్ అన్ ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత,  అన్ అల్ అవ్జాయ్యి,  అన్ ఖుర్రత , అన్ అజ్జుహ్రియ్యి , అన్ అబి సలమత అన్ అబి హురైరత ఖాల, ఖాల రసూలుల్లాహి మిన్ హుస్ని ఇస్లామి అల్ మర్ఇ తర్కుహు మా లా యనీహి” రవాహ్ అత్తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అత్తిర్మిది హదీథ్ గ్రంధకర్త   ← అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు  & గైరువాహిదిన్  ← అబుముస్హిరిన్  ← ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత ← అల్ అవ్జాయ్యి  ← అన్ ఖుర్రత ← అన్ అజ్జుహ్రియ్యి ← అబి సలమత ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఇస్లాం లోని ఉన్నతమైన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, మానవుడు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అత్తిర్మిది హదీథ్ గ్రంధం.

అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా బోధించారు -  “మిన్ హుస్నల్ ఇస్లాం, అల్ మరఅఁ తరకహ్ మా లా యఅఁనీహి” అంటే “అనవసర విషయాల జోలికి పోకుండా ఉండటం కూడా ‘మంచి ముస్లిం’ కావటానికి ఒక నిదర్శనం”  అత్ తిర్మిథి హదీథ్ గ్రంథం

హదీథ్ వివరణ

సందేశం మరియు ఆచరణ పరంగా ఇది ఒక ముఖ్యమైన హదీథ్. తనకు సంబంధించిన విషయాల గురించి తప్ప, ఒక ముస్లిం ప్రతిదాని గురించి మాట్లాడకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చకూడదని, వాటి జోలికి పోకూడదని కూడా ఈ హదీథ్ బోధిస్తున్నది. కేవలం ధనం సంపాదించటానికి మరియు ఉన్నత స్థానాలకు చేరటానికి మాత్రమే మన జీవితం వెచ్చించకూడదు.  ముస్లింలు పొగడ్తలను ఆశ్రయించకూడదు, ధర్మపరం గాను మరియు ప్రాపంచిక జీవితంలోను ఇది ఎంత మాత్రమూ ప్రయోజనకరం కాదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. తమకు సంబంధించని అనవసర విషయాలను వదిలి వేయమని ఇస్లాం ప్రోత్సహిస్తున్నది.
 2. మస్లింలు తమకు సంబంధించని విషయాలను – అవి మాటలు అయినా లేక చేతలు (పనులు) అయినా సరే
 3. వదిలివేయటం ఇస్లాం లోని అత్యుత్తమ నడవడికలో ఒక ముఖ్యమైన భాగం. అడగకపోయినా, స్వయంగా కల్పించుకుని సమాధానం చెప్పేటందుకు మీరు ప్రయత్నించవద్దు.
 4. మంచి వైపుకు దారి చూపటం పై ముస్లింలు ధ్యానం ఉంచవలెను.

ప్రశ్నలు

 1. ‘తమకు సంబంధించని అనవసర విషయాలు’ అంటే ఏమిటో వివరంగా వ్రాయండి.
 2. ఈ హదీథ్ ను ఆచరించటం వలన కలిగే లాభాలను వివరించండి.
 3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ఉపయోగం గురించి తెలుపండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : -  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు (Rights of neighbours)

హదీథ్׃ 09

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు - حق الجار على الجار

حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ:  ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ.  وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم

హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని  ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
 2. ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
 3. పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
 4. ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
 5. పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
 6. అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
 7. అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.

ప్రశ్నలు

 1. తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
 2. పొరుగువారి హక్కులు ఏవి?
 3. పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
 4. దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
 5. పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : -  ముహమ్మద్ కరీముల్లాహ్

అపనిందలు వేయటం (Gheebah & Slander)

హదీథ్׃ 08

تحريم الغيبة అపనిందలు వేయటం -

حَدَّثَنَا يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ شِيْبَةَ وَ ابْنُ حُجْرٍ قَالُوا: حَدَّثَنَا إِسْمَاعِيلُ عَنِ الْعَلاَءِ عَنْ أَبِيهِ، عَنْ أَبِي هُرَيْرَةَ

أَنَّ رَسُولَ اللَّهِ قَالَ  ” أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ قَالُوا” اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ“ قَالَ”ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ“ قِيلَ  ”أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟   “قَالَ ” إِن كَانَ فِيهِ مَا تَقُولُ، فَقَدِاغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيهِ، فَقَدْ بَهَتَّهُ “   رواة صحيح مسلم

హద్దథనా యహ్యా ఇబ్ను అయ్యూబ వ షీబత వ ఇబ్ను హుజ్రిన్ ఖాలూ, హద్దథనా ఇస్మాయీలు అనిల్ అలాయి అన్ అబిహి,  అన్ అబి హురైరత అన్న రసూలల్లాహి ఖాల, అతద్రూన మా అల్ గీబతు ?” ఖాలూ, అల్లాహు వ రసూలుహు ఆలము. ఖాల, దిక్రుక అఖాక బిమా యక్రహు. ఖీల, అఫరాయ్త ఇన్ కాన ఫీ అఖి మా అఖూలు ?” ఖాల, ఇన్ కాన ఫీహి మా తఖూలు, ఫఖదిగ్ తబ్తహు. వ ఇన్ లమ్ యకున్ ఫీహి, ఫఖద్ బహత్తహు. రవాహ్ సహీ ముస్లిం .

More

దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం (Sweetness of Iman)

హదీథ్ ׃ 13

حلاوة الإيمان దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం -

حَدَّثَنا مُحَمَّدُ بْنُ المُثَنَّى قَالَ: حَدَّثَنَا عَبْدُ الْوَهَّابِ الثَّقَفِيُّ قَالَ: حَدَّثَنَا أَيُّوبُ عَنْ أَبي قِلابَةَ عَنْ أَنْسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ”ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمَانِ أَنْ يَكونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إلَيْهِ مِمَّا سِواهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إلاَّ للَّهِ ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ “ رواة صحيح البخاري

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ఖాల, హద్దథనా అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ఖాల హద్దథనా అయ్యూబు అన్ అబి ఖిలాబత అన్ అన్సిన్ అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల థలాథున్ మన్ కున్న ఫీహి వజద హలావత అల్ఈమాని - అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా, వ అన్ యుహిబ్బ అల్మర్ఆ లా యుబ్బుహు ఇల్లల్లాహి, వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నారి రవాహ్ సహీ బుఖారి.

More